Home » Yarram chandrasekharam » Goodu Chedirina Pakshulu

 

                                      13
    రాఘవయ్య గారు చాలా పెద్ద కాంట్రాక్టరు. వ్యాపారం లక్షల మీద సాగుతూ ఉంటుంది. మొదటి నుండీ వారి ఫ్యామిలీ డాక్టరు ను నేనే! ఆ కారణంగా చనువు స్నేహం పెరిగిపోయాయి. అమ్మయ్య!.... ఒక సమస్య తీరిపోయింది. అయినా అన్నీ సక్రమంగా జరగాలి. తానొకటి తలుస్తే దైవమొకటి తలచినట్లు ఏమౌతుందో?  అలాగే జరిగింది. అమ్మాయి హౌస్ సర్జన్ పూర్తీ చేశాక హాస్పిటల్ బాధ్యత ఒప్పజేప్పాను అమ్మాయికి కూడా ..సుధాకర్ తో పెళ్ళి చూపులు జరిగాయి.... సుధాకర్ మా అమ్మాయిని నచ్చాడు. కాని అనుకోని విధంగా జరిగిన యాక్సిడెంటు ఎన్నో మార్పులను తెచ్చి పెట్టింది.
    అమ్మాయికి యాక్సిడెంటు జరిగిన తర్వాత సుధాకర్ మమ్ములను నిర్లక్ష్యం చేశాడు. అసలు ఈ చాయలకే రాలేదు. ప్రసాద్ తెగించి రక్తదానం చేశాడు. ఆ తర్వాత శశి అతను శశి గదిలో మాట్లాడుకున్న మాటలు నా కళ్ళను తెరిపించాయి. కురూపి అయిన అమ్మాయిని చేసుకోవడాని కైనా వెనుక ముందాడలేదు. రాత్రింబవళ్ళు కష్టపడి చదివి శశి కి ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. నాగ్ పూర్ వెళ్ళిన ఆ కొద్ది కాలం లోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆనాడు జరిగిన డిన్నరు లో ప్రసాద్ , రేఖల వివాహాన్ని నిశ్చయం చేశాను.
    ఆ తర్వాత ఇద్దరూ చిలకా గోరింకలలా హాస్పిటల్ పనులు నిర్వహించసాగారు. అనుకోని విధంగా పాక్ సైనికులు మనదేశం పై దాడులు జరిపారు. ప్రభుత్వం యువకులను సైన్యం లో చేరవలసిందనీ, అంతేకాకుండా డాక్టర్ల ను....ఇంజనీర్ల ను కూడా సైన్యం లో చేర వలసిందిగా ఆహ్వానించింది. ప్రసాదు వెళ్ళడానికి నిర్ణయించు కున్నాడు. అతని నిర్ణయం శశిని బాధించింది. ప్రసాద్ ను ఆ ప్రయత్నం నుండి విరమింప జేయాలని ఎంతగానో ప్రయత్నించి విఫలురాలై పోయింది.
    ఒకరోజు నేను యింట్లో వంటరిగా ఉన్న సమయంలో ఈ విషయాన్ని నా వద్ద కదిపింది. '[ప్రసాదు ఫ్రంటు కు వెళ్లక తప్పదా నాన్నారూ....?'
    'ఎలా తప్పుతుందమ్మా....? ఈ సమయంలో ఎంతోమంది ఉత్సాహంతో ముందంజ వేస్తున్నారు. అటువంటప్పుడు ప్రసాదు వెళ్ళక పోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. కొద్ది కాలం లోనే గొప్ప సర్జను గా పేరు తెచ్చుకున్నాడు.... అతని అవసరం ఈ విపత్కర సమయం;లో దేశానికి ఎంతైనా ఉంటుంది.'
    'నాకు దిగులుగా ఉంది నాన్నారూ...!'
    'దిగులెందుకమ్మా....? ప్రసాదు డాక్టరుగా వెడుతున్నాడు. అతనికి ఏ ప్రమాదమూ జరగదు.' అమ్మాయి దిగులు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.'
    ప్రసాదు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినప్పటి నుండి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. అయినా అమ్మాయి శశి అతను ఉన్నప్పుడు ఉన్నంత ఉత్సాహంగా ఉండడం లేదు. నేను మళ్ళీ హాస్పిటల్ బాధ్యత స్వీకరించవలసి వచ్చింది. అమ్మాయి సహాయంతో నర్శింగ్ హోం బాధ్యతలు ఎలాగో పూర్తవుతున్నాయి.
    ఒకటి రెండు సార్లు....కంపౌండర్లు 'ప్రసాదు గారు ఉన్నప్పుడు నర్శింగ్ హోం స్టాఫంతా చక్కని క్రమశిక్షణ తో మెదిలింది ఇప్పుడు మెదలలేదని కాదు... అయినా అప్పటి ఆ తీరు వేరు. ఎలాగైనా పెదబాబు గారు పెద్దవారై పోయారు.' అనుకుంటూ ఉండగా విన్నాను. అంత కొద్ది సమయంలోనే ప్రసాదు పై అందరికీ అటువంటి సదభిప్రాయం కలిగినందుకు ఎంతో సంతోషించాను. అతను తిరిగి రాగానే అమ్మాయి శశి తో వివాహం జరిపించేయ్యాలి.... ఇప్పటికే అనుకోకుండా ఆలస్యం జరిగింది... శశి.... ప్రసాదు లకు కలిగే పిల్లలతో ఆడుకోవడమే నా ధ్యేయం. అమ్మాయి శశి ప్రసాద్ ఆగమన వార్త కోసం ఎంతో ఆదుర్దాతో ఎదురు చూస్తూ ఉంది. ఈనాటి ఉత్తరం తో ఆదుర్దా తీరిపోయింది. త్వరలోనే వచ్చేస్తాడు.
    పై విధంగా ఆలోచిస్తున్న నన్ను సీతమ్మ మాటలు బాహ్య ప్రపంచం లో పడవేశాయి.
    'బాబుగారూ! మీకోసం ఎవరో యిద్దరు వ్యక్తులు వచ్చారు. తోటలో కూర్చోబెట్టి వచ్చాను.' అంది.
    చేతిగడియారం చూసుకున్నాను. సాయంత్రం ఐదైంది. ఆలోచనలతో చాలా కాలం గడిచిపోయింది. లేచి బట్టలు మార్చుకొని తోట లోపలికి నడిచాను. అక్కడ డా. రామనాధం గారితో మరో వ్యక్తీ కుర్చీలలో కూర్చుని ఉన్నారు.
    సీతమ్మ ను పిలిచి మూడు కాఫీలు తీసుకు రమ్మని చెప్పాను. ఆమె ఆ ప్రయత్నం లో లోపలికి వెళ్ళిపోయింది. రామనాధం గారు నా ప్రియ మిత్రులు. ఒకే వృత్తి. వారిని చిరునవ్వుతో చూస్తూ "ఏవండీ రామనాధం గారూ.... మీ ప్రాక్టీస్ ఎలా ఉంది?'
    'బాగానే ఉందండీ!' సమాధానం చెప్పారు వారు.
    వారి ప్రక్కనే కూర్చున్న పెద్ద మనిషిని ప్రశ్నార్ధకంగా చూశాను నేను. వారు నా చూపుల నర్దం చేసుకున్నారు.
    'వీరు రమణయ్య గారు...వీరిది యిక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరు... ఆరోగ్యం సరీగా లేక అక్కడి వారి ఊరిలో వైద్య సదుపాయాలు సరీగా అమరక భార్యతో సహా వచ్చి కొంతకాలంగా యిక్కడే ఉంటున్నారు... నా పేషెంటు గా.'
    'అలాగా....! అవుతే యిప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి....?'
    'కొంచెం నెమ్మదిగా నే ఉందండీ! మా డాక్టరు గారి పుణ్యమా అని మళ్లీ లేచి తిరగగలుగుతున్నాను..ఈ డాక్టరు గారిది చల్లని చేయి....నా రోగం త్వరగా నయమైంది.' అన్నారు రమణయ్య గారు.
    'వీరి వ్యాధి కన్న మనోవ్యాధి పెద్దది. మనోవ్యాధి ఎక్కువైనప్పుడల్లా బ్లడ్ ప్రెషర్ ఎక్కువౌతూ ఉంటుంది. వీరి పెద్దబ్బాయి వీరి నుండి దూరమయ్యాడు! ఆ పెద్దబబాయి పై గల బెంగతో వీరిలా బాధపడుతున్నారు.' అని వారు రమణయ్య గారి నుద్దేశిస్తూ 'మీ కధనంతా వారికి క్లుప్తంగా చెప్పండి.' అన్నాడు.

             
    రమణయ్య గారు క్లుప్తంగా అన్ని విషయాలూ చెప్పారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. నాకూ వారి పెద్దబ్బాయి ప్రసాదేనేమోనని అనుమానం కలిగింది. నిర్ధారణ మాత్రం కాలేదు. నిర్ధారణ చేసుకోవడ మెలా? ఇంతలో సీతమ్మ మూడు కాఫీ కప్పులు ట్రే లో ఉంచి తీసుకు వచ్చింది. అందరమూ కాఫీలు త్రాగాము. నాకు ఒక చక్కని ఆలోచన తట్టింది.
    'సీతమ్మా అమ్మాయి గదిలో టేబులు మీద ఉన్న ఫోటో ను ఒకసారి తీసుకు వస్తావా?'
    'అలాగే బాబుగారూ! ఇప్పుడే తీసుకు వస్తాను.' అని వెళ్ళిపోయింది.
    సీతమ్మ ఫోటోను తీసుకు వచ్చేంత వరకూ ముగ్గురమూ నిశ్శబ్దంగా గడిపాము. సీతమ్మ ఆ ఫోటో ను తీసుకు రాగానే ముందుగా రమణయ్య గారు ఆ ఫోటో ను సీతమ్మ చేతిలో నుండి అందుకొని ఆదుర్దాతో గమనించ సాగరు.
    నేను, రామనాధం గారు యిద్దరమూ రమణయ్య గారి ముఖ కావళికలను జాగ్రత్తగా పరిశీలించ నారంభించాము. ఆ ఫోల్డు ప్రేము లో ఒక ప్రక్క ప్రసాదు ఫోటో , మరొక ప్రక్క మా అమ్మాయి శశి ఫోటో ఉంది. లగ్న నిర్ణయం జరిపించిన రోజు తీయించిన కలరు ఫోటోలవి. ప్రసాదు ఫోటోను పరీక్షగా చూసిన రమణయ్య గారు...ఒకటి రెండు నిముషాల తర్వాత రెండు ఫోటో లను మార్చి...మార్చి చూశారు. తర్వాత వారు సంతోషంతో పొంగిపోయారు.
    అమాంతంగా వారు కూర్చున్న కుర్చీ నుండి లేచి నా చేతులు పట్టుకొని 'బాబుగారూ ....ఇవి చేతులు కావు ....మీరు చేసిన ఈ మేలుకు ఎన్ని జన్మలు మీకు దాస్యం చేసినా తక్కువే! మీ యింట ఉన్న ప్రసాదే నా బిడ్డడు..... చూసి కొన్ని ఏండ్లు గడిచినా గుర్తించగలిగాను....ఆ ఫోటో వాడిదే! నేను వాడి కన్న తండ్రిని.... కాదు...కాదు...కసాయి వాణ్ణి....అసలు వాడికన్న తండ్రి వాడిని యింటి నుండి తరిమేసినా నాడె వాడికి మరణించినవాడయ్యాడు....మీరే వారి తండ్రి.... వాడి జీవితాశయాన్ని నెరవేర్చారు...వాడి తల్లి....లక్ష్మీ కోరిక నెరవేరింది...వాడు పెద్ద డాక్టరయ్యాడు ....మంచి పేరు సంపాదించుకున్నాడు.. ఇక నేనేమైనా ఫర్వాలేదు.... నేను వాడికి అన్యాయం చేశాను. భగవంతుడు మాత్రం వాడిని చల్లగా చూశాడు... మీరూపంలో ఆదుకున్నాడు.' ఆవేశంతో ఒణికి పోతూ , ఆనంద భాష్పాలు రాలుస్తూ, మాటలు తడబడుతుండగా కుప్పగా కూలిపోయారు రమణయ్య గారు.
    'రామనాధం గారూ....! వీరు అతి సంతోషంతో స్పృహ కోల్పోయారు. బి.పి. ఉందన్నారు కదా....వీరిని లోపలికి చేర్చుదాం పదండి.' అన్నాను నేను.
    నేను రామనాధం గారి సహాయంతో వారిని లోపలికి తీసుకు వెళ్లాను. బి.పి. చెక్ చేసి వెంటనే యింజక్షన్ నిచ్చాను. పదిహేను నిముషాల తర్వాత రమణయ్య గారు కదిలారు. కళ్ళు తెరిచి ఏదో మాట్లాడ బోయారు. వారిని వారించి ఒక మాత్రను గొంతులో వేసి, మందు త్రాగించి సీతమ్మ ను అయన దగ్గర ఉంచి మాట్లాడనివ్వకూడదని ఆమెకు చెప్పి, నేను రామనాధం గారు ఇద్దరమూ హాలులోపలికి వచ్చి కూర్చున్నాము.
    ఆరోజు ఆదివారం.... శశి స్నేహితురాలు వాణితో ఎటో వెళ్ళింది. యింకా రాలేదు. రామనాధం గారు నన్ను పలకరించారు.
    'చూశారా విశ్వం గారూ....! ఇటువంటి మనస్తత్వం గలవారితో యిదే చిక్కు. ఏది వచ్చినా ఆపుకోలేరు... ఆరోజు పట్టరాని కోపంతో ప్రసాదు ను యింటి నుండి వెళ్ళ గొట్టారు. కొంతకాలం గా ప్రసాదు నిర్దోషి అని నిర్ధారణ చేసుకొని ఎంతగానో బాధపడుతున్నారు. ఈరోజు ప్రసాదు జాడ తెలుసుకొని.... డాక్టరు గా మంచి పేరు ప్రతిష్ట లతో క్షేమంగా ఉన్నాడని తెలుసుకొని సంతోషం పట్టలేక పోతున్నారు.... సృష్టి లో ఎన్ని రకాల వ్యక్తులండీ....!'
    'నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది....రామనాధం గారూ...! వారు కొంత కాలంగా అస్వస్థతగా ఉన్నందు వల్ల సంతోషాన్ని తట్టుకోలేక పోయారు. నేను ఆరోగ్యంగా ఉన్నందు వల్ల తట్టుకో గలుగుతున్నాను....అంతే తేడా!'
    'విశ్వం గారూ..రమణయ్య గారు గొప్ప ఆస్తి పరులు... పైగా మీ కులస్తులు .
    మీకు ఏ విషయం లోనూ తీసిపోరు....ఆ లోటు కూడా తీరిపోయింది.. చెవులు మెలేసి ప్రసాదు కోసం మీరు పెట్టిన ఖర్చంతా వాపసు తీసుకోండి.' నవ్వుతూ హాస్య ధోరణి లో అన్నాడు రామనాధం గారు.
    'నేను ఎంతో మందికి సాయం చేశాను రామనాధం గారూ! వారంతా బయట ఉండి నా సహాయం పొందుతున్నారు. ఇతనిని ఇంట్లో ఉంచుకున్నాను అంతే తేడా! అంతకు మించిన సౌకర్యాలు అతను పొందలేదు. నేను ఏ ప్రతిఫలాన్ని ఆశించి అతనికి సాయం చేయలేదు. నేను ఎన్నో సౌకర్యాలను అతనికి ఎన్ని సార్లో సమకూర్చాలను కున్నాను. లాభం లేకపోయింది. అటువంటి సంఘటనలు ఎన్నో....?'
    'మరి...వారిని యిప్పుడు కదిలించడానికి వీలుపడదనుకుంటాను....ఈ విషయం వారి భార్యకు తెలియజేసి ఆమెను తీసుకు వస్తాను.'
    'అలాగే తీసుకు రండి.... కాబోయే వియ్యపురాలు...అందునా మగపిల్లవాడి తల్లి ...తల ఒగ్గక తప్పదు.'
    'ఏమో అనుకున్నాను....మీరూ....రసికులే! త్వరగా వెళ్లి ఆమెను వెంట బెట్టుకు వస్తాను.' వెళ్ళిపోయారు రామనాధం గారు.
    రామనాధం గారు వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకు మా కారులో అమ్మాయి శశి వచ్చింది. సంగతంతా వివరించి చెప్పాను.
    'నాకెంతో సంతోషంగా ఉంది నాన్నారూ....! వారేక్కడున్నారు....? వెళ్ళి చూస్తాను.'
    'ప్రసాదు గదిలో ఉన్నారు.'
    నా మాటలు  వినగానే వేగంగా ప్రసాదు గది వైపు వెళ్ళింది శశి. నేను తృప్తిగా నిట్టుర్చాను. అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చింది.
    'వారిలో ప్రసాద్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయండీ నాన్నారూ! తండ్రి ఉండగా తనకెవరూ లేరని చెప్పాడేమిటి?'
    'ఒక్క తండ్రే కాదమ్మా..సవతి తల్లి....సవతి తమ్ముడూ ఉన్నారు...నా ఊహ సరియైన'దైతే మన నర్శింగ్ హోం లో పనిచేస్తున్న మన శివం వీరి రెండవ అబ్బాయి అయి ఉంటాడు... తెలుసుకొందా మనుకొనేసరికి ఆ ప్రమాదం కలిగింది..రేపు అన్ని విషయాలు తీరికగా మాట్లాడుకొందాము. కొద్ది సేపట్లో వీరి భార్యను తీసుకొని రామనాధం గారు వస్తారు. వారికీ కావలసిన ఏర్పాట్లు చూడు....నీకు కాబోయే అత్తగారు వారు....'

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra