మరో రెండు క్షణాల్లో ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు అతను. కారు సర్రుమని పడవలా ముందుకు దూసుకుపోయింది. చీనాంబర పక్కన కూర్చున్న అభినవ్ చుట్టూ ఏదో వింత పరిమళం, మత్తయిన పరిమళం. దేవకాంతలు వంటికి అద్దుకునే దివ్య పరిమళం.

 

    "మరచిపోయారా?" మెల్లగా అడిగింది ఆమె.

 

    "లే..... లేదు..... మి....... మ్మల్ని......ఎలా  మరచిపోతాను?" ఏదో  కుట్మలం విడివడినట్టుగా అతని గొంతు విచ్చుకుంది.

 

     కారు జనసమ్మర్థంలోంచి వెళ్ళిపోతోంది.

 

    "ఆర్టు ఎగ్జిబిషన్  గురించి మీరు నాకు తెలియజేస్తారని అనుకున్నాను" అందులోని నిష్టూరం అర్థంకాలేదు అతనికి. ఆ మాట  విన్పించనట్టు రోడ్డు వైపు చూస్తూ వుండిపోయాడు అతను.

 

    సాయంత్రం రాత్రిగా మారుతున్న సమయం.

 

    "పేపర్ లో ఎడ్వర్ట్ యిజ్ మెంట్ చూసి మిమ్మల్ని కలుసుకోడానికి వచ్చాను" మళ్ళీ అంది ఆమె.

 

    "ఢిల్లీనుంచా?" వెంటనే అడిగాడతను ఆశ్చర్యంగా.

 

    "అవును."

 

    "మీతో కొన్ని విషయాలు సీరియస్ గా మాట్లాడాలని" మళ్ళీ తనే అంది చీనాంబర.

 

    అభినవ్ కి వెంటనే కావ్య గుర్తుకొచ్చింది.

 

    సరిగ్గా  పది నిమిషాల వెనక్కి వెళ్తే-

 

    కంగారుగా హరిహరన్ తో మాట్లాడేసి "ఫిర్ మిలేంగే అంకుల్" అని చెప్పేసి పరుగు పరుగున మెయిన్ గేటు  దగ్గర  కొచ్చింది కావ్య. అక్కడ అభినవ్  కనబడకపోవడంతో నిరుత్తురురాలైపోయింది. కారిడార్లో హాల్లో, ధియేటర్ లోపల, బయట పిచ్చిదానిలా వెతికింది. మెయిన్ గేటు పక్కన చాలాసేపు అతని కోసం పిచ్చిగా ఎదురుచూసిందామె.

 

    ఎక్కడికెళ్ళిపోయాడు అభినవ్? తనలో కనీసం చెప్పకుండా!

 

    ఆమె మనసులో గుండుసూది దిగబడినట్టయింది. కళ్ళ వెనక చిన్న  తడి.

 

    అసహనంగా, కోపంగా అప్పుడే అటుగా వెళుతున్న ఆటోని పిలిచి  ఎక్కి కూర్చుంది.

 

    సరిగ్గా అదే సమయంలో-

 

    మౌంట్ రోడ్ లోని హొటల్  చోళ షెరటాన్ వైపు కారును తిప్పించింది చీనాంబర.

 

    "మీరెప్పుడూ సీరియస్ గానే వుంటారా?" ఆ ప్రశ్నకు అంతవరకు  రోడ్డు  వైపు చూస్తున్న అభినవ్ తల ఆమె వైపు తిప్పాడు.

 

    అతను ఆ సమయంలో తల పక్కకు తిప్పకుండా వుంది వుంటే, అతని  కళ్ళు రోడ్డు  పక్కన  బస్టాండ్ లో కూరగాయలు సంచితో నిలబడ్డ లిపిని చూసేవి.

 

    తన పక్కనుంచి దూసుకెళ్ళిపోయిన కారులోని వ్యక్తిని లిపి ఆశ్చర్యంగా చూసింది.

 

    మద్రాసులో ఈ వ్యక్తి..... తనకు యింకా ఎన్నిసార్లు కనబడుతాడో.....! మనసులో అనుకుంది లిపి.

 

    అంతలో సిటీ బస్సు రావడంతో అందులోకి ఎక్కి కూర్చుంది లిపి.

 


                                         *    *    *

 

    వెల్లివాకం బస్టాపులో బస్సు దిగి లిపి, లిపి తల్లి రాజ్యం రోడ్డు  పక్కన నడుస్తున్నారు. పక్కనే స్కూటర్ ఆగడంతో అకస్మాత్తుగా తల తిప్పి  చూసింది లిపి.

 

    "హాయ్ నిన్ను ఇక్కడ చూడడం......" వెంటనే అతని పోల్చుకోలేక పోయింది లిపి.

 

    "నేనండీ బాబూ..... రమణని. మీరు నాకు కాలేజీలో రావణబ్రహ్మ అని నిక్ నేమ్ పెట్టారు జ్ఞాపకం వుందా?" నవ్వుతూ అన్నాడు రమణ.

 

    గాంధీ మెడికల్  కాలేజీలో చదివిన రోజులు చప్పున  గుర్తుకొచ్చాయి  ఆమెకి.

 

    వెంటనే గుర్తుపట్టిందతన్ని. హైద్రాబాద్ లో రామ్ నగర్ లో  వుంటున్నప్పుడు పక్క పక్క ఇళ్ళల్లో దాదాపు ఏడేళ్ళున్నారు. ఇంటర్మీడియట్ నుంచీ వాళ్ళిద్దరూ కలిసే చదువుకున్నారు. ఇద్దరి మధ్యా నువ్వు, నువ్వు  అనుకునే  చనువుంది. అంతర్లీనంగా లిపిని ఒక్కప్పుడు ప్రేమించాడు రమణ.

 

    అకస్మాత్తుగా లిపి కనబడడంతో మళ్ళీ పాత ప్రేమ, ఇద్దరూ  ట్యూషన్ నుంచి తిరిగొస్తున్నప్పుడు చీకట్లో ఆమె వేళ్ళకు తన వేళ్ళు  తగిలించడం భుజాలకు భుజాలు రాసుకోవడం, హోలినాడు రంగులు జల్లుకోవడంలాంటి చిలిపి సంఘటనలు గుర్తుకొచ్చాయి అతనికి.

 

    "నువ్వు మద్రాసులో వుంటున్నట్టు నాకు తెలీదు" అన్నాడు  రమణ ఎగ్సైట్ మెంటుకి గురవుతూ.

 

    తనెందుకొచ్సిందో, ఏం చేస్తోందో చెప్పింది లిపి.

 

    "అయితే  మనం రెగ్యులర్ గా  కలుసుకోవచ్చన్నమాట" ఇంట్లో కొచ్చాక డ్రాయింగ్ రూంలో కాఫీ తాగుతూ అన్నాడు రమణ.

 

    "నీకు పెళ్ళయిందా?" తల్లి లోనకెళ్ళాక అడిగింది లిపి రమణను.

 

    "ఆ విషయం అడక్కు...... మా మేనమామ తెలుసు కదా! గాయత్రి ఎదిగీ ఎదగడంతోనే  నాకిచ్చి కట్టబెట్టేశాడు" నిట్టూరుస్తూ అన్నాడతను.

 

    "గాయత్రినే కదా! ఫర్వాలేదు. మంచి పిల్ల. పిల్లలా."

 

    "అప్పుడేనా, కొన్నాళ్ళు ఆగాలని నేనే  అనుకున్నాను. గాయత్రి నీకు తెల్సుకదా! పిల్లు  ఇంట్లో లేకపోతే ఇల్లు అదోలా వుంటుంది బావా! ఇదోలా వుంటుంది బావా అంటుంది పెద్ద ఆరిందాలా" చిరాగ్గా అన్నాడు రమణ.

 

    "ఎక్కడుంటున్నావు బాబు." లోపల్నుంచి వస్తూ అడిగింది రాజ్యం.

 

    "కోడంబాకంలోనండి. ఇక్కడ ఫ్రెండుంటే వచ్చాను" చెప్పాడు అతను.

 

    మరో అరగంట తర్వాత లేచి బయటికొచ్చాడు రమణ. అతని వెనకే బయటికొచ్చింది లిపి.

 

    "లిపీ! నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు రా! నేను మాత్రం  ప్రతి స్మడే నువ్వు వద్దన్నా మీ ఇంటికోస్తాను. రమ్మంటావా." నవ్వుతూ అడిగాడతను.

 

    "రా! ఏం అలా  అడుగుతావు? నువ్వేం కొత్తవాడివా. ఈసారి వచ్చేటప్పుడు గాయత్రిని తీసుకురా."

 

    "ఇక్కడికి గాయత్రినా? వద్దులే" స్కూటర్ స్టార్టు చేస్తూ అన్నాడతను.

 

    "ఏం?"

 

    "అదొక కథ. పెళ్ళయిన కొత్తలో అప్పుడప్పుడు నీ గురించి చెప్పేవాడ్నిలే. ఉడుక్కునేది, అలిగేది. అలాగయితే నన్నెందుకు చేసుకున్నారూ అన్నదాకా వెళ్ళిపోయేది. అందుచేత గాయత్రి మనస్తత్వం అలా తయారయింది గనుక మనం హాయిగా వుండాలంటే ఈ విషయం ఆమెకు తెలియకూడదు. సరేనా?" రహస్యం చెబుతున్నవాడిలా చెప్పాడతను. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra