Home » Balabhadrapatruni ramani » Ounante Kadantaa

"నీకు తెలీదు. ఆయన ఆ విసుగంతా నామీదా, పిల్లలమీదా చూపించి ఇల్లు రణరంగంగా మారుస్తాడు. ఆ విసుగు భరించడం నావల్లకాదు. పిల్లలు మాటామంతీ లేకుండా బిక్కచచ్చిపోతారు" అంది.
"సంపాదించని సదానందానికీ, తనకోసం మాత్రమే సంపాదించుకునే శ్రీధర్ కీ తేడా ఏవిటంటే.... స్వార్ధం! సదానందానికి సోమరితనంతప్ప స్వార్ధంలేదు" కోపంగా అంది శక్తి.
తార మౌనంగా తలదించుకుంది. అలా మౌనంగా లేకపోతే అతను "ఇష్టం లేకపోతే పో" అనేస్తాడు. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా పోయి ఎక్కడ బతుకుతుంది? బతకలేక కాదు. బతకనివ్వరీ జనం. వయసులో వున్న స్త్రీ అనేసరికి ఎక్కడలేని కుతూహలం దానికితోడు శాడిజం.
"సారీ! ఏమీ అనుకోకు" డబ్బు అందిస్తూ అంది శక్తి.
"నాకు తెలుసు నువ్వు ఎందుకు చిరాకు పడుతున్నావో? కానీ నీకు తెలీదు ఇలా భరించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయో! పిల్లలకి వయసు వస్తుంది. ఆ రోజు వాళ్ళకి తండ్రి అవసరం తోచి 'అమ్మా! ఇలా మమ్మల్ని ఎందుకు తండ్రిలేనివాళ్ళని చేశావు?' అంటే ఏం జవాబు చెప్పాలి? పైగా శ్రీధర్ చేసేలాంటి పనులు చెయ్యని మగవాడు నూటికి ఒక్కడుంటాడేమో! భార్యలమీద విసుక్కోవడం, కాస్త సమస్య రాగానే ఆమెమీదకి తోసెయ్యడం, దులుపుకొని తిరుగుతూ తన సుఖం తను చూసుకోవడం..... ఆ జాతి లక్షణాలుగా మార్చుకుంటున్నారు. ఈ కారణంగా ఎంతమంది భర్తల్ని వదిలేయాలో చెప్పు!" అంది తార.
"వదిలేయమనటం లేదు. కాస్త సంస్కరించమంటున్నాను. ఆదివారం వస్తే వుట్టిరోజుల్లో చేసింది సరిపోనట్లు పిండీ గుండై ఇల్లు సర్దడం, అతిథులకి మర్యాదలు చేయడం మానేసి, పిల్లల్ని తీసుకుని ఏ జూ పార్కుకో పోయి సాయంకాలానికి రా నీకంటూ కొంత సమయం కేటాయించుకొని పుస్తకాలు చదవడమో టీవీ చూడటమో చెయ్యి లేదా శుభ్రంగా తలుపేసుకుని నిద్రపో ఏం? నీ మొగుడు భోజనం కాగానే గురకలు పెట్టి మధ్యాహ్నాలు నిద్రపోడూ? ఆ సమయంలో అతని బంధువులొస్తే నువ్వే లేచి ఎందుకు టీ ఇవ్వాలీ? అతనెందుకు నిన్ను లేపకుండా ఆ పనులు చేసుకోలేడూ?" లాయర్లా అడిగింది శక్తి.
తార పెదవులపై ఓ శుష్క మందహాసం మెరిసి మాయమైంది.
"నాకు ఆర్ధికస్వాతంత్ర్యం వుంది అన్నమాట వుట్టిమాట. నేను సంపాదించే డబ్బుమీద నాకు ఏ మాత్రం స్వాతంత్ర్యం లేదు. ఓ హౌస్ వైఫ్ కీ నాకూ తేడా ఏమిటంటే.... ఆవిడకి ఇంటిపనులు మాత్రమే వుంటాయి నాకు ఇంట్లోనూ బయటా కూడా చాకిరీ వుంటుంది" అంది.
"మరి భర్తవల్ల ఏమిటి లాభం? నువ్వు పెళ్ళి చేసుకోకుండా వుండి వుంటే ఇంత బాధ్యత వుండేది కాదు. పైగా బోలెడు స్వేచ్చ!" అంది శక్తి.
"మెటర్నటీ లీవులు!" నవ్వుతూ చెప్పింది తార.
ఆ నవ్వులో జీవం లేకపోవడం చూసి నిట్టూర్చింది శక్తి.
రోడ్డుమీద వందలాది తారలు! మెడలో డిస్కోదారాలతో, చేతిలో టిఫిన్ డబ్బాలతో ప్రతి బస్టాప్ లోనూ, కళ్ళనిండా బస్ రాకకై ఆతృత నింపుకుని ఎదురుచూపులతో వడిలిపోతుంటారు. బస్ లో ఇనపకమ్మీలకీ, కరడు కట్టిన పురుషాహంకారానికీ తమ శరీరాలు ఒరుసుకుపోతుంటే, ఒళ్ళు అప్పజెప్పి, ఇవ్వవలసిన బాకీలకీ, వచ్చిన డబ్బులకీ సమన్వయం కుదరక లెక్కల్లో మునిగి తేలుతూ ఇల్లుచేరతారు. గుమ్మంలో ఆడుకునే పసికందులని చూడగానే 'రేపటినుంచీ ఈ ఉద్యోగం మానేసి కలో, గంజో తాగితేనో!' అనే ఆలోచన స్మశాన వైరాగ్యంగా మనసులో మెరుస్తుంది. మళ్ళీ ఏ రాత్రో ఇంటికొచ్చి అన్నం పెట్టమని అధార్టీ చేసి, తన హక్కుల్ని బలవంతంగా పొందే భర్తల్ని చూడగానే గానుగెద్దు జీవితం నీకు తప్పదన్న నగ్నసత్యం బట్టలు విప్పుకు ఎగురుతుంది. మళ్ళీ పొద్దుటే తెగిన చెప్పులకి పిన్నీసులు పెట్టుకుంటూ, బస్సు రాకకై ఎదురుచూస్తూ ఆత్రంగా, ఆశగా, ఆర్తిగా పరుగులు మొదలు.
శక్తిమతికి ఇంటికి వేలాడుతున్న తాళంకప్ప చూడగానే ఇంద్రనీల్ గుర్తొచ్చాడు.
'శక్తీ... మధ్యాహ్నం నీకోసం చిరోటాలు చేశాను. అవేంటా అని కంగారు పడుతున్నావా? వనితలో చదివి చేశాను. కాఫీరాగం, కానడా కలిపి పాడి నట్లుంటుంది. మధ్యలో మాల్ కోసడ్ లా నీకోసం మాల్టోవా కలిపాను. కాదంటే కాదంబరిలా కాఫీనే ఇస్తాను' ఇలా క్షణం వూరుకోకుండా వూదరగొట్టేవాడు.
'ఎంతమంది భార్యలు భర్తరాగానే సాధింపులూ, అనారోగ్యాలూ కాకుండా ఇలా సరదాగా మాట్లాడతారూ' అనుకుంది శక్తి.
"ఈరోజు మామ్మగారికీ తాతగారికీ భేటీ! ఎదురింటావిడకు మళ్ళీ కాలనీలో కెప్టెన్సీ."
"మీనాక్షి వాళ్ళాయన మీద మళ్ళీ పేరిశాస్త్రి అస్త్రం"
"పక్కింటావిడ వేర్పాటు వాదనకి మామ్మగారి తోడ్పాటు."
"పెరిగిన బీడీ ధరమీద సదానందం నిరసన!"
ఇలా పేపర్లో హెడ్డింగుల్లా సరదాగా ఇరుగుపొరుగు కబుర్లు అందిస్తాడు.
శక్తికి వంట చేసుకోవాలనీ, ఏమీ తినాలనీ అనిపించలేదు. స్నానం చేసొచ్చి నేతచీర కట్టుకుని మంచంమీద వాలిపోయింది.
దుప్పటిలోంచి ఇంద్రనీల్ వాడే షేవింగ్ లోషన్ వాసనొస్తోంది. అప్రయత్నంగా ముక్కు దగ్గరగా పెట్టి, గుండెలనిండా పీల్చింది. అతను పడుకునే జాగా ఖాళీగా...
ఆమె గుండెల్నిండా శూన్యం నిండినట్లనిపించింది.   
'చల్ల చల్లగా సాగే గోదావరిలా శాంత గోదారిలా...
నిలువెల్లా నిండుగా పలికించాడూ.... పులకించే గుండెనే దోచాడూ.....ఎవరమ్మా ఇతగాడు? ఎవరమ్మా?'
తలుపు చప్పుడయింది.
శక్తికి ఒక్కక్షణంసేపు తలుపు తీయగానే ఇంద్రనీల్ అయితే బాగుండు అనిపించింది. అదురుతున్న గుండెలతో నెమ్మదిగా తలుపు తీసింది.
మీనాక్షి నిండుగా నవ్వుతూ నిలబడి వుంది.
"శక్తీ! భోజనం చేశావా?" అడిగింది.
"ఆ... లేదు... చేస్తాను" తడబడింది శక్తి.
"అన్నయ్య అంటూనే వున్నాడు. తను లేకపోతే నువ్వు అన్నం తినవనీ, ఏం తింటావూ అసలు వండుకోనిదే" అంటూ ఆమె చేతిలోని క్యారియర్ విప్పదీసి అందులోంచి చిక్కుడుకాయ కూరా, సాంబారూ, అన్నం తీసి కంచంలో వడ్డించింది. "ఎందుకు మీనాక్షీ నీకు శ్రమ?" మొహమాటంగా అంది శక్తి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra