Home » Gullapalli sundaramma » Athani Lakshyam


    'ఫరవాలే దత్తయ్యా . ఎన్నెన్నో కొత్త కొత్త వైద్య పద్ధతుల్ని కనిపెడుతున్న ఈ రోజుల్లో మీరిలా భయపడ్డం లో అర్ధమే లేదు. అందులోనూ బావ స్వయంగా నన్ను చూసుకుంటూన్నప్పుడు ఇంకా మీకీ పిరికితనం ఎందుకూ. స్తిమితపడండత్తయయా, మీరు మనస్పూర్తిగా నన్నాశీర్వదించి పంపితే తప్పకుండా జయం లభిస్తుంది' అంది చేతుల్జోడిస్తూ సుధ.
    'నా తల్లివి కదే. నీ మంచి బుద్దికి ఆ లలితాంబ సర్వదా , నీకు మేలే చేకూరుస్తుందమ్మా , వస్తా' అంటూ సుధ తలని ప్రేమతో వోసారి నిమిరి చాటుగా చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయారావిడ.
    'పిచ్చత్తయ్యా ఎప్పుడో జరగబోయే వైద్యాన్ని గురించి ఇప్పట్నుంచే ఎందుకో ఈ బెంగ. అనుకుంది సుధ. అయినా ఎందువల్లనో తనకే అర్ధం కాని దిగులేదో తనలోనూ తరచూ మెదుల్తూనే వుంది. అయినా బావ అభిలాష ని కాదనే ధైర్యమూ ఇష్టమూ ఎప్పుడూ లేదు సుదకి. ఒకవేళ తనేమన్నా అయిపోయిందంటే అప్పుడు?' ఇలాంటి అలోచనలు నీడల్లా సుదనీ అప్పుడప్పుడూ వేధించక పోలేదు. అయినా బావ కోసరం తను ఏం చేయాలన్నా సుధ కేవిధమైన అభ్యంతరమూ ఎప్పుడూ లేదు. వుండదు కూడా.
    బొంబాయి వెళ్లేందుకు ముందుగా 'బిజినెస్' విషయంగా వోసారి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది రఘు.
    అక్కడున్న నాలుగు రోజుల్లోనూ 'రాధ ఇంటివారేవరి కంటా పడకుండా ఎలా బయట పడగలనా?' అనుకుని భయపడుతున్న రఘు అక్కడికి వెళ్లిన్నాటి సాయంత్రమే దత్తు గారు కాళ్ళబడి పోవడం జరిగి నందున , తప్పనిసరిగా ఆయనతో కలిసి వారింటికి వెళ్ళవలసోచ్చింది.
    అనుకోకుండా రఘు వారింటికి రావడం తో రాజమ్మ గారు ఆనందాని కిక మేరె లేకపోయింది.
    ఎక్కడ దిగాడో, ఎన్నాళ్ళువుంటాడో మొదలైన వివరాలన్నీ కనుక్కున్నాక... 'ఏవండీ? హోటల్లో అతన్ని చూసినప్పుడు వెంటనే అ గది ఖాళీ చేయించేసి అ సామానేవో కూడా తీసుకోచ్చేయ్యికుండా ఏవిటండీ. మీ పన్లూ మీరూనూ, ఇప్పుడన్నా వెళ్లి తేండి.' అంటూ భర్తని గౌరవంగా మందలించిందావిడ.
    'దానికేం అతన్నిక్కడే వుంచి నే వెళ్ళొస్తా.' అన్నారు రూము తాళం ఇమ్మన్నట్టు గా చేయి చాస్తూ దత్తు గారు.
    'అబ్బే వద్దండి. నేనొచ్చిన పనికి అక్కడుంటేనే నాకు వీలుగా వుంటుంది.' అన్నాడు తనూ లేస్తూ రఘు.
    'అదేమిటి బాబూ! మరి ముందో; వెనకో బంధువులు కావలసిన వాళ్ళం కదా! అయినా మేమ్మీ ఊరొచ్చినప్పుడు తిన్నగా మీ ఇంట్లోనే దిగలేదూ? అన్నారు ఫలహారం పళ్ళాల్నీ అయ్యరు చేత బల్ల మీద పెట్టిస్తూ ' రాజమ్మ గారు.
    'అలా వీలుగా వచ్చినప్పుడు నేనూ తప్పకుండా ఇక్కడే దిగుతా లెండి. ఈసారికి క్షమించండి.' అంటూ సర్ది చెప్పి టిఫిన్ తీసుకున్నాక కాస్సేపామాటా ఈ మాటా, మాట్లాడేసి బయల్దేరాడు రఘు. రఘుని దిగబెట్టడాని కని బయల్దేరుతూ ఏదో పనిగా లోపలి కెళ్ళిన దత్తు గార్ని చాటుగా నాలుగూ పెట్టి 'ఈ పైనన్నా సరిగ్గా ప్రవర్తించండి.' అంటూ, ఆ విధానాన్ని భోధపరిచి మరీ పంపిందావిడ.
    కార్లో తన పక్కనే కూర్చున్న రఘుతో అ మాటా, ఈ మాటా మాట్లాడి రాధ పెళ్ళి మాటల్లోకి తెచ్చి 'అన్నట్టు నువ్వేం చెయ్యదల్చావ్ ?' అన్నారు ఏదో సందర్భానుసారంగా అప్పుడే గుర్తొచ్చినట్టుగా నటిస్తూ దత్తు గారు.
    'అంతకన్నా విధాయకమైన పనులెన్నో ఇంకా వున్నాయండీ నాకూ!' అన్నాడు అయన ధోరణి ని కనిపెట్టిన రఘు.
    'దానికేం! అవన్నీ మహారాజులా చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే విద్యావ్యాప్తి కట్టే పోతున్నదనుకోవడం ఆ రోజుల్లో నోయి? ఇక ఇప్పుడా మొగవారి తో సరి సమానంగా ఆడవారూ బాగా చదువు, సంస్కృతిల్ని అలవరచు కోవడం వల్ల, ఆ చేసుకున్న భర్త ఆశయాలకు వారూ చేదోడు వాదోడుగా వుండి వారి పని సుళువు చేస్తున్నారు నేటి భార్యలు.' అన్నారు విపులంగా బోధిస్తూ.
    'అలాగా వుండొచ్చు, లేక ఆవిడ ఆశయాల కనుగున్యంగా అతడ్నే మారవలసింది గా నిర్భంధించే వారు గానూ వుండొచ్చు. ఎందుకంటె ఎప్పుడైతే ఆవిడా చదువు కున్నదయిందో , అప్పుడే ఆవిడకీ కొన్ని ప్రత్యెక అభిలాషలుండోచ్చును గాని,'
    'వారి విద్యా విధానం చెరొక విధమైనదీ గనక అయితే నువ్వన్నట్టు తప్పకుండా అభిప్రాయ బేధాలు కలగచ్చు. అయితే ఒకే లైనులో విద్య నభ్యసించే వారిలో ఇటువంటి తేడా రావడాని కేవిధమైన అవకాశమూ, ఉండదుగా.....అన్నారు. రాధని నువ్వు చేసుకోవడం లో అభ్యంతరం వుండకూడదు సుమా, అని ప్రత్యక్షంగా చెప్పడమే తరవాయి గా అయన.
    'అదృష్టం బాగుండి అలా నడుచు కోగల్గితే ఏమో గాని, లేకపోతె భిన్నాశయాలు గల ఆ ఇద్దరికీ కల్గనుండే ఇబ్బందుల్ని ఊహించు కుందుక్కూడా శక్యం కానివి' అన్నాడు నిర్మొహమాటంగా రఘు.
    ఆవలిస్తే పేగులు లెక్క పెట్ట గల్గె దత్తు గారు రఘు మాటల్లోని భావాన్ని అర్ధం చేసుకోక పోలేదు. ఏం? రాధ స్వభావ ఎటువంటిదో అయన మాత్రం ఎరగకనా? అయినా ఏదో తాపత్రయం! అంతే.
    'అదీ నిజమేనోయి. అసలీ పెళ్లన్నది , జీవితమంతా దాని మీద అధారపడవలసున్న ఒక ముఖ్య ఘట్టమాయే. అలాంటప్పుడు అన్ని విధాలా బాగా ఒకసారికి నాలుగు సార్లు ఆలోచించుకాకపోతే ఇబ్బంది కాదూ మరీ; అందులోనూ కొంత మందున్నారు చూశావ్, ఏ కావలసిన పిల్లలనో, ఏ ఆస్తి కోసరమనో, అలా, ఇలా ఆయమాయ గారడీ చేసేసి మెడలు వంచి నిర్భంధంగా ముడి పెట్టేస్తూ వుంటారు. అలాంటివన్నీ చాలా ప్రమాదమైన పనులని నా అభిప్రాయం. ఏమంటావా? ఏదో; ఏ గుద్దో, ఏ తిండో ఏ మిగతా సామాన్లో వగైరాలో అయినట్ట యితే 'పొతే పోన్లే! మరో మాటు మన కిష్టమైనది అమర్చు కుందాం' అనుకోవచ్చు. మరి ఈ పెళ్లన్నది అలాగా చెప్పు? జీవితాంతం వరకూ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ ఎంతో ఆనందం గానూ, సుఖంగానూ గడపాల్సిన భవిష్యత్తు. ఈ అవకతవక పెళ్లిళ్ళతో జీవితం చవీ, సారం , లేక నిరుత్సాహ మై ఊర్కుంటుంది. అందుకే, మన అభిప్రాయాల్ని, చుట్టరికాల్ని, మరో విధంగా చూసుకోవచ్చును కానీ, ఆ వంక పెట్టి పెద్ద వాళ్లిటువంటి విషయాల్లో మాత్రం ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు. అలా తెలివి తక్కువ తనంగా వారొక వేళ కల్పించుకున్నా ఆ ఫలితాన్ని అనుభవించాల్సు న్న కుర్రాళ్ళన్నా ఈపద్దతిని నిర్బయంగా ఖండించెయ్యాలి. లేకపోతె దేశం బాగుపడదు' అన్నారు అక్కడికి ప్రజా క్షేమం కోరే పెద్ద మనిషి లాగ.
    పాపం 'ఏదో విధంగా ఈ పని జయప్రదం చేసి భార్య అధికారాల్నుంచీ తప్పుకోవాలీ' అన్న దృష్టి ఒక్కటే ముఖ్యంగా వుంచుకుని అందుకనుగుణంగా మాట్లాడుకుంటూ పోయారే గానీ అందులోని స్వలాభభావం ఎంత నగ్నంగా ఎదుటి వారికి విపులంగా బోధపడి పోతుందో, అన్న ఆలోచనే ఆయనకి తోచలేదు.  
    అయితే అయన ఏ అభిప్తాయంతో ఎవర్ని గురించి అంటున్నారో అన్నది బాగా అర్ధం చేసుకున్న రఘు, ఈయన స్వబుద్దీ, స్వాభిమానం , అంటే ఏమిటో ఎరగని భార్య చేతుల్లోని వో యంత్రంవంటి వాడు. అనుకుని తనలో తను నవ్వుకున్నాడు. అందులోనూ నిజం లేకపోలేదు. రాజమ్మ గారెప్పుడూ అందరి తోటి ఏకరువు పెడుతూన్నట్టుగా ఇదంతా ఆవిడ అదృష్టం కొద్దీ వచ్చిన అదృష్టమే నన్న నమ్మకం కాగా మనసుకు పట్టిపోయిన దత్తు గారు మొదట్నుంచీ తన యిష్టా యిష్టాలతో ఏ మాత్రమూ నిమిత్తం లేకుండా ఆవిడ చెప్పినట్టూ ఆవిడ చేత యంత్రం లాగే నడుచుకు పోతున్నారు. అందుకే పనిలో పనిగా ఈయనకో చిన్న పాఠం బోధించి ఇక మీద నన్నా ఇటువంటి ఇంగితం లేని పన్లు చెయ్యకుండా చూడాలన్న వో అభిప్రాయం కల్గింది రఘుకి.
    'అయితే అదెలా ప్రారంభించడం?'
    'ఏమోయి? నేనన్నది . న్యాయమే నంటావా?' అంటూ ఆయనే మళ్లీ హెచ్చరించారు. తన బోధన ఎంతవరకు పని చేసిందో నన్నది తెల్సుకునే ఉద్దేశంగా.
    'క్షమించాలి. ఈ విషయం లో మీతో నేనేకీభావించ లేను. ఏవంటారా? ఈ ఆనందం సుఖం ఇవన్నీ వారి వారి మనస్తత్వాల మీద ఆధార పడుంటుంది. భక్తుడు తన ఇష్ట దైవాన్ని పూజించడం లో ఆనందిస్తే గాయకుడు తన సంగీతం లో గొప్ప సుఖాన్ని పొందుతాడు. అలాగే వారి వారి అభిరుచుల్ని బట్టి అవి సక్రమంగా సాగించ గల్గడం లో ప్రతి వారూ ఆనందాన్ని పొందగల్గుతారే గానీ అందరికీ అందం లో ఆనందం స్వార్ధం లోనే సుఖం అనుకుందుకు వీల్లేదు.
    అందులోనూ ఏకంగా చంద్ర మండలాన్నే చేరుకోవాలని ప్రయత్నించే ప్రయత్నానికి ప్రయోజకత్వం చూపుతూ ముందుకు పరుగులెత్తుతున్న ఈ కాలంలో స్వసుఖాల్లో ఆనందం వుందనుకునేవారు విద్యావంతుల్లో ఏ కొద్ది మందో మాత్రమే నని నా అభిప్రాయం' అన్నాడు అయన చెప్పిన దాన్నంత ఖండిస్తూ రఘు.
    ఇంతలో రఘు దిగిన హోటల్ రావడంతో తరుచూ రావలసిందిగా మరీ మరీ చెప్పి వెనక్కి మళ్ళారాయన. అతని మనో నిబ్బరానికి మనసారా అభినందిస్తూ.
    'వాళ్ళ అభుప్రాయాలే ఏవిధంగా వున్నాయో అన్నది క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న రఘు ఇంకో నాలుగు రోజులా వూర్లో వున్నా, మళ్లీ వారి కళ్ళ బడకుండా తప్పించుకు తిరిగాడు. రఘు విజయవాడ నుంచీ తిరిగి వచ్చేసరికి స్నేహితులంతా కలిసి ఒక పిక్నిక్' ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని రఘు రావడం తోనే అతన్నీ తీసుకుని బయల్దేరారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra