Home » Dr muktevi bharathi » Malli Vachhina Vasantham

 

    'అమ్మా  - నన్ను ఒక్కసారి శంకర్ దగ్గరికి తీసుకెళ్ళు - వాణ్ణి చూడాలని వుంది' అన్నాడు వెంకట్రామయ్య లలిత వెంటనే వెళ్ళడానికి సిద్దపడింది. లలిత వేంకట్రావు రావటం ఎంతో ఆనందాన్ని కరిగించింది శంకర్ కి పక్షవాతంతో బయటకి వెళ్ళటం కుదరక ఇంట్లోనే కాలంగడుపుతున్న శంకర్ బాబాయి ప్రాణం లేచి వచ్చినట్టయింది. రాజకీయాలూ, పన్నులు, కట్టడాలు, హైదరాబాదు ఉత్సవాలు, రాజభవనాలు - ఇలాటి వాటన్నిటికి గురించి పొద్దుపోయే వరకు మాట్లాడుకున్నారు.
   
    లలిత లోపల శంకర్ భార్యతో కబుర్లు చెప్పింది. 'అవును దీని పెళ్ళి విషయం ఏం చేశావుమరి' అన్నాడు వెంకట్రామయ్య.
   
    'ఏమీ చేయలేకపోతున్నాను - ఇవాళే చిన్నాడు ఉత్తరం రాసాడు వడి స్నేహితుడట - భార్యపోయింది. ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళు లలితకి చూస్తాను అని - ఇదేమో ఏమైనా చేసుకోనంటోంది -నాకేం తోచటం లేదు - అయినా వయసుదీనికి ఎక్కువే, మరిగొంతెమ్మకోర్కెలు కోరితే ఎలా - వెంకట్రామయ్య అన్నాడు.
   
    "కోరికలు కాదు దాన్ని నెమ్మదిగా ఒప్పించాలి - ఇద్దరు చిన్న పిల్లలుంటే డానికి ఇష్టంలేదేమో - ఇంక ఏదో ఒకటి చేసేసుకోవాలి".
   
    - అంతలోనే లలిత అక్కడకొచ్చింది.
   
    'నీ పెళ్ళి సంగతి ఏమిటేమరి' అన్నాడు శంకర్'
   
    'మీరు మంచిది చెప్పండి - నేను పెళ్ళి చేసుకోనంటున్నానా' అంది నవ్వుతూ.
   
    'మంచి అంటే - ఏదో సద్దుకోవాలి మరి అవును బాబాయి మీ ఇంట్లో వుంటున్నాడే ఆ అబ్బాయి - ఏ పేరో" శంకర్ అన్నాడు.
   
    "రామం" అంది లలిత వెంటనే.
   
    "ఆ అబ్బాయి విషయం కనుక్కుంటే"
   
    'ఆ కష్టం - ముందేమో ప్రేమవివాహం - అదేమో విడాకుల దాకా వచ్చింది......కోర్టులు - కేసులు - అవన్నీ తేలి ఆ అబ్బాయి పెళ్ళి చేసుకుంటాడో, చేసుకోడో - అప్పటికి మన అమ్మాయికి ఇంకా వయసు పెరిగిపోదూ.....అది కుదరదులే' - అన్నాడు వెంకట్రామయ్య.
   
    లలిత మనసులో అనుకుంది "ఎందుకు కుదరదూ" నిజంగానే శంకర్ అన్నయ్య కల్పించుకుని రామం సంబంధం కుదిరిస్తే తనకి ఎంతో ఇష్టం - నాన్న ఛాదస్తపు మాటలకేం కానీ, రామాన్ని తను చేసుకుంటానని అన్నయ్యతో చెప్తే ఏమవుతుంది - తనేం చిన్నపిల్లకాదు పెళ్ళి విషయం మాట్లాడటానికి సిగ్గుపడటానికి శారదకనక ముందుచూపు, తెలివి లేక రామాన్ని వదులుకుంది రామం చాలా మంచివాడు. సంపాదిస్తున్నవాడు - ఏ బాధ్యతలూ బరువులూ లేనివాడు - అలాంటి వాణ్ణి వదులుకున్న అవివేకురాలు శారద -
   
    తనకి అలాంటి అదృష్టం కలుగుతుందా - రామం తనని చేసుకుందుకు ఒప్పుకుంటాడా - అయినా ఒకసారి దెబ్బతిన్న రామం తనలాటి తెలిసిన మనిషిని, ఓర్పుగల మనిషిని పెళ్లాడటానికి ఎందుకిష్టపడడూ - కానీ ఈ వ్యవహారం ఎవరుపూనుకుని నిర్వహించాలి - తన పెద్దన్న పట్టించుకోడు - తన చిన్నన్న - ఇద్దరు పిల్లల తండ్రిని చేసుకోనంటున్నావని కోపగించి ఈ రామం విషయం పట్టించుకోడు - ఇక ఎవరున్నారు తన తరపున - తనే రామాన్ని అడిగితే - ఛ, ఛ పెళ్ళికాక పొగా స్నేహం చెడిపోతుందేమో - లలిత మనసు ఏంటో తేల్చుకోలేక సతమతమయింది - దీనికొక్కటే మార్గం శంకర్ అన్నయ్యనే ఆశ్రయించాలి - తను వెళ్ళిచెప్పినా అన్నయ్య ఏమీ అనుకోడు- లలిత మనసులో గట్టిగా అనుకుంటూ ఆటోలో కూర్చుంది - ముందు రామంకేసు తేలిపోవాలి - రామం మనసు కనిపెట్టాలి - తనుకూడా భయటపడకుండా, రామం మనసులో ఏముందో తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.
   
    ఆటో ఇంటిముందు ఆగింది. లోపలకొచ్చి తాళం తీస్తుంటే తాళానికున్న కాగితం కిందపడింది'. పదిహేనురోజులుండను పాలు పోయించుకోవద్దు - రామం సంతకం!! - పదిహేను రోజులు, అదేమిటి ఒక్కమాటయినా చెప్పకుండా వెళ్ళాడు!! - లలిత ముఖం చిన్నబోయింది.
   
    'అమ్మా - ఇందాక శంకర్ కూడా అన్నాడు - చిన్నన్నయ్య చెప్పిన సంబంధం విషయ ఆలోచించండి - తొందరపడి వదులుకోకండి అని రేపు చిన్నన్నయ్య అతనితో కలిసి వస్తాడు. నువ్వు తొందరపడకుండా ఆలోచించాలి. నీకా వయసు పెరిగింది. ముఫ్ఫయి దాటాయికదా - ఇంకా ఆలోచన ఏమిటీ" - తండ్రి మాటలు మనసుకి పట్టడం లేదు - రామం చెప్పకుండా పదిహేనురోజులు వెళ్ళిపోవటమనేదే మనసుని బాధించింది - తనకి భగవంతుడు పెళ్ళిగీత రాయలేదేమో !! - అందుకే తనుకూడా ఇంతవరకు పెళ్ళి గురించి ఆలోచించలేదు! - లలిత వంటింట్లో కెళ్ళి వంటపనిలో మునిగిపోయింది.
   
    లలిత మరో విధంగా ఆలోచిస్తోంది. 'చిన్నన్నయ్య తెచ్చిన సంబంధం థానే వద్దనటం ఎందుకు అతను చిన్నవాడట. ఇద్దరు పిల్లల తండ్రి !! అయితేనే - ఆ పిల్లలే తన పిల్లని పెంచలేదా కంటేనే పిల్లలా - పెంచితే పిల్లలు కాదూ! - కణ్వుడు ఎంత గొప్ప తండ్రి - పెంచిన తండ్రిగా అందరి మనసుల్లో, నిలబడిపోలేదా ! - లలిత మనసు క్షణంలో చెదిరిపోయింది. తను తల్లికావాలికానీ సవతితల్లి కాడానికి వీల్లేదు. వీధి చివర పోస్టాఫీసుకెళ్ళింది - "డోంట్ కమ్ టుమారో, లెట్ రఫాలోస్" - వెంకట్రామయ్య టెలిగ్రాం చిన్నన్నయ్యకి యిచ్చి వచ్చేసింది.
   
    అనుకోకుండా వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్యపోయింది యశోదమ్మ రామంతల్లి - 'ఉత్తరం రాయకుండా వచ్చావేమిరా' అంది మంచినీళ్ళు అందిస్తూ రామం ఏమీ మాట్లాడలేదు.

    'నేను పొలం పనులు చూసుకోవద్దూ - వెళ్ళిరానా' అంది తల్లి. ఈ రోజు వెళ్ళకు - మన పాలేరు. సుబ్బిగాడు వున్నారుగా. ఇవాల్టికి వాళ్ళు చూసుకుంటారులే - నువ్వు వెళ్ళద్దు" - రామం తల్లిని వెళ్ళనీయలేదు.
   
    తనకి పదేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. అప్పటి నుంచీ కంటికి రెప్పలా కాపాడుతోంది తల్లి. ఆమెలో కమే తను తన సుఖమే ఆమె సుఖం ఆనాడు రిజిస్టరు పెళ్ళి చేసుకుంటానంటే, సంప్రదాయాలపై ఎంతో నమ్మకమున్న ఆమె మరోమాటకి వాదనకి అవకాశం లేకుండా సరే అని ఒప్పుకుంది. మూడేళ్ళు కాకుండా శారద తనతో విడాకులు కోరితే, ఏమీ చేయలేక, ఎవరిపైనా కోపగించక ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది, అని ఒక తాత్విక చింతనతో మనసుకుదుట పరుచుకుంది. నాన్నపోయిన నాటి నుంచీ పొలం బాధ్యత థానే చూసుకుంటూ ఆ ఆస్తి కాపాడుకొస్తోంది. అమ్మకష్టజీవి - రామం తల్లివంక చూసాడు. అరిగిపోయి ఎండిపోయిన పాదాలు, చాలావరకు నెరిసి పోయిన జుట్టు, అందరితో ఆప్యాయంగా మెలుగుతూ, వంటరిగా జీవించే అమ్మని తను ఏ విధంగా ఆనందపెట్టగలడూ!! - ఆమె జీవించినంతకాలం ఇంతేనా, రామం మనసు వికలమైంది ఎందుకో...
   
    'తినరా ఏమిటాలోచిస్తున్నావు' అంది కంచంలో పెరుగుపోస్తూ.
   
    'నీ గురించే' -
   
    'నాగురించా' నవ్వింది యశోదమ్మ.
   
    "భగవంతుడు మనకేమిస్తే దాన్ని చూసి ఆనందిస్తూ జీవితం గడిపేయాలి" - లేని దానికోసం దుఃఖిస్తే వస్తుందా" - యశోదమ్మ కంచంలో అన్నం పెట్టుకుంటూ అంది -
   
    రామానికి చాలా తొందరగా వుంది కృష్ణమూర్తి గారింటి విశేషాలు వినాలని 'అమ్మా - మేష్టారూ వాళ్ళంతా బావున్నారా' అన్నాడు.
   
    'చాలాహాయిగా వున్నారు - పెద్దల్లుడు బాగా సంపాదిస్తున్నాడు. చిన్నల్లుడు కూతురు అమెరికాలోవున్నారు. ఆఖరిది విశాఖ పట్నంలో వుంది. దానికో కూతురు. మేష్టారు, భార్య చాలా హాయిగా వున్నారులే' అంది యశోదమ్మ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra