Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-2


    కొద్దిక్షణాలేం మాట్లాడలేకపోయాడు.

    ఎక్కడో- ఎవరో- కుర్రాడు... త్రినాధ్ లాంటి క్షణం తీరికలేని పారిశ్రామికవేత్త ఆలోచనల్లో ఎలా చోటు చేసుకోగలిగాడు? హిందూకి అర్ధం కావడం లేదు.

    ఛాంబర్ నిశ్శబ్దంగా వుంది.

    త్రినాధ్ ఏ నిర్ణయం తీసుకోనున్నాడు? హిందూ ఆలోచిస్తోంది.

    త్రినాధ్ తల కొద్దిగా వంచి, కనురెప్పల్ని సగం వాల్చాడంటే ఏదో నిర్ణయానికి రాబోతున్నట్లు సూచన-

    "ఆమె చనిపోవడం కన్నా ఇప్పటి ఆ కుర్రాడి దుస్థితే బాధాకరంగా వుంది."

    బోస్ మాటలకు త్రినాధ్ ఒకింత కనురెప్పల్ని పైకి లేపాడు.

    "ఆ తల్లికి శవ సంస్కారం చేసే దిక్కులేదు. ఆ కుర్రాడిని ఓదార్చే దిక్కు అంతకంటే లేదు. మరికొద్దిసేపటికి మునిసిపాలిటీవాళ్ళు రావచ్చు-"

    "స్టాప్..." అరుస్తూ లేచి నించున్నాడు త్రినాధ్.

    రాఘవ, బోస్, హిందూ వులిక్కిపడ్డారు త్రినాధ్ అరుపునకు.

    "పదా... దహన సంస్కారం మనం చేద్దాం-" త్రినాధ్ వేగంగా బయటకు నడుస్తూ ఓ క్షణం ఆగిపోయి" రాఘవగారూ... పదేళ్ళ వయస్సుకే శ్రమ విలువ, నీతి, నిజాయితీల కష్టనష్టాలు తెల్సుకున్న ఒక పసివాడి తల్లి దహన సంస్కారం జరపబోతున్నాను. మరలా కలుద్దాం" అంటూ వేగంగా బయటకెళ్ళిపోయాడు.

    విప్పారిత నేత్రాలతో వింతగా చూస్తూన్న హిందూవైపు చూస్తూ "ఎవరా కుర్రాడు? త్రినాధ్ కి బంధువా?" రాఘవ ప్రశ్నించాడు.

    "బంధువో, తెలిసినవాడో అయితే హిందూ అంతగా ఎందుకు ఆశ్చర్యపోతుంది? ఒక అనాధ... కమాన్ హిందూ" అంటూ బోస్ బయటకు నడిచాడు. ఆ వెనుకే హిందూ వెళ్ళిపోయింది.

    రాఘవకు నిజంగానే మతిపోయిందీసారి. అప్పటికప్పుడే ఒక నిర్ణయానికొచ్చి లేచాడు.


                                        *    *    *    *


    ముందు త్రినాధ్ హోండా కారు... ఆ వెనుక బోస్ జీప్, ఆ వెనుక హిందూ మారుతీ వరుసగా వేగంగా దూసుకుపోతున్నాయి. త్రినాధ్ కళ్ళ ముందిప్పుడు సిద్ధప్పే మెదులుతున్నాడు. తల్లి చావును చూడలేని సిద్దప్ప- పిరికి సిద్దప్ప- ఎక్కడికెళ్ళిపోయావురా... ఈ ప్రాణమిత్రుడ్ని వదిలి? కారు వెనుక సీటులో అలసటగా వాలి వున్న త్రినాధ్ మదిలో మెదులుతున్న ఆలోచనలివి.

    ఉన్నట్టుండి కారు ఓ ఇరుకైన వీధిలోకి తిరిగింది.

    దూరంనుంచే డ్రైవర్ తాను కారు ఆపవల్సిన స్థలాన్ని గుర్తించాడు.

    దూరంగా చిన్న పూరిపాక- ఆ ఒక్కనే మరో రెండు పాకలు- మిగతావన్నీ ఆల్ట్రా మోడరన్ బిల్డింగ్సు.

    పాకముందు నలుగురైదుగురు గుమికూడి వున్నారు.

    కారు తిన్నగా వెళ్ళి అక్కడే ఆగింది.

    త్రినాధ్ దిగుతూనే కుర్రాడి కోసం గాలించాడు. కనిపించలేదు- మరింత దగ్గరగా వెళ్ళి చూశాడు. తెల్లటి పాత గుడ్డ కప్పి వున్న శవం... గుడ్డ గాలికి కొద్దిగా ప్రక్కకు తప్పుకోగా కనిపిస్తున్న పుల్లలాంటి చేయి-

    శవానికి రెండడుగుల దూరంగా ఆ కుర్రాడు... అతను కూర్చున్న తీరు త్రినాధ్ గుండెని మెలిపెట్టింది. శోష వచ్చినట్లు పడి వున్నాడు. చిరుగుల చొక్కా, లాగు, ఎండిన జుత్తు, పీక్కుపోయిన బుగ్గలు.

    అప్పటికి బోస్ జీప్, హిందూ కారు వచ్చేశాయి. ఆ వెనుకే కంపెనీ వ్యాను వచ్చింది. అందులో పదిమంది కూలీలున్నారు.

    ఒక్కసారి అన్ని వాహనాల్ని చూసిన ఆ వీధిలోని జనాలు ఆశ్చర్యంతో చూస్తుండగానే బోస్ వ్యాన్ లో వచ్చిన కూలీలకు కనుసైగ చేశాడు. అంతే... ఆ పదిమంది హడావుడిగా శవాన్ని సమీపించి కర్మకాండకు రంగం సిద్ధం చేయనారంభించారు.

    అప్పటికిగాని ఆ కుర్రాడు స్పృహలోకి రాలేదు.

    వస్తూనే ముందుగా త్రినాధ్ ని చూసి చప్పున గుర్తుపట్టాడు. వాడికి అప్పుడు పొంగుకొచ్చింది దుఃఖం.

    "సార్..." కుర్రాడు వెక్కి వెక్కి ఏడుస్తూ త్రినాధ్ దగ్గరకు వచ్చాడు.

    అప్పటికే చాలామంది అక్కడ గుమికూడారు.

    సూట్ లో దర్జాగా, హుందాగా కనపడుతున్న త్రినాధ్ ని, కార్లను చూపులు మార్చి మార్చి చూస్తున్నారు ఆశ్చర్యంగా అక్కడ గుమికూడిన జనం.

    ఆ కుర్రాడు ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి ముఖం వాడిపోయిన లేతగులాబి మొగ్గలా వుంది. తల్లి చెట్టు నుంచి వేరు పడిన పసి మొగ్గ... చిన్నారి గుప్పెట తెరుస్తున్నాడు.

    అందులో నలిగిపోయిన రూపాయినోట్లు, కొంత చిల్లర- చెప్పలేకపోతున్న వాడి అసక్తతే త్రినాధ్ కి అంతా చెప్పేసింది. అప్పుడు త్రినాధ్ చేతులు చాపి కుర్రాడ్ని దగ్గరకు రమ్మంటూ సైగ చేశాడు.

    అంత బాధలోనూ ఆ కుర్రాడికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది....

    రెండు రోజుల క్రితమే తెల్లవారుఝామున బస్ స్టాండ్ లో కాకీ బట్టలతో కనిపించిన వ్యక్తి ఈ రోజు సూట్ లో.... ఆ వెనుక మందీ మార్భలంతో కనిపిస్తున్నాడు! ఆ ఆశ్చర్యం కొద్ది క్షణాలలోనే మరుగున పడిపోయింది.

    "నా దగ్గర 14-50 పైసలే వున్నాయి సార్..." ఛెళ్ళున కొట్టినట్లయింది త్రినాధ్ కి.

    త్రినాధ్ ఆ కుర్రాడ్ని దగ్గరకు తీసుకున్నాడు. "నువ్వెందుకురా ఏడుస్తావు...? మానవత్వం చచ్చిన ఈ సమాజం ఏడ్వాలి. తల్లికి కర్మ చేసేందుకు డబ్బు లేదని నువ్వెందుకురా బాధపడతావు? తల్లి కర్మా-? టైమ్ లేదే అనే స్థాయికి దిగజారిన ఈ సమాజం ఏడ్వాలి...." త్రినాధ్ కసిగా, ఉక్రోషంగా అన్న మాటలు అక్కడ గుమికూడిన వారందరికీ వినిపించాయి.

    "మా అమ్మను మునిసిపాలిటీవాళ్ళు లాక్కెళతారట సార్-"

    ఈసారి నిజంగానే త్రినాధ్ కళ్ళలో నీరు తిరిగింది.

    "నీకా ఖర్మలేదు బాబు..." బోస్ అప్పుడే అక్కడకు వస్తూ అన్నాడు.

    కుర్రాడు ఆశ్చర్యంగా బోస్ వైపు, త్రినాధ్ వైపు చూశాడు నిజమేనా అన్నట్లు.

    త్రినాధ్ తలూపాడు నిజమే అన్నట్లు.

    శవాన్ని స్మశానానికి తరలించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

    కుర్రాడు వున్నట్టుండి త్రినాధ్ కాళ్ళమీదకు జారిపోయి తన చిన్నారి చేతులతో మూడుసార్లు త్రినాధ్ పాదాలకు నమస్కరించాడు.

    ఒక్కో వ్యక్తి మరో వ్యక్తికి కొన్ని విషయాల్లో బాగా నచ్చుతాడు. ఆ నచ్చడం అన్నది అవతల వ్యక్తి జీవితగమనాన్నే మార్చివేయవచ్చు.

    ఇండియన్ అయి వుండీ ఉప్పు, కారం తక్కువ తినే అలవాటున్న త్రినాధ్ సాయి ఛిరో హోండాకి నచ్చాడు. ఆ నచ్చడమే త్రినాధ్ జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. అలాగే ఇప్పుడు- ఇక్కడ త్రినాధ్ కి ఆ కుర్రాడిలో నచ్చిన విషయం ఒకటుంది.... తనకు పాతికేండ్లు వచ్చినా తను శ్రమ విలువ గుర్తించలేక పోయాడు. తనకు జరిగిన అవమానమే తనని నిద్రలేపింది. 

    తన తల్లి పోషిస్తుంటే తను చదువు, సంధ్యా లేక సంపాదన లేక పాతికేండ్లు సోమరిగా తిరిగాడు. కానీ ఈ కుర్రాడు పదేండ్ల వయస్సుకే శ్రమ విలువను గుర్తించడమే కాక, బాధ్యతను కూడా గుర్తించాడు. అదే త్రినాధ్ ని అంతగా కదిలించింది. ఈనాడు కోట్లకు అధిపతి అయిన త్రినాధ్ లాంటి గొప్ప వ్యక్తి వూరు, పేరు లేని ఓ నిరుపేద కుర్రాడి తల్లికి శవ సంస్కారం చేయించడానికి రావడం కొంతమందికి పిచ్చిగా, వెర్రి చర్యగా అనిపించవచ్చు. తనకు నచ్చిన వ్యక్తిని అందలం ఎక్కించిన ప్రముఖులు చరిత్రలో ఎందరో వున్నారు.... ప్రతి ఆలోచనకు, ప్రతి చర్యకు, ప్రతి నిర్ణయానికి వెనుక భౌతికపరమైన ఆధారం- లాజిక్- రీజనింగ్ వుండక్కరలేదు.

    శవం పాడె మీదకు ఎక్కింది.

    కుర్రాడ్ని స్నానం చేయించి చిన్న అంగీ అంగవస్త్రంగా నడుముకు చుట్టి, నుదుటికి బొట్టుపెట్టి, చేతికి కుండ ఇచ్చారు బోస్ తో వచ్చినవారు.

    శవాన్ని పట్టేందుకు నలుగురు వ్యక్తులు పాడె దగ్గరకు వెళుతుండగానే త్రినాధ్ చటుక్కున ఒక వ్యక్తిని ఆపి తను ఓవేపు ఎత్తుకున్నాడు భుజానికి.

    బోస్, హిందూలే కాదు అప్పుడే అక్కడకు పోలీస్ బ్యాండ్ తో వచ్చిన రాఘవ కూడా షాక్ తిన్నాడు త్రినాధ్ చర్యకు.

    పోలీస్ బ్యాండ్ ఒక్కసారి అక్కడున్న నిశ్శబ్దాన్ని బద్దలు చేసింది.

    ఈసారి రాఘవ ఏర్పాటుకు బోస్, హిందూలతోపాటు త్రినాధ్ కూడా ఆశ్చర్యపోయాడు.

    ఊరేగింపు స్మశానంకేసి కదిలింది.


                                       *    *    *    *


    సరిగ్గా ఇదే సమయానికి వసుంధరాదేవి ముందు నించున్నాడు ఇంజనీర్.

    "చాలాకాలంగా దాస్తూ వస్తున్నాను- ఇక చెప్పక తప్పదనిపిస్తోంది" ఇంజనీర్ ముఖం సీరియస్ గా వుంది.

    వసుంధరాదేవి ఆశ్చర్యంగా చూసింది. "ప్రతి రాత్రి త్రినాధ్ చెడు తిరుగుళ్ళకి అలవాటుపడి కంపెనీ ప్రతిష్టను దిగాజార్చుతున్నాడు. ఈ విషయం అసహ్యంగా చెప్పుకుంటున్నారు."

    ఆమె మౌనంగా వుంది.

    "ఈరోజు ఒక అనాధ బాలుడి తల్లికి శవ సంస్కారం చేసే బాధ్యత నెత్తికెత్తుకున్నాడు. త్రినాధ్ కి తోడు బోస్, హిందూ...."

    అయినా ఆమె మాట్లాడలేదు.

    "ఉన్నట్టుండి జనరల్ హాస్పిటల్ కట్టించేందుకు ఆర్డర్స్ పాస్ చేశాడు. పేద ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తానంటూ కంకణం కట్టుకున్నాడు. ఎందరు చెప్పినా వినడం లేదు. ఏం, మనం పూటకు గతిలేక అల్లాడే రోజుల్లో ఎవరన్నా ముందుకొచ్చారా? ఎందుకీ దేశసేవ? బిజినెస్ మెన్ కి ఎంతసేపూ వ్యాపార గొడవలే వుండాలి గాని- ఈ ఎమోషనల్ ఫీలింగ్స్, సెంటిమెంట్స్ వుంటే తిరిగి పూర్వాశ్రమానికేగా వెళ్ళేది?"

    వసుంధరాదేవి అప్పటికీ నోరు విప్పలేదు.

    త్రినాధ్ అంటే నాకు ప్రేమల లేక కాదు ఇవన్నీ చెప్పేది- అతడు మాకు దైవంతో సమానం. కొండంత గౌరవం, అభిమానం. మా ప్రాణంలో ప్రాణమైన త్రినాధ్ దారితప్పి ప్రయాణిస్తుంటే హెచ్చరించవలసిన బాధ్యత మనకుంది గదా? పేదరికం, అవమానాల్ని భరించలేకే గదా పట్టుదలగా ఇంత ఎత్తులకు ఎదిగింది? తిరిగి అదే స్థాయికి వెళితే?"

    ఇంజనీర్ వసుంధరాదేవిని తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో కొంతవరకు కృతకృత్యుడు కాగలిగాడు.

    ఆమెకు తొలిసారి మరికొన్ని కొత్త విషయాలు తెలిసివచ్చాయి.

    "నేను చెబితే వింటాడా? వింటాడన్న నమ్మకం వున్నా, చెప్పే సాహసం నాకు లేదు. మీరే హెచ్చరించే ప్రయత్నం చేయకూడదూ?" వసుంధరాదేవి మెల్లగా అంది.

    ఇంజనీర్ మొహం ప్రసన్నంగా మారింది.

    "చాలు... మీరీ మాత్రం నిలబడితే నేనే త్రినాధ్ చర్యలకు అడ్డుకట్ట వేస్తాను. వస్తానండి" ఇంజనీర్ అక్కడినుంచి వేగంగా వెళ్ళిపోయాడు తన పథకానికి రూపం ఇచ్చేందుకు.


                                        *    *    *    *


    బోస్, హిందూ ఆఫీస్ రూమ్ లోకి ఎంటరయ్యాడు ఇంజనీర్ ఒకింత భయంగానే.

    త్రినాధ్ ఛాంబర్ ఫస్ట్ ఫ్లోర్ లో వుంటే- బోస్, హిందూల రూమ్ సెకండ్ ప్లోర్ లో వుంది. ఇంజనీర్ ని చూస్తూనే చిరునవ్వుతో పలకరించాడు ఫైల్స్ తిరగేస్తున్న బోస్.

    కొద్దిసేపు ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకున్నాక అసలు విషయంలోకి వచ్చాడు ఇంజనీర్.

    "ఎవరో పేద ప్రేజలు- అయితే మనకేమిటి బోస్- కోట్లాది రూపాయలు గుమ్మరించి ఉచితంగా హాస్పిటల్ కట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది?" ఇంజనీర్ మొండిగా అనేసాడు.

    బోస్ తల వంచుకుని వున్నాడు.

    అతని రియాక్షన్ ఏమిటన్నది ఇంజనీర్ కి తెల్సుకునే అవకాశం లేకపోయింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra