"మాట తప్పడం మా వంశంలో లేదు...." సాలోచనగా అన్నాడు త్యాగి "ఎందుకంటే నేనో స్వాతంత్ర్య సమరయోధుడికి మనవడ్నిగా."
    
    ఆ తర్వాత త్యాగి మోటార్ బైక్ ధూళి రేపుకుంటూ వెళ్ళిపోయింది. ఇంత అద్భుతమైన ప్రియుడ్ని సంపాదించుకోగలిగిన సౌందర్యని చూస్తూ రూపిణితోబాటు స్నేహితురాళ్ళంతా అభినందనలతో ముంచెత్తినా నిశ్శబ్దంగా వుండిపోయింది నీలిమ ఒక్కతే.
    
    "తొందరపడ్డావేమో సుందూ" అంది నెమ్మదిగా ఏ స్నేహితురాళ్ళముందు తనను నిస్సహాయంగా నిలబెట్టాడో ఆ వ్యక్తుల ముందే అతడ్నిలా నిస్సహాయుడ్ని చేయడం సౌందర్యకి ఆనందంగా వుంది. "నీపదివేలూ నెక్లెస్ రూపంలో నీకు దక్కినందుకు సంతృప్తి పడిపోవాల్సింది సుందూ.....పాపం అతడి కిలాంటి పరీక్ష పెట్టాల్సింది కాదు."
    
    "జన్మలో యిక మన ఛాయలకి రాడు నీలూ" అంది సౌందర్య సౌందర్య పొరపాటు పడిందిక్కడే.
    
                                                                  * * *
    
    "సో.....చావాలని ఉబలాటపడిన ఇంటర్మీడియట్ విద్యార్ధివన్న మాట" ముకుందం ఉత్సాహంగా అడిగాడు కానీ.
    
    తలవంచుకు నిలబడ్డ విద్యార్ధి కళ్ళనుంచి ధారపాతంగా నీళ్ళు వర్షిస్తున్నాయి తప్ప జవాబు లేదు.
    
    "మాట్లాడు" రెట్టించాడు ముకుందం.
    
    "నీపేరు?"
    
    "కృష్ణ"
    
    "వయసు"
    
    "పద్దెనిమిది సంవత్సరాలు"
    
    "ఊరు?"
    
    "ఇదే"
    
    జాలిపడుతున్న పులిలా నవ్వేడు పరమహంస "దారుణం కృష్ణా......భావి భారతపౌరుడొకడు ఇంత చిన్న వయసులో నిరర్ధకంగా చావాలనుకోవడం....."
    
    సుమారు ఇరవైనాలుగు గంటలుగా ఆకలి సైతం మరిచి కృష్ణ అసలు చావాలనుకున్న తన నెందుకిలా రక్షించారో అర్ధంకాక నిస్సత్తువగా కంపిస్తున్నాడు. "చెప్పు కృష్ణా..అసలు నువ్వెందుకు చావాలనుకున్నావు....." ఇప్పటికి యిదే ప్రశ్న పదిసార్లు అడిగి వుంటాడు పరమహంస.
    
    బ్రతకాల్సివచ్చినందుకు కలవరమో ఏదో గుర్తుకొచ్చినట్టు వెక్కి వెక్కి పడిపోతున్నాడు. "కృష్ణా" బ్రతుకు పుస్తకపుబడిలో నిద్రించిన అశ్రువుల పుటలకి గండి పడినట్టు కృష్ణ కళ్ళనుంచి నీళ్ళు రాలుతుంటే ఆప్యాయంగా భుజంతట్టిన పరమహంస మరింత ఆర్ద్రతని వ్యక్తం చేస్తూ అన్నాడు "ఏ మనిషి ముఖ్యంగానీ వయసులో వున్న ఏ యువకుడూ అంత సులభంగా జీవితాన్ని కడతేర్చుకోవాలనుకోడని నాకు తెలుసు. అసలు ఏ సమస్య నిన్నీ దారుణానికి పురిగొల్పింది. పరీక్షలో ఫెయిలయ్యావా..."
    
    "లేదు" తల అడ్డంగా వూపేడు కృష్ణ. "నీ తల్లిదండ్రులపరంగా" "అహ...నాకు నాన్నలేడు......"
    
    "అంటే......నిన్ను పెంచి పెద్దచేసింది నీ తల్లేనన్నమాట....." అవునన్నట్టుగా తల పంకించాడు......
    
    "అదిగో అలా ముక్తసరిగా వుంటే నువ్వు బ్రతికి ప్రయోజనం లేనట్టే కృష్ణ...నీ ముందున్న ముకుందం సామాన్యుడు కాదు.......దేవుడంత మంచివాడు. ఉన్నవాడు......నీ సమస్య చెబుతే తప్పకుండా పరిష్కరిస్తాను...... అలా అని అందరి సమస్యల్నీ పరిష్కరించడం ధ్యేయంగా తీసుకున్న వ్యక్తి అనుకోకు......కేవలం నీఒక్కడి సమస్య..... అదెంత జటిలమైనధైనాసరే ..చెప్పు.....ఎందుకు చావాలనుకున్నావు....." పరమహంస మాటల్లో జీవం కోల్పోతున్న ఏ నమ్మకలకి వూపిరి పోసినట్టయిందో దైన్యంగా చూశాడు నిజమా అన్నట్టు.
    
    చిన్మయానందంగా నవ్వాడు ముకుందం....
    
    "అవును కృష్ణా" నేనున్నానన్న హామీ ముకుందం గొంతులో "చెప్పు......ఏమిటి నీ సమస్య...."
    
    దేవుడా.....ఎన్ని పరీక్షల తర్వాత నువ్విక్కడ ప్రత్యక్షమై పోయావ్. ఈ పాటికి చింకిన కళేబరంగా మారాల్సిన నాకు యింత ఆలశ్యంగా అదృష్టాన్ని అందించావేం.....    

    "కమాన్.....క్విక్...."
    
    ఈ అవకాశమూజారిపోతుందన్న భయమేమో ఉద్విగ్నంగా అన్నాడు కృష్ణ....." అమ్మతోబాటునాకో అక్క వుంది...... నా కన్నా అయిదేళ్ళు పెద్దది. చదువుకోవాలనుకుంది. ఆరోగ్యం సరిగ్గా లేని అమ్మకి తోడుగా వుండి తానుచదువుకునే స్థోమతలేదని తెలుసుకుని నన్ను చదివించాలనుకుంది. చదివిస్తూంది కూడా...."
    
    "దెన్ వై ఎందుకు ఈ మార్గాన్ని ఎన్నుకున్నావు?"
    
    "అమ్మకి అనారోగ్యమని తెలుసు కాని కేన్సరని ఈ మధ్య తెలిసింది."
    
    పరమహంస వేపు చూశాడు ముకుందం..... "అది కాదు...." నిభాయించుకోలేని ఉద్విగ్నత కృష్ణ గొంతులో" అమ్మ బ్రతుకదని తెలిసిన నాలుగోరోజునే అక్కయ్య ఏం చేసి డబ్బు సంపాదిస్తున్నదీ అర్ధమైంది."
    
    "బహుశా వ్యభిచారం చేస్తూ వుండొచ్చు" ప్రపంచంలో బ్రతుకు తెరువుకోసం ప్రతి ఆడది చేసేపనే అది అన్నంత ధీమాగా అన్నాడు పరమహంస.
    
    "అవును......మొన్న పోలీస్ రైడింగ్ లో అక్క దొరికాక మా వీధిలో అందరికీ తెలిసింది"
    
    మెలితిరిగి పోతూ జుగుప్స గా నులిమేస్తున్న నిస్సహాయతతో కూలబడి పోయాడు..... "ఆ తర్వాత..."
    
    "నీకు బ్రతుకు మీద రోతపుట్టింది" అర్దోక్తిగా అన్నాడు పరమహంస" చావబోతున్న తల్లి......చావులాంటి జీవితంతో నిన్ను, నీ తల్లిని బ్రతికించాలనుకుంటున్న అక్క......లోకం చేసే అల్లరి. రేపెలా బ్రతకాలీ అన్న భయం...యింతకన్నాచావు నయం అనిపించిన ఆలోచనలు "ఇవీ నిన్ను ఆత్మహత్య కి ప్రేరేపించాయి"
    
    క్షణం ఆగేడు పరమహంస "సహజమే కృష్ణా.....సమస్యల లాఠీ దెబ్బలతో చొక్కా అంతా నెత్తురుచిన్దినా తట్టుకోలేని వయసులో వున్న నీలాంటి వాడు ఖచ్చితంగా యిలానే ఆలోచిస్తాడు. ఆలోచించాలి కూడా..... కాని నువ్వు చస్తే ఈ సమస్యల నుంచి నువ్వు దూరంగా పారిపోగలవు తప్ప, మీ వాళ్ళు నుంచి సమస్యలు దూరంగా పారిపోవుగా. ఆలాంటప్పుడు తెలివయిన నీలాంటి యువకుడేంచేయాలి"
    
    నిస్త్రాణగా తలపైకెత్తి చూశాడు కృష్ణ.
    
    "అవును కృష్ణా.....చావుని ఆహ్వానించడానికి సిద్దపడిన నువ్వు నీ బ్రతుక్కి వెలకట్టయినా నీవాళ్ళకి కొంత ఆసరా అందియ్యాలి"
    
    అర్ధంకాలేదు కృష్ణకి. నిజమే....అలాంటి అవకాశమేవస్తే అణువంతైనా తన బ్రతుక్కి అర్ధం కల్పించుకోవాలనుకున్నాడు కాని ఎలా....
    
    "హఠాత్తుగా నీకు లక్ష రూపాయలు ఇస్తామంటే...." బ్రెయిన్ వాష్ ప్రారంభించేశాడు పరమహంస "దేనికైనా సిద్దపడతావు కదూ......అవసరమైతే హత్య చేయడానికైనా...."

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra