Home » Kommuri venugopala rao » Aathma Jyothi

  

     "నాకూ చెప్పాలనే వుంది" అన్నాడు. "కానీ అది చెప్పలేని బాధ."
    
    అతన్నో భయంకరమైన సందేహం పీడిస్తోంది కానీ అడగలేకపోతున్నాడు.
    
    "అయితే రేపు రావా?"
    
    "రానులే."
    
    "ఎక్కడికి?"
    
    "రానులే."
    
    "శివా" అని గట్టిగా అరిచాడు మోహన్. అతని భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు. "ఏమిటి నీ పరధ్యానం?"
    
    జవాబులేదు. చాలాసేపు మౌనంగా గడిచిపోయింది. శివనాథరావు స్నేహితుడి వంక తిరిగి "మోహన్! నువ్వెళ్ళు యింటికి నేను ఓ అరగంటాగి వస్తాను" అన్నాడు.
    
    "అదేం?"
    
    "నీకు తెలియదు."
    
    మోహన్ కాసేపు బ్రతిమిలాడి లాభంలేక ఓ అరగంట అయినాక తప్పక వచ్చెయ్యమనీ, మరీ రాత్రి అయితే ప్రమాదమనీ చెప్పి నెమ్మదిగా నడిచి వెళ్ళి పోయాడు. ఓ పదినిముషాలు గడిచాయి. ఆ దారినపోతున్న యిద్దరు రైతులు తన్నీ స్థితిలో చూసి నవ్వుకుంటూ వెళ్ళారు. అతనుచిన్నగా లేచి నిలబడ్డాడు. అడుగులు తూలుతున్నాయి. చలిగాలి మృదువుగా వీచసాగింది. తలవంచుకుని నడవసాగాడు. ఇసుకనేల అయిపోయింది, మట్టిగట్టు అడ్డంవచ్చింది. అది ఎక్కాడు. చుట్టూ చెట్లు చప్పుడుచేస్తూ ఊగుతున్నాయి. కాలిలో ముల్లు ఒకటి ఖస్సున దిగిపోయింది "నీకూ ఎంతజాలి నామీద?" ఒంగి నిర్దాక్షిణ్యంగా లాగివేస్తూ కాకతాళీయంగా ఎదుటికి చూశాడు. పువ్వులు! కానీ మొగ్గలు.
    
    చీకటిపాయలు కలిసి దట్టంగా వ్యాపించింది.

    జాబిలి వెలిగాడు. తారకలు విరహోన్మదులు. అందుకే "నిను విడజాల" అంటూ చుట్టూచేరి దాగుడుమూతలు ఆడుతున్నాయి.
    
    అతనాలోచించాడు. తాను యిక్కడ నిలబడి ఏంచేస్తున్నాడనీ? అసలు దీని పర్యవసానం ఏమిటి?
    
    "శివయ్య గోరూ.."
    
    దగ్గరగా టార్చిలైటు వెలుగుతోంది.
    
    "ఓయ్" అన్నాడు.
    
    ఈసారి లైటు కాంతి అతని పాదాలమీదకు వచ్చిపడింది. వెంకన్న దగ్గరగా వచ్చి లైటు ఆర్పివేసి, ఇక్కడున్నారా బాబూ, రండి అన్నాడు.
    
    "ఎందుకు?" అన్నాడు భారంగా.
    
    "వణ్ణానికి పిలుచుకురమ్మన్నారు అయ్యగోరు."
        
    "వెంకన్నా" అన్నాడు.
    
    "బాబూ.."
    
    "కదల్లేను, మెదల్లేను."
    
    "జరంగాని వచ్చిందా బాబూ?"
    
    "అలాంటిదే."
    
    "నా భుజంచుట్టూ చేతులేసి పట్టుకునడవండి బాబూ. ఇంటికాడికి జాగురత్తగా జారేసే పూచీ నాకొగ్గెయ్యండి."
        
    "నువ్వు నాకు చేయగలిగే సహాయం ఇదికాదు వెంకన్నా ఇంటికిపోయి ఎంత బలవంతం చేసినా రానన్నానని చెప్పు. ఇక్కడినుంచి వెళ్ళు"
        
    "నన్ను చంపేస్తారయ్యగోరు."
    
    "నా విషయంలో ఏమీ అనడులే. నేనీరాత్రి తప్పకుండా ఇంటికి తిరిగొస్తానని చెప్పు. నాకోసం వాడు ఇక్కడకు వచ్చే అభిప్రాయం పెట్టకున్నట్లయితే ఒట్టే అన్నానని చెప్పు."
    
    "భయం వెయ్యదా బాబూ?"
    
    "వెయ్యదు, వెళ్ళిపో వెంకన్నా."
    
    అతను నిస్పృహగా వెనుదిరిగాడు. టార్చిలైటు వెలుగు దూరంగా తుప్పల్లో మెరిసింది. అతన్ని పిలిచాడు.    
"ఆ లైటు నాకిచ్చి వెడతావా?" అన్నాడు.
    
    వెనక్కి వచ్చి, యిచ్చి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు వెంకన్న.
    
    అక్కడో పెద్ద ఇసుకదిబ్బ వుంది. దానిమీదకు పోయి కూర్చున్నాడు. చలిగాలి విపరీతంగా వీస్తూ వణికిస్తోంది. అజ్ఞాతవ్యక్తులు సానుభూతితో విడిచిన నిట్టూర్పులు గాలిలో కలసి ఠపఠప చిందినట్లు ఏదో వేదన అస్పష్టంగా, జీవిత చరమాంకం సదాన్నావస్థలో రగులుకుంది. పురుటిలో బిడ్డడు కేర్ మని ఏడిస్తే ఆ కేక మాతృహృదయంలో సూటిగా గ్రుచ్చుకొని దుర్వారమైన అనురాగం అతిశయింప చేసినట్లు అతని ఆర్ద్రహృదయం ఆశతో అలమటించింది. అతను హఠాత్తుగా లేచి నడవసాగాడు. ఈ ఊరికి స్మశానం యిదే అయి వుంటుంది. కాలికి రెండుమూడు బొమికలు తగిలాయి. రానురానూ దారి దుర్గమంగా వుంది. ఎవరో వెనకనుంచి పట్టి లాగుతున్నట్లు అనుభూతి, బహుశా స్త్రీ హస్తంతాలూకూ అనుబంధమే అయివుంటుంది. హఠాత్తుగా వెలుగు పెనువృక్షాలు ఒకదానికొకటి పెనవేసుకుని అవతలి ప్రదేశానికి అడ్డాలు మూశాయి. క్రమంగా వెలుతురు పెరగసాగింది. గాలి ఆగిపోయింది. అటువంటి అద్భుత తరుణంలో ఓ స్త్రీ - సౌందర్యవతి, ఎదురుగా వచ్చింది. "శివా, నాతో రా!" అంది. అతను మౌనంగా అనుసరిస్తున్నాడు. ఎవరై వుంటుంది? ఈమె అనామ కాదుకదా? చూపులవే. 'అనామా' అని పిలిచాడు. పలకదేం? ఆగదేం? కోపంగా 'దెయ్యమా' అని అరిచాడు. దెయ్యమా! అరణ్యమంతా మార్మోగింది. వేపచెట్టు ఓ కాయరాల్చింది. తలెత్తి చూశాడు. పిచ్చివాడా! ఇది దెయ్యముకాదు, నీ ఆశాజ్యోతి. అతని సంతోషం కట్టలుతెగి ప్రవహించింది. 'సరోజినీ' అని అరిచాడు. ఇప్పటికి నిజం తెలిసింది. ఈ సన్నివేశం తనకోసం దయతో సృష్టించబడింది. కానీ ఆగదేం? వేగంగా పరిగెత్తాడు. ఆమెను అందుకోగలిగాడు. సున్నితమైన ఆమె కరతములు అతని చేతుల్లో యిరుక్కున్నాయి. కానీ ఈ స్పర్శ నూతనంగా వుంది. ఆమె పెనుగులాడింది. 'మనం లోకంవిడిచి చాలాదూరం వచ్చాం. ఇక వెరవాల్సిన పనిలేదు. రా నా దగ్గరకు' అన్నాడు.
    
    "నువ్వెవరివి?" అన్నదామె  కఠినంగా.
    
    "నా పేరు శివుడు."
    
    "నేనెవర్ని?"
    
    "నీ పేరు సరోజిని."
    
    "నేనెవర్ని?"
    
    "నా భార్యవు. కాదు...మోహన్."
    
    "నిజమేనా?"
    
    "అంటోంది విధి."
    
    ......
    
    "నాలోకి రావా?"
    
    "ఈ చేతిని పట్టుకునే అర్హత మోహన్ గారికి తప్ప ఎవరికీ లేదు."
    
    "నిన్ను చుంబిస్తాను."
    
    "నీ తరమా-? వద్దు, మొండితనం చేయకు. మనమిద్దరం చావును కోరుకోవద్దు. బ్రతుకుదాం."
    
    "సరోజినీ."
    
    "సరోజినీ."
    
    "నన్నిలా పిలవటానికి వీలులేదు."
    
    ఆమె హఠాత్తుగా అతని హృదయానికి చేరువగా వచ్చింది. చెంపలు నిమురుతూ "పిచ్చి శివా, మమకారాలు నశించాలి. ప్రపంచంలో నీ చావుకన్నా భయంకరమైన చావులున్నాయి" అంది.
    
    అజ్ఞాతవ్యక్తులు కొందరుచేరి "శివా, ఎందుకు భయపడతావు? ఈ వియోగం అంతకన్నా భయంకరమైనది సుమా" అని హెచ్చరించారు.
    
    "సరోజినీ, వారించకు, ఈ కపట నాటకమెందుకు? నాతోరా, నాలో ఐక్యంకా...."
    
    "సరే పద." ఆమె బయల్దేరింది. వెనుదిరిగి చూశారో అరిష్టం తప్పదు అంది.
    
    నిశీధిలో రెండునీడలు బయల్దేరాయి. గుడ్లగూబలు అరుస్తున్నాయి. ఏవో పెనుకేకలు కాసేపు వెనుకనుంచీ, కాసేపు చుట్టుప్రక్కలనుంచీ వినవచ్చాయి. అయినా లెక్కచేయలేదు. సరోజిని 'అమ్మో' అని అరిచింది. అయినా లెక్క చేయలేదు. ఇంతలో ఓ కర్కశస్వరం 'శివా, వెనుదిరుగు, మొండినమ్మకం విడిచిపెట్టు. నీ సరోజినీ హామీ నిన్ను రక్షించలేదు. నేను బలిమిని ఆమెను తస్కరిస్తున్నాను. చేవవుంటే కాపాడుకో' అని అరిచింది. అయినా లెక్కచేయ లేదు పాదాలు నెత్తుటితో తడుస్తున్నాయి. శరీరమంతా పొదలమధ్య నలిగి, రక్తసిక్తమై చిన్నాభిన్నమైంది. అయినా లెక్కచేయలేదు. గమ్యస్థానం చేరాడు. నామాట నెగ్గించుకున్నాను. ఇహ మనని ఎవరూ వేరుచేయలేరు అంటూ వెనక్కి తిరిగాడు. సర్వం చీకటి, సరోజిని లేదు 'ద్రోహీ' అని పెద్దగా కేకవేశాడు. కళ్ళు తిరిగాయి.
    
    మెల్లగా కళ్ళువిప్పి చూశాడు. పైన నక్షత్రాలు-చేయి ప్రక్కకు జాపి తడిమాడు. టార్చిలైటు దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మీట నొక్కాడు. శరీరం చూసుకున్నాడు, రక్తం తను ఎక్కడున్నాడు? చుట్టూ ఫోకస్ చేశాడు. త్రుళ్ళిపడ్డాడు. తను యిందాక పడున్నస్థలంలో లేడు. నిద్రలో నడుస్తూవచ్చాడా? చుట్టూ ఏదో రొద. దూరంగా ఏదో రోదన. కొంతసేపు స్పష్టంగా, కొంతసేపు అస్పష్టంగా వినిపిస్తుంది. లేచి కూర్చున్నాడు. దూరంగా ఏదో వెలుగుతూ, ఆరుతూ వెలుగుతోంది. ఇంతలో అతని కాళ్ళకిందనుండి ఏదో జరజరమని ప్రాకుకుంటూ వెళ్ళిపోయింది. ఉలికిపడి లేచి నిల్చున్నాడు. శరీరం గజగజ మని వణుకుతోంది. దగ్గరలో సర్పమో ఏదో బుసకొడుతోంది. "పారిపో పారిపో" అని వెయ్యికంఠాలు ఉద్భోదించాయి. ఏమిటిది? ఒక్క దూకు దూకాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra