Home » Vachaspathi » Antasthulu Antahkaranalu

                          

                                       15
    ఆ రోజుకు రాఘవయ్య హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి దగ్గర దగ్గర రెండు వారాలు కావస్తుంది. భానుమూర్తి తీరికున్నప్పుదల్లా వెళ్ళి రాఘవయ్య ను చూసి వస్తూనే ఉన్నాడు. కానీ తన మనసులోని విషయం చెప్పలేక పోతున్నాడు. ఆరోజు మటుకు మానసులో గట్టిగా తీర్మానించుకునే రాఘవయ్య దగ్గరికి వెళ్ళాడు.
    "మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నానండి!' అన్నాడు కుశల ప్రశ్నలూ అవీ అయ్యాక.
    "ఏవిటి బాబూ?' కొంచెం కుతూహలంగానే అడిగాడు రాఘవయ్య.
    "పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను మాస్టారూ!" అన్నాడు భానుమూర్తి సిగ్గు నంతా అతి ప్రయత్నం మీద దాచి నవ్వుతూ.
    "అదేవిటోయ్ ! అంతకన్నా సంతోషకరమైన విషయం నాకేముంటుంది? తప్పకుండా చేసుకో" అన్నాడు రాఘవయ్య హృదయ పూర్వకంగా నవ్వుతూ.
    "మీ అంగీకారం లేనిదే ఎలా వీలవుతుంది, మాస్టారూ?" అన్నాడు భానుమూర్తి చమత్కారంగా.
    "ఏవిటోయ్ , భానూ, అలా మాట్లాడతావు? నా అంగీకారమే నీకు కావలసి వస్తే అది తప్పకుండా లభిస్తుంది." వాత్సల్య పూరిత దృక్కులతో భానుమూర్తి ముఖంలోకి చూస్తూ అన్నాడు.
    "నాకు సరే , మాస్టారూ ...." నసిగాడు.
    "ఊ.....ఇంకేవరికోయ్?"
    "మరి....విశాలకో?"
    "విశాలకా!" ఆశ్చర్యంగా అడిగాడు రాఘవయ్య .
    "లేకుంటే నాకు పెళ్లెలా అవుతుంది మాస్టారూ?"
    "భానూ!" ఆనందమూ, ఆశ్చర్యమూ మేళవించిన కంఠంతో అన్నాడు రాఘవయ్య.
    'అవును, మాష్టారూ! విశాలను నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీరు తప్పక అంగీకరించాలి."
    "బాగుంది! కావలసింది నా అంగీకారం కాదు విశాలది." నవ్వుతూ అన్నాడు రాఘవయ్య.
    "విశాల అంగీకరిస్తుందనే అనుకుంటాను." ఎదురుగా ఉన్న గది వేపు చూస్తూ అన్నాడు భానుమూర్తి.
    "విశాల జన్మవృత్తాంతం నీకు తెలిదనుకుంటాను. ఇలాంటి సమయాల్లో దాచడం మంచిది కాదు."
    "తెలుసు, మాస్టారూ!"
    "ఏం తెలుసు?"
    "విశాల మీ అమ్మాయి కాదని...."
    "ఇంకా?"
    "అంటే?" అబద్దమాడాడు.
    "విశాల నా స్నేహితుని కూతురు. అందరికీ తెలిసిన విషయం నీ దగ్గర దాచటం నా కిష్టం లేదు. వర్ణాంతర వివాహానికి ఫలితం విశాల." భానుమూర్తి కళ్ళలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు రాఘవయ్య.
    భానుమూర్తి ఆ విషయానికంతగా ఆశ్చర్య పడినట్లు కనిపించలేదు. ఎందుకంటె మురళి నోటంటే అలాంటి విషయాన్ని విని ఉన్నాడు.
    "భానూ!"
    "ఏం మేష్టారూ?"
    "కులం పట్ల నీ అభిప్రాయమేమిటి?"
    "మానవ నిర్మితం."
    "మనిషి తనకన్నా కూడా ఎక్కువ ప్రాముఖ్యాన్ని దాని కెందుకిస్తున్నాడంటావు?"
    "స్వార్ధం."
    "బాగా చెప్పవోయ్!"
    "ఏవుంది , మాస్టారూ! కులం పట్ల ఎక్కువ పట్టింపు ఎక్కువ కులాల వారికే గానీ తక్కువ కులాల వాళ్ళలో అంతగా కనిపించదు. కులరహితమైన సమాజం ఏర్పడిన రోజు గొప్ప కులాల వాళ్ళమని చెప్పుకు తిరిగే వాళ్ళకు అంత గొప్ప గౌరవం లభించక పోవచ్చు."
    "అంతేనంటావా?"
    "అక్షరాలా!"
    రాఘవయ్య ఓ క్షణం ఊరుకున్నాడు. "ఇది ఈరోజు విషయం కాదు. ముప్పయ్యీ ఆ ప్రాంతం. రామారావు నాకు ప్రాణ స్నేహితుడు. అప్పటికే అతను బి.ఎ పాసయ్యాడు. మహాత్మా గాంధీ గారి నాయకత్వాన ఉప్పు సత్యాగ్రహం అప్పుడే ప్రారంభమైంది. దేశంలో నలు మూలల నుండి చాలా మంది ఈ ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నారు. ఆంధ్రులు కూడా తమ దేశ భక్తిని చాటుకున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. అందులో రామారావోకడు. కొన్ని రోజుల పాటు జైల్లో కూడా వున్నాడు. గాందీగారితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. మహాత్మాజీ బోధనలు రామారావు మీద ఎంతో ప్రభావాన్ని కలిగించాయి. రామారావు బ్రహ్మాన కులస్తుడు. తిరిగి స్వగ్రామం వచ్చిన తర్వాత హరిజన కన్యను వివాహం చేసుకున్నాడు. ప్రేమ పెళ్ళిళ్ళ రకం అనుకుంటావేమో? అదేం కాదు. ఆదర్శం కోసం చేసుకున్న పెళ్ళి . ఆ కాలంలో సమాజ పరిస్థితి ఎలా ఉండేదో నువ్వే ఊహించుకో. స్వగ్రామంలో ఉండడం చాలా కష్టమైంది.బంధువులు, స్నేహితులు దూరమయ్యారని ఇక అక్కడ ఉండలేక  మద్రాసు చేరుకున్నాడు. మా యిద్దరి మధ్యా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే వున్నాయి. ఒకరోజు బరువైన కవరోకటి పోస్ట్ మాన్ నా చేతిలో పెట్టాడు. ఆత్రంగా విప్పి చూశాను. రామారావు తన హృదయ వేదన అంతా అందులో వ్రాశాడు. భార్య ప్రసవించి చనిపోయిందనీ, ఆమె గుర్తుగా తనకో అమ్మాయి నిచ్చి పోయిందనీ, తన జీవితాని కిలా అర్ధం లేకుండా ఎందుకు పోతుందో తెలీడం లేదనీ ఏమేమో వ్రాశాడు. ఓదారుస్తూ ఒక ఉత్తరం వ్రాయడం తప్ప నేను మరేం చెయ్యలేకపోయాను. ఇంకో సంవత్సరం కూడా జరిగిపోయింది. ఓరోజు స్కూలు నుండి వస్తుంటే పోస్టు మాన్ సంతకం తీసుకుని టెలిగ్రాం ఒకటి చేతిలో పెట్టాడు. రామారావు దగ్గర్నుండే ఆ వైరు వచ్చింది. నన్ను ఉన్నపళంగా బయల్దేరి రమ్మాన్నాడు" అని రాఘవయ్య ఆగాడు.
    "ఊ.....తర్వాత?' భానుమూర్తి ఆదుర్దాగా ప్రశ్నించాడు.
    "ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక ఎకాయేకిని మద్రాసు ప్రయాణమయ్యాను. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నాకోసమే చూస్తున్నాడు రామారావు. నా కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. హృదయం లో చెయ్యి పెట్త్రి దేవినట్లయింది. విషయం క్షణంలో అర్ధం చేసుకున్నాను. ఉయ్యాల్లో ఉన్న పాపాయిని నాకప్పజేప్పాడు. తన గాలి పిల్లకు తగల కూడదనీ, నన్ను వెంటనే వెళ్ళమనీ బలవంతం చేశాడు. వాడి నాస్థితిలో వదిలి వెళ్ళనని మొండి కేశాను. ఏడ్చాడు. అంతవరకూ కడుపులో దాచుకున్న నాదుఖన్నంతా యిక ఆపుకోలేకపోయాను. ఇద్దరం ఒకర్నొకరం పట్టుకుని ఏడ్చుకున్నాము. ఆక్షణానికి కాస్త మనశ్శాంతి లభించింది. పాపను నేను తీసి కెళ్ళినట్లయితే తను వెళ్ళి శానిటోరియం ;లో చేరేటట్లు వాగ్దానం తీసుకుని నేను వచ్చేశాను. తర్వాత రెండు సంవత్సరాలకు రామం పోయినట్లు శానిటోరియం నుండి కబురొచ్చింది." చివరి వాక్యం చెప్పేటప్పుడు రాఘవయ్య గొంతు పూడుకు పోయింది.
    భానుమూర్తి కళ్ళు ఆర్ద్రమయ్యాయి.
    "నేను ఆరోజు తెచ్చిన పాపే విశాల. కానీ రామం టి.బి తో పోయాడని తెలిశాక బంధువులూ, స్నేహితులూ ఎన్నో మాటలన్నారు. 'అలాంటి అప్రాచ్యపు పని చేసినందుకు భగవంతుడు మటుకు క్షమిస్తాడా?' అన్నారు. చూడు, భానూ! వాడు చనిపోయాడని తెలిశాక కనీసం సానుభూతి చూపేటంతటి సహృదయం  కూడా వాళ్ళకు లేకపోయింది. మనిషిని మనిషి ఎంతగా ద్వేషిస్తాడో చూడు! భగవంతుడు కూడా అంత చిన్నచూపు చూడ్డం ఏం న్యాయం చెప్పు? అంత మంచి పని చేసినవాణ్ణి లోకమూ, భగవంతుడు కూడా చిన్నచూపు చూడ్డం శోచనీయం. జీవితానికి నిర్వచనమివ్వడం ఒక్కోసారి చాలా కష్టమే అవుతుంది. అయినా రామం జీవితంలో యింతగా ఓడిపోతాడని నేనే రోజూ అనుకోలేదు. విశాల నో యింటి దాన్ని చేస్తే వాడి ఆత్మ సంతోషిస్తుంది. కానీ, భానూ , నువ్వు సాహసమైన కార్యమే తలపెట్టావు." అన్నాడు.
    "ఇందులో అంత సాహసం ఏముంది మాస్టారూ? వర్ణాంతర మతాంతర వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.
    'అయితే వాళ్ళ కష్టాలకు గురికావడం లేదంటావా?"
    "లేకేం, మాస్టారూ? కష్టం కలుగుతుందని మంచి పని చెయ్యడం మానుకుంటామా చెప్పండి!'
    రాఘవయ్య హృదయం పులకరించింది. అర్ద్రమైన కన్నులతో భానుమూర్తి కళ్ళల్లోకి చూస్తూ "జీవితాన్ని సుఖంగా, హాయిగా గడపాలనుకునేవాళ్ళు కష్టాలను కావలించుకుంటారా? సామాన్య మానవుడు సామాన్యంగానే ఆలోచిస్తాడు. సామాన్యమైన దారిలోనే వెళ్తాడు. అసాధారణంగా ఆలోచించడం గానీ, అసాధారణ మార్గంలో వెళ్ళడం గానీ ఎప్పుడూ చెయ్యడు. అసాధారణంగా ఆలోచించడమే సాహసం. ఇక అది ఆచరణలో పెట్టడం అంత కన్నా సాహసమే అవుతుంది. నీవు తలపెట్టిన కార్యం సాహస కార్యం కాక మరేమవుతుంది , భానూ?" అన్నాడు.
    భానుమూర్తి మాట్లాడకుండా కూర్చున్నాడు.
    "{నువ్వు ఎదుర్కోబోయే కష్ట నష్టాలను గురించి ఆలోచించావా? ఇంట్లో నీకు చెప్ప తగ్గ వాళ్ళు గూడా లేరు."
    "ఆలోచించాను.' గంబీరంగా ముఖం పెట్టి అన్నాడు భానుమూర్తి.
    "మీనాక్షి కి తెలుసా?"
    "ఎందుకు తెలీదు?"
    "ఒప్పుకుందా?"
    "ఒప్పుకుంది. విశాలంటే ఆమెకో ప్రత్యేకాభిమానం ఉంది."
    "అన్నట్టు మీ అత్తయ్యా వాళ్ళూ గూడా యిక్కడే ఉన్నారుగా?"
    "అవును"
    "వాళ్ళకు తెలుసా?"
    భానుమూర్తి మాట్లాడకుండా తప్పు చేసినవాడిలా తల తిప్పుకున్నాడు.
    'చెప్పలేదా?"
    "లేదు"
    "అదేం?"
    "చెప్తాను"
    "ఆమె యిష్టపడక పోతేనో?"
    "మీరే యిలా మాట్లాడితే నేనేం చెప్పను, మాస్టారూ? ఆమె అంగీకరించినా, అంగీకరించకున్నా నేను విశాలను మటుకు చేసుకుని తీరడం నిశ్చయం.
    "ఓ మాటు చెప్పడం మంచిది. నీ నిధి కూడా."
    "అలాగే."
    "నువ్వు చిన్నవాడివి. పైగా నా శిష్యుడివి. నీకు అభినందనలే తెల్సాలో, అభినందనలే తెల్సాలో తోచకుండా ఉంది."
    "అదేవిటి, మాష్టారూ?"
    ఆనందం తో చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ "అవును భానూ! ఈరోజు నాకెంత సంతోషంగా వుందో నీకు తెలియ జేయ్యడానికి మాటలే దొరకడం లేదు. జీవితంలో యింత ఆనందమైన ఘడియలు నాకోసం ఎదురు చూస్తుంటాయని నేననుకోలేదు. నా చిరకాల వాంచితం నేడు ఈడేరింది. ఈ విషయంలో లోకులేన్ని విధాలుగా అనుకుంటారో, నాకు తెలుసు. మేమంతా కలిసి నిన్ను వలలో వేసుకున్నామని గూడా అనచ్చు-- " అన్నాడు.
    "అదేం మాట? ఇందులో వలలో వేసుకోవడమేముందీ? మీరలా ఎప్పటికీ అనుకోవద్దు, మాష్టారూ!"
    "ఎవరేన్ననుకున్నా నేను లెక్క చెయ్యను. నేనెలాంటి తప్పూ చేయడం లేదు. నిన్ను భర్తగా పొందగలిగిన విశాల నిజంగా అదృష్టవంతురాలు. నా ఆశీర్వాదం సదా నిన్ను వెన్నంటే వుంటుంది, భానూ!"
    "కృతజ్ఞుడ్ని ! ఇక వెళ్తాను. మాస్టారూ!" లేస్తూ అన్నాడు భానుమూర్తి.
    "ఉండవోయ్! కాసిని కాఫీ తీసుకు వెల్దువు గానీ, విశాలా, కాస్త కాఫీ తీసుకురా అమ్మా!" అంటూ కేకవేశాడు రాఘవయ్య.
    'అల్లుడి మర్యాదలు నాకేం అక్కర్లేదు." నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
    "ఈ రోజంటే నువ్వల్లుడివయ్యావు! అది నిజమే! ఇన్నాళ్ళుగానో? నాకు ప్రియ శిష్యుడి వేగా? నువ్వు నాకు అల్లుడు కాకున్నా నీ మీద నాకున్న ఆత్మీయతా, ఆదరణా ఏనాటికీ, ఎట్టి సమయంలోనూ తరిగిపోవూ. అది మటుకు గుర్తుంచుకో." నవ్వుతూ అన్నాడు రాఘవయ్య.
    విశాల రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి యిద్దరికీ యిచ్చి వెళ్ళిపోయింది.
    "మర్యాదలయ్యాయిగా? ఇక వెళ్ళచ్చా?"
    "ఊ.... వెళ్ళవోయ్! ఇక నిన్నెవరూ పట్టుకోరు!"
    "అవును. ఇప్పుడెవరూ లేరు, మాస్టారూ!" ఫక్కుమని నవ్వి లోపలి గుమ్మం వేపు చూస్తూ అన్నాడు భానుమూర్తి.
    రాఘవయ్య కూడా నవ్వకుండా ఉండలేక పోయాడు .

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra