Home » Yarram chandrasekharam » Goodu Chedirina Pakshulu


                                         12
    పర్సు నా జేబులో వేసుకొని అక్కడ గుమి గూడి ఉన్న నలుగురి సాయంతో యువకుడి ని కారు దగ్గరకు తీసుకు వచ్చి కారులో చేర్చాను. అంతలో ఆ రౌడి ని వెదకడానికి వెళ్లిన మనుషులు తిరిగి వచ్చి వాడు దొరకలేదని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పి కారును నర్సింగ్ హోం వైపు మళ్ళించాను. నర్శింగ్ హోం లో అతని గాయాన్ని శుభ్రపరచి , కుట్లు వేసి , కట్టుకట్టాను. అది స్పృహ తప్పవలసి నంత గాయం కాదు. రక్తం ఎక్కువగా కారడం ....ఆ రౌడీ వెధవతో పోరాడడంతో అలసి పోయిన ఆ యువకుడు స్పృహ కోల్పోయాడు. జరిగిన దానికి పూర్తిగా అలసి పోయాను. వెంటనే యింటికి బయలు దేరాను .అమ్మాయి కూడా ఆందోళన పడింది. ఆకలిగా ఉండడం వల్ల ఇద్దరమూ భోజనం చేసి పడుకున్నాము.
    అర్ధరాత్రి ఫోను మోగడంతో మెలుకువ వచ్చింది. స్థిమితంగా కూర్చొని ఆ ఫోను అందుకున్నాను. విషయం తెలుసుకొని త్వరగా బట్టలు మార్చుకొని కారును షెడ్ నుండి తీసి నర్శింగ్ హోం బయలుదేరాను.
    నేను వెళ్ళేసరికి ఆ యువకుడు బాధతో మెలికలు తిరిగి పోతున్నాడు... టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంది.. బ్లీడింగ్ వల్లనే కట్టిన కట్టు తడిగా ఎర్రగా అయింది. బ్లీడింగు ఆపడానికి జ్వర తీవ్రత తగ్గడానికి యింజక్షన్లు చేసి నుదుటి మీద ఐస్ ఫోమెంటేషన్ పెట్టించాను. నిద్రపోవడానికి  మందు యిప్పించాను. అరగంటలో నిద్ర పోయాడు.
    'సిస్టర్...యిప్పట్లో నిద్ర లేవడు. అవసరమనిపిస్తే మళ్ళీ ఫోను చెయ్యి.... నేను వెడుతున్నాను....'
    'అలాగే డాక్టర్....!'
    ఇంటికి వచ్చి పడుకునేసరికి రాత్రి మూడయింది. మగత నిద్రతో తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకొని హాస్పిటల్ కు వెళ్లాను. అతని పరిస్థితి కాస్త మెరుగుగా ఉంది. జ్వరం పూర్తిగా తగ్గలేదు. కాని తీవ్రత తగ్గింది. గాయం నుండి బ్లీదింగు ఆగిపోయింది. రాత్రి చూసినప్పటి మరక వెడల్పు కాలేదు.
    ఆ యువకుడు వారం రోజులలో పూర్తిగా కోలుకున్నాడు. ఆమ్మాయి శశి ఆరోజు స్కూలు నుండి హాస్పిటల్ కు వచ్చింది.
    'నన్నాగారూ ...అతని కేలా ఉంది?'
    'కులసాగానే ఉన్నాడు. చాలా నీరసంగా ఉన్నాడు. పని ఒత్తిడి వల్ల ఉదయం నుండీ వెళ్ళి చూడలేదు.'
    ఇద్దరమూ అతని బెడ్ దగ్గరకు వెళ్ళాము.... చార్టు చూశాను.... టెంపరేచర్ నార్మల్ గా ఉంది... నీరసం తప్ప అతనికి ఏ బాధా లేదు. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నాము.
    'నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబూ....?'
    'నీరసంగా ఉంది...గాయం కొద్దిగా నొప్పి పెడుతూ ఉంది.... ఆకలి బాగానే ఔతూ ఉంది.'
    'నీ పేరేమిటి....?'
    'నన్ను ప్రసాదు అంటారు.'
    'మీ వాళ్ళ కేవరి కైనా కబురు చేయాలా?  ఆ విషయం నాకింత వరకూ తట్టనే లేదు.'
    'నాకెవరూ లేరండీ!'
    'మరి...! నీవేం చేస్తుంటావు బాబూ....? నీవు ఈ సిటీ వాడివిలా కనిపించడం లేదు.'
    'నేను 12 వ క్లాసు డిస్టింక్షన్ లో ప్యాసయ్యాను.... మెడిసిన్ చదవాలని ఉంది... ఎవరిని కలవాలో... ఏం చేయాలో అర్ధం కాక వారినీ, వీరిని తెలుసుకుంటూ రెండు మూడు రోజులు తిరిగాను. కాలేజీ కి వెళ్లాను.... అవి యింకా తెరవలేదు. ఏమీ తోచక ఆరోజు ట్యాంకు బండు వద్ద ఆలోచిస్తూ కూర్చున్నాను. మీరు వచ్చిన దగ్గర నుండీ మీ మీద దృష్టి ని నిలిపాడు ఆ రౌడీ. నేనప్పుడే అనుమానించాను వాడిని. అనుకున్నంతా అయింది.'
    'ఇంత దెబ్బ ఎలా తగిలింది....? గాయం కత్తి పోటులా ఉంది...ఆ రౌడి కత్తితో పోడిచాడా ఏం...?'
    'అవునండి! వాడి కాళ్ళకు నా కాళ్ళు అడ్డు వేసి కదలనివ్వ కుండా పట్టుకొని వాడి చేతిని కొరికి ఆ పర్సు లాక్కున్నాను. మళ్ళీ పర్సు ను నా చేతిలో నుండి పుంజు కోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు...ఇక లాభం లేదని గ్రహించి పర్సు ను కుడి చేతితో పట్టుకొని బోర్లా పడుకున్నాను.... వెంటాడుతున్న మనుషుల అలజడి విని అక్కసు కొద్దీ బలంగా కత్తితో పొడిచి పారిపోయాడు. కొద్ది సేపటికి మీరు వచ్చారు. మీ పర్సును మీకు అందించాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.'
    మెల్లిగా....వినయ విధేయతలు ఉట్టి పడేలా చెప్పాడు ప్రసాదు. నాకు ఆశ్చర్యం కలిగింది...ప్రసాదు ఎంత ధైర్యం చేశాడు.
    'అందులో ఉండవలసిన పైకం జాగ్రత్తగా ఉందాండీ...?' ఒక్క నిముషం ఆగి నెమ్మదిగా అడిగాడు.
    'జాగ్రత్తగానే ఉంది...కానీ నీ పరిస్థితే నాకు ఎంతో బాధను కలిగించింది.'
    'ఇంకా ఎంతకాలం యిక్కడ ఉండాలి డాక్టర్? నేను మెడికల్ కాలేజీ లో చేరాలి.....ట్యూషన్లు కుదుర్చుకోవాలి.... చనిపోయిన నా తల్లి గారి ఆశయాన్ని నెరవేర్చాలి. వీధి లైటు క్రింద కూర్చొని యైనా కన్నతల్లి కోరిక నెరవేరుస్తాను...... ఆమె ఏ లోకాలలో ఉన్నా నా సఫలతను సంతోషిస్తూ నన్ను ఆశీర్వదిస్తుంది...'
    ఆ యువకుని దృడ నిశ్చయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏ ఆసరా లేకుండా మెడిసిన్ చదవాలని సిటీకి వచ్చిన అతని ధైర్య సాహసాలను మనసులొ అభినందించుకుండా ఉండలేక పోయాను.

                      
    'నీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది.. భారమంతా నా పై వేసి నీవు నిశ్చింతగా ఉండు....నీవు సాహసం చేసి రెండు వేల రూపాయలు కాపాడావు.... చాలా కృతజ్ఞతలు...'
    'అవేం మాటలండీ....? మీరు పెద్ద వారు... నాకు మీరు కృతజ్ఞతలు చెప్పాలా...? అన్యాయం జరుగుతూ ఉంటె చూస్తూ ఊరుకోలేక పోయాను.... నా విద్యుక్త ధర్మం నిర్వర్తించాను.. గొప్పగా నేను మీకు చేసిందేమీ లేదు.' అని మళ్ళీ 'డాక్టరు విశ్వం గారు ఎవరో మీకు తెలుసా? వారు చాలా మంది పేద విద్యార్ధులకు సాయం చేస్తారని విన్నాను.... వారిని ఒకసారి చూడాలని ఉంది....'
    'అలాగే బాబూ....! నీకు పూర్తిగా నయంయ్యాక నేనే వారి యింటికి తీసుకు వెడతాను....బాగా విశ్రాంతి తీసుకో.'
    ముసి ముసిగా నవ్వుతూ రేఖ వైపు చూశాను. ఆమె చిరునవ్వు చిందిస్తూ ప్రసాద్ ముఖంలోకి తదేకంగా చూస్తూ 'నాన్నగారి మాటల పై విశ్వాస ముంచి నిశ్చింతగా ....నిర్భయంగా ఉండి విశ్రాంతి తీసుకోండి. అన్నీ సవ్యంగా జరిగిపోతాయి.'
    'అలాగే నండీ...! మీ పేరు....?'
    'శశిరేఖ....'
    'సంతోషం....! ఈ నిరు పేడను మాత్రం మరిచిపోకండి.'
    'ఎంతమాట....? ఎలా మరుస్తాం....?'  
    'ధన్యుణ్ణి....'
    'మేం వస్తాం బాబూ.... మరొక వారం రోజులలో పూర్తిగా కోలుకుంటావు. ధైర్యంగా ఉండు.'
    ఆ యువకునికి ధైర్యం చెప్పి నేను శశిరేఖ నా రూము కు వచ్చాము. శశి యింటికి వెళ్ళిపోయింది. నేను అక్కడ గుమిగూడి ఉన్న పేషెంట్లను పరీక్ష చేయడంలో నిమగ్న డనయ్యాను. పది రోజులు గడిచిపోయాయి. ప్రసాదు పూర్తిగా కోలుకున్నాడు. అతని గాయానికి వేసిన కుట్లు విప్పు కూడా రెండు మూడు రోజులైంది.
    ఒకరోజు ఆ యువకుని వద్దకు వెళ్లి ప్రశ్నించాడు . 'ప్రసాదు! ఈరోజు డా. విశ్వం గారి యింటికి వెడదామా?'
    'అలాగే....నాకిప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంది; మీ దయవల్ల.'
     'అదేమిటి బాబూ? ఇందులో నాదయే ముంది? మాకోసం ప్రాణాలను సైతం లెక్క చేయక ఆ రౌడీ తో పోరాడావ్! వాడు నీ  చేతి మీద కాకుండా మరెక్కడైనా పొడిచి ఉన్నట్లయితే....?'
    'ఊరికే నన్ను ఆ విషయం లో పొగడకండి.... అందులో ప్రత్యేకంగా నే చేసిందేమీ లేదు. ఆ పరిస్థితిలో ఎవరైనా అదే చేస్తారు. దొంగను తరమాలని ఎవరికి మాత్రం ఉండదు....?'
    'ఈ మాటలు నీ మంచితనాన్ని ఋజువు చేస్తున్నాయి.... సరే...! ఇక వెడదాం పద.
    'అలాగే నండి....!'
    ఇద్దరమూ యిల్లు చేరాము. ప్రసాదు ను నేను క్రింద హాలులో కూర్చుండ బెట్టి పైకి వెళ్లాను. అమ్మాయి కూడా అక్కడే ఉంది. సీతమ్మ అమ్మాయికి ఏదో నీతి కధ చెబుతూ ఉంది. నేను రావడం చూసి ఆమె నిలబడింది.
    'స్నానానికి నీళ్లు తోడుతాను... త్వరగా గుడ్డలు మార్చుకొని స్నానానికి రండి బాబుగారు....'
    'స్నానం తర్వాత చేస్తాను సీతమ్మా.... ముందు హాలులో కూర్చున్న అబ్బాయిని పైకి తీసుకురా....'
    'అలాగే బాబూ!'
    సీతమ్మ వెళ్ళిపోగానే కుర్చీలో కూర్చుని బూట్లు విప్పసాగాను. రేఖ మంచం మీద కూర్చుని ఏదో చదువుకుంటూ ఉంది.
    ప్రసాద్ నా గదిలోపలికి వచ్చాడు. సీతమ్మ దారి చూపిస్తూ ముందుగా లోపలికి వచ్చింది. ప్రసాదు ను చూడగానే ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ కూర్చోమని సంజ్ఞ చేశాను. సీతమ్మ తో 'మొన్న పర్సు కాపాడాడని చెప్పిన కుర్రాడు ఈ అబ్బాయే!'
    'అలాగా బాబుగారూ....?' అని ప్రసాదు వైపు చూసి 'ఎంత ధైర్యం చేశావు బాబూ? ప్రమాదం జరిగి ఉంటె....?'
    'ప్రమాదం జరుగుతుందని భయపడి.... అక్రమాన్ని ఎదుర్కో కుండా ఎలా ఉండగలమండీ....?'
    'కూర్చో నాయనా....! నిలబడే మాట్లాడుతున్నావెం' అన్నాను నేను.
    'ఫర్వాలేదండీ ...మీరు పెద్దవారు... మీతో సమంగా కుర్చీలో కూర్చో....'
    'కూర్చోవయ్యా బాబూ...ఫర్వాలేదు.' అని సీతమ్మ అతని కుర్చీలో కూర్చుండబెట్టింది; బలవంతంగా.
    'డాక్టరు బాబుగారూ.... మీరు నన్ను డా.విశ్వం గారి యింటికి తీసుకు వెడతానని తీసుకు వచ్చారు...?' నసుగుతూ బెరుకుగా అన్నాడు ప్రసాదు.
    'ఏమిటీ....? ఇది విశ్వం గారి యిల్లే నాయనా....! వారే విశ్వం గారు.' అంది సీతమ్మ. ప్రసాదు ఆశ్చర్య పోయాడు... మొహమాట పడ్డాడు. లేచి వచ్చి నా పాదాలకు నమస్కారం చేశాడు... రేఖ...నేను ముసి ముసిగా నవ్వుకున్నాము.
    అతనిని లేవదీస్తూ 'ఆ విశ్వాన్ని నేనే బాబూ! నీ చదువుకు తప్పకుండా సాయం చేస్తాను. నీవు నా యింట్లో నే ఉండి చదువుకో. నీకే అవసరం కలిగినా సీతమ్మ ను అడుగు. మా అమ్మాయి శశి కూడా నీకు కావలసిన సాయం చేస్తుంది.... ఏమాత్రం బిడియ పడకు, ' అన్నాను.
    'అంతటి అదృష్టమా బాబుగారూ....? ఇంత గౌరవానికి నేను తగనేమో? మీరు సహాయం మాత్రం చేయండి.... హాస్టలు లోనో...వేరే ఎక్కడైనా రూము లోనో ఉండి చదువుకుంటాను..... అప్పుడప్పుడు మిమ్ములను కలుసుకుంటూ మీ ఆశీస్సులను పొందుతూ ఉంటాను.'
    'హాస్టలు...రూము....ఎందుకోయ్! ఇంత యిల్లు ఉండగా ఎక్కడో అవస్థ పడతానంటావెం? ఇక్కడ ఉండడం యిష్టం లేకపోతె మాత్రం చెప్పు. వేరే ఎక్కడైనా ఏర్పాటు చేయిస్తాను.'
    'ఎంతమాట....? ఇష్టం లేకపోవడమా ? నేను యిక్కడ ఉండడం వల్ల మీకు ఏమైనా యిబ్బంది కలుగుతుందో ఏమో నని...' గోళ్ళు గిల్లుకుంటూ.... సిగ్గుపడుతూ మాటలు పూర్తీ చేయలేక పోయాడు.
    'లేదు బాబూ....! సంతోషం కలుగుతుంది. మరింకేం మాట్లాడకు.' అని సీతమ్మ నుద్దేశించి 'ఒక గదిలో శుభ్రం చేసి అతనికీ అన్నీ ఏర్పాట్లు చూడు.' అని వారిద్దరినీ అక్కడి నుండి పంపించి వేశాను.
    'బుద్ది మంతుడు...చదివితే మణిపూసలా తయారౌతాడు....ఆ నమ్మకం  నాకుంది... ఏమంటావమ్మా....?'

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra