Home » Yarram chandrasekharam » Goodu Chedirina Pakshulu

 

    'అవును నాన్నారూ.... ఎక్కడో పల్లెటూర్లో ఉంటూ అంత గొప్పగా ప్యాసయ్యాడంటే అతనికి చదువు మీదగల శ్రద్దను ఒప్పుకు తీరాల్సిందే!'
    అమ్మాయిని ఆప్యాయంగా చూస్తూ "పదమ్మా! వెళ్లి బాతు రూం లో నీళ్లు పెట్టి మన ముగ్గురికీ వడ్డించమని చెప్పు సీతమ్మ కు. ఐదు నిమిషాలలో స్నానం చేసి వచ్చేస్తాను....' అన్నాను.
    'అలాగే నాన్నారూ...! ' అని అమ్మాయి మేడ దిగి క్రిందికి వెళ్ళిపోయింది.
    ఒక ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు నా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఏదో మెడికలు మాగజైన్ తిరగవేయసాగాను. నా గది ప్రక్కగది అమ్మాయి శశిది. ఆమె గదిలో యేవో మాటలు వినిపించడం తో నా ధ్యాసను అటు మళ్ళించాను.    
    'నన్ను పిలిచారా అమ్మాయి గారూ...?' ప్రసాదు గొంతు.
    'అవును ప్రసాదు ! మొన్న చేసిన ప్రాక్టికల్స్ లో ఒక సందేహం కలిగింది. తెలుసుకుందామని....?'
    'అలాగే! మీ ప్రాక్టికల్స్ పుస్తకం తీయండి. నాకు సాధ్యమైతే చెబుతాను.'
    'ఇదిగో యిక్కడ....'
    ప్రసాద్ అమ్మాయికి వివరించి చెప్పడం విన్నాను... ఎంత చక్కగా చెప్పాడు....ఏదైనా ఒక విషయం విడమర్చి చెప్పడం లో అతనికి అతనే సాటి.... ఈ విషయం లోగా కూడా గమనించాను. అమ్మాయి కూడా ఒకటి రెండు సార్లు ప్రస్తావించింది.
    'అమ్మాయిగారూ....నేను వచ్చేసరికి మీరు ఏదో నవల చదువుతూ ఉన్నట్లున్నారు....? తెలుగా...? ఇంగ్లీషా...? చూడనివ్వండి.'
    'అదా....ప్రసాద్ ..ఏదో కాలక్షేపానికి చదువుతున్నానులే' అమ్మాయి తడబడుతూ అంది.
    'ప్రణయం లో ప్రమాదం' దయచేసి పొరపాటు న గూడా మీరు అటువంటి నవలలు చదవ కూడదు. మనసును, శరీరాన్ని పాడు చేస్తాయి. ఇప్పటి ఈ వయసు కెమెరా లెన్సు లాంటిది. ఎదురుగా...ఆకర్షణీయంగా కనపడే విషయాలను హృదయానికి గాడంగా హత్తుకునేలా చేస్తుంది. ప్రతి వ్యక్తీ ఈ వయసులోనే ఎంతగానో జాగ్రత్త పడాలి....ముఖ్యంగా మంచి కంటే చెడునే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాము. తమాషా ఏమిటంటే ....? ఆ చెడును చెడుగా తెలుసుకోలేము. ఇటువంటి పుస్తకాలను ప్రభుత్వం నిషేధించి నప్పటికీ అవి మార్కెటు కు ఎలా వస్తాయో నాకు తెలియడం లేదు...వ్రాసేవారైనా కేవలం ధనా భావం తప్ప మంచి...చెడును ఆలోచించరు.'
    'ప్రసాద్....! నా పై కోపం వచ్చిందా?'
    "అబ్బే! లేదండీ. మీ పై కోపమా?... ఈ కోపం ....ఆవేశం మీ పై కాదు . రోజు రోజుకూ నైతికంగా పతనమౌతున్న సమాజం పైన.... యువతరం పైన....వారి దోషం మాత్రం ఎంతవరకు? అదే అర్ధం కావడం లేదు. బాధ్యులు వారి తలిదండ్రులా....? అధ్యాపకులా....? ప్రభుత్వమా? అందరునూ....?'
    'నీకిష్టం లేకపోతె చదవను ...సరేనా....?'
    'నా మాట మన్నించినందుకు ధన్యుణ్ణి ...అనవసరంగా లేనిపోని సోది పెట్టి మీ సమయం పాడు చేశాను.... నన్ను మన్నించండి.'
    'అబ్బే...! అంత మాటెందుకు ప్రసాద్? నిజమెప్పుడూ నిష్టూరం గానే ఉంటుంది. నేను కూడా ఎప్పుడూ చదవను....యిక అసలే మానేస్తాను.... ఏమిటో ఆ వెధవ పుస్తకాల మీద ఆకర్షణ అలా ఉంటుంది...'
    'అలాగే! నేను వెడతాను....పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. జాగ్రత్తగా చదివి మీ క్లాసులో మీరే ప్రధములుగా ప్యాసవ్వాలి.'
    'అలాగే!'
    ప్రసాద్ వెళ్ళిపోతున్న చప్పుడు వినిపించింది. అతని సంస్కార హృదయాన్ని నా మనసులో అభినందించాను. అందరూ ఇలా ఉంటె సమాజమెంత బాగుపడుతుందో? నాలుగు సంవత్సరాలుగా గమనిస్తున్నాను. ఒకనాడైనా ప్రసాద్ అబద్దం చెప్పడం గాని, చెడు మాటలు మాట్లాడడం గాని, ఒకరి మనసు నొప్పించడం గాని చూడలేదు. అమ్మాయిని ఎంత సున్నితంగా మందలించాడు ....? చదువు సంధ్యలలో అట పాటలలో అగ్రగణ్యుడుగా పేరు సంపాదించుకుంటున్నాడు. అమ్మాయి నా గదిలోపలికి వచ్చింది.
    'ఏమ్మా....మీ సంభాషణంతా నేను విన్నాను. ప్రసాద్ మాటలు నిన్ను నొప్పించాయా?'
    'లేదు నాన్నారూ....కళ్ళు తెరిపించాయి. ఎంత మృదువుగా నచ్చ జెప్పాడు....? కాలేజీ లో కూడా యింతే. తన మాటలతో ఎంతటి కఠిన హృదయం గలవాడి నైనా యిట్టే మార్చేస్తాడు.... అంతా అతనిని ఎంతగానో గౌరవిస్తారు.... యిక అమ్మాయిల సంగతి చెప్పనే అక్కరలేదు. కాలేజీ లో నేను, ప్రసాద్ ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే ఈర్ష్య పడుతూ గుడ్ల గూబలలాంటి కళ్ళతో చూస్తూ... అమ్మాయిలంతా నాకు వింతగా కనిపిస్తారు.'
    'అంత ఈర్ష్యా వాళ్ళ కేందుకమ్మా?'
    'ఏమో నాన్నారూ...?'
    'అందరితో చనువుగా మాట్లాడడా?'
    'ఎందుకు మాట్లాడడు? మాట్లాడుతాడు. ఎవరికి వారే అతనిని స్వంతం చేసుకోవాలని తాపత్రయ పడతారు.... ఎవరికీ అందడు.'
    'ఏమో అమ్మా....? అతనెవరో....? కులగోత్రాలు ....పుట్టు పూర్వోత్తరాలు.... ఆస్తి పాస్తులు....ఎప్పుడూ అడగలేదు.... అతను చెప్పలేదు. మొత్తానికి మణిపూస లాంటివాడు.
    'ఒకటి రెండు సార్లు నేనూ ప్రయత్నించాను.... లాభం లేకపోయింది. ఆ విషయం ఎత్తి నప్పుడల్లా ఎంతగానో బాధపడిపోయాడు..... మాట తప్పించే ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఆ ఊసు ఎత్తలేదు నేను.'
    'మంచిదమ్మా....వెళ్లి జాగ్రత్తగా చదువుకో.... పరీక్షలు దగ్గర పడుతున్నాయి.'
    అమ్మాయి వెళ్ళిపోయింది. ప్రసాదు ఈ సంవత్సరం ఫోర్టు ఇయర్ పూర్తీ చేస్తాడు. ఎం.బి.బి.యస్. తర్వాత ఎమ్మెస్ , చేయించాలని ఉంది. అతని ఉద్దేశ్యమేమిటో? ఎమ్మెస్ పూర్తీ చేశాక నర్శింగ్ హోం బాధ్యత అతని పై, అమ్మాయి పై ఉంచుతాను. ప్రసాదు చాలా బుద్ది మంతుడు. అయినా అమ్మాయికి తగిన వాడేనా....? ఆ విషయం అంత త్వరగా నిర్ణయించేటువంటిది కాదు. అమ్మాయిని వేరే ఎవరికైనా యిచ్చి వివాహం జరిపిస్తే ఆ  వచ్చే అల్లుడితో నర్శింగ్ హోం బాధ్యత ముగ్గురికి చెందుతుంది. నేను త్వరపడి ప్రయోజనం లేదు. కాలమే సమస్యలను పరిష్కరిస్తుంది.... ఒకనాడు శశి ని పెంచడం ఒక పెద్ద సమస్య గా ఉండేది. సీతమ్మ పుణ్యమా అని ఆ సమస్య తీరిపోయింది.... ప్రస్తుతం అమ్మాయి వివాహ సమస్య నన్ను ఎదుర్కొంటూ ఉంది. అది కూడా పరిష్కారమైతే నేనిక నిశ్చింతగా నా శేష జీవితాన్ని గడపవచ్చు.....రేణూ! యిప్పుడు నీవు ఉన్నట్లయితే ఎంతగా సంతోషించే దానవో? నీవు   ఆ అదృష్టానికి నోచుకో లేదు. నీవు ఏ లోకాలలో ఉన్నా అమ్మాయిని మాత్రం దీవిస్తూ ఉండు. అంతకన్న నిన్ను ఏమీ కోరను.
    రోజులు ప్రశాంతంగా దొర్లిపోయాయి. అమ్మాయి శశి తన హౌస్ సర్జన్ షిప్ ను ఈ సంవత్సరం పూర్తీ చేస్తుంది. ఆ తర్వాత అమ్మాయి వివాహం జరిపిస్తాను. రేఖా ప్రసాద్ లు సన్నిహితులౌతూ ఉన్నట్టు తోస్తూ ఉంది నాకు... ప్రసాద్ ఎవరో....? కులగోత్రాలేమితో తెలియదు. చూస్తూ, చూస్తూ పిల్లని నివ్వాలంటే నా మనసొప్పడం లేదు. పిల్లవాడొక కుటుంబీకుడై తల్లితండ్రి అప్పచెల్లెల్లు ఉన్నవాడైతే బాగుంటుంది. అమ్మాయిని ప్రసాద్ కిచ్చి వివాహం జరిపిస్తే యిక యిద్దరూ మా యింట్లోనే ఉంటారు, రాకపోకలు ముద్దు ముచ్చటలు ఏమీ నేరవేరవు.
    'బాబుగారూ ...మీకోసం ఎవరో వచ్చారు....హాలులో కూర్చోబెట్టాను.... వారిని పైకి తీసుకు రమ్మంటారా...మీరు క్రిందికి వెళ్లి మాట్లాడుతారా?'
    'బహుశా రాఘవయ్య గారే అయి ఉంటారు.... నేనే వెళ్లి మాట్లాడుతాను. నీవు త్వరగా రెండు కప్పుల కాఫీ తయారు చేసి తీసుకురా....'
    ఆ వచ్చినది రాఘవయ్య గారని చూచాయగా గ్రహించాను. ఈరోజు వస్తానని చెప్పారు. నేను యిప్పుడు ఆలోచిస్తున్న విషయాన్నే వారికి వారం రోజుల క్రితం చెప్పాను. బహుశా అమ్మాయికి ఏదైనా సంబంధం చూసి ఉండవచ్చు. ఆలోచనలతో క్రిందకు దిగాను. నేను అనుకున్నట్లు గానే రాఘవయ్య గారు సోఫాలో కూర్చుని నాకోసం ఎదురు చూస్తున్నారు.
    'నమస్కారమండీ రాఘవయ్య గారూ.... కులసాయేనా! మీ కాంట్రాక్టు లు బాగా సాగుతూ ఉన్నాయా....?'
    నాకు ప్రతి నమస్కారం చేస్తూ 'బాగానే సాగుతున్నాయండీ! మొన్న మీరు ఒక విషయం నా చెవిన వేశారు...?'
    'ఆ....అవును, మా అమ్మాయికి మంచి సంబంధమేదైనా ఉందేమో చూడమన్నాను.... ఎక్కడైనా చూశారా....?'
    'చూశాను... మీరు కోరిన అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి. ఆ మాట మీ చెవిన వేద్దామని యిలా వచ్చాను.'
    'చాలా థాంక్సండీ! ఓపికతో పని కట్టుకొని శ్రమ తీసుకున్నారు.'
    అంతలో సీతమ్మ కాఫీ కప్పులు తీసుకు వచ్చింది. మేమిద్దరమూ కాఫీ త్రాగాము.
    'అలాగంటారేమిటండీ?' మీరు మా ఫ్యామిలీ డాక్టరు....మా కుటుంబానికి ఎంతో సేవ చేస్తున్నారు... ఇంత చిన్నపని మీరు పురమాయిస్తే , చేయడానికి వెనుక ముందాడుతామా?'
    నాపై నా పేషెంట్ల కుగల అభిమానానికి పొంగిపోయాను--
    'ఇంతకూ కుర్రవాడు ఏం చేస్తున్నాడు..? ఏం చదువుకున్నాడు....? వారి కుటుంబ విషయాలు విడమర్చి చెబితే తర్వాత విషయాలు మాట్లాడుకోవచ్చు.'
    'కుర్రవాడు కూడా డాక్టరే! ఏమ్.డి ఈ సంవత్సరం లో పూర్తవుతుంది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చే సంవత్సరం వివాహం చేయాలను కుంటున్నారు. మీరు కూడా వచ్చే సంవత్సరమే అమ్మాయి వివాహం జరిపించ తలచుకున్నట్లు చెప్పారు. పిల్లవాడి పేరు సుధాకర్. తల్లిదండ్రులు అప్పచెల్లెండ్రు ఉన్నారు. బాగా కలిగిన కుటుంబమే! కొడుకు ఒక్కడే! మీకు అందుబాటు లో గల ఆర్ధిక స్తోమతు.... మీరు బాగానే సంపాదించారు.... పైగా మీకు ఒక్కగానొక్క కూమార్తె. ఈ సంబంధం తప్పకుండా కుదురుతుందని నేను ఆశిస్తున్నాను. ఈలోగా నేను కూడా వేరే యితర సంబంధాలు యింతకన్న మంచిది తలుగుతాయేమో చూస్తుంటాను. నా ఉద్దేశంలో యిది చాలా మంచి సంబంధం... అయినా యింతకన్న మంచి సంబంధం గురించి తెలిసి నప్పుడు మళ్ళీ కలుస్తాను. మీరు ఈ వేళప్పుడు యింట్లో ఉంటారని అనుకోలేదు నేను. హాస్పిటలు లో ఉంటారను కున్నాను.. అవును.... ఈవేళ ప్పుడు యింట్లో ఉన్నారేమిటి?'
    'ఇది నేను హాస్పిటలు లో ఉండే సమయమే! కాని డాక్టర్ ప్రసాద్ ఎం.ఎస్ పూర్తీ చేశాడు. అతనే యిప్పుడు ఆస్పత్రి బాధ్యత వహిస్తున్నాడు.... నాకు యిప్పుడు కాస్త వెలుసుబాటుగా ఉంటూ ఉంది. తప్పనిసరి అవసర మనుకుంటే తప్ప నేను వెళ్ళడం లేదు...ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం వెడుతున్నాను.'
    'అలాగా....! ప్రసాద్ అనే పేరు ఒకటి రెండు సార్లు విన్నాను. అతను ఎవరండీ? మీ బంధువా?'
    'కాదు. నా సహాయంతో చదువుకున్న వారిలో అతను ఒకడు.... సమర్ధుడు....తెలివైన వాడు...చురుకైనవాడు.. నా దగ్గరే ఉంటూ నర్శింగ్ హోం బాధ్యత చూస్తున్నాడు.'
    'చాలా సంతోషం...! కాని ఒక చిన్న అనుమానం. మీ నర్శింగ్ హోం ఎంతో పేరు ప్రతిష్టలను సంపాదించుకుంది. అందుకు కారణం మీరు.....అటువంటిది అంత గురుతర బాధ్యతను మీరు అతని పై ఉంచారు. అందుకు అతను సమర్దుడా...? మీరు సమర్ధుడన్నారు కాబట్టి తెలివైన డాక్టరే నని ఒప్పుకుంటున్నాను. కాని మీదయా గుణం...రోగుల యెడ మీకుండే ఆదరాభిమానాలు...పేదల యెడ మీరు చూపే ప్రత్యెక శ్రద్ధ యివన్నీ మీ వృత్తి కి చాలా ముఖ్యం గదండీ! చూస్తె కుర్రవాడు....వ్యవహారం బాధ్యత గలది....? అయినా నా పిచ్చి గాని ఈ విషయాలన్నీ మీరు ఆలోచించకుండా అంత పెద్ద బాధ్యతను మీరు అతని మీద పెడతారా?'
    'మీరు చెప్పినవన్నీ ఆలోచించవలసిన విషయాలే! ఆలోచించాను కూడా! మీరు పేర్కొన్న గుణగుణాలన్నింటిలోనూ అతను నన్ను మించిన వాడు.. ఏమాత్రం సందేహమక్కరలేదు.'
    'అలాగా....! చాలా సంతోషమంది! ఇప్పటి యువకులలో అటువంటి వారుండడం అరుదు. అందుకే అలా అనవలసి వచ్చింది. ఒకసారి అతని పరిచయం చేసుకోవాలి. ఏం చేస్తాం....? ఎంత ధనికులకైనా , ఎంత గొప్ప వారికైనా రోగాలు తప్పవు కదండీ! అటువంటప్పుడు డాక్టరు కు లొంగి తీరవలసిందే!....తప్పదు.'
    'భలే ఛలోక్తి విసిరారే....?' నవ్వుతూ అన్నాను.
    'నేనిక శలవు తీసుకుంటాను. మళ్ళీ అవకాశం చూసుకొని ఎప్పుడైనా కలుస్తాను. నమస్తే.'
    'మంచిదండీ...నమస్తే! ఎంతో శ్రమ చేశారు.'
    'అబ్బే...! మీరుఊరికే అలా అనకండి!  అదేమీ లేదు' అని వెళ్ళిపోయారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra