Home » Yerramsetti sai » Bomma Borusu


    బస్ వెంటనే దొరికిందతనికి. సాయంత్రం నాలుగుగంటలకల్లా హేమ ఇంటికి చేరుకున్నాడతను. అతన్ని చూసి ఆశ్చర్యపోయిందామె.
    "నేనిక్కడున్నట్లు ఎలా తెలుసు?" అంది విస్మయంతో.
    "అష్టకష్టాలూపడి కనుక్కున్నాను...." నవ్వుతూ అన్నాడతను.
    ఇద్దరూ లోపల కుర్చీలో కూర్చున్నారు. హేమ ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా అదివరకటిరూపానికి దగ్గరగా కనబడుతోంది. అంతకు ముందు తనుచూచినప్పుడు కళా విహీనంగా కనిపించిన ఆమె మొఖం ఇప్పుడు మునుపటిఅందం, ఆకర్షణలతో మెరిసిపోతుంది. ఆమెవేపు నుంచి  చూపులు మరల్చుకోలేకపోతున్నాడు చంద్రకాంత్.
    "నిన్ననే నీకొకటి, వసుంధరకొకటీ రెండు ఉత్తరాలురాశాను!" చెప్పింది హేమ.
    "నమ్మమంటారా" నవ్వుతూ అడిగాడు చంద్రకాంత్.
    "భలేవాడివే!" నవ్విందామె.
    "మీరిక్కడికొచ్చి ఎన్ని రోజులయింది?" అడిగాడతను.
    "నెలరోజులుపైనే!"
    "ఇప్పుడు మీరెంత బావున్నారో తెలుసా? పెళ్ళి అవకముందు ఎంత అందంగా ఉండేవారో అంత బావున్నారు!" హేమ సిగ్గుపడింది.
    "ఇంతకూ నేనిక్కడికొచ్చేసినట్లు ఎలా తెలిసింది నీకు?" అడిగింది మాటమారుస్తూ "ఉదయం మీఇంటికెళ్ళాను!"
    "ఇవాళా?" హేమ ఆతృతగా అడిగింది.
    "అవును!"
    "తను ఉన్నారా?"
    "ఆ!" "ఏమన్నారు?"
    "మీరు ఎవరని అడిగారు. చెప్పాను! హేమతో ఏమిటీ పని అనడిగారు! ఊరికే చూడ్డానికి వచ్చానన్నాను. మరి ఇంతకాలం ఎందుకు చూడ్డానికి రాలేదు అని అడిగారు. చాలా రోజులు అడ్రస్ దొరకలేదు. దొరికాక ఓసారి వచ్చాను అని చెప్పాను. తనులేనప్పుడు వచ్చినందుకు అనుమానం కలిగింది. ఏవేవో అన్నారు. ఇంకోసారి కనబడితే మర్యాదగా ఉండదని హెచ్చరించాడు. అన్నిటికీ మౌనం వహించి బ్రతుకు జీవుడా అని బయటపడ్డాను...."
    హేమచకితురాలయింది "అదేమిటి! అలా నిందిస్తోంటే ఎందుకు వూరుకున్నావు? గట్టిగా సమాధానంచెప్పలేదూ?"
    "ఊహు! నా సంగతి తెలీందేముందీ? ఏనాడయినా ఎవరితోనయినా గట్టిగా మాట్లాడిఎరుగుదునా?" నవ్వుతూ అన్నాడతను.
    "మరి నేనిక్కడున్నట్లు తనే చెప్పేరా?"
    "ఊహు! నా ఎదురుగానే ఇంటికితాళంవేసి వెళ్ళిపోయాడు దాన్ని బట్టి మీరు ఇక్కడికొచ్చి వుంటారని ఊహించాను!" ఆమె భారంగా నిట్టూర్చింది.
    "మీరు ఇక్కడికెందు కొచ్చేశారు? మళ్ళీ ఏమయినా గొడవలయినాయా?" "మామూలువే! కానీకొద్ది రోజులు ప్రశాంతంగా గడపాలనిపించి వచ్చేశాను...." "వస్తూంటే మిమ్మల్ని అడ్డగించలేదా?"
    "ఊహు!"
    "ఇంతవరకూ ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేవా?"
    "ఊహు!"
    "ఇంకెంతకాలమిలా మరి?"
    "ఏమో! నాకేమంత ఆసక్తి లేదు-తిరిగి వెళ్ళాలని!"
    చంద్రకాంత్ త్రుళ్ళిపడ్డాడు. "అంటే?"
    "ఆయన తనంతట తను బ్రతిమాలితే అప్పుడు వెళ్తానేమో!"
    కొద్దిక్షణాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
    హఠాత్తుగా ఓ ఆలోచన తట్టిందతనికి.
    "హేమగారూ! ఎలాగూ ఇక్కడే ఉంటున్నారుగా! కొద్దిరోజులు హైద్రాబాద్ రాకూడదూ?" ఆశగా అడిగాడు.
    "రావాలనే అనుకుంటున్నాను. బహుశా మరోవారం పదిరోజుల్లో వస్తాను."
    అతను ఆనందం పట్టలేకపోయాడు.
    "నిజంగానా?" అన్నాడు సంతోషంతో.
    "బావుంది! అబద్దాలుగా కనబడుతున్నాయా నా మాటలు" నవ్వుతూ అందామె. ఆమె నవ్వుతూంటే విజ్రుంభిస్తోన్న ఆమె అందం అతనిని సమ్మోహనపరుస్తోంది! తను నిజంగా ఓ పెద్ద ఇడియట్! ఇంత అందమైన దేవతను ఎందుకువదులుకున్నాడు? తనకంటే ఆమె వయసులో పెద్దదయితేనేం? ఎంతమంది భార్యలుభర్తల కంటే పెద్దవారు లేరు? ఎవరు ఆపేక్షిస్తే మాత్రం తనకేమిటి? తనకు కావలసింది తన జీవితాన్ని తనకోర్కెల కనుగుణంగా మలచుకోవడం! తను ఆనాడే ధైర్యం చేసి ఉంటే హేమ తనను తిరస్కరించేదా? ఏమో! ఆ విషయం ఇప్పుడెలా తెలుస్తుంది? ఒకవేళ తెలుసుకున్నా ఏం లాభం? జరిగిన చరిత్రనెవరయినా మార్చగలరా?
    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?" అడిగిందామె.
    "ఏమీలేదు" తడబడ్డాడతను.
    అతన్ని చూస్తూంటే ఆమెకు నవ్వొచ్చింది.
    "మీరు హైద్రాబాదు వచ్చేముందు నాకు ఉత్తరం రాస్తారా?" అడిగాడతను.
    "ఓ! దానికేముందీ?"
    సౌభాగ్యమ్మవాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది.
    రామరాజు ఆఫీసు నుంచి వచ్చేవరకూ కూర్చుని అతనితో కూడా కాసేపు మాట్లాడి తిరిగి ఆ రాత్రికే హైద్రాబాదు బయల్దేరాడు చంద్రకాంత్.
    ఆమె కిప్పుడు అదివరలా తన సంసారం గురించి, శ్రీనివాసరావుగురించి ఆలోచనలురావడంలేదు. పూర్తిగా రచనల మీదే మనసు కేంద్రీకరించింది. తనకు తారసపడే వ్యక్తులందరినీ పరిశీలించడం, భార్యలను చిత్ర హింసలు పెట్టే మగాళ్ళగురించీ, భర్త ఎంత క్రూరుడయినా అతనినే సర్వస్వంగా భావించి అతని కాళ్ళదగ్గరే పడివుండే స్త్రీల గురించీ ఘాటుగా తన రచనల ద్వారా విమర్శించడం ఆమెకెంతో సంతృప్తి కలిగిస్తోంది ఓ రోజు రాత్రి ఏడుగంటలవుతోండగా ఆమెకు టెలిగ్రామొచ్చింది. అది బహుశా శ్రీనివాసరావ్ ఇచ్చిందేమోనని కలవరపడిందామె.
    తీరా చూస్తే ఆమె నవలకు ద్వితీయ బహుమతి లభించినట్లు తెలుపుతూ పత్రికలవాళ్ళు పంపించారది. ఆ వార్తా ఆమెకు ఎక్కడలేని ఆనందాన్నీ కలుగజేసింది. తనసలు తన నవలకు బహుమతి ఊహించనేలేదు. మామూలుగా ప్రచురణకు అంగీకరించబడితే చాలని అనుకుంది. ఎందుకంటే ఆ నవలలో కథకన్నా తన అభిప్రాయాలూ, భావాలు ఎక్కువగా ప్రస్ఫుటమౌతున్నాయి. ఇంచుమించుగా అది వ్యాసాలసంపుటి అన్నా ఫర్వాలేదు మరి అలాంటి నవలకు బహుమతి వస్తుందని ఎవరనుకుంటారు! నిజానికి ఈ విజయం తనదికాదు. తను నమ్ముకున్న ఆశయాలది. అంతలోనే ఆమెకు భయం కూడా తన ఒక్క పేరు తప్పితే మిగతా అన్నీ శ్రీనివాసరావ్ ని పోలి ఉండే హీరోగురించే రాసింది. అతని అనుమానపు బుద్దీ, భార్యంటే బానిస అనే తత్త్వం ఆమెతో గొడ్డు చాకిరీ చేయించుకోవాలనే మనస్తత్వం ఆమెను మానసికంగానూ, శారీరకంగానూ హింసించి ఆనందించడం.
    ఆ నవల చదువుతే తప్పక అది తన గురించి రాసిందే అని అతనికి తెలిసిపోతుంది. అప్పుడతను ఏం చేస్తాడు? దగ్గరుంటే చేయిచేసుకునేవాడేమో! కానీ తను తల్లిదండ్రులదగ్గరుంది కదా! ఇక్కడికొచ్చి ఏమయినా రభస చేస్తాడేమో! నాల్రోజుల తర్వాత దగ్గరలోనే ఉన్న ఓ ఫోటో స్టూడియోలో ఫోటో దిగి తన గురించిన వివరాలు కొన్ని రాసి పత్రికకు పంపిందామె.
    ఆ తరువాత ఆమె హైద్రాబాదు ప్రోగ్రాం దగ్గర పడిపోయింది. మర్నాడు రాత్రేప్రయాణం. ముందే సుధీర్ కీ, వసుంధరకూ ఉత్తరాలు రాసిందామె బస్ స్టాండ్ కి సుధీర్ వచ్చాడు. ఆమెను రిసీవ్ చేసుకోడానికి. అతను చాలా లావుఅయిపోయాడు. గుర్తుపట్టడానికి వీల్లేనంతగా మారిపోయిందతనిరూపం.
    "ఏమిటి ఇంతలావయ్యావ్?" నవ్వుతూ అందామె.
    "నాటకాలు మానేశాను! ఇంకేం పనుంటుంది నాకు! తినడం, నిద్రపోవడం" నవ్వుతూ అన్నాడతను.
    "నాటకాలెలా మానేశావ్! అని అలవాటయినవాడు ఛస్తే మానలేడని అంటారు కదా!"
    "నిజమేననుకో! కానీ మా ఆవిడ 'నాటకాలుమానకపోతే విడాకులిస్తా'నని బెదిరించింది" నవ్వుతూనే అన్నాడతను.
    "ఓహో! మీ ఆవిడ మాటంటే అంత భయం వుందన్నమాట! ఫరవాలేదు" ఇద్దరూ ఆటోలో ఇల్లు చేరుకున్నారు.
    హేమను చూస్తూనే ఆనందపడింది సుధీర్ తల్లి. తను భార్యను తీసుకొచ్చి హేమకు పరిచయంచేశాడు సుధీర్.
    "మా ఆవిడ రజని! నీ గురించి అంతా చెప్పాన్లే! అప్పట్నుంచి నిన్ను చూడాలని కలవరించి పోతూంది".
    "అంతగా కలవరించిపోయేటట్లు ఏం చెప్పావ్?" నవ్వుతూ అంది ఆమె.
    "అదే! నువ్వు మగాళ్ళని చీల్చి చెండాడేస్తావనీ, అందుకే అందరికీ నువ్వంటే భయమనీ"
    "చాల్చాల్లే నీ పబ్లిసిటీ ఎప్పుడో నా కొంప ముంచేస్తుంది." వారిద్దరి మాటలూ నవ్వుతూ వింటోంది రజని. రజనీని మాట్లాడుతూనే పరిశీలించింది హేమ ఆమె అందగత్తె కాదు. మామూలుగా వుంది ఆధునికంగానే అలంకరించుకుంది. కాఫీలు తాగాక ఏకాంతంగా ఉన్న సమయంచూసి హేమతో నెమ్మదిగా ఆమె విషయం అడిగాడు సుధీర్.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra