Home » Dr muktevi bharathi » Malli Vachhina Vasantham

 

    రాజమ్మ పిన్ని మేడమీదకెళ్ళింది.
   
    "ఉన్నవా - సుబ్బలక్ష్మిసరే ఓ గ్లాసు మంచినీళ్ళియ్యమ్మముందు" అంది రాజమ్మ.
   
    బావగారిని పైకి రమ్మంటాను - పాపం ముసలాయన, ఆ దిక్కు మాలిన బస్సు ప్రయాణానికి అలసిపోయాడు. ఇక్కడికి రాగానే ఇంటికి తాళం చూసి మరీ బెంబేలు పడిపోతున్నారు. రాజమ్మ మేడమీద నిలబడి, "బావ - పైకి రండి - ఇక్కడ పదినిముషాలు పడుకుని రెస్టు తీసుకోండి - రండి - అంది.
   
    సుబ్బలక్ష్మి రెండు కప్పుల కాఫీ తయారుచేసి యిచ్చింది. రాజమ్మ సుబ్బలక్ష్మిని పిలిచి సందులో కెళ్ళింది -
   
    'ఏమోనమ్మా వదినా నాన్నగారిని చూడ్డానికెడుతున్నానని చెప్పింది. మరి ఎక్కడి కెళ్ళిందో' అంది సుబ్బలక్ష్మి "నరసాపురం కూడా వెంటబెట్టుకొచ్చింది. అదీ వెళ్ళాక మా బావకి మనసు బాగా లేక, మనం హైదరాబాదెళ్ళి పదిరోజులుండి అక్కడదాని వ్యవహారాలేమిటో చూద్దాం అని నన్ను, పెద్దాడిని తీసుకొచ్చారమ్మా నేను రానన్నను - కానీ మాబావ నేనొక్కన్నీ వెళ్ళలేనే రాజమ్మా - కాస్త వండి పెట్టడానికైనా మనిషి వుండాలని వెంటతీసుకొచ్చారు - అసలు మా ఆకకయ్య ఈ పిల్లబెంగతోనే చచ్చిపోయింది' కళ్ళొత్తుకుంది రాజమ్మ.
   
    'ఏమోనమ్మా - వాణ్ణి వెంట పెట్టుకుని ఊరొచ్చిందంటే దాని ధైర్యం చూడుమరి. ఇంతకీ ఎవరేమంటే ఎంతప్పో కానీ, ఆ పిల్ల పద్దతి బాగాలేదు - అంది సుబ్బలక్ష్మి.
   
    'పెళ్ళయినపిల్లకదా మంగళసూత్రాలు తీసిపారేసింది'
   
    'ఏం, పెళ్ళో - పెటాకులో - మొగుణ్ణి వద్దని విడాకులకి పడేసిందిగా, అవునా' అంది సుబ్బలక్ష్మి.
   
    'ఇదిగో అమ్మా ఈ గొడవలన్నీ తేల్చేసి, ఇక్కడ ఉద్యోగం మానిపించి తీసుకోపోదామనే మా బావ వచ్చింది. ఆయనకి ఒక్కరోజు నిద్రపడితే ఒట్టు -తిండిసాయించటం లేదు ముసలాయన - కాదు మరీ మగాడంటే అది వేరు - ఆడపిల్ల - అవ్వ! - బరితెగించి పోయిందిలే - అది మొదటినుంచీ పొగరుమోతు - తల్లిమాట కూడా వినేదికాదు - రాజమ్మ రహస్యంగా అంది.
   
    'భోజనాలకి ఏర్పాటు చేస్తానువదినా' అంది సుబ్బలక్ష్మి లేస్తూ.
   
    'భోజనాలు వద్దు - ఇంత ఉప్మాతిని పడుకుంటాం. ఈ రాత్రికి - అది రాకపోతే పొద్దున్నే మాదారిని మేం వెళ్ళిపోతాము. ఇల్లుబాగావుందే సుబ్బలక్ష్మీ - నాలుగేళ్ళయిందా కట్టి - ఇల్లంతా తిరిగిచూసి వచ్చింది రాజమ్మ.
   
    రాజమ్మ, తండ్రి మేడమీద కెళ్ళాక, వేంకటేశు అలా రోడ్డు మీద దాకా వెళ్ళాడు. ఎక్కడయినా హోటలు కనిపిస్తే అందులోకెళ్ళి ఏదైనా తినాలని రోడ్డుదాటేసరికి తాజ్ మహల్ హోటల్ ఎదురుగా కనిపించింది - వేంకటేశుకి హాయిగా అనిపించింది. దూరం నడవక్కర్లేదు. నాన్నగారికి, రాజమ్మ పిన్నికి కూడా టిఫిన్ పాక్ చేసి తీసికెళ్ళచ్చు అనుకుంటూ బల్ల యందు కూచున్నాడు వేంకటేశు. దోసె, వడ తిన్నాడు కాఫీతాగాడు. ముందు కడుపు చల్లబడితే మైండ్ అదే పని చేస్తుంది.
   
    శారద రాగానే దాని ప్లీడరు దగ్గరికి వెళ్ళటం మొదటి పని. ఆయనతో మాట్లాడి కాంప్రమైజ్ కి వీలవుతుందేమో కనుక్కోవాలి. ఏదో పొరబాట్లు చేస్తే దాని తరపున మేము క్షమార్పణ చెప్పుకుంటాం అని రామం కాళ్ళుపట్టుకుబతిమాలాలి - లేకపోతే, శారదకి బతుకు ఏమవుతుందీ - మొగుణ్ణి వదిలేసిన ఆడదాన్ని వెంటనే పెళ్ళి చేసుకుందుకు ఎవడైనా ముందుకొస్తున్నడా మన సమాజంలో - లేదుకదా - మొగుడు లేక పోయినా ఏ బలహీనతలోకి లోనుకాకుండా బతకగలిగే తత్వమూ మన శారద - కాదు కదా! మరి ఎందుకు - మా ఎవరితో చెప్పకుండా తనే విడాకులకి రామానికి నోటీసు యిచ్చింది - వేంకటేశుకి శారదపైన ఒక్కసారి కోపమొచ్చింది - రాజమ్మ పిన్ని ఏదో అంటుందని తనకు కోపమెందుకూ!! - స్నేహితుడంటే మాత్రం మరోమగాడితో తిరుగుతుంటే సంఘం ఒప్పుకుంటుందా - అయినా స్త్రీ పురుష ఆకర్షణ అనేది వుండనేవుందిగా - అదికాబట్టి ధైర్యంగా దినేష్ తో కారులో వచ్చేసింది, ఒక్కర్తీ - మరో ఆడపిల్ల అలావస్తుందా - ఈ వ్యవహారం ఇలాగే సాగితే, రేపు ఆవిడ, అదే ఆ దినేష్ భార్య, పిల్లలు వచ్చి దీంతో పోట్లాడితే - అసలు దేనికీ ఖర్మ  అంతా - విడాకులు తీసుకుందాము ఖచ్చితంగా అనుకుంటే తీసుకొమ్మను - కానీ మరో ఆడదాని కాపురం కూలకొడితే ఎలా - స్నేహితుల్లో, బంధువుల్లో దీనిమూలంగా తలవంపులు వస్తూనే వున్నాయి - ఛీ, దీని గురించి తల్చుకుంటుంటే నాకు సిగ్గుగాను అసహ్యంగానూ ఉంది, వేంకటేశు ఆ హోటల్ పక్కన నిలబడి సిగరెట్టుకాలుస్తూ దిక్కులు చూస్తున్నాడు.
   
    'అమ్మాయి రాలేదా' అన్నాడు ఆవులిస్తూ. రాజారావు.
   
    'అయ్యో రామా అమ్మాయి ఎక్కడుందో ఎవరికి తెలుసు ఎప్పుడొస్తుందో ఎవరికి తెలుసు. సుబ్బలక్ష్మి అన్నీ చెప్పింది' - కిందగోడకానుకుని కూర్చుంటూ అంది, రాజమ్మ.
   
    'ఏమంటుందీ' -
   
    'అసలు ఇది ఊరినించి వచ్చాక ఇల్లు ఖాళీ చేయించాలనుకుంటున్నారట వాళ్ళు' అంది మెల్లగా.
   
    'ఇల్లు ఖాళీ చేయించాలని - ఎందుకో - రెంటు పెంచాలనేమో'
   
    'అదీకాదు బావా - అద్దెకోసం కాదు - మన అమ్మాయి పద్దతి నచ్చక' - మూతితిప్పుకుంది రాజమ్మ.
   
    'పొద్దున్నే వెళ్ళి పోదాం' అన్నాడు కళ్ళు మూసుకుని రాజారావు   
   
    'ఎలావెళ్ళిపోతాం - వచ్చిన పనికాకుండా - పిల్లయింటికి రాకుండా' అంది దీర్ఘంతీస్తూ.
   
    దినేష్ పైన కోపం వచ్చింది రాజారావుకి వాడికి భార్యపిల్లలు వుండే వుంటారు. దీనితో స్నేహమేమిటి - అంటే ఇది వాడికి రెండో భార్యకాబోతుందా - భార్యస్థానం యిస్తాడో - ఉంచుకుంటాడో రాజారావుకి ఒక్కసారిగా ఆవేశం వచ్చింది.
   
    'ఇదిగో రాజమ్మా అదికనక వస్తే కాళ్ళు విరక్కొడతాముందు - వీలయితే గొంతు నొక్కి చంపిపారేస్తాను. ఇలాటి పిల్లవుండటం కన్నా లేక పోవటమే నయం - రానీ చెప్తా - " కుర్చీలోంచి లేచాడు రాజారావు కోపం ఎలాటిదో రాజమ్మకి తెలుసు.
   
    'ఊరుకోబావా - నువ్వు మనసు స్థిమితపరచుకో అన్నీ అవే సర్దుకుంటాయి చంపుకునేందుకా పిల్లని ఇంత ప్రేమగా పెంచుకున్నదీ - వస్తుందిగా, రాణీ - ఆవేశపడకు - నీకు బి.పి. పెరిగిపోతే కష్టం - రాజమ్మ ఆమాట అంటూ హార్లిక్సు కలిపి తెచ్చియిచ్చింది. హార్లిక్సు తాగి రాజారావు వీధివరండాలోకి వచ్చి కూచున్నాడు.
   
    తాజ్ మహల్ హోటల్లో టిఫిన్ తిని. బయటకొచ్చి సందు చివర సిగరెట్టు తాగుతూ నిల్చున్న వేంకటేశు ఒక్క నిముషం కంటిరెప్పార్పకుండా చూస్తూ నిలబడిపోయాడు. నిర్ఘాంతపోయాడు. నిశ్చేష్టుదయ్యాడు - ఇది నిజమా, కళా అనే భావంతో నిలువెల్ల వణికిపోయాడు - అదే నెంబరు - అదేకారు - అతనే - అతనితోపాటు మరో అతను - ఫుల్ సూట్, చేతిలో బ్రీఫ్ కేసు!! - ఆ ఇద్దరూ దిగాక జుట్టువిరబోసుకుని జీన్స్ పాంటు, లూజ్ షర్టు - అమ్మాయి - అదే! అదే! సూట్ కేసు చేతికందించాడు దినేష్, బై, బై - శారదనడిచి రోడ్డు దాటింది - కారు వెనక్కి మళ్ళింది. హోటల్లో కెడదామని అనుకున్న దినేష్ సందుచివర సిగరెట్టు కాలుస్తున్న వేంకటేశుని చూసాడు. కారు అతివేగంగా ముందుకు దూసుకుపోయింది.
   
    రాత్రి తొమ్మిదవుతోంది. హడావిడిగా ఇంట్లోకొచ్చిన శారద తాళం తీసింది. 'అబ్బ - ఎంత బడలికగావుందో' లైటు వేసింది లైటు వెలగటం తోనే వరండాలో వెలుగొచ్చింది.
   
    'వచ్చిందనుకుంటా చూసివస్తా - మీరిక్కడేవుండండి" గబగబా మేడమెట్లు దిగింది రాజమ్మ పిన్ని.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra