28

    మర్నాడు లేచే సరికి రాత్రి జరిగినదంతా ఒక్కసారి జ్ఞాపకం వచ్చి, అంతా కలలే అనుకున్నాడు గోపాలం. కాని, వెను వెంటనే అది కల కాదని ఒప్పుకున్నాక, తన ఆలోచన మాత్రమేనని సరిపెట్టుకున్నాడు.
    ఎక్కడో, అంతరాంతరాలలో బహుశా వసంత నించి తాను విడివడడానికి కోరుతూ - తనకే తెలియకుండా - ఆలోచించి ఉంటాడు! నిద్రలో కరిగిపోయిన ఆలోచనల్లో ఆ ఆలోచన: తెలీని, అంగీకరించని ఆ కోరిక ఆ చిన్న ఆధారంతో ఆమె మాటల్ని అల్లి, తనలో నమ్మకం కలుగ జేసే భయంకర స్వరూపం ఐ పోయింది అనుకున్నాడు గోపాలం.
    ఆవేళ శనివారం కావడాన్న హాఫ్ డే.
    ఆఫీసుకు వెడుతుంటే. "కారు పంపించు- బయటికి వెళ్ళాలి" అంది వసంత.
    "నువ్వు ఉంచుకో-టాక్సీలో వెడతాను" అన్నాడు గోపాలం.
    "అంత తొందరలేదు- ఇంకా నేను రెడీ అవలేదు. వొచ్చేటప్పుడు టాక్సీలో రా' అంది వసంత.
    ఆమె గుమ్మంలో నిలబడి మాట్లాడుతోంది.
    ఎంత అందంగా వుంది వసంత.
    ఈ రెండేళ్ళల్లో ఆమె యువతి అయిపోయింది. అప్పుడు- వాల్తేరులో ఆమెని చూసిన వెంటనే అంతకన్న చక్కదనం ఉండదనుకున్నాడు.... కాని. అప్పటికే ఉండిపోయిన గీతలు వొంపులె పోయి, పూర్ణత్వం వచ్చింది వసంతలో. ఎందుకో, ఈ రోజు మరీ చక్కగా కనిపిస్తోందామె.
    ఒక్కమెట్టు ఉంది తనకి ఆమెకీ మధ్య....కాని. ఆ ఒక్కటే ఎన్నిలోకాల పెట్టు! మహాదాహంగా ఉన్న మనిషిని మంచినీళ్ళకి ఎదురుగా, అందలేని దూరంలో సిలువవేసినట్లుంది ఆమె ఎదురుగా నిలబడి! ఆమెని - తన భార్యని- స్పృశించలేక పోవడం!
    అప్రయత్నంగా అతను వెనక్కి అడుగు వేశాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
    ఆక్షణంలో అతన్ని కటిక అదృశ్య బంధాలు మరెంతో బలంగా అయిపోయాయి; ఆక్షణం లోనే అవి చాలా సడిలిపోయాయి.
    టాక్సీలో ఆఫీసు చేరుకుని గంటసేపు ఆలోచనలు రానీకుండా పనిచేశాడు. కాని. ఆ తరవాత చెయ్యడానికేమీ లేక పోయింది.
    డ్రాయరు తీసేసరికి మొన్న వచ్చిన అపాయింట్ మెంట్ ఉత్తరం కనిపించింది. వెంటనే దాన్ని వెనక్కి తోసి: అవసరంలేని ఒక పుస్తకం తీసుకుని చదవసాగాడు.
    స్టెల్లా వొచ్చి ఉత్తరాలు ఇస్తూ, "అలాగ ఉన్నారేం?" అంది.
    "ఎలాగ?" అన్నాడు గోపాలం, ఆతృతగా, నీరసంగా.
    "మీ ఆరోగ్యం బాగులేదా?"
    "బాగానే ఉంది..."
    "మరి?..."
    ఏం చెప్పేది నీకు? అనుకున్నాడు గోపాలం.    కాని, ఆమె కంఠంలో ఆతృతని అతను గమనించకుండా ఉండలేక పోయాడు-ఎందుకని, తన వాళ్ళే వదిలేక, ఆమె తనకోసం బాధపడడం?
    "పరిస్థితులు...జీవితం..."
    "సారీ"
    జాలిగా చూసి, స్టెల్లా వెళ్ళిపోయింది.
    అంతలోనే టెలిఫోన్ రామానంద్.
    "హల్లో" అన్నాడు గోపాలం.
    "ఎలా ఉన్నారు?..."
    "చాలా బాగున్నాను..."
    "రేపటి మాట జ్ఞాపకం చేద్దామని పిల్చాను- శ్రీమతి రారా?"
    "సారీ..."
    "పోనీండి- వచ్చేవారం తీసుకురండి. శశి చాలా ఆతృతపడింది. బైదివే - ఇంకో ఫ్రెండు - మీకు పాత ఫ్రెండు-కూడా వస్తారు రేపు..."
    "ఎవరు?" వచ్చే నాలుగైదు నెలల్లో ప్రమోషనూ ట్రాన్స్ఫరూ వస్తాయని అనుకొంటున్నాను- అంతా నిశ్చయమైనట్లే. బహుశా బెజవాడలో వేస్తారని అనుకుంటాను.

                           
    నీ సంసారం ఎలాగ ఉంది?
    మీ వదిన ఎన్నో సార్లు నిన్ను తలుచుకుంటూంది- సరళ కులాసాగా ఉంది.
    బాబుకి వంట్లో బాగులేదు- వాడూ నిన్ను తలుచుకుంటున్నాడు. వెంటనే ఉత్తరం రాయి!
    ప్రక్కనే నిలబడి మీ వదిన ఇలాగ రాయమంది: "వసంతని తీసుకుని పదిరోజులు ఉండేలాగ రా- మిమ్మల్నిద్ధరినీ చూడాలని చాలా చాలా ఆతృతగా ఉంది..."
    నువ్వు వస్తే చాలా సంతోషిస్తాను.
                                                                                            -రామం.
    చిన్న ఉత్తరాల్ని నాలుగు సార్లు చదువుకొన్నాడు. చీకట్లో చిన్న కిరణం లాగ, ఆ కొంచెం ఉత్తరం అతనికి కొంత ఉపశమనం కలుగజేసింది- తన కోసం ఆ ముగ్గురూ నిజంగా, మనసారా, అభిమానిస్తారని ఈ మధ్య తనకి జ్ఞాపకమే రాలేదు?    
    రెండో ఉత్తరం విప్పేసరికి నాలుగు లైన్లు చక్కగా టైప్ చేసి, సంతకం లేని కాగితం మాత్రం ఉంది.
    "బ్రదర్!
    మూడు కోతులు తెలుసుగా?-చెడుని కననిదీ, విననిదీ, పలకనిదీ? వాటిని మిళితం చేసిన అవతారమా, నువ్వు? నీ భార్య ఈమధ్య కొన్ని యుద్దాలని కలుగజేసింది భగవాన్ పేరు మీద-ఆమెని అదుపులో పెట్టు.
            శుభాకాంక్షకులు"
    ఇంగ్లీషులో పద్యంగా చేసి పంపేరెవరో.
    కొద్ది నిముషాలు మతి చలించినట్ల యిందతనికి. ఎవరీ ఆకాశరామన్న?
    ఏం చెయ్యాలి తాను?
    ఏం చెయ్యగలడు? ఆ పరిస్థితులు దాటి పోయాయి.
    ఉత్తరాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వేస్ట్ బాస్కట్ లో పడేశాడు. కాని ఆ ప్రతీ పంక్తీ అతన్ని వెక్కిరిస్తూనే ఉంది! ప్రతీ మాటా మనస్సులో ఉండి పోయింది.
    ఒంటిగంటకి ఆఫీసు ఐపోయింది.
    ఇంటికి వెళ్ళాలని లేదు - కనీసం సినిమాకి వెడితే తలలో ముసురుతోన్న ఈ ఆలోచనలకి కొంత విశ్రాంతి వస్తుందని, ఎలిత్ కి వెళ్ళాడు.
    మై ఫెయిర్ లేడీ - టిక్కెట్లు ఐపోయాయి. ఫుల్ హౌస్! బోర్డు వెక్కిరించింది.
    నిస్పృహగా తిరిగి వస్తూంటే ఎవరో "టికెట్ కావాలా?" అన్నారు.
    "ఆఁ"
    ఐదూ ఇరవై అయిదు ఇచ్చి, టికెట్ తీసుకుని వెళ్ళి కూర్చున్నాడు, అదృష్టం ఈ మాత్ర మైనా ఉందిలే! అనిపించింది అతనికి.
    ఆ మధురసంగీతం, కళా విశేషం, అతనికి చాలా ఉపశమనం కలుగజేశాయి.
    షో అయాక వీరులో కాఫీ తాగుతూంటే అతనికి ఉదయం వొచ్చిన ఉత్తరం జ్ఞాపకం వొచ్చింది.
    వెనువెంటనే అతనికి ఓ ఆలోచన వచ్చింది - వసంత తనని ఎలీజ లాగ చూస్తూందా? - సినీమా కథలో లాగ విజయం పొందిన ఎలీజాకాదు. ఓడిపోయిన ఎలీజా...
    కాఫీ చేదుగా అనిపించింది. ఒదిలేసి! బయటికి వచ్చాడు గోపాలం.
    పేవ్ మెంటు మీద. ఈ ఆర్కేడ్ లనిండా ఖాళీ లేకుండా నడుస్తున్నారు జనం. ఎన్నివేలమంది? ప్రతిగంటకి ఇక్కడ తిరుగుతూ ఉంటారో. ఎక్కణ్ణించి వీళ్ళందరూ? ఎక్కడికి?
    మనుషులని తప్పించుకుంటూ నెమ్మదిగా ఇంటిదారి పట్టేడు గోపాలం. నిన్నటి సంఘటనల తరవాత ఇంటికి వెళ్ళడం అంటేనే అదొక లాగ ఉంది అతనికి.
    పార్క్ స్ట్రీట్ లోకి వెళ్ళేసరికి ట్రింకాని దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతోన్న మాధవరావు కనిపించేడు - ఒక్కసారి ప్రాణం లేచి వచ్చినట్లైంది. గోపాలాన్నిచూసి, మాధవరావు త్వర త్వరగా తన సంభాషణ ముగించి అతని దగ్గిరికి వొచ్చేడు.
    పరస్పరం కుశల ప్రశ్నలయాక, "ఈమధ్య మీరు కనిపించనేలేదు:- ఒకనాడుమీ ఇంటికి వొచ్చాను" అన్నాడు గోపాలం.
    "సారీ...శాంత - అదే- వంశాభివృద్ధి చెయ్యబోతోంది తరుచు డాక్టర్..."
    "కంగ్రాచ్యులేషన్స్!" అని మనఃపూర్వకంగా అని, "ఆమె ఎలాగ ఉన్నారు?" అన్నాడు గోపాలం.
    "ఇంకా చాలాకాలం ఉందిగా!...మరేం గొడవలేదు. ఎందుకేనా మంచిదనిడాక్టరు దగ్గరికి వెళ్ళడం. తీరికఉంటే ఇలాగ తిరగడం - మీ విశేషాలేమిటి? అలాగ చిక్కిపోయారేం?"
    "మామూలేనండీ...జీవితం అన్నాక ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి - పదండి. కాఫీ తాగుదాం."
    క్వాలిటీలోకి వెళ్ళి శాండ్విచెస్, కాఫీ ఆర్డరు చేశాక. "మీ ఇంటికే వొద్దామని చాలారోజుల నించి ప్రయత్నం చేశాం.. మీ అడ్రస్ సరీగా తెలీకపోవడం, ఆ తరవాత శాంతా..."
    ఏమనాలో తెలియలేదు గోపాలానికి -
    "ఈ వారం, పైవారంలో వొస్తాము - మీ అడ్రస్ ఇవ్వండి."
    ఒక్కసారి తన నిజ పరిస్థితుల్ని మాధవరావుకి చెప్పాలనిపించింది గోపాలానికి.... ఆ ఇల్లు తనదికాదు. తమదికాదు - వసంతది... అక్కడికి ఎవర్నీ పిలవాలని లేదు తనకి ఏమని చెప్పడం?
    బేరర్ వచ్చి కాఫీ, శాండ్విచెస్ సర్దుతూ, సంభాషణకి అంతరాయం కలిగించి తాత్కాలికంగా అతన్ని రక్షించాడు.
    కొంచెం ఆగి, "మై ఫెయిర్ లేడీ" చూశారా! అన్నాడు గోపాలం.
    "లేదండీ - శాంత రావడం కుదర లేదు. ఆమెతో వెళ్ళాలి, బహుశా వొచ్చేవారం..."
    "మంచి పిక్చరు.... చాలా ఎంజాయ్ చేశాను..."
    "విన్నాను - స్క్రిప్టు చాలావరకు షా దేట కదూ?"    
    "అవును - కథకికొంత చేర్చేరు. ముఖ్యంగా పాటలు."
    కాఫీ ముగిసేదాకా మళ్ళీ అతను భయపడుతోన్న టాపిక్ రాలేదు.
    బయటికివొచ్చి, "త్వరలోనే కలుసుకుందాం!" అని చెయ్యి ఊపి గోపాలం ఇంటికి నడిచాడు - త్వర త్వరగా.
    అతను ఇంటికి వెళ్ళేసరికి శేఖర్ సోఫాలో నిద్రపోతున్నాడు.
    తట్టిలేపి, "ఎంతసేపైంది నువ్వొచ్చి?" అన్నాడు కొంత ఆనందంతో. గోపాలం.
    "రెండు గంటలకి వచ్చాను బ్రదర్ - అంటే ఐదుగంటలసేపు ఐంది."
    "పద - ముఖం కడుక్కో - కాఫీ తాగు."
    "అన్నీ చేశాను ఆరుగంటలకి."
    "సారీ - టెలిఫోన్ చెయ్యలేకపోయావ్?"
    "సెలవు రోజు కలకత్తా సర్వే చేస్తానని నాకేం తెలుసు గోపాల్! అందుకనే తిన్నగా వచ్చాను, ఎక్కడి కెళ్ళావు? - లేక అడగకూడదా?"
    ఆశ్చర్యంగా చూసి, "ఆ సందేహం ఎందుకు వొచ్చింది?" అన్నాడు గోపాలం.
    "నాకేం తెలుసు? - ఈమధ్య ఇంట్లో ఉండడం లేదని రిపోర్టు - ఇవేళ..."
    "ఇంట్లో లేను - అంచేత రిపోర్టు కరెక్టు - ఏం?"
    "ఆఁ . అవును-"
    "దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళేనో రహస్యం!"
    "లేదని నువ్వు చెప్తే తప్ప."
    "ఏమీ రహస్యంలేదు. ఎలీత్ లో పిక్చర్ కి వెళ్ళేను - ఇదిగో టికెట్ ముక్క."
    "థాంక్స్ - నీ మాటచాలు. స్నానం చేసి రా."
    గోపాలం లేచి స్నానంచేసి బట్టలు మార్చుకుని వచ్చేడు. జరుగుతూన్న ఈ నాటకంలో శేఖర్ కి పాత్ర లేదనీ, అతను ప్రేక్షకుడుగా, అందుచేత నిర్వికారంగా, విషయాలని గమనిస్తాడనీ అనుకున్నాడు గోపాలం. కాని ఈ కొంచెం నిముషాల్లో ఆ నమ్మిక పోయింది.

                                  *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra