Home » Vasundhara » సుహాసిని


    నేనిక హాసను పూర్తిగా మరచి ఆమెకు అడ్డుతొలగాలి.

    అందుకోసం ఏం చేయాలి?

    గౌతమ్ చరితను తన గదిలోకి పిలిచాడు.

    "సాయంత్రం నీతో ఏకాంతంగా మాట్లాడాలి. పార్కుకి వెళ్దామా?" అనడిగాడు.

    చరిత మనస్సు తనువూ రెండూ పులకించాయి.


                         *    *    *    *


    సన్నటి తుంపర.

    వాన పడుతున్నట్లు లేదు.

    పూల వానలాగుంది.

    పార్కులో ఒకరికొకరు ఎదురెదురుగా గౌతమ్, చరిత.

    గౌతమ్ గంభీరంగా వున్నాడు. చరిత కుతూహలంగా అతణ్ణి చూస్తోంది.

    అతడు రెండు అరచేతుల్నీ దగ్గరగా చేర్చి వ్రేళ్ళతో విన్యాసాలు చేస్తున్నాడు. ఆమె చేతివ్రేళ్ళు పార్కులోని పచ్చగడ్డిని తడుముతున్నాయి.

    ఇద్దరూ తడుస్తున్నారు? కానీ వారికా స్పృహ లేదు.

    "చరితా!" అన్నాడు గౌతమ్.

    "ఊఁ" అంది చరిత.

    "నీది చాలా అందమయిన పేరు" అన్నాడు గౌతమ్.

    చరిత తలవంచుకుని "నా అందం పేరులోనే వుందా?" అంది.

    "మరి నా అందం పేరులో కూడా లేదు...."

    చరిత నెమ్మదిగా "చరిత్రలో గౌతమ్ కి సుస్థిర స్థానముంది" అంది.

    "ఆ గౌతముడు ప్రేమను పదిమందికీ పంచి చరిత్రలో ప్రేమమూర్తిగా నిలిచిపోయాడు. ఈ గౌతముడు చరిత నుంచి ప్రేమను కోరుతున్నాడు...."

    ఎందుకో చరిత ఉలిక్కిపడింది.

    గౌతమ్ ఆమెను గమనించలేదు.

    "చరితా! చిన్నతనంనుంచీ ప్రేమకోసం అన్వేషిస్తున్నాను. అదెక్కడా దొరకలేదు నాకు...."

    "ఏం? మీకు తల్లి, తండ్రి, అన్న, అక్క ఎవరూ లేరా?"

    "అంతా వున్నారు. వాళ్ళందరికీ నేనో ఆటబొమ్మని. నన్నెవరూ మనిషిలా చూడలేదు. చిన్నతనంనుంచీ మనిషిలా చూడబడాలని ఆక్రోశించాను...."

    "ఇంట్లో ఆఖరు వారయుంటారు. అదృష్టవంతులు...."

    "అదృష్టమా?" అని నిట్టూర్చాడు గౌతమ్.

    "మా ఇంట్లో అయిదో వాణ్ణి నేను. అందరి బట్టలూ కట్టుకుని, అందరి పుస్తకాలూ చదువుకుని, అందరి ఆధిపత్యాన్నీ భరించి పెద్దవాడినయ్యాను. ఇంట్లో ఆఖరు వాడినయినా క్లాసులో మొదటివాడుగా వుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను. ఇప్పటికీ మా ఇంట్లో నన్నెవరూ మనిషిలా చూడరు. కానీ నన్నుపయోగించుకుని డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. అందుకే వాళ్ళకు ఖచ్చితంగా చెప్పాశాను__

    "నా పెళ్ళి నా యిష్టం. నన్ను ప్రేమించే పిల్లను నేను వెతుక్కుని పెళ్ళి చేసుకుంటాను" అని.

    అప్పటినుంచీ వాళ్ళకూ- నాకూ మధ్య యుద్ధం జరుగుతోంది. నాన్న నన్ను తిట్టి సాధించాలనుకుంటాడు. అందువలన నాకాయనో పెద్ద సమస్య కాదు. కన్నీళ్ళతో నన్ను సాధించాలనుకునే అమ్మనెలా ఎదుర్కోవాలో నాకు తెలియంది కాదు.

    అమ్మ కన్నీళ్ళక్కుంగిపోతే నేను కట్నం తీసుకోవాలి. మరో మధ్యతరగతి యింట కన్నీళ్ళు సృష్టించాలి. అది నాకిష్టంలేదు. అలాంటి పద్ధతిలో...." ఆగాడతడు.

    "ఊఁ" అంది చరిత కుతూహలంగా.

    "ఒకరోజు నిన్ను చూశాను...."

    అప్పుడు తెలిసింది నాకు-నా కోర్కె తీరబోతోందని!

    "ప్లీజ్ స్టాపిట్!" అంది చరిత.

    ఉలిక్కిపడ్డాడు గౌతమ్. ఆమె మాటలో అసహ్యం వుంది.

    "ఏమయింది చరితా?" అడిగాతడు.

    "మీరు చెప్పేవన్నీ అబద్దాలు" అంది చరిత.

    "ఎందుకని?" అడిగాడు ఆశ్చర్యంగా.

    "ఇంట్లో ఆఖరు వాడికి ఎప్పుడూ గారం వుంటుంది. మీకా ప్రేమ ఇంతవరకూ దొరకలేదంటే నమ్మలేను. ఒకరోజు నన్ను చూశానన్నారు. మనమిద్దరం చాలాకాలంగా ఒకే ఆఫీసులో కలిసి పనిచేస్తున్నాం. మొదటిసారి నన్ను చూసినప్పుడే నేను మీకు నచ్చితే మనమిలా కలుసుకునెందుకు ఇంతకాలం పట్టేది కాదు...."

    "అయితే నేను నీతో అబద్దాలెందుకు చెబుతాను?"

    "మగాడు ఆడదానికి అబద్ధాలు చెప్పేది మోసం చేయడానికి"

    "నేను మోసగాడినా?"

    "మీరు మోసగాడు కాకపోవచ్చు. కానీ మీ మాటలు మోసగాడివే"

    "అంటే?"

    "రమణ తెలుసా మీకు?" అంది చరిత.

    "ఏ రమణ?" అడిగాడు గౌతమ్.

    "ఎవరో ఒక రమణ....ఆ పేరుగల వ్యక్తి తెలుసా మీకు?"

    "తెలియదు...."

    "ఇంకో అబద్ధం!"

    గౌతమ్ ఆశ్చర్యంగా ఆమెవంక చూశాడు.

    అప్పటికి వాన వెలిసి చాలాసేపయింది. మంచులో తడిసిన మల్లెపూవ్వులా మెరుస్తోందామె.

    "అబద్ధం చెప్పలేదని నామీదొట్టు వేయండి"

    "అబద్ధం చెప్పినవాణ్ణి అబద్దపు ఒట్టు వేయలేనా?" నిష్టూరంగా అన్నాడతను.

    "ఆ ఒట్టు నన్నే కొడుతుంది. జీవితంలో రెండోసారి మోసపోయాక ఒట్లకు భయపడతానా?" అంది చరిత.

    "ఏమిటి నువ్వనేది?" అన్నాడతను.

    "ఇన్నాళ్ళకు మీ సందిగ్ధానిక్కారణం తెలిసింది. రమణ మిమ్మల్ని కలిశాడు నన్ను మోసగించమని ప్రోత్సహించాడు. అవునా?"

    గౌతమ్ మాట్లాడలేదు.

    "ఇవే మాటలతో రమణ నన్ను దారుణంగా మోసగించాడు. మోసపోయానని తెలిసేక ఏడిస్తే "మళ్ళీ నీ జీవితంలోకి రానని హామీ ఇస్తున్నాను. నన్ను మర్చిపో" అన్నాడు.

    ఎందుకిలా మోసగించారంటే_"నేను మోసగించలేదు, నువ్వే ఇష్టమయి మోసపోయావు" అన్నాడు. నీ మోసాన్ని పందిమందిలో బట్టబయలు చేస్తానని బెదిరిస్తే- "ఇలా మాట్లాడ్డం నా పద్ధతి. నువ్వు నా విషయం బైటపెట్టినా యింకా ఎందరినో నేనిదే పద్ధతిలో మోసం చేయగలను. కాబట్టి నా జోలికిరాకు. అదీ నీ ప్రాణాలకే ప్రమాదం...." అంటూ హెచ్చరించాడు.

    నా జీవితం తన వలన అన్యాయమైపోయిందని ఏడిస్తే- "సవాలుచేసి చెబుతున్నాను. తప్పు నీలో వుంది. ఇంకో మనిషి మళ్ళీ నా పద్ధతిలోనే వచ్చి నిన్ను మోసం చేయగలడు. నువ్వు మగాడి ఆకర్షణకు తట్టుకోలేవు" అని నీచంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. మీరు మాట్లాడే పద్ధతి చూడగానే రమణ గుర్తుకొచ్చాడు. మీ మాటలు పూర్తిగా వినగానే నా సందేహం తీరిపోయింది...."

    "మొత్తంమీద నీకు గత చరిత్ర వుందన్నమాట" అన్నాడు గౌతమ్.

    "చరితకుండేదే గతం. లేనిది భవిష్యత్తు....మా వాళ్ళు నాకు చాలా మంచిపేరు పెట్టారు" అంది చరిత.

    "చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. కానీ నీ గతాన్నిప్పుడేవేశంలో బయటపెట్టావు. లేకుంటే దాచిపెట్టేదానివేగా?" అన్నాడు గౌతమ్.

    "మిమ్మల్ని చూశాను. మీలో సంస్కారాన్ని నమ్మాను. నా గతం మీ ముందుంచాలన్నదే నా తాపత్రయం. అందుకు మీరింతవరకూ అవకాశమివ్వలేదు. ఇప్పుడయినా నేను రమణ గురించి చెప్పకపోతే మీకేం తెలియదుగా? నాకు గతం దాచిపెట్టాలన్న దుర్భుద్ధిలేదు. తరతరాలుగా మగాడు ఆడదాన్ని మోసం చేస్తున్నాడు. ఆడది మోసపోతోంది. ఈ వ్యవహారంలో మార్పు రావాలంటే మగాడు మోసపోయిన ఆడదాన్ని మన్నించడం నేర్చుకోవాలి. ఆమె పవిత్రతను గుర్తించాలి. అందుకు మిమ్మల్నెన్నుకుని పెద్ద పొరపాటు చేశాను. ఈ రోజుతో మీకూ- నాకూ ఎటువంటి స్నేహబంధమూ లేదు గుడ్ బై"

    చరిత లేచి నిలబడింది.

    గౌతమ్ ఆమెను వారించలేదు.

    చరిత వెళ్ళిపోయింది.


                                                            *    *    *    *


    చరిత తనను తప్పు పట్టిందని గౌతమ్ కి బాధలేదు.

    అతడి భయమంతా రమణ వ్యక్తిత్వం గురించే!

    హాస తనకూ-రమణకూ మధ్య జరిగిన సంభాషణ తూచా తప్పకుండా తనకు చెప్పింది. రమణ పద్ధతి తన మీద ప్రభావం చూపించగా అదే పద్ధతి చరిత ముందు అనుసరించాడు.

    చరిత ఆ పద్ధతిని గుర్తుపట్టింది.

    అంటే రమణ ఆడవాళ్ళతో ఆడుకునే వేటగాడు!

    ఇప్పుడు హాసపై ఒకప్పటి పద్ధతినే మళ్ళీ ఉపయోగిస్తాడు. చరితను అతడు పతితగా మార్చిన ఆ పద్ధతి హాసనేం చేస్తుంది?

    ఈ విషయం హాసకు చెబితే?

    ఆమె తన మాటలను నమ్ముతుందా? ఋజువులడుగుతుంది. అప్పుడు తనూ బయటపడాలి.

    ఇంతకూ చరిత మాటలెంతవరకూ నిజమో!

    ఏదయినా ముందుగా ఈ విషయమై హాసను హెచ్చరించాలి.

    ఆ రాత్రి అతడు హాసతో మాట్లాడలేదు. రమణ గురించి ఏమయినా చెప్పాలని అతడి కోరిక.

    గౌతమ్ పిలుపు వింటూనే వుత్సాహంగా "రమణ ఈజ్ వండ్రఫుల్ పర్సన్. ఒక్కరోజులో మా ప్రతిభ సమస్యను పరిష్కరించేశాడు...." అంది.

    "ప్రతిభ ఎవరు? ఆమె సమస్యేమిటి?" అన్నాడు గౌతమ్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra