Home » Yerramsetti sai » Death Chamber


    చాలాసేపటి వరకూ సోఫాలోనే కూర్చుని ఆలోచిస్తూండి పోయిందామె. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేక పోతోంది.
    హఠాత్తుగా అంతకుముందు జరిగిన రెండు మూడుఇదేమాదిరి సంఘటనలు గుర్తుకొచ్చాయామెకి.
    వాళ్ళ అసభ్యప్రవర్తనకు తనుకోపగించుకునేసరికి వాళ్ళు శ్రీనివాసరావు నాటకం తెలుసుకుని చేసేదిలేక జారుకుంటున్నారు.
    ఇలాంటి దుర్మార్గుడినాతను సెక్రటరీ నియమించుకుంది? అతని ముఖం చూడాలంటే అసహ్యంగా వుంది తనకు. ఇంకొక్క క్షణం కూడా అతను తనదగ్గర పని చేయడానికి వీల్లేదు.
    వెంటనే లేచి బయటకు నడిచివాచ్ మన్ ని పిలిచింది చంద్రిక.
    "చూడు రేపు ఉదయం శ్రీనివాసరావుని ఇంట్లోకి రానీకు! గేటు బయటే నిలబెట్టి ఉద్యోగంలోంచి తీసేశాననీ. నాతో మాట్లాడటానికి కూడా వీల్లేదని చెప్పు! అర్ధమయిందా?"
    "సరేనమ్మా!"
    "ఒక వేళ ఏమైనా వాగితేపోలీస్ ని పిలిపించి జైల్లో వేయిస్తానని చెప్పు!"
    లోపలకు వచ్చేసింది చంద్రిక.
    ఆ రాత్రి ఆమెకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఈ ఫీల్డులో ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలీటంలేదు. మర్నాటినుంచీ శ్రీనివాసరావు కనిపించలేదు తనకు.
    రోజులు గడచిపోతున్నాయ్. రాన్రాను ఆ జీవితం విసుగు కలిగించసాగిందామెకి. లోలోపల అసంతృప్తి పెరిగిపోతోంది. ఇంతవరకూ తను నటనలో పేరు ప్రఖ్యాతులు గడించాలనీ, ధనం సంపాదించాలనీ కోరిక వుండేది.
    అవి రెండూ తీరాక ఇప్పుడు నిజానికి అవి రెండూ ముఖ్యంకాదనీ, జీవితం సుఖమయంకావడానికి మరింకేవో సాధించాల్సి వుందనీ అనిపించసాగింది.
    రాన్రాను వంటరితనం భరించలేకపోతోంది. షూటింగు - తప్పితే యింట్లో! ఈ రెండే వ్యాపకాలు, రెండుచోట్లా తనుహృదయం విప్పి మాట్లాడుకునేంత చనువు ఎవరితోనూ లేదు. ఎంతకాలమిలా దారుణమయిన జీవితం భరించడం?
    తనను అర్ధం చేసుకుని, మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తి సాంగత్యం లభిస్తే గానీ తనీ స్తభ్తతనుంచి బయటపడదు. కానీ అందుకోసం ఎంత కాలంవేచి వుండాలో.
    ఆ సాయంత్రం కౌశల్ వచ్చాడామెయింటికి.    
    "ఇవాళ మన పిక్చర్ రిలీజయిందని మీకు తెలుసా?" అడిగాడతను.
    "అరె! మర్చిపోయాను!"
    "మ్యాట్నీ రిపోర్ట్స్ ఏమంత బావుండలేదు" నిరుత్సాహంగా అన్నాడతను.
    "అరె! ఎందుకని?"
    "మన కర్మ! అంతే! మీరు వెంటనే నాతో హోటల్ కు రావాలి. మీరు పక్కనే లేకపోతే స్పృహ తప్పి పడిపోతానేమో నని భయంగా వుంది" అన్నాడతను.
    చంద్రిక  అతనితోపాటు హోటల్ కి చేరుకుంది.
    చాలాసేపు ట్రంకాల్స్ బుక్ చేసి ముఖ్యమయిన టౌన్స్ తో మాట్లాడాడు కౌశల్.
    "కొన్ని చోట్లే హౌస్ పుల్ అయింది. ఫరవాలేదులెండి. నేనె లాగూ ఫ్లాప్ కి సిద్దపడే వున్నాను."
    చంద్రికకు అతని పరిస్థితి ఆందోళనకలిగిస్తోంది.
    ఇంచుమించుగా కట్టుబట్టలతో మిగుల్తాడతను. ఇదే వేరొకరయితే గుండె పగిలిపోతుంది.
    "మీరింత నిబ్బరంగా ఎలావున్నారో నాకు అర్ధం కావడంలేదు" అతనితో అంది చంద్రిక.
    నిజానికి అతను ఆ విషయాలేమీ ఆలోచించడం లేదు. గత కొద్ది రోజులుగా అతని ఆలోచనలన్నీ చంద్రిక చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆమెతో ఏర్పడిన సాన్నిహిత్యంక్రమేపీ ఆమె తనదయితే బావుండునన్న ఆలోచనలను రగిలించింది.
    అయితే తన ఆలోచనలను ఆమె ముందుంచడానికి ధైర్యం చాలడంలేదు. తను వివాహితుడు ప్రస్తుతం ఆస్తి అంతా పోగొట్టుకున్నవాడు. మరి తనలాంటివాడిని అంగీకరిస్తుందా ఆమె?
    ఏదేమయినా తను ఆ విషయం ఈరోజే ఆమెతో మాట్లాడదల్చుకున్నాడు. ఆమె వివాహానికి అంగీకరించడం వల్ల తను ఆర్ధికంగా కూడా కోలుకుంటాడు.
    చంద్రికగారూ! ఇవాళ ఎంతో ఆనందించాల్సినరోజవుతుందని ఆశపడ్డాను. ఈ సినిమా బంగారుగుడ్లు పెడుతుందని అనుకున్నాను. తీరా చూస్తే అంతా తారుమారయింది. అయినా నాకు సంతృప్తి మిగిలింది. మీకు ఈ చిత్రం మరింతమంచిపేరు తేవాలనుకున్నాను. అది నిజమయింది. మీకు లభించిన ఈ విజయానికి చిహ్నంగా నయినా మనం అనందంగా గడపాలి" అంటూ లేచి వెళ్ళి అల్మరాలో నుంచి స్కాచ్ విస్కీ తీసుకొచ్చి ఆమె ముందు వుంచాడతను.
    "ఇవాళ మీరు కూడా నాతో మందు తీసుకోవాలి. 'నో' అనకూడదు!"
    చంద్రిక కలవరపడింది.
    "ఊహూ! వద్దండీ! నాకిష్టం లేదు!"
    "మొదట్లో నాకూ అంతేనండీ! కానీ ఇప్పుడు మాత్రం రోజూ ఇది లేనిదేవుండలేకపోతున్నాను"
    "ప్లీజ్ బలవంతం చేయకండి!"
    "ఈ ఒక్కసారికి కాదనకండి! పోనీ ఎక్కువ తీసుకోవద్దు. ఓ గుక్కెడు కంపెనీ కోసం!"
    "కౌశల్ గారూ! ఇలా బలవంతంచేయకండి మీకు భావ్యంకాదు" ఇబ్బందిగా అందామె.
    "నిజమే! వప్పుకుంటాను. ఇంకెప్పుడూ మీ జోలికిరాను. కానీ ఈ ఒక్కరోజు మాత్రం కాదనకండి!"
    "కానీ ఇందువల్ల మీకేమిటి లాభం?" అనునయంగా అడిగిందామె.
    "ఈ రోజుని జీవితాంతం మరువలేని రోగుగా మిగుల్చుకోవడం కోసం" అంటూనే రెండు గ్లాసుల్లోకి విస్కీవంచి ఆమె చేతికిఅందించబోయాడతను.
    "ప్లీజ్!" అతని చేతినితోసి వేస్తూ అందామె.
    "ఊహు! నన్ను క్షమించండి!" అంటూ బలవంతంగా గ్లాసుని పెదాలకు తాకించాడు.
    "ఒక్క షరతు!" అందామె.
    "ఏమిటి?"
    "ఇంకా తాగమని అడగకూడదు!"
    "సరే!" ఉత్సహంగా అన్నాడతను.
    చంద్రిక గ్లాసు ఎత్తిగడగడ తాగేసింది. అతనుగట్టిగా నవ్వేశాడు.
    "వండర్ ఫుల్! మెనీ మెనీ థాంక్స్" అంటూ తను కూడా తాగేశాడు. చంద్రికకు అదోలా వుంది. వికారంగా ఫీలవసాగింది.
    "ఎలా వుంది చంద్రికగారూ! ఇంత అద్భుతమయిన అనుభవం ఇంతకు ముందెప్పుడయినా పొందారా?" నవ్వుతూ అన్నాడతను.
    "ఏమో! నాకేమిటోగా ఉంది" కలవరపాటుతో అందామె.
    "కొంచెంసేపు అలాగే ఉంటుంది! మీరేం గాభరాపడకండి!" అన్నాడు.
    చంద్రిక నెమ్మదిగాలేచి సోఫాలో వెనక్కుజారగిలబడి కూర్చుంది.
    "ఇప్పుడు మనం చాలాముఖ్యమైన విషయం మాట్లాడాలి చంద్రికగారు! ఇంతకు ముందు అనేకసార్లు మాట్లాడాలని ధైర్యం చాలక ఊరుకున్నాను...." అన్నాడతను ఆమెవంకేచూస్తూ.
    "ఏమిటది?" అడిగింది చంద్రిక.
    "మనిద్దరికీ పరిచయమైన రోజునుంచీ మనసులో ఉన్న కోరిక ఇది. కానీ ఎంతోఆలోచన తర్వాత నిర్ణయానికొచ్చాను!" అతను లేచి ఆమె పక్కనే కూర్చున్నాడు.
    "చంద్రికా! మీరు నాక్కావాలి! ఈ ఒక్కరోజు కోసం కాదు! జీవితాంతం మీరు నా పక్కన ఉంటే ఎన్నో సాహసాలు చేయగలనన్ననమ్మకం నాకుంది. మనం ఒకరికొకరం సుపరిచితులం! ఒకరినొకరు అర్ధం చేసుకున్నాం. ఎన్నో విషయాల్లో మనిద్దరికీ ఏకాభిప్రాయం వుంది. మనం ఒకటవడం, ఎలాంటి అవాంఛనీయపరిణామాలకూ దారి తీయదనినాకు నమ్మకం వుంది"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra