Home » Yerramsetti sai » Bomma Borusu


    "మాబావ అలాగే మాట్లాడతారు హేమగారూ! ఆయనపట్టిన కుందేటికి మూడేకాళ్ళు!" నవ్వుతూ అన్నాడు చంద్రకాంత్.
    అక్కడినుంచి లేచివెళ్ళబోతూ!" ఆయనే కాదు! మగాడుపట్టిన ఏ కుందేటికయినా మూడేకాళ్ళు!" తనూ అందామె.
    కుమార్ కూడా నవ్వేశారు. "నేనింకవెళ్ళి పడుకుంటాను. మళ్ళీ ప్రొద్దున్నే డ్యూటీ కెళ్ళాలి!" అంటూ వెళ్ళిపోయాడతను.
    హేమా, వసుంధరా చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చుండిపోయారు. శ్రీనివాసరావ్ గురించి అన్ని విషయాలూ వసుంధరకి చెప్పిందామె.
    "అలాంటి మూర్ఖుడికి గట్టిగా బుద్ది చెప్పాల్సిందే!" మండిపడుతూ అంది వసుంధర. "మరి నీ సంసారం విశేషాలేమిటి? మీవారిక్కూడా కొన్ని తిక్క అభిప్రాయాలున్నట్లున్నాయే!" సందేహంగా అడిగిందామె.
    "ఆయన చాలా మంచి మనిషి హేమా! 'మగాడు ఎక్కువ స్త్రీ తక్కువ' అనుకునే మనస్తత్వమేకాదు. నిజానికి ఆయన సాహచర్యం వల్ల మనం ఆ రోజులల్లో ఏర్పరచుకున్న అభిప్రాయాలు చాలావరకూ తప్పు అని తెలిసివచ్చిందినాకు. ఇద్దరికీ ఏ విషయంలోనయినా అభిప్రాయ భేదాలొస్తే ఇద్దరం దాని మంచీచెడులను చర్చించుకుని ఎలాంటి రిజర్వేషన్స్ లేకుండా ఒక నిర్ణయానికొస్తాం. నాకిప్పుడేమనిపిస్తుందో తెలుసా? కొంతమంది క్రూర ప్రవర్తనవల్ల మగవారి నందరినీ అలాంటి వారిగానే ముద్రవేయడం అసమంజసమనీ వివాహమయాక ఆయన సాన్నిధ్యంలో ఒక్కరోజు కూడా నేను తక్కువగా చూడబడుతున్నానన్న భావన గానీ, మనకున్న స్వేచ్చగానీ, హక్కులుగానీ చాలవన్న ఆలోచనగానీ కలగలేదు....." ఆనందంగా చెప్పిందామె.
    "అది నీ అదృష్టమే! కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను! నీకు లభించిన అదృష్టం చాలా తక్కువమందికి లభిస్తుంది!" వారు పడుకునేసరికి రాత్రిపన్నెండుదాటింది. మర్నాడు సాయంత్రం తిరిగి తమ ఊరికి బయల్దేరింది హేమ. చంద్రకాంత్ ఆమెతోపాటు బస్ స్టాండ్ కొచ్చాడు.
    "అబ్బ ఈ రెండు రోజులూ ఎంత ఆనందంగా గడిచిపోయిందో తెలుసా హేమగారూ! మీరెప్పుడూ మా ఇంట్లోనే ఉండిపోతే బావుండుననిపిస్తోంది!" అన్నాడతను.
    "మీ ఇంట్లో ఉండిపోవాలా? నిజంగా ఉండిపోతే నాలుగురోజుల్లో మొఖం మొత్తి, ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తారు....." నవ్వుతూ అందామె.
    చంద్రకాంత్ మొఖంలో చిరునవ్వు మాయమయిపోయింది. "హేమగారూ! మీరు నన్నర్ధంచేసుకొంది ఇంతేనన్నమాట!" బాధగా అన్నాడతను.
    "సరదాకలా అన్నాను! నిన్ను నొప్పించాలనికాదులే" అతనిని సమాధానపరుస్తూ అందామె.
    "సరదాకి కూడా అలాంటి మాటలునేను భరించలేను హేమగారూ! మీకు నాహృదయంలో ఎలాంటి స్థానముందో మీకు తెలీదు...." ఆమె కలవరపడింది.
    అతని మాటలు ఆమె కర్ధంకావటంలేదు. అతనంతగా బాధపడాల్సిణ విషయమేముందనీ? కండక్టర్ బెల్ మోగించడంతో బస్ ఎక్కి తన సీట్లో కూర్చుందామె. చంద్రకాంత్ బయట కిటికీపక్కనే నిలబడ్డాడు.
    "ఇంక ఉంటాను చంద్రకాంత్! నాకు ఈ రెండు రోజులూ కంపెనీ ఇచ్చినందుకు చాలా థాంక్స్!" అంది హేమ అతని వంక చూసి.
    "నేనేమీ థాంక్స్ చెప్పాలి" బస్ బయల్దేరింది అతను చేయి ఊపాడు.
    కొద్దిసేపట్లో హైద్రాబాద్ హడావుడి నుంచి బయటపడి తాపీగాపరుగెత్తసాగింది బస్. హేమ సీటు మీద వెనక్కువాలి కళ్ళుమూసుకుంది.
                
                                                             * * * * *
    
    నాగమణికి ఆ తరువాత కొద్ది రోజులకే ఉద్యోగంలో సెలక్టయినట్లుకాగితం అందింది జాయినవడానికి వారం రోజులు గడువు ఇచ్చారు. వెంటనే శ్రీనివాసరావుకి టెలిగ్రామిచ్చి విజయవాడకు బయల్దేరిందామె. ఎలాగూ శ్రీనివాసరావు తనను రిసీవ్ చేసుకుంటాడు. అతనే తనకు అన్ని సహాయాలూ చేస్తాడు. తను వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో చేరుతుంది.
    బస్ స్టాండ్ లో తనకోసం ఎదురు చూస్తూ కనిపించాడు అతను. బస్ పైనవున్న ఆమె సూట్ కేస్ బెడ్డింగ్ కిందకు దింపించుకుని  రెండు రిక్షాల్లో అతనింటికి బయల్దేరారు వాళ్ళు. "హేమ వచ్చిందా?" అని అడుగుదామని అనుకుని ధైర్యం చాలక ఊరుకుండిపోయిందామె.
    "మామయ్య రాలేదా?" అడిగాడు శ్రీనివాసరావు రిక్షా ఎక్కే ముందు.
    "ఊహూ! నేనే వద్దన్నాను....." అందామె రిక్షా దిగాక ఇంటివేపు చూసిందామె. తాళంవేసే వుందది. హేమలేకుండా తను అతనితోగడపడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించిందామెకి. తాళంతీసి లోపలకు నడిచారిద్దరూ.
    "అక్కరాలేదా?" అడిగిందామెకొద్ది సేపు తటపటాయించి.
    "ఊహు!"
    "చాలారోజులయింది కదా?"
    "అవును! పొగరింకా తగ్గలేదనుకుంటాను!" నవ్వుతూ అన్నాడు.
    "మరి భోజనానికి నీకు కష్టంగా లేదూ?"
    "నాకేంకష్టం? హాయిగా రోజుకో హోటల్లో తింటున్నాను".
    "బావుంది! ఎన్నాళ్ళని అలా ఆరోగ్యం పాడు చేసుకుంటావ్ బావా! ఇప్పటికే చాలా చిక్కిపోయావ్ నువ్వు!"
    "నీ కొక్కర్తెకే అలా కనబడుతున్నాను కాబోలు! అందరూ తెగబలిసిపోయానంటున్నారు.....అది సరేగానీ నువ్వు స్నానంఅదీ చేసి రడీగా ఉండు! నేనీలోగా హోటల్ కెళ్ళి కాఫీ ఫలహారం తెస్తాను...." అనేసి సంచీ ప్లాస్కూ తీసుకుని వెళ్ళిపోయాడతను. ఇల్లంతా ఓసారి కలియజూసింది నాగమణి. అంతా దుమ్ముపేరుకుపోయి ఉంది. ఇల్లంతా బట్టలూ, కాగితాలూ పేపర్లూ చిందరవందరగా పడి ఉన్నాయ్. అన్ని త్వరత్వరగా సర్దేసి ఇల్లంతా చిమ్మి ఓ కొలిక్కి తీసుకువచ్చిందామె.
    స్నానం చేస్తూండగా మధ్యలో హోటల్నుంచి తిరిగివచ్చి తలుపుతట్టాడు శ్రీనివాసరావ్. త్వరత్వరగా స్నానం ముగించి చీర చుట్టేసుకుని తలుపుతీసి పక్క గదిలోకి పారిపోయిందామె. శ్రీనివాసరావ్ కి నవ్వొచ్చింది. ఇల్లంతా నీట్ గా సర్ది కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. ఇంత త్వరగా ఇన్ని పనులు చేయగలిగిందా నాగమణి?
    నాగమణికీ హేమకూ ఎంతో తేడా ఉన్నట్లనిపించిందతనికి. ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ ఫలహారం ముగించాడు.
    "ఎప్పుడు జాయినవుతున్నావ్?" అడిగాడు శ్రీనివాసరావ్.
    "రేపట్నుంచీ వెళదామనుకుంటున్నాను....."
    "ఓ.కే! అలాగయితే నీకు టిఫిన్ కారియర్ లో భోజనం తెచ్చి ఇచ్చి ఆఫీస్ కెళతాను! సాయంత్రంవరకూ విశ్రాంతి తీసుకో!" అన్నాడతను.
    "హోటల్ భోజనమా?" ఆశ్చర్యంగా అందామె.
    "అవును! ఏం?"
    "వద్దుబావా! నేను ఖాళీగానే ఉంటాను కదా ఇవాళ! ఇంట్లో వండేస్తాను!"
    "చాల్చాల్లే! ఇప్పుడా వంట పనెందుకు నెత్తినేసుకుంటావ్? వద్దు!" వారిస్తూ అన్నాడు శ్రీనివాసరావ్.
    "ఏమంతకష్టమైన పననీ?"
    "ఊహు! వద్దు! చుట్టాలకెవరయినా పని చెప్తారా?"
    "నేను చుట్టాన్ని కాదు బావా!"
    "మరి?"
    "నీ మరదలినేగా?" సిగ్గుపడుతూ నవ్వి అందామె. శ్రీనివాసరావ్ కూడా నవ్వేశాడు. ఆమాటగిలిగింతలు కలిగించింది కొద్ది క్షణాలపాటు ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయ్ నాగమణి సిగ్గుతో చూపులుమరల్చేసుకుంది. పది గంటలకల్లా హోటల్నుంచీ కారియర్ తెచ్చాడతను. ఇద్దరూ కలిసే భోజనంచేశారు.
    "ఓ.కే! నేను వెళతానిక! సాయంత్రం అయిదున్నరకల్లా వచ్చేస్తాను! ఆ టేబుల్ మీద మాగజైన్లు ఉన్నాయ్! కావాలంటే చదువుకో!" అన్నాడతను ఆఫీసుకి బయల్దేరుతూ. అతను వెళ్ళిపోయాక చాలాసేపు పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంది నాగమణి. ఆ తరువాత ఆమె ఆలోచనలు శ్రీనివాసరావ్ వేపు మళ్ళినయ్. అతనిలో ఎలాంటిలోపమూ తనకు కనిపించలేదు.
    ఎలాంటి అవాంఛనీయ ప్రవర్తనాలేదు. అదివరక్కంటే స్వేచ్చగా చనువుగా తనతో మాట్లాడగలుగుతున్నాడిప్పుడు. తనను వివాహంచేసుకోడానికి నిరాకరించినందుకు అతనంటే కొద్దికాలం కోపంగా వుండేది. కానీ రాన్రాను అదంతా తుడిచిపెట్టుకుపోయింది. అతను ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తాడా అని ఆత్రుతగా ఎదురుచూడసాగిందామె. నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యపడడం లేదు.
    శ్రీనివాసరావ్ ఆఫీసుకి చేరుకోగానే పోస్ట్ మన్ ఓ ఉత్తరం అందించాడతనికి ఆత్రుతగా కవరు చింపి ఉత్తరం చదివాడతను. అది హేమ తండ్రిరాసింది. హేమకిప్పుడు మూడోనెల అనీ తనోసారి వాళ్ళింటికి వెళితే అన్ని విషయాలూ మాట్లాడుకోవచ్చనీ రాశాడాయన. ఆ వార్త కొంచెం ఆనందాన్ని కలిగించినా మరుక్షణం ఆమె నిర్లక్ష్యం అతనికి కోపాన్ని కలిగించింది.
    ఈ వార్త హేమే ఎందుకురాయలేదు? తనను రమ్మని రాయడానికి ఆమెకంత అభిమానమెందుకు? అంటే ఆమెకున్న పొగరు వీసమెత్తు కూడా తగ్గలేదని తెలీటం లేదూ? అలాంటి దానికోసం తనెందుకు వెళ్ళాలి? ఉత్తరం చింపి అవతల పారేశాడతను. సాయంత్రం ఇంటికిచేరుకునేసరికి నాగమణి అతని కోసం ఎదుర్చూస్తోంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra