Home » Avasarala ramakrishna rao » Sampengalu Sannajaajulu

 

                                     11

    తల వంచుకుని వ్రేలితో బల్ల మీద గీస్తూ మధుర అంతకుముందు రోజు జరిగినది ఆమెకు పద్దతిగా పూర్తిగా విరుద్దంగా అతి నెమ్మదిగా మెల్లిగా చెప్పింది.
    చంటి పిల్లాణ్ణి తల్లి రెండు అరచేతుల్లోనూ ఉంచుకుని అటూ యిటూ వూగించినట్లు గంగా తరంగాల పై ఉయ్యాల లూగే వాన. తియ్యని వూహలతో సయ్యాట లాడే తరుణ వయస్కులు.
    'ఇలా మనమిద్దరం పడవలో ప్రయాణం చేస్తుంటే నీకేమనిపిస్తోంది మధురా?' అన్నాడు కేశవ. ఇద్దరం పడవకు చెరో చివరనా కూచున్నాం, దూరంగా ఉన్నాం. కాని, ఒకరి కొకరు చెప్పలేనంత సమీపంలో ఉన్నాం.
    'ఇన్నాళ్ళూ పరీక్షలని నిన్ను డిస్టర్బ్ చెయ్య లేదు. ఇవాళికి నా మనస్సులోది చెప్పకుండా ఉండలేను. నువ్వలా వూరుకుంటే లాభం లేదు. మనిద్దరం ఒకే రిక్షాలో కూచుని వెడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకున్నారని నీ కనిపించింది మధురా?'
    "మీకు నేనేమని జవాబు చెప్పగలను కేశవా!మనిద్దరం కలసి ప్రక్కప్రక్కల నిలబడి విశ్వనాధుడికి హృదయ పూర్వకంగా నమస్కారం చేసినప్పుడు మీకేమని పించింది కేశవా?"
    కొన్ని ప్రశ్నలకు జవాబు అనవసరం. కొన్ని అనుభవాలకు వ్యాఖ్యానం అనవసరం.
    'ఇంకొక్క ఏడాది. నీ చదువూ, నా రీసెర్చీ అన్నీ అయిపోతాయి. అప్పుడిక మన వివాహానికి ఎటు వంటి అభ్యంతరమూ ఉండదు' ఇదే అయన చెప్పింది. మొదట్నుంచీ చివర వరకూ అతడు చాలా సభ్యత తో ప్రవర్తించాడు మంజులగారూ! ఇంకా నాకే అనిపించింది గాని నా చేతిని తన చేతుల్లోకి తీసుకోడాని కైనా ప్రయత్నించలేదు. ' నీ చేతికి ఈ గాజులు బాగుంటాయి. నీ రంగుకి ఈ తిలకం నప్పుతుంది. రెండు జడలు వేస్తె నువ్వు బాగుంటావ్' ఇటువంటి ఒక్క ముక్క గూడా -- నిజానికి నేనే ఆశతో ఎదురు చూసినది -- అతని నోటి నుండి రాలేదు. నా చదువు గురించి, అతని రిసెర్చి గురించే మాటాడేవాడు. 'ఎంతసేపూ యీ కబుర్లేనా' అంటే 'ఇంకో రకం కబుర్ల కి ఇంకా ముందు కాలముండి' అనేవాడు. అతనితో ఎన్నిసార్లు విశ్వనాధుడి దర్శనానికి వెళ్ళినా నాకు తనివి తీరేది కాదు. అంత దూరమున్న విశ్వనాద్ గల్లీ కూడా ' ఇంకాస్త పోడుగుంటే దీని సొమ్మేం పోయిందో " అనిపించేది. అతడు పదేపదే పట్టుబట్టి చెప్పబట్టి గాని ఈ పరీక్షల మీద కూడా నాకు ఇంతగా దృష్టి నిలబడక పోనేమో.
    ఆమె చెప్పేదంతా శ్రద్దగా విన్నాను. ఆమె తల మీద చెయ్యి వేసి అభిమానంతో నిమిరాను.
    'మీరిద్దరూ సరే అంటే సరే అనుకుంటే సరిపోతుందా మధురా! తల్లిదండ్రు లున్నారు గదా!'
    'నా విషయంలో అటువంటి ఆటంకాలెవీ ఉండవండి. మా నాన్నగారు నా మాట కాదనరు. ఒకవేళ కాదంటే నాపక్షాన వాదించడానికి మా అన్నయ్య ఎప్పుడూ సిద్దంగానే ఉంటాడు. ఇంక అతని విషయం. వాళ్ళ అమ్మా నాన్నా ఎప్పుడో పోయారట. ఉన్నదల్లా సవతి తల్లి. ఆవిడ కేశవ సవితి తమ్ముడి దగ్గరే ఉందిట. వాళ్ళకీ వీళ్ళకి రాకపోకలు గాని ఉత్తర ప్రత్యుత్తరాలు గాని జరిగి మూడేళ్ళు దాటింది. అన్నిటి మించి వాళ్ళదీ మాదీ ఒక్కటే శాఖ కూడా. ఇంక అడ్దేముంది? మిగిలిన కష్టమల్లా ఒక ఏడాది పాటు పగటి కలలు కంటూ కూచోడమే' అంది నవ్వుతూ. ఒక నిముషం ఆగి 'ఇప్పుడు చెప్పండి. అతనితో అలహాబాదు వెళ్ళడానికి అన్ని విధాల మీరు అడ్డు పడ్డారు. అది పొరపాటు కాదంటారా?" అన్నది.
    నేను నిశ్చయంగా అన్నాను.
    'ఎంత మాత్రం కాదు. ఆవేశపూరితమూ అనాలోచితమూ అయిన పని అది. ఎంతగా వాగ్దానాలు చేసుకున్నా సాంఘిక నియమాల్ని సాహసించి ఉల్లంఘించి సుఖపద్దవారు తక్కువ. పెళ్ళి కాని నువ్వు పరాయి పురుషుని వెంట వెళ్ళడం ఎంత మాత్రం మన సంప్రాదాయ సమ్మతం కాదు. వయస్సులో ఉన్న యువతీ యువకులు ఏకాంతంగా కలుసుకున్నప్పుడు మనసు చేసుకున్న కట్టుబాట్లను శరీరాలు పాటిస్తాయనుకోడం శుద్ధ తెలివి తక్కువ.'
    జవాబు రాకపోడం చూసి మధుర వైపు చూశాను. ఆమె కళ్ళు మూతలు పడి ఉన్నాయి. వెనుక సీటు కి జారబడి పడుకోవడమే గాక నోరు తెరచుకుని తగుమాత్రం గుర్రు కూడాను!

                            *    *    *    *
    ఉత్తరం చూసుకుని వదిన స్టేషను కు వచ్చింది మళ్ళీ ఒక్కర్తే.
    "మంజూ నీతో మాట్లాడాలి. రెండ్రోజుల పాటు ఇక్కడ దిగి మరీ వెళ్ళు' అంది. వదిన అలా మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగించింది. 'లేదు వదినా, మధురిమను చూసి ఎన్నాళ్ళో అయినట్లుంది. దాన్ని ఆ కామేశ్వరి చేతుల్లో వదిలి వచ్చాను. ఎలా ఉందొ ఏమిటో. అది గాక టెలిగ్రాం కూడా యిచ్చాను. అయన స్టేషన్ కు వస్తారు. రెండ్రోజులుండి మళ్ళీ వస్తాగా. అప్పుడు ఏకంగా పదిరోజులుంటాను. ఇప్పటికి వదిలెయ్యి.'
    'అలాకాదు పనుంది దిగు.'
    'ప్లీజ్. మళ్ళీ వస్తా నన్నానుగా?'
    'మీ అన్నయ్యకు ఒంట్లో బాగు లేదు. చూసి వెళ్ళవా?'
    అంతకన్న పదునైన గాయం నా హృదయానికి వేరేముంది? ఇంక నేను ముందుకి సాగలేక పోయాను.
    'వింటున్నావుగా మధురా, యీ సంగతులన్నీ అయనతో చెప్పు . బుధవారం , తప్పితే లక్ష్మీ వారం వచ్చేస్తానని చెప్పు. మధురిమ అంతగా అల్లరి పెడితే బంట్రోతు నిచ్చి పంపమని చెప్పు, ఏమంత దూరం కాదుగా? అన్నట్టు నా సామానులన్నీ యిక్కడ దింపడం దేనికి, ఒక బట్టల పెట్టి మాత్రం తీసుకుంటాను. మిగిలినవి ఇంటికి జాగ్రత్తగా చేరేస్తావుగా?'
    'బాగుందండీ , నన్నో సామాను కింద జమకట్టి యింత పదిలంగా తీసుకెళ్ళి తీసుకొచ్చేరు కదా, మీ సామానులే నాకు బరువా? ఇంతకీ పాపం మా అన్నగారికేం జబ్బూ?'
    నేను కూడా వదిన వైపు ఆతృతగా చూశాను. ఆమెకు వినపదలేదో, వినపడనట్టు ఉరుకుందో గాని జవాబు చెప్పలేదు. ఇంతలో రైలు కదల్నే కదిలింది.
    ఇల్లు చేరగానే ఆతృతగా మెట్లెక్కి లోపలికి వెళ్ళెను. అన్నయ్య పడక్కుర్చీ మీద పడుకుని ఏదో చదువు కుంటున్నాడు.

 

                  
    'ఏంరా యీ వేళప్పుడు యింట్లో ఎలా ఉన్నావ్? ఆఫీసుకు వెళ్లలేదేం?'
    'ఇవాళ మా ఆఫీసుకు శలవు. నువ్వేం అలా ఉన్నావ్, ఇదంతా పరీక్ష బడలికేనా? ఇంతకీ పరీక్ష లేలారాసినట్టూ, సెకండ్ క్లాస్ ష్యూరేనా?'
    ఆ ఆ! ప్యాసైతే సెకండ్ క్లాస్ వచ్చినంత ఫలం. నువ్వేం మరీ అంత నీరసంగా ఉన్నావ్?'
    నేనింకా ఏదో మాటాడబోతుంటే వదిన చెయ్యి పట్టుకుని నన్ను గబగబా లోపలికి తీసుకు పోయింది. 'వేడ్నీళ్ళు సిద్దంగా ఉన్నాయి. స్నానం చేసి ముందు భోం చెయ్యి ఎప్పుడనగా తిన్నావో కబుర్లకేం తరువాత చెప్పుకోవచ్చు.' అంటూ.
    వేడి వేడి నీళ్ళు పోసుకుని వేడి వేడి అన్నం తినగానే కమ్మ కమ్మని నిద్ర కమ్ము కొచ్చింది. ఆ ప్రాణం ఎక్కడికి పోయిందో మళ్ళీ రాత్రి తోమ్మిందిటికి గాని మెలకువ రాలేదు. అప్పటికి పిల్లలిద్దరూ వచ్చి భోజనాలు చేసి పడుకోడం కూడా జరిగింది.
    'ఎమామ్మోయ్ ఊర్మీళా దేవీ, లేచినట్టేనా?' అంటూ వదిన వచ్చింది.
    'ఇప్పుడు మళ్ళీ భోం చెయ్యలేను ఓ గ్లాసు మజ్జిగ తీసుకురా' అన్నాను. మొహం కడుక్కుని అ మజ్జిగ తాగెను. చల్లగా ఉంది. ' శ్రమంతా తీరిందా' అనిపించింది.
    'ఇక్కడకు వస్తే ప్రానమెంతో హాయిగా ఉంటుందొదినా ఇది నీలో ఉందొ, ఈ జాగాలో ఉందొ"
    'రెండింటిలోనూ లేదు. 'పుట్టిల్లు' అన్న పదంలో ఉంది. కాని నీకీసారి ఆసుఖం యివ్వలేనేమో నమ్మా మంజూ!'
    వదిన క్రిందకు వెళ్ళి అన్నయ్య పడుకుని ఉన్నాడని రూడి చేసుకుని మళ్ళీ పైకొచ్చింది.
    'ఇలాంటి రాత్రి కోసమే ఎదురు చూస్తున్నాను. నీలాంటి దాని కోసమే ఎదురు చూస్తున్నాను. ఏం చెయ్యను. భరించే శక్తి నాలో సన్న గిల్లిపోతోంది. ఈ యింటి పరిస్థితులేం బాగులేదమ్మా మంజూ.'
    నా గుండె ఆగినంత పని అయింది. అర్ధం కాక మనసు గిలగిల కొట్టుకుంది.
    'ఏం, ఏమయింది ఇప్పుడే మొచ్చింది?'
    'మీ అన్నయ్యకు వంట్లో బాగులేదు అని నేను 'స్టేషను లో చెప్పెను కదా నువ్వేమనుకున్నావ్?'
    'ఇంటికి వచ్చి అన్నయ్యను చూశాను. బాగా నీర్సంగా ఉన్నట్టు కనిపించాడు. కాని ఏదో జబ్బుతో ఉన్నట్టు మాత్రం నాకు అనిపించలేదు. ఇంకే విషయమేనా మాటాడుదామని నువ్వీ వంకతో నన్నిక్కడ దింపేవేమో అనుకున్నాను.'
    'లేదు మంజూ. అయన జబ్బుతో బాధపడుతున్నామాట నిజమే. మొన్న నువ్వు కాశీ వెళ్ళేటప్పుడు తను స్టేషను కు రాకపోవడానికి ఆ జబ్బే కారణం. ఇవాళ ఆఫీసుకు వెళ్ళకపోవడానికి అదే కారణం. శలవని చెప్పేరే అది అబద్దం, ఈయనే ఆఫీసుకు శలవు పెట్టేరు! అజ్ఞానురాల్ని, నాకేం తెలుసు! చదువుకోక పోవడం వల్ల యింతింత దారుణమైన నష్టాలున్నాయని తెలుస్తే ఎలాగైనా బుర్ర బద్దలు కొట్టుకునైనా చదువుదునేమో.'
    వెర్రి వదిన. ఈ చదువుల వల్ల కనీస వైద్య జ్ఞానమూ, న్యాయశాస్త్రం యిలాంటివి తెలియవని ఆమెకు తెలియదు!
    'మెడిసిన్ చదువుకుంటే గాని అవన్నీ ఎలా తెలుస్తాయ్?'
    'ఏమో ప్రతి దానికీ నన్ను కొట్టి పారేస్తారు. ఒక్కలా బాధపడి పోతూ తనకే రోగమూ లేదంటారు. కడుపునిండా యింత తిండి తిని, కంటి నిండా - యింత నిద్రపొయీ ఎన్నాళ్ళయిందో! ఆయనకు చెప్పగలిగే పాటి తెలివితేటలు నాకు లేవు గాని రోజురోజుకి అయన కృశించి పోతున్నారనే సంగతి మాత్రం స్పష్టంగా చెప్పగలను.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra