Home » Kommanapalli ganapathi rao » అసావేరి

    నిజానికి శంకూ వాళ్ళని గమనించలేదు. కానీ అప్పటికే శంకూ టేబుల్ చుట్టూ కూర్చున్నారు.
   
    ఇప్పుడేం జరుగుతుందో వూహించలేక గుటక వేయకుండా అందరి వేపూ చూశాడు.
   
    "కంగారుపడకు శంకూ....పాపం ఆకలేస్తున్నట్టుందిగా....తిను.....డబ్బుల్లేకపోతే చెప్పు.....నేను సర్దుతాను...." రవి అన్నాడు ఆత్మీయంగా.
   
    ఆ ఆప్యాయత సైతం అతను వూహించలేనిదే.
   
    లేవబోయిన శంకూని కూర్చోబెట్టి రవి బృందమంతా టిఫిన్ కి ఆర్డరిచ్చారు.
   
    అరగంటసేపు ఒక్కరూ కామెంట్ చేయకుండా తెచ్చింది తినేసి అంతా లేచారు.
   
    "థాంక్యూ శంకర్....." రవి అన్నాడు. "నిన్న నువ్వు పోరాడిన తీరుకి, నీ పట్టుదలకీ నేను అభినందించకుండా వుండలేకపోతున్నాను. నీ గెలుపు సందర్భంగా నువ్విచ్చిన ఈ పార్టీకి మా జోహార్లు...."
   
    శంకూ ఆందోళనగా చూశాడు.
   
    అతనేదో అనబోతుండగానే కౌంటర్ ని చేరుకున్న రవి 'గూండా'లా కనిపిస్తున్న హోటల్ యజమానితో అన్నాడు "చూడు సందీప్.....అక్కడ టేబుల్ దగ్గర కూర్చున్నాడే శంకూ అని....చాలా మంచి ఫైటర్! చూడటానికి అమాయకంగా వుంటాడు కాని గట్టిపిండం.....కొత్తగా ఇంటర్ లో చేరాడులే! వద్దు మాకు పార్టీ ఎందుకు అంటే బలవంతంగా అరవై రూపాయలు బిల్లు చేయించాడు డబ్బులడిగితే నీ బుర్ర రామకీర్తన పాడిస్తానంటున్నాడు. ఎలా వసూలు చేసుకుంటావో ఏమో...."
   
    సిటీ యువసేనలో ఏక్టివ్ మెంబర్ అయిన హోటల్ ఓనర్ సందీప్ రోషంగా పైకి లేచాడు.
   
    ఇక జరగబోయేదేమిటో తెలిసిన రవి తన బృందంతో బయట ఆవరణలో నిలబడి చూస్తుండగానే సందీప్ సరాసరి వెళ్ళి శంకూని డబ్బుల కోసం నిలదీశాడు.
   
    "లేదు....నా దగ్గర అన్ని డబ్బుల్లేవు."
   
    "మరి అందరికీ పార్టీ ఎలా యిచ్చావు?" అతను చెప్పింది వినిపించుకోకుండా కాలర్ పట్టుకున్నాడు. "పైగా నేను ఎలా వసూలు చేస్తానో చూస్తానని సవాలు చేస్తావా? నేనెవరో...." నగరంలో తనకున్న ప్రశస్తి గురించి చెబుతూనే టేబుల్ ముందు నుంచి బలంగా ఈడ్చాడు.
   
    "ప్లీజ్! నాకేం తెలీదు."
   
    అక్కడ హోటల్లో కస్టమర్లంతా ఖర్చులేని వినోదాన్ని చూస్తుంటే శంకూ నిస్సహాయతపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధిస్తున్న సందీప్ ఇక తృటిలో వంట గదిలోకి లాక్కుపోయి బట్టలిప్పించేసేవాడే....
   
    సరిగ్గా అప్పుడు లోపలి వచ్చింది సావేరి. "ప్లీజ్ స్టాపిట్."
   
    ఆమె పెదవులు రోషంతో అదురుతున్నాయి.
   
    అంతా ఉత్కంఠగా చూస్తుంటే ఆమె ఎవరో తెలిసిన సందీప్ "అదికాదు, మీ అన్నయ్య రవితో వీడు ఛాలెంజ్ చేశాడట....ఇంత గొప్ప ఫైటర్ నైన నా దగ్గరనుంచి డబ్బులు ఓనర్ ఎలా వసూలు చేస్తారో చూస్తానని...." చెప్పాడు వివరంగా.
   
    నవ్వేసింది బాధని దిగమింగుకుంటూ "నిజమే....మంచి ఫైటర్ కాబట్టే మా అన్నయ్య మొహం పచ్చడి చేసినవాడు మీ దగ్గర ఓడిపోయాడు."
   
    సందీప్ ఆవేశం చల్లారిపోయింది.
   
    "అయితే మా అన్నయ్యతో నేను వేసిన పందెం మరోటుంది. అది..." ఓ క్షణం శంకూ వైపు సాలోచనగా చూసింది. "శంకూ కాలర్ పట్టుకుని అదుపులోకి తీసుకున్న మొనగాడికి ఈ రిస్ట్ వాచీని ప్రజంట్ చేస్తానన్నాను. కారణమేమన్నాగాని మీరా పని చేయగలిగారు కాబట్టి ఈ రిస్ట్ వాచీ తీసుకోండి. దీని ధర అయిదొందలనుకుంటాను. సో....ఇక మీరు టిఫిన్ బిల్లు అతడ్ని అడగడం మానేసి దీన్ని బహుమతిగా తీసుకుంటారనుకుంటాను."
   
    ఓ అందమైన అమ్మాయి అందులో తన అహంకారాన్ని చల్లార్చి అప్పళంగా అంత ఖరీదయిన 'వాచ్'ని ఇస్తుంటే ఆనందంగా తీసుకొని శంకూని విడిచిపెట్టాడు.
   
    అక్కడ దూరంగా నిలబడ్డ రవికి తల తీసినంత పనైంది.
   
    "ఏంటి నువ్వు చేసింది?" కోపాన్ని అదిమిపెడుతూ అడిగాడు బయటికి వెళుతున్న సావేరిని.
   
    "టిట్ ఫర్ టేట్" టక్కున జవాబు చెప్పింది. "నలుగురిలో ఓ అమాయకుడి మీద నువ్వు తెలివితక్కువగా ప్రతాపం చూపిస్తే ఆ ప్రతాపానికి నువ్విచ్చిన వాచ్ ని ఖరీదుగా చెల్లించాను."
   
    సావేరిని ఓ మూలకి లాక్కుపోయాడు రవి ఆవేశంగా. "శంకూ ఎవరని?"
   
    "ఎవరని నువ్వు ద్వేషిస్తున్నావో అది చెప్పు."
   
    "మగాళ్ళం మాకేవో గొడవలుంటాయి...."
   
    "ఆడపిల్లని నాకూ ఏవో ఆలోచనలుంటాయి."
   
    చెల్లెలు ఎంత మొండిఘటమో తెలుసు కాని ఇలా బరితెగిస్తుందని అనుకోలేకపోయాడు. "నాన్నగారికి తెలిస్తే...."
   
    "ముందు నువ్వు చేసిన తప్పునీ తెలుసుకుంటారు. ఆ తర్వాతే నా విషయం అడుగుతారు" కొద్దిగా తమాయించుకుంది. "అయినా నేనేం తప్పు చేయలేదే ఏదో పరిచయం వుంది కాబట్టి పైగా అమాయకుడు కాబట్టి ఇలా ఇంట్రస్ట్ తీసుకున్నాను. కావాలంటే ఇక్కడ జరిగిందంతా డాడీకి నేనే చెప్పేస్తా సరేనా?"
   
    "వద్దు...." తొట్రుపాటుగా అన్నాడు.
   
    ఇది తన స్తహయిలో పరిష్కరించాలనుకుంటున్న విషయం అసలిదో పెద్ద సమస్యగా రవి భావించడంలేదు. అలాంటి తండ్రికి పుట్టిన తను ఇలాంటి స్వల్ప విషయాలు ఆయన దృష్టికి తెచ్చి అసమర్ధుడు కాలేడు.
   
    ప్రతి కథకి ఓ ముగింపు వుంటుంది. కానీ ముగించాలనుకునే ప్రేమ కథ విషయంలో మాత్రం రాసే ప్రతి చివరి పుటా ఇంకో సమస్యకి ప్రారంభమవుతుంది. కారణం నిజమైన ప్రేమ రాలిపడటానికి ఉల్కకాదు. యుగాల తరబడి వెలిగే నక్షత్రం.
   
    అదే రవికి తెలీని విషయం.
   
                                           *    *    *    *    *
   
    తన కిరణాలను మరో కావ్యసృష్టికి కలలుగా వాడిన సూర్యుడు ఆ రోజు ఇక రాసింది చాలన్నట్టుగా పశ్చిమాద్రిన బడలికగా విశ్రమిస్తున్నాడు.
   
    శారదానడి ఇసుక తిన్నెలనానుకుని వున్న మామిడితోపు యిప్పుడే మొదలయిన ప్రేమకథకి కొత్తగా కట్టిన కుటీరంలా వుంది.
   
    ఓ పొదమాటున చెట్టునానుకుని కూర్చున్న శంకూ సన్నగా ప్రకంపించడం ఎదురుగా వున్న సావేరి గమనించింది.
   
    సావేరికీ కంగారుగానే వుంది. ఈ సాహసానికి ఎంత ధర చెల్లించాల్సి వచ్చేదీ తెలీని తొందరపాటో, అదీ కానినాడు తన మాట దక్కించుకున్నందుకు గర్వమోకానీ గడ్డిలో కూర్చుని మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి ఓరకంట అతడ్ని చూసే ప్రయత్నం చేస్తూంది తప్ప ఆమెకి గొంతు పెగలడంలేదు.
   
    మంగ దూరంగా ఒడ్డునానుకొని వున్న ఇసుకలో నిలబడి ఇద్దర్నీ మాత్రమే పరికించడంలేదు ఇక్కడ శంకూని కలుసుకోవాలని చెప్పకుండా తోడు రమ్మని బలవంతం చేసిన సావేరి మొండిధైర్యానికి అటూ ఇటూ దిక్కులు చూస్తూంది.
   
    అక్కడ సంజెవెలుగులో గాలి గడ్డకట్టుకుపోతూంది.
   
    "చాలు....ఆపేయ్...." అప్పటికే రెండు చదరపు మీటర్ల వైశాల్యం గడ్డి పీకేసిన శంకూ టక్కున చేయి వెనక్కి లాక్కున్నాడు సావేరి అల్లరిగా నవ్వుతుంటే.
   
    "చెప్పేసేదా?" నెమ్మదిగా అన్నాడు.
   
    "ఏమిటీ....గడ్డిపీకే టెక్నిక్ గురించా...."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra