Home » Yandamuri veerendranath » లేడీస్ హాస్టల్

  

       ఆనందానికి పరాకాష్ట : దుఃఖానికి విరుగుడు కన్నీరు! అదికూడా అతడిని పరిహసిస్తున్నట్టు కళ్ళలోనే ఘనీభవించి బాధపెడుతోంది.
   
    ఏమిటి తను చేసిన తప్పు? ఆలోచిస్తూంటే దురదృష్టం తనమీద ఎంతటి విజయాన్ని సాధించిందో అర్ధమవుతోంది. లేకపోతే పెళ్ళి ఇంట్లోంచి అలాంటి పరిస్థితిలో తను లక్ష్మిని చూడడానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది?
   
    బలహీనత ఆవరించనే కూడదు. ఆవరించిందో జరజరా పాకి శరీరాన్నీ మనసునీ కూడా నిస్తేజం చేసేస్తుంది. రాయన్న రాయిలా కుర్చీలోనే బిగుసుకు పోయాడు. బయట ఆట సాగుతూనే వుంది. ఆ తర్వాత భారత జట్టు ఆటగాళ్ళు ఎక్కువసేపు నిలబడలేకపోయారు. రాయన్న తర్వాత వచ్చిన ఆటగాడు అజరుద్దీన్ కలసి ముప్పై పరుగులు సాధించడంతో జట్టు పరువు నిలబడింది. టీ సమయానికి నూట ఇరవై ఎనిమిది పరుగులకి అంత అవుట్ అయిపోయారు. ఆ తరువాత భారతజట్టు ఫీల్డ్ లోకి దిగింది.
   
    రాయన్న కూడా ఫీల్డ్ లోకి రాక తప్పలేదు. ఆ ప్రదేశాన్ని వదిలి పారిపోవాలని వుంది. కాని ఏమీ చెయ్యలేని నిస్సహాయత.
   
    పాకిస్తాన్ జట్టు మొదటినించే బాగా విజ్రుంభించింది. అయిదు ఓవర్లకి పద్దెనిమిది పరుగులి చేశారు. రాయన్నను ఉత్సాహపరచడానికన్నట్లు అజరుద్దీన్ అతడిని బౌలింగ్ చేయమన్నాడు. భయం భయంగానే రాయన్న వేసిన మొదటి బంతిని బ్యాట్స్ మన్ ఫోర్ కొట్టాడు. మళ్ళీ స్టేడియంలో అరుపులు, కూతలు ఆ ఒక్క ఓవర్ లోనే రాయన్న పది పరుగులిచ్చాడు. అతడిలో ఏ మాత్రం ధైర్యం మిగిలివున్నా అదీ సడలిపోయింది.
   
    'లాంగ్ ఆన్'లో నిలబడ్డ అతడిమీద అరటి తొక్కలు, టమోటాలతోపాటు విసుర్లు, పరిహాసాలు కూడా వచ్చి పడుతున్నాయి.
   
    మనిషిని మాటలతో, చేతలతో హింసించి ఆనందించే శాడిజం పక్క మనిషిలోనే వుండడం మానవజాతికి దేవుడిచ్చిన శాపం.
   
    ఆ రోజు ఆట ముగిసే సమయానికి రాయన్న ముఖంలో జీవం పూర్తిగా హరించుకుపోయింది. అయితే అంతకు మించిన అవమానానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయనీ, మర్నాడు ఆట మొదలయ్యే సమయానికి ప్రారంభం అవుతాయనీ అతడికి తెలిస్తే ఆ రాత్రే అతడు ఆత్మహత్య చేసుకునేవాడు.
   
                                 *    *    *
   
    విజయకుమార్ కి చాలా సంతోషంగా వుంది. అంతా తను అనుకున్నట్టుగానే జరుగుతోంది. మొదటిరోజున ఆటతో రాయన్న అవకాశాలు దాదాపు హరించుకుపోయాయి. మర్నాడు అతడు చిత్తుగా ఓడి కూలిపోకతప్పదు. ఆ తర్వాత తన ఆట గొప్పగా లేకపోయినా టీమ్ లో తనే సెలక్టవడం ఖాయం.
   
    ఢిల్లీలోని ఓ పెద్ద హోటల్లో అతడు రాఘవరెడ్డితో కలసి పార్టీ చేసుకున్నాడు.
   
    "మొత్తానికి అసాధ్యుడవయ్యా గొప్ప రాజకీయపు బుర్ర నీది" అంటూ పొగిడాడు రాఘవరెడ్డి.
   
    "అంతేమరి! శతకోటి దారిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నారు. రాయన్న ఎంత సిన్సిటివో నాకు తెలుసు. అలాంటివాడు ఇలాంటి దెబ్బతట్టుకోలేడు."
   
    "హైదరాబాద్ నించి హాస్టల్ అమ్మాయిలు కూడా వచ్చారని పేపర్లో చదివాను నిజమేనా? అదెలా మేనేజ్ చేశావు?"
   
    "ఆ రమణి తన గ్యాంగు అందరినీ వెంటబెట్టుకు వచ్చినట్లుంది. ఇది నా పనికాదు, రాజారావుగాడిపని అక్కడ చెయ్యలేని పని ఇక్క్దయినా చేసి చూపించాలని తాపత్రాయ పడుతున్నట్లున్నాడు."
   
    "అతడికేం లాభం?"
   
    "లాభమేం లేదు. ఈ కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోనని భయం! రాయన్నకీ ఆ పిల్లకీ స్నేహం కలిపినవాళ్ళు ఈ రాజారావు, రమణిలే. తమమీద అనుమానాలు రాకూడదని ఏదేదో చేస్తున్నారు. ఈ రకంగా ఢిల్లీ చూసి, నాలుగురోజులు ఎంజాయ్ చేయవచ్చని రమణి స్నేహితురాళ్ళు వచ్చుంటారు. ఫైనాన్స్ అంతా రాజరావుదే. ఇలాంటివన్నీ వాడికి సరదాలు.'
   
    "ఏమయినా కానీ ఇది మనకు లాభిస్తోంది. నీ పేరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా చూసుకో అదే మనకు కావలసింది" హెచ్చరించాడు రాఘవరెడ్డి.
   
    "ఆ విషయంలో ఎలాంటి భయంలేదు. చెయ్యవలసిన వాళ్ళు చేసే విధంగా నేను వెనుకనుండి చేయిస్తున్నాను" దర్పంగా అన్నాడు విజయకుమార్. "నువ్వు చెయ్యలేనిదాన్ని నేను మరోలా సాధించాను చూడు" అన్న గొప్పతనం ఆ మాటల్లో వుంది. దీనికోసం అతడు యాభై వేలదాకా ఖర్చుపెట్టాడు. దానికి తగిన ఫలితం కనుపిస్తుందని నమ్మకం కుదిరింది. రాబోయే రోజుల్నీ, భారత్ టీమ్ లో తన స్థానాన్నీ తలుచుకుని పొంగిపోతున్నాడు విజయకుమార్.
   
    సరిగ్గా అదే సమయానికి- తనకు తెలియని శత్రువుని ఎదుర్కొనే ధైర్యాన్ని రాయన్న కివ్వడానికి కిరణ్మయి ఢిల్లీ చేరే దారిలో వుంది.
   
                                  *    *    *
   
    రెండో రోజు ఆట మొదలవబోతోంది. ఫీల్డ్ లోకి వెళ్ళే సమయం దగ్గరపడింది. ప్లేయర్సందరూ హడావుడిగా తమ తమ పనుల్లో మునిగిపోయున్నారు. కెప్టెన్ అజారుద్దీన్ ఆ రోజు ఆటలో వ్యూహం గురించి వివరిస్తున్నాడు. ఇది టెస్ట్ మ్యాచ్ కాకపోయినా ఆరంభంలోనే చిత్తుగా ఓడిపోతే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జనం మొదట్లోనే చప్పబడిపోతారు. కాబట్టి ఈ ఆట ఓడిపోకుండా డ్రాగానైనా మార్చాలంటే ఈ పూట ఆటలోనే అది సాధ్యపడాలి.
   
    రాయన్న చెవులకి ఇదేమీ ఎక్కడం లేదు. ఆ రోజు ప్రొద్దున్న స్టేడియంకు రాకముందే అతడికి ఈ విషయం తెలిసింది. దాదాపు అయిదు వందలమంది ఢిల్లీ కాలేజీ విద్యార్ధినులు తనను ఆటలోంచి తొలగించమని స్టేడియం బయట ధర్నా చేయబోతున్నారు!!!
   
    'అమాయకురాలైన ఓ కన్యను రేప్ చేసి, అంతటితో తృప్తిపడక అమానుషంగా చంపిన హంతకుడికి, దేశానికీ ప్రాతినిధ్యం వహించే అర్హత ఎక్కడుం'దని నినాదాలు చేస్తున్నారు. ప్రేక్షకులకి లోపలి ఆటకన్నా బయటి వ్యవహారం ఉత్సాహంగా వుంది.
   
    రాయన్నకి సింకింగ్ ఫీలింగ్ కలుగుతోంది.
   
    ఇన్ని వేలమంది దృష్టిమీద!!!
   
    ఆటగాళ్ళందరూ ఒక్కరొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. రాయన్న మాత్రం కదల్లేదు. రాయన్న మాత్రం కదల్లేదు. కెప్టెన్ అతడివైపు దృష్టి సారించి చూసి ఏమీ అనలేక బయటకు వెళ్ళిపోయాడు. చాలసేపు అతను అలాగే వున్నాడు - ఒంటరిగా! అంతలో అతడి భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది.
   
    "నేను రాలేను ప్లీజ్. నన్ను వదిలెయ్యండి" అన్నాడు తలెత్తకుండానే.
   
    "నువ్వు వెళ్ళకపోతే నేనెలా వూరుకుంటాను రాయన్న. నువ్వు ఆడితీరాలి. నా సిస్టర్ బాధపడకుండా వుండడానికయినా నువ్వు ఆడాలి" అన్న స్వరం! స్నేహితుడి స్వరం వినగానే రాయన్న చివుక్కున తలెత్తాడు. స్నేహితుడి వెనకే నిలబడివుంది కిరణ్మయి. ఊహించని ఆ అద్భుతానికి ఒక్కక్షణం పాటు రాయన్న కళ్ళు ఆనందంతో మెరిసి అంతలోనే ముకుళించుకుపోయాయి.
   
    "ఓడిపోయాను కిరణ్మయీ. నువ్వు పెట్టిన పరీక్షలోకూడా చిత్తుగా ఓడిపోయాను. ఇలా ఓడిపోతానని తెలిసికూడా, నీ మాట కాదనలేక ముందుకు వచ్చాను. దానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాను" అన్నాడు గద్గద స్వరంతో, తలవంచుకుని.
   
    "ఓడిపోయాను అనుకోవడమే పిరికి లక్షణం! అసలు ఓటమి అంటే ఏమిటి? అవతలి బలానికి, ధాటికి తట్టుకోలేక చిత్తయి పోవడమే ఓటమి! పరీక్షకు పిలుపు వచ్చినప్పుడు ఇక్కడనించి కదలకుండానే ఓడిపోయాననుకోవడం హాస్యాస్పదం. ఇది ఓటమి కాదు, పలాయనం."
   
    "దానికి ఏ పేరైనా పెట్టు ఆ బయట నిలబడి నా మీద ఆరోపణలతో నినాదాలు చేస్తున్న అంతమంది స్వరం ముందు "నేను నిరపరాధిని" అని అరిచినా నా ఒక్కడి స్వరం ఎంత బలహీనమవుతుందో వూహించు."
   
    "ఆ బయట నిలబడ్డ వందలాది అమ్మాయిల్లో ఏ ఒక్కరికైనా మీతో సన్నిహిత పరిచయం వుందా? మీరు ఎలాంటివారో వాళ్ళలో ఎవరికైనా తెలుసా? మీరు చేసిన నేరాన్ని ఏ ఒక్కరైనా ధైర్యంగా వచ్చి సోదాహరణంగా నిరూపించగలరా? ఆవేశానికి లోబడి నిజానిజాలు తెలియకుండా చేస్తున్న ఆరోపణలు నాలుగు దిక్కిలా ప్రతిధ్వనించినా అందులో స్వర తీవ్రతే తప్ప ఆత్మశుద్దత కనిపిస్తుందా?" అంది కిరణ్మయి.
   
    "ప్రజలకు వినిపించేది ఆ స్వరాలే కిరణ్మయీ."
   
    "నిజమే అందుకే ధైర్యంగా వెళ్ళి ఆ పరీక్షను ఎదుర్కోమంటున్నాను. ఈ ప్రజల సంగతి ఒక్కసారి ఆలోచించండి. విడదీసి ఒక్కొక్కరిని మాట్లాడమనండి. ఒకరో, ఇద్దరోతప్ప మిగతావాళ్ళు నోరువిప్పరు. పదిమందితో కలసి ఎవరి స్వరమో తెలియకుండా అరవడమే వాళ్ళకు తెలుసు. వీళ్ళ ఆవేశం, ఆలోచన గుండెలోతుల్లోంచి వచ్చేవి కావు. కాబట్టి మీరు నోటితో వాళ్ళకు జవాబులివ్వాల్సిన అవసరంలేదు. మీ ఆటద్వారా ఇవ్వండి. నేరారోపణ చేసిన ఈ నోళ్ళే మీరు విజయం సాధిస్తే జయజయ ద్వానాలు పలుకుతాయి."
   
    "నీకున్న ఆత్మవిశ్వాసం, ధైర్యం నాకు లేవనుకుంటాను కిరణ్."
   
    "అనుకుంటాను' అని తప్ప 'లేదు' అని గట్టిగా చెప్పలేకపోవడంలోనే మీ అంతరంగం తెలుస్తోంది - వాళ్ళను జయించాలని, వాళ్ళ నోళ్ళు మూయించాలని పట్టుదల మీలో వుంది కని సంకోచం మిమ్మల్ని బలహీనపరుస్తోంది. ఒక్క మాట చెప్తాను. మీరు నిజంగా నేరం చేసివుంటే ఈ గదిలోంచి కదలొద్దు. అప్పుడు నా స్వరం కూడా బయటివాళ్ళ నినాదాలతో కలుస్తుంది. నేరం చేయలేదంటే ఆ వినిపించే అపనిందలను ఒక ఛాలెంజ్ లా తీసుకుని అదే ఒక యుద్దమనుకుని మీ నిజాయితీ నిరూపించబడేటట్లుగా ధైర్యంగా వెళ్ళి ఆడండి. ఆటలో మీ విజయం ద్వారా మీ నిర్దోషిత్వం నిరూపించబడాలి. ఇంతకంటే నేను చెప్పాల్సిందేమీ లేదు" కిరణ్మయి గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra