Home » Yandamuri veerendranath » Bharya Gunavathi Sathru

  

    "దాన్దేముంది" అన్నాడు బాలు చాలా మామూలుగా ఆ ఛాన్సు రావటమే అతనికి బంపర్ లాటరీ తగిలినట్లుంది. డబ్బు సంగతి ఎక్కువ ఆలోచించలేదు అతడు.    
    ఏ ఫీల్డులో అయినా అంతే కొత్త మోజు తగ్గి అవకాశాలు రావటం అలవాటైపోయాక అప్పుడు గుర్తొస్తుంది డబ్బు.    
    బజర్ నొక్కాడు యం.డి. సెక్రెటరీ వచ్చింది. సమ్మోహనంగా బాలూవైపు చూసి నవ్వుతూ ఒక ఫోల్డరు వాళ్ళముందు ఉంచింది. బంగారపు క్యాప్ వున్న పెన్ను అందించింది. ఏదో గొప్ప అంతర్జాతీయ ఒడంబడిక మీద సంతకం పెడుతున్న జాతీయ నాయకుడిలా ఫీలవుతూ పెన్ను క్యాప్ తెరిచాడు.    
    ఫాంటాస్టిక్ లక్ యిది - యా! నిజంగా ఫాంటాస్టిక్..... ఆడియో....వీడియో క్యాసెట్లు.    
    రేపో మాపో.....తోర్న్, ఈ.ఎమ్.ఐ. లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు.    
    ఫారిన్ టూర్లు! ఫారిన్ కార్లు.    
    ఈ అగ్రిమెంటుతో తను మరో మహత్తరమైన దశలో అడుగు పెడుతున్నాడు. అనుకుంటూ సంతకం పెట్టబోయాడు.    
    హఠాత్తుగా అతన్ని ఎవరో ఎలక్ట్రిక్ కమ్చీతో చెళ్ళుమని కొట్టినట్లయింది.    
    'అగ్రిమెంటు'.    
    ఇదివరకు సత్యనారాయణ్ తో చేసుకున్న అగ్రిమెంటూ, దానివల్ల తనుపడ్డ కష్టాలూ గుర్తొచ్చాయి.    
    ఇదీ అలాంటిదేనా! దీని వెనుక కూడా బ్రహ్మానంద అదృశ్యహస్తం ఉందా!    
    అవును.    
    ఉండే వుండాలి.    
    లేకపోతే ఇంత నోరూరించే కాంట్రాక్టు తనని వెదుక్కుంటూ రావటమేమిటి? పెన్ను క్యాప్ పెట్టేసి, అగ్రిమెంటు కాయితాలు చేతిలోకి తీసుకుని పరపర చింపేశాడు బాలు.    
    సంభ్రమంగా నోరు తెరిచి చూస్తున్నాడు యం.డి.    
    సీరియస్ గా ఇంగ్లీషులో చెప్పాడు బాలు. "చూడు ఓ ముసలాయనా! ఒక మనిషిని ఒక పద్దతిలో ఒకేసారి ఫూల్ చెయ్యొచ్చు. రెండోసారి కూడా అదే పద్దతి పట్టుకు వేళ్ళాడితే ఫూల్ చెయ్యబోయిన వాడే ఫూల్ అవుతాడు. ఈ సంగతి మీ బ్రహ్మానందతో చెప్పు" అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బయటకు నడిచాడు.    
    యం.డి.బిత్తరపోయి, బాలూ వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయాడు.    
    వెళ్ళేటప్పుడు కంపెనీ కారులో వెళ్ళి బాలు వచ్చేటప్పుడు టాక్సీలో తిరిగి వచ్చాడు.    
    ప్రొద్దున్నించి ఏకధాటిగా పడుతున్న వాన అప్పుడే వెలిసింది. అతడి మనసు బావోలేదు.

    కాలింగ్ బెల్లు నొక్కుతూ నేలమీద వున్న బూట్ల ముద్రలు చూశాడు. బెల్లు వినీ వినబడగానే తలుపు తీసింది సౌదామిని. భోజనం కూడా చెయ్యకుండా అతని కోసమే కనిపెట్టుకుని కూర్చుని వుంది ఆమె.    
    "ఏమైంది?" అంది అతని మొహంలోకి వెదుకుతున్నట్లు చూస్తూ భుజాలెగరేసి నవ్వాడు బాలు. "బాస్టర్డ్! మళ్ళీ ఫూల్ చేద్దామని చూశాడు మనల్ని."    
    నుదురు చిట్లించి "ఆ తిట్లు మానమన్నానా!" అని తన కొంగు పట్టుకుని వున్న కొడుకువైపు ఒకసారి చూసి "ఫూల్ చేద్దామని చూశాడా! ఎవరు?" అని అడిగింది.    
    "ఇంకెవరు ఆ బ్రహ్మానంద" అన్నాడు బాలు.    
    "ఏం చేశాడు?" అంది విస్తుబోయి.    
    జరిగినదంతా చెప్పాడు బాలు. సాలోచనగా చూస్తూండి పోయింది సౌదామిని.    
    అంతలో "ట్రింగ్ ట్రింగ్.... ట్రింగ్ ట్రింగ్..." అని ఫోను మ్రోగింది.    
    రెండు అంగల్లో దాన్ని చేరుకున్నాడు బాలు.    
    "హలో" అన్నాడు రిసీవర్ ఎత్తి.    
    వెంటనే లైన్లో అవతలివైపు నుండి వినబడ్డ నవ్వు అతని పళ్ళు భగ భగ మండేలా చేసింది.    
    ఆ నవ్వు బ్రహ్మానందది! పల్చటి విషాన్ని కక్కుతున్నట్లు అన్పించే ఆ నవ్వుని మర్చిపోలేడు అతనెప్పుడూ.    
    "నేను బ్రహ్మానందని."    
    "తెలుసు. ఈసారి నీ ఎత్తు ముందే కనిపెట్టేసి దానికి పై ఎత్తు వేశాను నేను" అన్నాడు.    
    కసిగా నవ్వాడు బ్రహ్మానంద.    
    "నా ఎత్తు ముందే కనిపెట్టేశానని భ్రమపడి దానికి పై ఎత్తు వేస్తున్నానని పొరబడి నీ కింగ్ పిన్ ని నువ్వే ఫినిష్ చేసుకున్నావ్."    
    "ఏమిటి నువ్వనేది?"    
    మళ్ళీ నవ్వు.    
    "పిచ్చి నాయనా! నీకు పొద్దున్న వచ్చిన ఆఫర్ నిజమయినదే. దానితో నాకేం సంబంధం లేదు కానీ, అది నేను పన్నిన వల అని భ్రమపడి వదిలేసుకున్నావ్. అంటే నీ నీడని చూసి నువ్వే బెదిరిపోయేంత భయోత్పాతం కలిగిస్తున్నానన్న మాట నేను. యామ్ ఐ కరెక్ట్! సౌదామిని ఎలా వుంది బాలూ? అమ్మాయితో ఒక్కసారి మాట్లాడవచ్చా!"    
    బాలూ జవాబు చెప్పకుండా విసురుగా రిసీవర్ క్రెడిల్ మీద పెట్టేశాడు.    
    చివుక్కున సౌదామినివేపు తిరిగి "వీడు నిజంగానే ఇంకోసారి ఫూల్ చెయ్యగలిగాడు మనల్ని" అన్నాడు కోపంగా.    
    "ఏమైందండి" అంది సౌదామిని కంగారుగా. అంతా చెప్పి హఠాత్తుగా నేలవైపు చూసి గుర్తొచ్చినట్టు - "ఇంటికి ఎవరొచ్చారు ఇవాళ?" అని అడిగాడు.    
    తెల్లబోయింది సౌదామిని. "మన ఇంటికా? ఎవరూ రాలేదే."    
    "మరి ఈ బూట్ల గుర్తులు ఎవరివి?"    
    "ఏ బూట్ల గుర్తులు?"    
    సోఫా దగ్గర వున్న బూట్ల గుర్తులు చూపించాడు బాలూ.    
    వాటిని చూడగానే క్షణంసేపు సౌదామిని మొహం పాలిపోయింది. ఒక్క క్షణం సేపు మాత్రమే, మళ్ళీ మామూలుగా అయిపోయి "ఎవరూ రాలేదే" అంది ఆలోచిస్తూ ఆమె మొహంలోకి పరిశీలనగా చూసి ఏదో అడగబోయి మనసు మార్చుకుని ఆగిపోయాడు.    
    ఎవరో మనిషివచ్చి తిరిగి వెళ్ళిపోయినట్లు బూట్ల గుర్తులు స్పష్టంగా కనబడుతున్నాయ్.    
    వంగి చాలాసేపు వాటిని పరీక్షగా చూశాడు బాలూ. అతన్నే గమనిస్తోంది సౌదామిని.    
    ఎవరై వుంటారు? బహుశా బ్రహ్మానంద తాలూకు మనిషే అయివుండాలి. "ఇంక లాభంలేదు సౌదామినీ మనం వాచ్ మెన్ ని పెట్టుకుందాం" అన్నాడు.    
    "వాచ్ మనా!" అని నవ్వింది సౌదామిని. "టీవీలో వస్తున్న షెర్లాక్ హోమ్స్ సీరియల్ ప్రభావం మీ మీద బాగా పడినట్టుందే! ప్రతిదాన్ని భూతద్దంలో చూసి, భూతమని భయపడి పోతున్నారు. జాగ్రత్త. అవసరం కానీ పారనోయిడ్ గా మారకూడదు మనం" అంది. అతడామెవైపుకు అయోమయంగా చూశాడు.    
    "కాకపోతే ఏమిటండీ? నేను వంటింట్లో పనిచేసుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి నేను పలక్కపోతే వెళ్ళిపోయుంటారు. ఆ బ్రహ్మానంద చెప్పింది కరెక్ట్! మన నీడ చూసి మనమే భయపడే స్థితిలోకి వస్తున్నాం మనం."    
    అతనికి హఠాత్తుగా కోపం వచ్చేసింది.    
    "నేనింత సీరియస్ గా చెబుతుంటే వేళాకోళంగా మాట్లాడతావేం? నా గురించి భయపడుతున్నావా ఏమిటి? నా భయమంతా నీ కోసం, బాబు కోసమే!" అన్నాడు.    
    నవ్వటం ఆపేసింది సౌదామిని.    
    "మీరందరూ విరగబడి నవ్వినా సరే! నేను వాచ్ మెన్ ను పెట్టితీరతాను" అన్నాడు బాలు.    
    "సరే! మీ ఇష్టం" అని అయిష్టంగా, ముక్తసరిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సౌదామిని.    
    ఆలోచనలో పడిపోయాడు బాలు.    
    ప్రొద్దున - ఫుట్ ప్రింట్స్ ఇన్ టైమ్ అన్న తన క్యాసెట్ విషయంలో నిజాన్ని అబద్దమానుకుని నష్టపోయాడు తను.    
    ఇప్పుడు మళ్ళీ ఇంట్లో ఈ ఫుట్ ప్రింట్స్! ఇది కాకతాళీయమా? తనది కేవలం రజ్జు సర్ప భ్రాంతా?    
    కాకపోతే దీని వెనకంతా తనకు అంతుబట్టనిది ఏదైనా జరుగుతోందా!    
    కణతలు చేతితో నొక్కుకుంటూ ఉండిపోయాడతను. సరిగ్గా ముఫ్ఫై నెలల తరువాత.....అంతా పూర్తిగా మర్చిపోయిన తరువాత.....ఇప్పుడు భయపెడుతున్నాడు బ్రహ్మానంద.    
    ఇన్నేళ్ళు..... దాదాపు రెండున్నర సంవత్సరాలు ఊరుకుని బ్రహ్మానంద మళ్ళీ ఎందుకు ఈ ప్రయత్నాలు మొదలుపెట్టాడు? సౌదామిని విషయం మర్చిపోలేదా?    
    బాలూ వెన్ను అప్రయత్నంగా జలదరించింది.    
    కోటనుంచి ఆమెను తీసుకొచ్చేస్తూ వుంటే బ్రహ్మానంద చూసిన చూపు ఇంకా గుర్తుంది. "నేను దీన్ని మర్చిపోను..... ఇంతకు ఇంతా అనుభవిస్తావు.....ఇన్నాళ్ళూ నేను పెంచి పెద్ద చేసినదాన్ని..... సానబెట్టిన వజ్రాన్ని నువ్వు తీసుకుపోతున్నావు. మాకు సంబంధించిన అమ్మాయి ఈమె" అన్నట్టు చూపు.    
    పక్కనే ఉన్న ఆంజనేయులు కూడా సౌదామిని వచ్చేస్తూంటే అదే విధంగా వీడ్కోలు చెప్పాడు, 'తనది' అనుకున్నది వెళ్ళిపోతున్నట్టు.    
    అసలా కోటలోనే గాలి అదోలాంటి కృత్రిమత్వంతో నిండి వుంది.    
    సౌదామిని చెప్పిన స్వీయకథ గుర్తొచ్చింది.    
    ఆమె తల్లిని యవ్వనంలో బ్రహ్మానంద ప్రేమించాడట. ఆవిడ ఇతనిని ఇష్టపడక పెద్దలు చూపించిన సంబంధం చేసుకుని వెళ్ళిపోయిందట. సౌదామిని తండ్రిని చంపి, నిండు గర్భవతి అయిన ఆవిడని తనతోపాటూ తెచ్చుకున్నాడట, ఈ ఆధునిక రావణాసురుడు సౌదామిని భూమిమీద పడ్డ మరుసటిరోజు ఉరిపోసుకుని చనిపోయిందట. ఆవిడ - కేవలం కడుపులో పాపకోసమే అన్నాళ్ళు బ్రతికినట్టు.    
    అంతటి శాడిస్టు బ్రహ్మానంద - అయినా అతడికి సౌదామిని అంటే వల్లమాలిన ప్రేమ అతడు - తనకి లభ్యం కానిదాన్ని మరొకరికి దొరకనివ్వడు.    
    ఈ రోజు అతడి వస్తువుని తను తీసుకొచ్చేడు.    
    తనని కూడా చంపేస్తాడా? చంపేసేట్టయితే ఇంకా ఎందుకు ఆగుతున్నాడు? కూతురు (లాంటిదాని) నుదుట కుంకుమ చెరపటం ఇష్టంలేకా? అలాంటి సెంటిమెంట్లు అతడికేమీ ఉండవు..... మరి? సౌదామినిని చూసా?    
    ఏది ఏమైనా తమ జాగ్రత్తలో తాముండాలి.    
                                             13    
    వెతకబోయిన తీగ కాలికే చుట్టుకున్నట్లు దొరికాడు బాలూకి వాచ్ మెన్ ఆసెయ్య. తన ఇంటిని కనిపెట్టుకుని ఉండటానికి ఒక వాచ్ మెన్ కావలని తనకి తెలిసిన వాళ్ళందరితో చెప్పాడు బాలు. వాళ్ళు తమ మిత్రులతో చెప్పారు. ఈ మాట ఆనోటా ఆనోటా వ్యాపించిందిగానీ మనిషే దొరకలేదు వారం రోజుల పాటు.    
    తర్వాత ఒకరోజు జరిగిందది.    
    బాలూకి కొంచెం తీరిక చిక్కి ఆ ప్రాంతంలో ఇంకా ఎన్ని ఇళ్ళు లేస్తున్నాయో వాటి నిర్మాణం ఇంకా ఎంతవరకూ వచ్చిందో చూద్దామని బయలుదేరాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra