Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 23

        ఈ ఆలోచన  రాగానే అతని నరాలు జివ్వుమని లాగాయి.

    పండు పరుగెత్తుకుని వెళ్ళి రిక్షా ఎక్కాడు.

    "వస్తానమ్మా చిన్నమ్మాయిగారూ"  అన్నాడు చిట్టబ్బాయ్.

    చిన్నమ్మాయి నవ్వింది.

    "ఏమిటి? మీక్కూడా నేను చిన్నమ్మాయినేనా?"

    "మీ ఇంట్లో మనుషులందరికీ మీరు చిన్నమ్మాయ్తేతే  నాక్కూడా చిన్నమ్మాయే  నండి. వస్తానమ్మా"  అంటూ చెయ్యి  వూపి  గేటు బయటికి వచ్చి రిక్షా ఎక్కాడు.

    పండు చిన్నమ్మాయికి టాటా చెప్పాడు.

    చిన్నమ్మాయి కూడా పండుకి  టాటా చెప్పింది. ఆ టాటా చెప్పింది తనకే అన్నంత సంబరంగా చిట్టబ్బాయ్ చిన్నమ్మాయి కేసి చేయ్యూపాడు.

    "ఏంటి దిక్కులు చూస్తావ్?  త్వరగా పద, నాకు స్కూలుకి టైమతే పోతుంది" అన్నాడు పండు చికాకుగా.

    చిట్టబ్బాయి ఉలిక్కిపడి పండుని చూశాడు.  వాడి చికాకుకి మొదట తెల్లబోయినా వాడి ముద్దు మొహం చూస్తే నవ్వొచ్చింది చిట్టబ్బాయ్ కి.

    'వెళ్తాను లేరా బామ్మర్ది' మనసులోనే అనుకుని రిక్షాని ముందుకి పోనిచ్చాడు చిట్టబ్బాయి.

    మాసాబ్ ట్యాంక్ సెంటర్లో కన్నారావు దిక్కుతోచకుండఅటూఇటూతిరుగుతున్నాడు నిమిషానికో మారు టైము  చూస్తున్నాడు.

    "ఎంతసేప్తెనా రాడేం ? ఏమ్తేపోయాడు వీడు? పట్టుబడ్తే ఇంకేంలేదు ఒళ్లు హూనం  అయ్యేలా చితక్కోడతారు. పట్టుబడ్డాడా లేకపోతే రజనితో కబుర్లేసు  కోవద్దూ? ఒక రిక్షావాడితో అనవసరంగా  కబుర్లలోకి ఎందుకు దిగుతుంది?

    ఇలా అనుకుంటూ ఎదురుగా చూశాడు కన్నారావు.

    అంతే! ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

    ఆ అమ్మాయి! ఇటే వస్తుంది!! 

బాబోయ్! ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి తనని పలకరిస్తుంది. కబుర్లలో దింపుతుంది. సరిగ్గా ఆ టైంకే  ఈ చిట్టబ్బాయిగాడు పండుని  తీసుకుని రిక్షాలో వస్తాడు. ఎవరి అబ్బాయి? ఎక్కడికి తిస్కళ్తున్నారు? ఎందుకు తిస్కెళ్తున్నారు??  లాంటి ప్రశ్నలు వేసి చంపుతుంది.

    "ఆ పండుని కిడ్నాప్ చేసి తిస్కు వెళ్తున్నట్లు ఆ అమ్మాయి గ్రహిస్తే ఇంకేమ్తెనా ఉందా? తనమీద ఏ మాత్రం ఇంప్రెషన్ ఉండదు. తనని ఓ క్రిమినల్ కింద జమేస్తుంది. పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చినా ఇస్తుంది.  ఆ అమ్మాయికి  తను కనబడకూడదు.

    గబగబా పక్కకి వెళ్ళి అక్కడ మున్సిపాలిటి చెత్తకుండి వెనకానక్కికూర్చున్నాడు కన్నారావు చెత్తకుండి వెనుక కూర్చున్నాడో లేదో.  ఆ చెత్తకుండిలోంచి  ఒక కుక్క చివాలున లేచి కన్నారావు ను చూసి  "గుర్ ర్.. ఘి..." అంది పళ్ళు బయటకు పెట్టి క్రూరంగా.

    "ఏయ్ నోర్ముయ్.... నేనేమి నీకు కాంపిటిషన్ కి రాలెదు.... చెత్తంతా నువ్వే తిను..." కుక్క వంక విసుగ్గా చూస్తూ అన్నాడు కన్నారావు.

    కాని కుక్కకి మనవ భాష  రాదుగా?  అందుకే మళ్ళి కసిగా పళ్ళు బయటికి పెట్టింది.

    "గుర్ ర్ ర్...ఘి...భౌ...."

    "ఏయ్ ఛి... ఛి..."  అంటూ పక్కనున్న రాయితిసి  చెయ్యెత్తాడు."

    "భౌ ...గుర్ ర్ ర్ ....ఘి... భౌ...."

    కుక్క కన్నారావు మీదికి దూకడానికి సిద్దపడింది

    "బాబోయ్ పిచ్చిముండ కండపికేసేలా వుంది!" అనుకుంటూ కన్నారావు చెత్తకుండి వెనుక నుండి కంగారుగా ఇవతలకి వచ్చాడు. సరిగ్గా ఆ అమ్మాయి అప్పడే అతన్ని చూసింది.  కన్నారావు కంగాపడిపోయాడు.

    ఆ అమ్మాయి నడుస్తూ కన్నారావుకి  దగ్గరగా వచ్చింది. అలా వస్తూ వస్తూ కన్నారావు వంక మరోసారి చూసింది.

    "హి.... హి. మరేమో నా చేతిలోని రూపాయి బిళ్ళ కిందపడి దొర్లుకుంటూ ఆ చెత్తకుండి వెనక్కి వెళ్ళిందండి... నేనేమో దానికోసం వెతుకుతున్నా నన్నమాట! అంతే..." అన్నాడు కన్నారావు.

      "ఆ విషయం మీరు నాకెందుకు చెప్తున్నారు?"

    ఆశ్చర్యంగా కన్నారావు వంక చూస్తూ అడిగింది ఆ అమ్మాయి.

    "అంటే ఎలాగూ మీరు నన్నడుగుతారు కదా... ఆ చెత్తకుండి వెనకాల ఎందుకు దాక్కున్నావని?  అందుకనే నేనే ముందుగా చెప్పే ముందుగా చెప్పే శానన్నమాట!.... చూశారా నేనెంత తెలివ్తేనవాడినో? హి" నవ్వు తెప్పించుకుంటూ అన్నాడు.

    "నేనెందుకు మిమ్మల్ని అడుగుతాను?  మీరు ఆ చెత్తకుండి వెనకాల దాక్కుంటే నాకేం?...మీరు ఎవరని అడుగుతాను?..." మరితంగా ఆశ్చర్యపోతూ  కళ్ళు ఇంతింత చేసి చూస్తూ అడిగింది.

    "నేను మైక్ స్నేహితుడిని కాకపోవచ్చుగాని, పరిచయస్తుడ్నిగా ?  చెత్తకుండి వెనకాల తచ్చాడుతుంటే ఎందుకలా చేస్తున్నావని అడుగుతారని..."

    "పరిచయస్తులా?.."

    అయోమయంగా చూస్తూ అంది ఆ అమ్మాయి.

    "అదేమిటండి... మీరు నన్ను గుర్తుపట్టలేదూ?" ఆశ్చర్యంగా అడిగాడు కన్నారావు.

    ఆ అమ్మాయి పరీక్షగా కన్నారావు మొహంలోకి  చూసింది.  ఆమె పెదాలు  ఒక్కసారిగా  నవ్వూతూ విచ్చుకున్నయి.

    "ఓ! కన్నారావుగారా? ఇందాకట్నుండి అనుకుంటున్నా ఈ మనిషిని ఎక్కడో చూసినట్టుందే అని! అయినా ఇలా పగటి వేషం వేశారేంటి?" ఫక్కున నవ్వింది ఆమె.

    కన్నారావు ఉలిక్కిపడ్డాడు!

    ఆ అమ్మాయి ని  చూసిన కంగారులో, కన్  ప్యూజన్ లో తను మారువేషం వేస్కున్నట్టే మర్చిపోయాడు. కన్నారావు తన  మానాన తను నిల్చుని వుంటే  ఆ అమ్మాయి అతన్ని గుర్తించకుండా వెళ్ళిపోయి వుండేది.

    ఎక్కువగా నవ్వడం వల్ల ఆమె కళ్ళలో నీళ్ళు  తిరిగాయి.  కొంగుతో కళ్ళు ఒత్తుకుని  మళ్ళి అడిగింది ఆ అమ్మాయి.

    "అవునుగాని... మీరు మారువేషం ఎందుకు వేస్కున్నారంటే మాట్లడరీం?"

    "అంటే... మరి...  అది... ఏవిటంటే..." బుర్రగోక్కున్నాడు ఏం చెప్పాలో తోచక.        "ఊ చెప్పండి... అంత చెప్పకూడని రహస్యమా?"

    రహస్యమా? అబ్బే!!.. రహస్యం ఏముంటుంది?  నేనేమ్తెనా దొంగనా, స్మగ్లర్ నా? లేకపోతే చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేవాడ్నా? మరేమో నేనోకడికి పదివేలు

అప్పిచ్చాను...కాని వాడు  నా బాకీ ఎంతకి తిర్చాడే?... ఇప్పటికే చాలాకాలం అయింది. నేను రోడ్డు మీద కనిపిస్తే చాలు రూటు మార్చేసి  పారిపోతున్నాడు.  అందుకని ఇలా మారువేషంలో  ఇక్కడా కాపు వేషా....వాడు ఇట్నుండే వస్తాడు" అన్నాడు కన్నారావు గబగబా.

    "అదేంటి?.... మీరు వాళ్ళింటికి వెళ్ళోచ్చుగా?"

    "లాభం లేదండి... వాళ్ళ వాళ్ళచేత ఇంట్లో లేడని చెప్పిస్తున్నాడు... అందుకనే ఈ మారువేషం బాధ. వేషంలో నన్నెవరూ గుర్తుపట్టారు కదండి?"

    మామూలుగా అలా వెళ్ళిపోతూ చూస్తే గుర్తుపట్టరుగాని దగ్గరగా వచ్చి ముఖంలోకి పరీక్షగా చూస్తే గుర్తుపట్టవచ్చు...."


    "వాడంత పరీక్షగా చూసేలోగానే నేను వాడిని పట్టేస్కుంటాలేండి....ఇంతకి మీరు ఇటోచ్చారేం?"


    "అదే...ఇక్కడ మా ఫ్రెండుందని  చెప్పాగా!... దాన్ని కలవడానికొచ్చాను... ఇంక వస్తానంది" ఆ అమ్మాయి రెండడుగులు ముందుకు వేసింది.

    "ఏవండేవండి ఇప్పటిక్తేనా మీ పేరు చెప్పరా?"  ఆమెని అనుసరిస్తూ  అడిగాడు కన్నారావు.

    "చెప్తాను కాని మళ్ళి పాత కండిషన్ మీదే చెప్తాను...నేను మళ్ళి ఒక చిక్కు ప్రశ్న ఇస్తాను. దానికి సమాధానం చెప్తే నా పేరు చెప్తాను" చిరునవ్వుతో అంది ఆ అమ్మాయి.
   
    "ఆమ్మో!  మళ్ళి చిక్కు ప్రశ్నా?... పోనీండి. అడగండి చెప్తా"

    "ఒక ఇంట్లో ఇద్దరు తండ్రులున్నారు. వారిద్దరికీ  ఇద్ద్దరు కొడుకులు. కాని వాళ్ళింట్లో నలుగురు కాకుండా ముగ్గురే వున్నారు. ఇదెలా సాధ్యం?"

    "ఒసే ఇంతేనా ? ఒక తండ్రిగాని కొడుకుగాని చాచ్చుంటాడు... అంతేగాని?" హుషారుగా సమాధానం చెపాడు కన్నారావు.
 

 Previous Page Next Page