27

    మర్నాడు రామానంద్ కి టెలిఫోన్ చేద్దామని అనుకున్నాడు గోపాలం. కాని. ఈ వెలుగులో నిన్నటి సంఘటన అతనికి అప్పటిదాకా తెలియని రంగుల్లో కనిపించింది. మనసులో ఉద్రేకం తగ్గాక, ఆ సంభాషణలో ప్రతీ వాక్యాన్నీ నెమరు వేసుకున్నాక! అతనికి వసంత మనసులో మగ్గుతోన్న నిప్పుల వేడి కొంత తెలియ వచ్చింది. శశిరేఖకి భౌతికంగా తాను దూరంగా ఉన్నా మానసికంగా చాలా దగ్గర అని వసంత గట్టిగా నమ్ముతోంది...
    ముందర ఆ గుర్తు తనకి బాధ కలిగించినా. దాని వెనకాల ఉన్న కొంత నిజం అతన్ని నిందితుడిగా భావింప జేసింది.... కాని, వసంత తన ప్రవర్తనని అతని లోపాలకి ఫలితంగా నమ్ముతూన్న నిజం మాత్రం అతన్ని గడబిడ పెట్టింది. ఇప్పటిదాకా ఫిర్యాదుగా తప్ప అతను తనని మరే దృక్పధంలోనూ గమనించుకోలేదు: నిన్న ఒక్క మాటతో వసంత తనని ముద్దాయిగా, దోషిగా నిలబెట్టింది! అంతకన్నా అతనికి బాధకలిగించిన విషయం. ఆమె ముద్దాయి స్థానం నుంచి న్యాయ మూర్తి స్థానాన్ని ఆక్రమించింది!
    ఆమె శశిరేఖని చూడడానికి వస్తానన్నది, కాని...
    ఏ ఉద్దేశంతో వస్తుంది? మనసులో ఉన్న దానినంతనీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో శశిరేఖ మీద ఆరోపణలుచేసి సంతృప్తిపడుతుందా? తనకీ, శశిరేఖకీ మధ్య మిగిలిపోయిన పలచటి ఈ కొంచెం అనుబంధాన్నీ ఆమె వాడి మాటలతో కత్తిరిస్తుందా?
    ఆలోచించినకొద్దీ అతనికి ఆరాటం హెచ్చయింది. శశిరేఖ ఈ రెండేళ్ళల్లో చాలా మారి పోయి ఉంటుంది. అప్పటి సౌమ్యత. అప్పటి మెత్తదనం ఈ కాలంలో మిగిలి ఉండవు. గోపాలం కోసం వసం ఉండవు.
    ఆలోచించినకొద్దీ వెయ్యి భయాలు అతన్ని వేటాడ సాగాయి. మరొక అనుమానం అతన్ని వేధించసాగింది - తీరా ఈ రోజు రామానంద్ కి చెప్పి ఆదివారం వసంత రానంటే? తాను మరీ నవ్వుల పాలుకాడా!
    అన్నీ ఆలోచించి నిర్ణయం శనివారం దాకా వాయిదా వేశాడు గోపాలం.
    ఆ మధ్యాహ్నం స్టెల్లా అతనికి కొంత ఉపశమనం కలిగించే వార్త ఒకటి చెప్పింది- యూనియన్ లో స్ట్రైక్ విషయంలో చాలా అభిప్రాయ భేదాలు వచ్చాయనీ, సుమారు సగం మంది కార్మికులు సమ్మెకి వ్యతిరేకులుగా ఉన్నా రనీ.
    "మీ కెలాగ తెలుసును?"
    నవ్వి. ఆ మాట అడగకూడదు-" అంది.
    "కాని, చెప్పవచ్చును.... మేనేజిమెంటుకి తెలుసా"
    "తెలీదు-"
    "మరి?"
    కొంచెం తికమకపడి, మీకు చెప్తాను....మరెవ్వరికీ చెప్పనంటే," అంది.
    అతను ఆలోచించకుండా వాగ్గానం చేశాడు.
    స్టెల్లా చెప్పిన దాన్ని బట్టి ఆమె భర్తకీ, యూనియన్ లో ఒక నాయకుడికీ చాలా దగ్గిర స్నేహం అని. వాళ్ళురోజు రోజూ కలుసుకుంటారనీ. ఆ కారణం వల్ల ఆమె కీ విషయం తెలిసిందని బోధపడింది అతనికి.
    "థాంక్స్" అన్నాడు గోపాలం.
    "మరెవ్వరికీ చెప్పకండి" అంది స్టెల్లా.
    "ప్రామిస్!"    
    ఆ సాయంత్రం వెంకట్రామ్ వచ్చి. గోపాలం కొంచెం ఆలశ్యంగా ఇల్లు చేరేసరికి కనిపించారు. బయట కూర్చుని ఆయనా వసంతా టీ తాగుతున్నారు.
    అతన్ని చూసి, "ఆలశ్యం ఐందేం గోపాలం?" అన్నాడు కొంచెం ఆతృతగా.
    వసంత నవ్వి, ఇవేళ త్వరగా వచ్చేరు- మన అదృష్టం! అంది.

               
    "అంటే?"
    అతనేమో అనేలోపున వసంత "మొన్నటి దాకా క్లాసులు...ఆ తరవాత..."
    ఆమె ఆగిపోయింది. గోపాలం ముఖం ఎర్రబడి పోయింది. ఆమె చెప్పేది ఊహించుకుని.
    "ఆఁ?" వెంకట్రామ్ సగంలో ఆపదలుచుకోలేదు.
    "ఏమీలేదు."
    వసంత లేచి, లోపలికి వెళ్ళిపోయింది.
    గోపాలం కోటుతీసి సోఫాలో పడేసి వచ్చేడు. చాలాసేపు అతను కాని, వెంకట్రామ్ కాని, మాట్లాడలేదు.
    చివరికి వెంకట్రామ్ అతన్ని తేరిపార చూస్తూ, "ఏం జరుగుతోందిక్కడ గోపాలం?" అన్నారు.
    "ఏమీ లేదు"
    "నాకు కళ్ళున్నాయి. నిజం చెప్పు. ఏమిటి జరుగుతోంది!"
    "వసంతనే అడగండి"
    "అడుగుతాను కాని, నువ్వు ముందు చెప్పు"
    "ఏమిటి?"
    నిజం, శేఖర్ చెప్పినా నేను నమ్మలేను... మీరిద్దరూ ఎందుకిలా వున్నారు? ఈ కీచులాట లెందుకని?"
    వెయ్యి సమాధానాలు గొంతుకలోకి వచ్చాయి గోపాలానికి, కాని, ఆయన కళ్ళలోని వేడి ముందు అన్నీ కరిగిపోయాయి. అతనేమీ సమాధానం ఇవ్వలేదు.
    "గోపాలం!-మీ ఇద్దరి మధ్యా లక్ష చిలిపి కయ్యాలు రా వచ్చును.....కాని, మొత్తం మీద మీరు సుఖంగా ఉంటే సహజంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక చాలా సార్లు విన్నాను. వసంతని నాకు తెల్సును - కొంతవరకూ నిన్నూ నాకు తెలుసును. అందుచేతనే ఆ అపోహలు తప్పు అని అనుకున్నాను. కాని, ఇవేళ మూడోసారి మిమ్మల్ని గమనించండి- ఆమె అటు ముఖం, నువ్వు ఇటు ముఖం, నిజంగా చెప్పు, ఈ ఇంట్లో ఏమైనా శాంతి ఉందీ?"
    అసలే బాధపడుతూన్న గోపాలానికి ఆయన మాటలు పుండు మీద కారం జల్లినట్లు ఐంది.
    "లేదు మామగారూ! లేదు" అన్నాడు.
    "ఎందుచేత?"
    ఆ మాట వసంతని అడగండి" అన్నాడు గోపాలం?
    "ఈ ఇంట్లో మగవాడివి నువ్వు- నువ్వు చెప్పు".
    కొంచెం ఆశ్చర్యపడినట్టు ఆగిపోయాడు గోపాలం, ఆయన మాటలు కొరడా దెబ్బల్లాగ తగిలేయి.
    "నిజమే....చెప్తాను వినండి. వసంతకి కావలసిన జీవితం వేరు- ఆమె స్నేహితులు వేరు.... ఆమె ప్రపంచమే వేరు. నాతో ఆమె కాలం  గడుపుతోంది-కాని, కష్టంగా నా మీద ఆమెకి పెద్ధనమ్మకమేమీ లేదు.... వాళ్ళ నాన్న గారు కొనిపెట్టిన ఆట బొమ్మలాగ. కన్న...."
    లేచి నిలబడ్డారు వెంకట్రామ్,
    "నువ్వేం చేశావు?"
    ఆశ్చర్యంగా చూశాడు గోపాలం.
    "తెల్లబోయి చూడకు గోపాలం!- మంచికో, చెడుకో వసంతని నీకు ధారపోసి దానం చేశాను. దాని జీవితం సరిదిద్దే శక్తినీలో ఉందని అనుకున్నాను. చివరికి ఎవరో మిమ్మల్ని గురించి చెప్పవలసిన స్థితి వచ్చింది."    
    ఆయన లోపలికి వెళ్ళి వసంత పడుకున్న మంచంమీద కూర్చున్నారు.
    "ఏడిచి ఏం లాభం వసంతా? ....మీ ఇద్దరికీ కావలిస్తే తప్ప నీ సంసారంలో సుఖ శాంతులుండవు. కొంచెం నువ్వూ ఆలోచించు. బాధ్యత పెట్టకునే వయస్సు వొచ్చింది."
    ఆమె తల నెమ్మదిగా నిమిరి, లేచి, "వెడతా నమ్మా! అన్నాడు వెంకట్రామ్.
    వసంత లేచి కూర్చుని, కళ్ళు తుడుచుకుని, "భోజనం చేసి వెళ్ళు నాన్న!" అంది.
    "వద్దమ్మా- ఇంక ఆకలి లేదు." అని, వెనక్కి చూడకుండా వెంకట్రామ్ బయటికి నడిచాడు.
    గోపాలం ఆయన వెంట మెట్లుదిగాడు. కాని ఆయన ఇంకేమీ మాట్లాడకుండానే కారులో కూర్చుని వెళ్ళిపోయారు.
    ఈ హరాత్సంఘటన చాల కలవరపెట్టింది గోపాలాన్ని! ఆయన ఆడిన మాటలకన్న ఆడనివే ఎక్కువ బాధ పెట్టాయి అతన్ని. వీటన్నిటికన్నా, ఈ సంఘటనకి దారితీసిన వసంత మాటలు అతన్ని మరీ బాధపెట్టేయి.
    నెమ్మదిగా మెట్లెక్కి మీదకి వచ్చాడు. వసంత సోఫాలో కూర్చుని రెండు చేతులూ గెడ్డంకింద పెట్టకుని సుదీర్ఘంగా ఆలోచిస్తోంది.
    అనేక భావాలూ, ఎన్నో మాటలూ అతని నాలిక చివరి దాకా వచ్చేయి. కాని, వాటిని దిగమింగుకుని ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు.
    చాలా సేపు అలాగే నిశ్శబ్దంగా గడిచిపోయింది - గాలి వాన వెలిసినట్టు.... కాని, అతనికీ, ఆమెకీ, తెలుసును-ఈ ప్రశాంతత గాలి వాన ముందరిదని.
    చివరికి నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఆయనకి ఏమిటి చెప్పావు వసంతా?" అన్నాడు గోపాలం.
    తలఎత్తి చూసి, "నీ వెనకాల నేనేమి చెప్పలేదు- నీకు తెలియక పోవచ్చును-ఆ అలవాటు నాకు లేదు!" అంది.
    "ఆయనకి హఠాత్తుగా ఇంతకోపం ఎందుకొచ్చింది?"
    "కోపం కాదనుకుంటాను గోపాలం..."
    "మరి?"
    "బాధ"
    "ఎందుకని?"
    "ఆయన మాటలు నువ్వూ విన్నావు"
    "కాని, నాకు పూర్తిగా అవగతం కాలేదు."
    "అందుకనే, ఆయనకీ బాధ"
    అతను తేరిపార చూశాడు.
    "ఏమిటి నువ్వనేది?"
    "అన్నీ కనిపించీ కళ్ళు మూసుకుంటే నీకు వివరించడం కాని పని - గోపాలం! నాకూ మనస్సు బాగులేదు. వెళ్ళి భోజనం చేసి పడుకో"
    "నువ్వు?"
    "నాకాకలిలేదు. కొంతసేపు ఆలోచించు కోనీ"
    "తప్పకుండాను... నీ ఆలోచనలకి అడ్డురాను. కాని ఒకమాట చెప్పు, మన మధ్య ఉన్న దానికి - లేదా. లేనిదానికి బాధ్యత అంతా నాదేననా ఆయన ఉద్దేశం?"
    లేచి నిలబడింది వసంత.
    ఆ సంగతి నువ్వు ఎవర్నీ అడగాల్సింది కాదు. సమాధానం నేను యివ్వలేను...ఆయన్నే అడుగు"
    ఆమె వెళ్ళి పడుకుంది. అతను రెండు మెతుకులు తిని అవతలిగదిలోకి వెళ్ళిపడుకున్నాడు.
    బాగా రాత్రి అతనికి కొంచెం నిద్రపట్టింది. టెలిఫోన్ రింగ్ విని లేచేసరికి వసంత రిసీవరు తీసుకుంది.
    అతని రాక ఆమె గమనించలేదు.
    "....అత్యవసరమైతే అలాగే నాన్నా... అవును.... అతను మారటం కల్ల..."
    వసంత దేనికి సమాధానంగాఅంటూందో అతనికి బోధపడలేదు.
    "రేపు మాట్లాడతాను-... వస్తాను...పొరపాటు మీదికాదు..."    
    అతనికి కొంచెం బోధపడసాగింది.
    ".....రాత్రి ఏమీ అవదుగా!....లేదు.....ఏమీ రియాక్షన్ లేదు......ఈ పరిస్థితికన్న అది చాలా మెరుగు.... సారీ.... గుడ్ నైట్..."
    ఆమె వెనుదిరిగే లోపున అతను వెళ్ళిపోలేక పోయాడు- అతన్ని చూసి క్షణమాత్రం సందేహించి ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది.
    తల తిరిగి నట్లయింది  గోపాలానికి. నీరసంగా వెళ్ళి మంచంమీద పడుకున్నాడు...నిజంగా వసంత ఆ సూచనకి అంగీకరిస్తోందా?
    తమ మధ్య కలతలు నీటిమీద గీతలు కాదు. అవి నిండని ఆ ఖాతాలు! దాటలేని పెద్దగోడలు! నిజంగా ఆమె తన నుంచి శాశ్వతంగా విడిపోడానికి అంగీకరిస్తోందా?
    డైవోర్స్...
    ఆ మాట ఆ సంభాషణలో అతను వినలేదు. కాని అతని అంతరాంతరాలు ఆ చిన్న సందేహాన్ని అతనికి ఉపశమనం ఇచ్చే వీలు కలి కలిగించలేదు.... వసంత అంటే తండ్రికి ప్రాణం- అతనూ భావోద్రేకంలో పనులు చేసే మనిషి-ఆమె కూడా చాలా విషయాల్లో తండ్రి పోలిక. తనతో వివాహమూ హఠాత్తుగానే జరిగింది వసంతకి. ఈ నిర్ణయమూ...
    ఏ కారణం వల్ల అడుగుతుంది డైవోర్స్?
    సరియైన ప్లీడరు దొరికితే ఎన్ని కారణాలు ఉండవు!
    అతను పడుకున్న మంచం ముళ్ళకంచెలాగ అనిపించింది గోపాలానికి. తెల్లటి ఆదుప్పటే రాళ్లలాగ గుచ్చుకుంటోంది. ఎయిర్ కండిషనర్ పని చేస్తోన్నా,  ఊపిరి సలపడం లేదు!
    మంచం పక్కనే ఉన్న దీపం వేశాడు.
    ఆ గదిలో తన స్వంతం ఏమీ లేదు! బైటా లేదు. తన అంతరంగం కూడా క్రమంగా తనది కాకుండా పోతోంది. నిద్రరాలేదతనికి కింక.

                                      *    *    *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra