Home » Vasireddy seeta devi novels » చిలకలు


    "ఆలోచించి చెప్పు. ఇన్స్ స్పెక్టర్ చూపించేంతవరకునువ్వు సిగరెటే తాగలేదా? తాగడానికి కేసుకోసం వెదుక్కోలేదా?"
    సూర్యనారాయణ ఆలోచనలో పడ్డాడు.
    "శనివారం ఉదయం రావూ అండ్ రావూస్ కంపెనీకి వెళ్ళినపుడు సిగరెట్ కేసు నా దగ్గరే ఉంది. రామకృష్ణ లోపలికివెళ్ళడం చూసి కొంతదూరంలో గోడ పక్కగా నిలబడ్డాను. తల దిమ్మెక్కిన స్థితిలో ఉన్నాను. అప్పుడు అంటే రామకృష్ణ బయటికి వచ్చేలోపల కనీసం ఓ నాలుగైదు సిగరెట్లయినా కాల్చి ఉంటాను. అంతవరకూ బాగా గుర్తుంది" అని ఆగి ఏదో జ్ఞాపకం చేసుకోవాలని ప్రయత్నించాడు.
    "నువ్వు ఆ తర్వాత రామకృష్ణను అనుసరించావ్? అప్పుడు ఎక్కడైనా సిగరెట్ తాగినట్లు  గుర్తుందా?"
    "ఉహూ! గుర్తు రావడంలేదు. ఆరోజు దాదాపు నేను పిచ్చి వాడినే అయిపోయాను. అదే స్థితిలో మీ దగ్గరకు  వచ్చాను."
    "అసలు  సిగరెట్  కేసు పోయినట్టే మీకు తెలియదా ? ఆరోజు నుంచి సిగరెటే కాల్చలేదా?"
    "రెండోరోజు ఉదయం తెలుసుకున్నాను. ఎక్కడో జారిపోయిందిలే అనుకున్నాను. డానికి నేనంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు. పైగా ఇంట్లోనే ఎక్కడో ఉంటుందిలే అని కూడా భావించాను జీవనమరణ సమస్యను  ఎదుర్కొంటున్న నేను సిగరెట్ కేసు పోయిందా లేక  ఇంట్లోనే ఉందా అని ఆలోచించే స్థితిలోలేను. అది ఆ పరిస్థితుల్లో చాలా చిన్న విషయం. పోలీసుల చూపించేంతవరకు అసలు దాని గురించిన ఆలోచనే నా బుర్రలోలేదు. ఇల్లు సోదా చేశారు. నేను  లేనప్పుడు. ఇంట్లోనె పోలీసులకు ఇది దొరికి ఉండొచ్చు. కేసు బనాయించడానికి వాళ్ళే దీన్ని కొట్టేశారు."
    "ఓ.కే." అంటూ నరేంద్ర లాకప్ గదిలోనుంచి బయటికి వచ్చాడు.
                                                                             13
    "బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. గంటకు అరవైమైళ్ళ వేగంతో. తుఫాన్ కోస్తా ప్రాంతాలవైపుకు పయనిస్తోంది. వచ్చే ఇరవై! నాలుగు గంటల్లో గాలీ, వానా ఉధృతంగా పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. తీర ప్రాంతాలవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం జరిగింది."
    ఆలిండియా రేడియోలో ప్రత్యేక వార్తలు ప్రసారం అవుతున్నాయి.
    విజయవాడ రైల్వే స్టేషన్ లోని ప్రయాణీకులు వార్తలు చెవులు రిక్కించికొని వింటున్నారు. కొందరి ముఖాల్లో అందోళన స్పష్టంగా కన్పిస్తోంది.
    ప్లాట్ ఫారం మీద కొందరు ఈదురుగాలికి వణికిపోతూ ముడుచుకొని కూర్చుని ఉన్నారు.
    మరికొందరు, సిగరెట్లు, బీడీలు తాగుతూ చలినుంచి తప్పించుకొనే ప్రయత్నంలో పచార్లు చేస్తున్నారు.
    పట్టపగ అయినా. మబ్బులు కమ్మడంవల్ల వాతావరణంలో చీకట్లు కమ్ముకున్నట్టుగా అన్పిస్తోంది.
    సన్నగా తుప్పర పడుతుంది. హొరుగాలి వీస్తోంది.
    కొందరు ప్రయాణీకులు రానున్న తుఫాన్  ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నారు.
    అప్పుడే కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫారం మీదకు వచ్చి ఆగింది.
    భారతి తల తుడుచుకొంటూ వచ్చి పెకండ్ క్లాసు ఆడవాళ్ల  పెట్టెలోకి ఎక్కికూర్చుంది.
    ఆమె కిటికీ దగ్గరగా కూర్చుంది,
    ఒడ్డూ పొడవూ ఉన్న ఒక వ్యక్తి చేతిలో అరటిపళ్ళు పట్టుకొని భారతి కూర్చున్న కంపార్టుమెంటు దగ్గర కొచ్చాడు. ఆమెకు పళ్ళు అందించాడు.
    "ఇవన్నీ ఎందుకు మామయ్యా?"
    "పొద్దుటినుంచీ ఏమీ తినలేదు. రెండుపళ్ళయినా తిను. ఇది సంతోషించవలసిన సమయం అమ్మా, అలా దిగులుపడకు, నీకు మంచి జరగబోతున్నది."
    "నాకేదో భయంగా ఉంది మామయ్యా!"
    "నేనుండగా నీకు భయం ఎందుకు భారతీ?"
    "ఆయన నన్ను స్వీకరిస్తారని నీకు నమ్మకం ఉందా మామయ్యా?"
    "ఎవరికోసం? చచ్చినట్టు స్వీకరిస్తాడు."
    "నాకు అంతగా నమ్మకం కుదరడంలేదు మామయ్యా, ఆయన స్వభావం నీకు పూర్తిగా తెలియదు."
    "తెలుసమ్మా. ఇప్పుడు చాలా వరకుమారిపోయాడు. అతడే నిన్ను పిలిపించమని కోరాడు. ముందు నీ అడ్రసు ఇవ్వమన్నాడు తనే వచ్చి క్షమాపణ చెప్పుకొని నిన్ను తీసుకోస్తానన్నాడు నేనే వారించాను. వెంటనే బయలుదేరి వచ్చాను."
    "వాకేమైనా పర్వాలేదు. నాబిడ్డ.....వాడికేం కాకూడదు. వాడు పెరిగి పెద్ద కావాలి. తన తల్లికి జరిగిన అన్యాయం తెలుసుకోవాలి.
    "అందువల్ల ప్రయోజనం?"
    "చాలా ఉంది. నాకు లేకపోవచ్చు. కనీసం వాడు తన జీవితంలో ఒక పిల్ల జీవితాన్ని నాశనం చెయ్యడు. చెయ్యలేడు."
    కొంచెం ఆగి "నా బిడ్డ ఎలాంటి హాని జరగకూడదు" అన్నది ఆవేశంగా.
    "వాడుచాలా సురక్షితమైనచోటనే ఉన్నాడుగా? ఇంకా భయమెందుకూ?"
    భారతి మాట్లాడలేదు.
    "మామయ్యా! నాకు మాట ఇవ్వాలి."
    "ఏమిటమ్మా అది? చెప్పు!"
    "నాకేమైనా అయితే...."
    "నీకేంకాదు అని చెప్పానుగా?" మధ్యలోనే అందుకొని మందలింపుగా అన్నాడు ఆ వ్యక్తి.
    "అతడు నన్నేమైనా చేస్తే నా బిడ్డ భాధ్యతనీదే, వాడ్ని పెంచి పెద్దచేస్తానని మాటివ్వు."
    "పిచ్చిపిల్లా? వాడికి ఎన్ని గుండెలుండాలి నిన్ను ఏమైనా చెయ్యడానికి? నా మేనకోడలిని. నీ జోలికి ఎన్ని గుండెలతో వస్తాడు? కాకపోతే నిన్ను అతడు తన భార్యగా అంగీకరించకపోవచ్చు. ఏ ఆధారం లేకుండా నేను ఏమీ చెయ్యలేను."
    "మరి అలాంటప్పుడు నన్నెందుకు బలవంత పెట్టి తీసుకువెలుతున్నావ్?"
    "నా మేనకోడలి బతుకు బాగుచేద్దామనే. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను."
    "నీ మాట కాదనలేక వస్తున్నాను. కాని అతడి మీద ఆశాలు పెంచుకొని కాదు. అతడు మారే మనిషికాడు. కరడుగట్టిన స్వార్థం అతడి శరీరంలోని అణువణువునా ఉంది. నా బిడ్డను నేను పోషించుకోగలను" అన్నది భారతి.
    "అది నిజమేననుకో నేనుండగా నువ్వు వంటరిగా ఆ చిన్న ఉద్యోగం చేస్తూ బతకాల్సిన అవసరంలేదు, అప్పుడంటే మీ అత్తయ్య నోటికి భయపడేవాడ్ని, నా కొడుకు లిద్దరూ ఆమెరికాలో స్థిరపడిపోయారు. వాళ్ళకు నా ఆస్తి అక్కర్లేదు వాడు కాదంటే నువ్వు నాదగ్గరే ఉండిపోతావు. పిల్లవాడ్ని బాగా చదివిస్తాను" అన్నాడు శంకర్రావు.
    "సారీ! మామయ్యా, నేను ఎవరి మీదా ఆధారపడి బతకను నాకు ఉద్యోగం ఉంది. నా బిడ్డను నేను పోషించుకోగలను" ధృడంగా పలికింది భారతి కంఠం.
    అతడు ఆమె ముఖంలోకి చూశాడు.
    "నీ ఇష్టం!"
    "నాకేదైనా అయితే మాత్రం నాబిడ్డ బాధ్యత నీదే మామయ్యా" కంఠం గద్గదమైంది.
    "ఛ! ఏమిటా మాటలు. ఎందుకంత భయం నేనుండగా నీకు  ఏమీ కాదు నిన్ను ఎవరూ ఏమీ  చెయ్యలేరని చెప్పానుగా? దైర్యంగా ఉండు."
    కొద్ది దూరంలో ఓ యువకుడు నిల్చుని వాళ్ళిద్దర్ని గమనిస్తున్నాడు. వారి మాటలు వినడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని మాటలు స్పష్టంగా విన్పించడం లేదు తెగిపోయిన సినిమా రీళ్ళాలా అప్పుడప్పుడు ఒక్కొక్క మాట విన్పిస్తుంది సందర్భంలేకుండా.
    ఎక్స్ ప్రెస్ దిక్కులు అదిరేట్టు పెద్ద కూత వేసింది. దూరంగా నిల్చుని భారతినీ, ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తిని గమనిస్తున్న యువకుడు ఒక్క ఉదుటన పరిగెత్తి అప్పుడే కదులుతున్న రైల్లోని ఫస్టు క్లాసు  కంపార్టుమెంటు ఎక్కాడు. కృష్ణా ఎక్స్ ప్రెస్  పొగలు కక్కుకుంటూ ప్లాట్ పారం దాటింది.
    భారతికీ కిటికీ అద్దాలు ఎత్తింది. ముఖం మీదకు పడిన వానచినుకులు పైట చెంగుతో తుడుచుకుంది. కిటికీ అద్దాలలో నుంచి బయటకు చూస్తుకూర్చుంది.
    ఆకాశంలో కారు మేఘాలు పరుగుల తీస్తున్నాయి. నలువైపులా నుంచి చీకట్లు తరుముకొస్తున్నాయ్.
    "చేలూ, చెట్లు, టెలిపోన్ స్థంభాలూ, వలయాలు తిరుగుతూ వెనక్కు పోతున్నాయ్. రైలు ముందుకు పోతుంది.
    కలువ రేకుల్లా ఉన్న భారతి కనురెప్పల కింద కన్నీరు తిరిగింది. ఆమె ముఖంలో విషాద మేఘాలు ఆవరిస్తున్నాయి. మనసు ముసురు పట్టిన ఆకాశంలా ఉంది.
    భారతి  కనురెప్పలు ఒకసారి గట్టిగా మూసుకొని తెరిచింది. కన్నీటిబోట్లు చెంపలమీదగా కారి గుండెల మీద పడి పైటను తడుపుతున్నాయి.
    "ఎందుకమ్మా ఏడుస్తున్నావ్? అత్తవారింటికి వెళ్తున్నావా?"
    "భారతి తుళ్ళిపడింది.
    తల ఎత్తి ఎదురు బల్లమీద కూర్చుని ఉన్న ఓ నడివయసు స్త్రీని చూసింది. ఆమె తననే జాలిగా చూడటం గమనించింది.
    భారతి కళ్ళు తుడుచుకొన్నది.
    బలవంతంగా పెదవుల మీదకు చిరునవ్వును తెచ్చి పెట్టుకుంది. కాని ఆమె ప్రశ్నకు బదులు ఇవ్వలేదు.
    "నేను అప్పుడే అనుకున్నాలే అత్తవారింటికి వెళ్తున్నావని." ఏదో పెద్ద రహస్యం కనిపెట్టినట్టుగా అన్నది ఆ స్త్రీ.
    భారతి చిరునవ్వునవ్వింది.
    "కొత్తలో అలాగే ఉంటుంటు. రాను రాను పుట్టిల్లు గుర్తుకూడా రాదు. పిచ్చిపిల్లా! ఎందుకేడుస్తావ్? పెళ్ళయి ఎంతకాలమైంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra