"ఫోన్ చెయ్యడానికి నా దగ్గర డబ్బులు లేవు" చెప్పింది రాగ.
"డబ్బులు సంపాదించుకోవచ్చు"
"ఎలా?"
"బచ్చాలాడి పందెం గెలవగలవా?"
"ఆ గేమ్ నాకు రాడు"
"పోనీ సామాన్లు మోయ్యగలరా?"
"మోయలేను"
"గుళ్ళో జనం దగ్గర పాంటు జేబుల్లోంచి , హేండ్ బేగ్ లోంచి డబ్బులు దొంగతనం చెయ్యగలవా?"
"చీ...చీ తప్పు కదూ!"
భుజాలేగరేశాడు శంభూ.
"పోనీ పాటలు పాడి డాన్సులు చేయగలవా?" రాగ వెంటనే ఉత్సాహంగా "ఓ! డిస్కో డాన్సు వొచ్చు టిస్ట్ కూడా వచ్చు"
"అయితే రా! టెంపుల్ దగ్గర డాన్సు చేద్దువుగాని డబ్బులోస్తాయేమో చూద్దాం." వెనక ముందూ ఆలోచించకుండా ఉత్సాహంగా శంభూ తో బయల్దేరింది. ఎలాగైనా డబ్బులు సంపాదించి తల్లికి ఫోన్ చేసి, సారీ చెప్పాలన్నడే ఆ పిల్ల పట్టుదల ఇద్దరూ వూరి పొలిమేరలు దాటి కోణార్క్ టౌన్ షిప్ లో అడుగుపెట్టారు.
కోణార్క్ టౌన్ షిప్ మరి పెద్దది కాకపోయినా, పోలిస్ స్టేషన్, హైస్కూల్, కాలేజి, హాస్పిటల్ అన్నీ వున్నాయి. ప్రాచీన శిధిల శిల్పలు భద్రపరిచిన లాజికల్ మ్యూజియం కూడా వుంది. పంత్ నివాస్ అనే టూరిస్ట్ బంగాళా , ట్రావెలర్స్ లాడ్జి అవి రెండూ వున్నాయి. తిరుపతి మొదలైన దేవస్థానాలో వున్నంత రష్ కాకపోయినా కోణార్క్ లో సూర్యదేవాలయం ఎప్పుడూ యాత్రికులతో సందడిగానే వుంటుంది. హిందీ, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు మాట్లాడే గైడ్స్ యాత్రికులకు అన్నీ వివరించి చెప్తుంటారు. కోణార్క్ దేవాలయానికి ఆ పేరు రావడానికి రకరకాల కధలు చెప్తారు.
కోణంలో వున్న అర్కుడు (సూర్యుడు) అని కొందరంటారు.
నరసింహదేవ మహారాజు కాన్ కాన్ దగ్గిర సూర్యదేవాలయం నిర్మించాడట అదే క్రమంగా కోణార్క్ అయి వుండొచ్చు ఇలా రకరకాల కారణాలు చెప్తారు. ఈ క్షేత్రంలో సూర్య దేవుణ్ని కోణార్క్ అని అంటారు. పురాణాలలో విష్ణుమూర్తి గయాసురుని చంపినా తరువాత శంఖాన్ని పురిలోనూ, చక్రాన్ని భువనేశ్వర్ లోనూ, గదని జయపూర్ లోను, పద్మాన్ని కోణార్క్ లోనూ వొదిలి పెట్టాడని వర్ణిస్తారు. అందుకని కోణార్క్ ని పద్మ క్షేత్రమని కూడా పిలుస్తారట.
దేవుళ్ళ మాట ఎలా వున్నా, ఆ సూర్యదేవాలయంలోని శిల్ప సంపదను చూడటానికి దేశ విదేశాల నుండి యాత్రికులు కోణార్కకి వచ్చి పోతుంటారు. కర్మ సాక్షిగా ఆరోగ్య ప్రదాతగా సూర్యభగవానుడు హిందువులకు ఆరాధ్య దైవమె సూర్యాదేవాలయానికి సంబంధించి మరో కధ కూడా వుంది. కృష్ణుడి కొడుకు శంభుడికి నారదుడి శాపం వల్ల కుష్టు రోగం వచ్చిందట. అతడు నారదుడి సలహా ప్రకారం చంద్రభాగానది తీరాన మైతేయారణ్యాలలోకి వెళ్ళి సూర్యుని గూర్చి తపస్సు చేసి కుష్టు రోగం పోగొట్టుకున్నాడట.
ఒకరోజు శంభుడు చంద్రభాగనదిలో స్నానం చేస్తుండగా సూర్యదేవుని విగ్రహం దొరికిందట దానినతడు తీసుకువచ్చి దేవాలయం కట్టించి అందులో ప్రతిష్టించాడట. ఆ రకంగా కోణార్క్ లో సూర్యదేవాలయం కృష్ట భగవానుని కలం నుంచి వస్తున్నట్లు ప్రతీతి. కోణార్క సూర్యదేవాలయం టౌన్ షిప్ కి బాగా దూరంగా వుంటుంది. కోణార్క్ దేవాలయం పక్కన చిన్న మాయాదేవి దేవాలయం కూడా వుంది. నరసింహదేవుడు మాయదేవిని ప్రేమించాడట. అతడు యుద్దంలో ఉండగా ఆమె చనిపోతే ఆమె స్మృతి చిహ్నంగా చంద్ర భాగా నదిటిరానా కోణార్క్ సూర్యదేవాలయం నిర్మించాడట. క్రీ.శ. 1237 లో యీ దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. ఇసుక నేలలో ఈ దేవాలయం నిర్మించడానికి పదహారు సంవత్సరాలు పట్టిందట.
ఈనాటి విలువను బట్టి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయి వుంటుందని అంచనా. దేవాలయం సూర్యుడి రధం అక్కరంలో నిర్మించబడింది. అటు పన్నెండు చక్రాలు, ఇటూ పన్నెండు చక్రాలు వున్నాయి. మొదట సూర్యుని సప్తాశాలు కనిపిస్తాయి. విమానము, ముఖశాల, నాట్యశాల , భోగమండపము, ఒకదాని తరువాత ఒకటి కనిపిస్తాయి. ప్రధాన దేవాలయం మూడింటిలో ఎత్తైనది. ఆ రోజుల్లో దేవాలయాన్నిటిలోను నాట్యమండపాలు తప్పనిసరిగా వుండేవి. అలాగే కోణార్క్ లోను వుంది. సూర్యుని తొలి వెలుగు రేఖ గర్భగుడిలోని సూర్యదేవుని విగ్రహం శిరసు పైన పడేలాగా నిర్మించడంలోనే ఈ శిల్పుల కళ ప్రావిణ్యట వ్యక్తమౌతుంది. అదే ఈ దేవాలయంలోని విశిష్టత. నది తీరాన కొండలకు దూరంగా నిర్మించబడ్డ ఈ దేవాలయానికి పెద్ద పెద్ద శిలలను ఏ రకంగా సమీకరించేవారో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఆదునిక సదుపాయాలు ఏమి లేని ఆ పురాతన కాలంలో ఏంతో బరువైన యినప స్తంబాలను, పెద్ద శిల శిఖరాలను అంత యెత్తుకు ఎలా చేర్చారో అద్భుతంగా తోస్తోంది.
కోణార్క టౌన్ షిప్ లోంచి కోణార్క దేవాలయం వరకు నడిచేసరికి కాళ్ళు లాగసాగాయి రాగకి ఆ పిల్ల అప్పటివరకు కోణార్క దేవాలయం చూడలేదు నది తీరాన పద్మంలో వున్నట్లుగా అనిపించే ఆ దేవాలయాన్ని కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆరోజు మాఘ సప్తమి కావడం వల్ల జనం చాలా మంది వున్నారు. యాత్రికుల్లో హిందువులు చాలామంది తెల్లవారుఝమున చంద్రభాగా నదిలో స్నానాలు చేసి సముద్ర తీరాన నిలబడి ఉదయ సూర్యుని దర్శించుకుని సముద్ర గర్భంలోంచి బంతి కేగాబాగుతున్నట్లున్న ఉదయ సూర్యుని దర్శించుకుని ఆ తరువాత సూర్య దేవాలయానికి కొచ్చారు. ముఖ మండపంలోంచి నాట్య మండపం లోనికి తీసుకొచ్చాడు రాగని శంభు నాట్య మండపం పై కప్పు కూలిపోయింది. అయినా కోణార్క దేవాలయంలోని శిల్ప సంపద ఎక్కువ భాగం అక్కడే వుంది. ఎటు తల తిప్పినా సంగీత వాయిద్యాలతో అభినయ భంగిమలతో వున్న స్త్రీ శిల్పాలు అవి చూడగానే రాగకి తన తల్లి నేర్పే భారతనాట్య భంగిమలు గుర్తుకొచ్చాయి.
తల్లి ముచ్చటగా నేర్పినా ఒక తరంగం నెమ్మదిగా పాడుతూ అభినయించడం మొదలు పెట్టింది. ముద్దులు మూటగట్టే ఎనిమిదేళ్ళ పాప తియ్యని పాట చక్కని అభినయం చూడగానే యాత్రికులు కొన్ని నిమిషాలు నిలబడసాగారు. పాప తన్మయత్వం తో అభినయిస్తుంటే శంభూ చెయ్యి జపాడు డబ్బుల కోసం. కోణార్క దేవాలయానికి భక్తితో వచ్చే వారికంటే విలాసంతో వచ్చేవారు ఇంకా ఎక్కువ. త్వరలోనే చాపిన శంభు చేతిలో చిల్లర కురవసాగింది తన అలసట, ఆకలి, మమ్మీ, డాడీ ల మీద బెంగ అన్నీ మర్చిపోయి డాన్సులో లీనమైపోయింది రాగ. ఎంతైనా ఆమె ప్రఖ్యాత నర్తకి అణువేద కూతురు. తరంగం అభినయించడం పూర్తిచేశాక, అప్పుడు కాళ్ళ నొప్పులు తెలిసివచ్చాయి. రాగకి కాళ్ళు రెండూ చేతులతో పట్టుకుని కూలబడింది.
"ఇంకా డాన్సు చెయ్యి బోలెడు డబ్బులోస్తాయి" చూపుల నిండా దురాశ నింపుకుని అభినయంతో చెప్పాడు శంభు. "ఫోన్ చెయ్యడానికి కావలసిన డబ్బులు వొచ్చాయి కదా! ఇంక డాన్సు చెయ్యలేను. పోదాం పద" ఆయాసపడుతూ లేచింది రాగ శంభూ కి కోపం వచ్చింది. "మళ్ళీ డాన్సు చెయ్యి" అన్నాడు బెదిరింపుగా.
రాగ శంభు చేతిలోంచి డబ్బులు లాక్కుని నాట్య మండపం బయటికి నడిచింది. నాట్యమండపం నుంచి నాలుగు వైపులా మెట్లున్నాయి. తూర్పు వేపున ఏనుగు తల మీద కాళ్ళు పెట్టిన పెద్ద పెద్ద శిల్పాలున్నాయి. ఏనుగు తొండంలో చిక్కుకుని ఒక పురుషాకృతి వుంది. ఆ బొమ్మల్ని రాగ చూస్తున్నంతలో శంభు వచ్చి ఆమెను పట్టుకోబోయాడు. యాత్రికుల మధ్య నుంచి అతనిని తప్పించుకుంటూ నవగ్రహ మండపమ వైపు పరిగెత్తింది. అక్కడ సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, మొదలైన నవగ్రాహాల గ్రహాలు ఉన్నాయి.