Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

 

      ఈ తరం కాలేజి అమ్మాయిలు ఫాస్టని తెలుసుగానీ, మరీ ఇంత అని తెలీదు. అదిరిపోయి చూశాడు. కానీ వెంటనే సర్దుకుని--
   
    "చీరకన్నా ముఖ్య విషయం చెప్పనా?" అన్నాడు.
   
    "ఏమిటి సార్-"
   
    "ఇది కాలేజీ కాదు. ఆఫీసు. కాలేజ్ లో లెక్చరర్లని ఏడిపించినట్టు, స్నేహితుల్తో మాట్లాడినట్టు మాట్లాడితే ఇక్కడ ఉద్యోగం పోతుంది." ఆ అమ్మాయి మొహం వాడిపోయింది, తలదించుకుని "సారీ సర్" అంది.
   
    "ఇక మీరు వెళ్ళవచ్చు."
   
    ఆమె మౌనంగా పుస్తకం పట్టుకుని లేచి, తలుపువైపు నడిచింది. అతడికి జాలేసింది. అప్పటివరకూ ఫస్ట్ మార్క్ వచ్చి ఒక పరీక్షలో అది రాకపోతే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మొహం ఎలా చాటేస్తారో, అలా వెళ్తూంది ఆమె మాట అన్నాడు. ఆమె ఆగి వెనుదిరిగింది.
   
    "కనకాంబరం రంగు జార్జెట్ మీద తెలుపు జాకెట్, ఎడమవైపు భుజం దగ్గిర గులాబీ అంత పువ్వు అదే రంగులో రెండు జెళ్ళు మానేస్తే మంచిది" అన్నాడు.
   
    ఆమె మొహం విప్పారింది. చిన్నపిల్లలు మిస్చువస్ గా నవ్వినట్టు నవ్వేసి "థాంక్స్ సార్" అంది.
   
    అతడు తిరిగి తన పనిలో మునిగిపోయాడు.
   
                               15
   
    మరో వారం రోజులు గడిచాయి.
   
    మామూలుగా అయితే ఆమె జ్ఞాపకం స్మృతుల పుటల్లో ఎక్కడో మారుమూలకు క్రమక్రమంగా వెళ్ళిపోవలసిందే. కానీ ఇంట్లో తాండవించే శ్మశాన నిశ్శబ్దం అతడికి ఆమెనే గుర్తుకు తెస్తూంది.
   
    తమ జీవితంలో ఏదో కోల్పోయిన భావం ఈ మధ్య కొత్తగా వచ్చి చేరింది. అది రోజురోజుకీ ఎక్కువ అవుతూంది.
   
    ఇంతకు ముందయితే, రోజంతా ఆఫీసులో అలిసి - ఇంటికి ఏ పదింటికో వచ్చి కాసింత తిని నిద్రపోయేవాడు.
   
    ఇప్పుడు నిద్ర పట్టటంలేదు. నిద్రాణమైణ కోర్కె ఏదో తొలిచేస్తూంది. దానికి స్పష్టమైన రూపురేఖ లేదు.
   
    ఆ రోజు మరో ఉపద్రవం వచ్చిపడింది. ఆ ఇంట్లో చేసే పనిమనిషికీ, బావమరిదికీ ఎన్నాళ్ళనుంచి సంబంధం వుందో తెలీదు. ఆ రోజే బయటపడింది. దానికి నాలుగో నెల. అలగాజనాన్ని ఇంటిమీదకు తీసుకొచ్చింది. అదృష్టవశాత్తు ప్రెస్ కి పొక్కలేదు ఈ విషయం. పదివేలు ఇస్తేగానీ వదల్లేదు.
   
    డబ్బు పోయినందుకు కాదు బాధ. మాధవి తమ్ముణ్ణి వెనకేసుకు రావటం! అక్కా తమ్ముళ్ళిద్దరూ కలిసి చివరికి తప్పు తన మీదకు తోసేశారు. "మీకు తెలీదండి! బాగా డబ్బున్నవాడు కదా అని తమ్ముణ్ణి పట్టింది. మీరేమో బెదిరిపోయి పదివేలు వదుల్చుకున్నారు" అంది.
   
    అతడు తెల్లబోయి, "లేకపోతే ఏం చెయ్యాలి?" అన్నాడు.
   
    "ఈ విషయం నాకు వదిలేసివుంటే నేను చూసుకుని వుండేవాణ్ణి బావా-"
   
    "అవునండీ! అదేదో నాలుగు వగలుచూపి వీణ్ణి బుట్టలో వేసుకుంది. అమాయకుణ్ణి చేసి ఆడిద్దామనుకుంది. మీరు మరీ భయపడేసరికి వాళ్ళు రేటు పెంచేశారు?"
   
    అతఃడికి అసహ్యమేసింది......ఇక్కడ తప్పెవరిది అని కాదు ప్రశ్న. తప్పు చేసినవారు తన వాడయ్యేసరికి మారిపోయిన వాదనా విధానం. తను ఒకరోజు ఒక్క పెగ్గు డ్రింకు తీసుకొస్తే నానా హడావుడి చేసే తన భార్య, ఆవిడ తమ్ముడు ఒక పని మనిషితో కులికినా, దానికి అమాయకత్వం అని పేరు పెట్టేసి సర్ది చెపుతోంది. ఇంకేముంది విలువలకి విలువ.
   
    అంతర్ సంఘర్షణ అనేది మొదలవనే కూడదు. ఒకసారి అది అయితే ఇక శాంతి వుండదు.
   
    ఆ మరుసటిరోజు అతడు ఆఫీసుకి వెళ్ళేసరికి ఒక చిన్న మంచి వార్త తెలిసింది. కోటి రూపాయల టెండరు తమకి వచ్చిందని....
   
    చాలా ప్రిస్టేజికి సంబంధించిన టెండరు అది. ముఖ్య పోటీదారు చెంచు రామయ్యకి రాకుండా తమకి రావడం సంతోషదాయకం ఆ టెండరు తయారుచేసింది అతడి సెక్రటరీ.
   
    ఆమె గుర్తుకు రావటంతో అతడు ఆమె ఆరోగ్య విషయం వాకబు చేశాడు. ఇంకో నెలరోజులు బెడ్ మీదే వుండాలన్నారని తెలిసింది. అతడి కొత్త సెక్రటరీ కూడా సంతృప్తికరంగానే పనిచేస్తూంది. కానీ కాలేజీనుంచి కొత్తగా వచ్చిన అమ్మాయి అవటం వల్ల, ఇంకా ఒద్దిక, నమ్రత వంటబట్టలేదు. క్లాసులో వేసినట్టే జోకులు అవీ వేసి నాలుక్కర్చుకుంటూ వుంటుంది. కానీ తెలివైనదే. చేరిన మూడోరోజు ఓ పది ఆటోగ్రాఫ్ పుస్తకాలు పట్టుకొచ్చి, "మా స్నేహితురాళ్ళది సార్. సంతకం చేయండి" అంది.
   
    అతడు ఆశ్చర్యపోయి, "ఆటగాళ్ళవీ, సినిమా యాక్టర్లవీ పెట్టించుకుంటారు గానీ బట్టల కంపెనీవాడివి ఏమిటి?" అన్నాడు.
   
    "మీ పాపులారిటీ మీకు తెలీదు సర్. ఆర్.టి. టెక్స్ టైల్స్ లో పని చేస్తున్నానని తెలియగానే రవితేజ నీకు తెలుసా అని మా ఫ్రెండ్స్ అందరూ అడగటమే. ఆయన దగ్గిరే పని అనగానే ఈ పుస్తకాలన్నీ ఇచ్చారు."
   
    అతడు నవ్వుతూ సంతకాలు పెట్టాడు. ఎంత కాదనుకున్నా చిన్న గుర్తింపు ఫీలింగు, కొత్తరకమైన అనుభవం.
   
    'నేనే చీర కట్టుకుంటే బావుంటాను' అని అడిగి తెలుసుకుని వెళ్ళిన మూడు రోజులకి ఆమె ఆ రకం చీరె కొనుక్కుంది. రావటం రావటమే గాలిలా వస్తూ, "థాంక్స్ సార్! మా వాళ్ళందరూ పిచ్చెక్కిపోయారు. నాలో ఇంత అందం ఇంతకు ముందెప్పుడూ కనిపించనేలేదట! ఇడియెట్స్! అయినా మొత్తం బ్యూటీ అంతా ఇదిగో ఈ పువ్వు దగ్గిర వచ్చింది సార్" అంటూ మొదలు పెట్టబోయింది.
   
    అతడు విసుగ్గా "చూడు ప్రియంవదా! ఇలా ఎప్పుడు పడితే అప్పుడు క్యాబిన్ లోకి వచ్చెయ్యకూడదు. నేను పిల్చినప్పుడే రావాలి" అన్నాడు.
   
    ఆమె బిక్కమొహం పెట్టి, "సారీ సర్" అంది.
   
    అంత చిన్నపిల్లని హర్ట్ చేశానే అని అతడు నొచ్చుకుని "సర్లే - ఎలాగూ వచ్చావు కాబట్టి డిక్టేషన్ తీసుకో" అని తన దగ్గిర వున్న పాడ్ ఆమె ముందుకు తోస్తూ, "నిజంగా ఈ చీరె నీకు బాగా నప్పింది-" అన్నాడు ఆమెని తిరిగి తన మూడ్ లోకి తీసుకురావటానికి. ఆ చిన్న కాంప్లిమెంట్ కే ఆ అమ్మాయి మొహం విప్పారింది. పాతదంతా మర్చిపోయి, "నిజమా సార్ నేను చెప్పానుకదా ఈ పువ్వు".
   
    "డిక్టేషన్ తీసుకుంటావా?"
   
    ఆమె సర్దుకుని "చెప్పండి సర్" అంది.
   
    "డియర్ సర్! దీపావళి సీజన్ వస్తూంది కాబట్టి వీలైనంత ఎక్కువ స్టాకులు మీరు పెట్టుకోవాలి. కానీ మీ ఆర్డర్లు సంతృప్తికరంగా లేవు. మన పోటీదార్లు కార్లని బహుమతిగా ఇస్తున్నమాట నిజమే! కానీ ప్రజలు త్వరలోనే, ఈ కార్ల ఖరీదు కూడా తమ చీరెల ధరలోనే కలిపి వుందని గ్రహిస్తారని నా వుద్దేశ్యం త్వరలోనే సంక్రాంతి కూడా వస్తోంది. ఉయ్ అప్రోచ్..."
   
    "కాక్రోచ్" అందామె.
   
    "కాక్రోచ్ కాదు, అప్రోచ్" అన్నాడు.
   
    ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. లేచి నిలబడింది, "కాక్రోచ్" అంది మళ్ళీ.
   
    ఆమె నిలబడటం అతడు చూడలేదు. తన ధోరణిలో తనున్నాడు.
   
    "కాదని చెప్పటంలే...." అన్నాడు ఆ మాటలు ఇంకా పూర్తికాలేదు. ఆమె చిన్నగా అరిచి అతడి మీదపడి, అతడి వెనగ్గా వెళ్ళి, బల్లక్రిందికి భయంగా చూడసాగింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది.
   
    ఈ హఠాత్ చర్యకి నిశ్చేష్టుడై "ఏమిటి" అన్నాడు.
   
    "బొ....బొద్దింక" అంది ఆమె దాదాపు కళ్ళనీళ్ళ పర్యంతమై "బొద్దింకంటే నాకు చచ్చేటంత భయం." అతడు తేరుకుని "సర్లే, కూర్చో" అన్నాడు. ఆమె చేతులు ఇంకా వణుకుతూనే వున్నాయి. ఆ పరిస్థితిలో ఆమె డిక్టేషన్ తీసుకోవటం అసాధ్యమని గ్రహించి "కొంచెం సేపయ్యాక మళ్ళీ పిలుస్తాన్లే" అన్నాడు.
   
    బ్రతుకుజీవుడా అన్నట్టు ఆమె ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. అప్పుడే అతఃడికి స్ఫురణకు వచ్చింది- ఆమెని ఏకవచనంలో సంబోధిస్తున్నానని ఎప్పట్నుంచి ఇలా జరిగిందో మాత్రం గుర్తుకు రాలేదు.
   
    రవితేజ డిక్టేట్ చేసిన ఉత్తరం పట్టుకుని తీసుకొచ్చి ఇస్తూ ప్రియంవధ అక్కన్నుంచి వెళ్ళిపోకుండా, "సార్, నాకో ఆలోచన వచ్చింది రాత్రి" అంది.
   
    "ఏమిటి?"
   
    "నిన్నటి మీ ఉత్తరం టైప్ చేస్తూ వుంటే..."
   
    "విషయం తొందరగా చెప్పు."
   
    "మన ప్రత్యర్ధులు కార్లూ, స్కూటర్లూ ఇస్తున్నారు కదా-"
   
    "అవును-"
   
    "మనం మన షాపుల్లోనే ఫారిన్ చీరెల విభాగం పెడదాం. ఆడవాళ్ళకి ఈ ఫారిన్ చీరెలమీద చాలా మోజు సార్. కస్టమ్స్ వారితో మనం ఒప్పందం చేసుకుని కొన్ని చీరెలు మాత్రమే అలా పెడతాం. ఆ విభాగంలో కొన్ని మాత్రమే అలాటి చీరలు వుంటాయి. మిగతావి మనవే వుంటాయి. చాలామందికి రెండింటికీ తేడా తెలీదు. అమ్మకాలు పెరుగుతాయి-"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra