Home » Merlapaka murali » Preminchandi Please

   
    సాయంకాలం ఆరు గంటలవుతోంది.
    హోటల్ ఊర్వశి ఫ్యాషన్ గా అలంకరించుకున్న టీనేజ్ గర్ల్ లా హోయలుగా వుంది. ముఖానికి రాసుకున్న పౌడర్ ను సరిగా తుడుచుకోకపోతే మెడకింద ఏర్పడ్డ తెల్లటి గీతల్లా అక్కడక్కడా మెర్క్యురి లైట్లు మెరుస్తున్నాయి. ఎర్రటి స్టిక్కర్ అతికించుకున్నట్టుగా రిసెప్షన్ లో షాండలీర్ వేలాడుతోంది.
    ఆంజనేయులు బెరుగ్గా ఆ హోటల్ కి అడుగుపెట్టాడు.
    ఇంతకు ముందెప్పుడూ అతను ఆ హోటల్ లో అడుగుపెట్టలేదు. ఎప్పుడైనా వెళ్ళి కాఫీ తాగాలనిపించిన పర్స్ మూతముడుచుకునేది. అవును మరి ఎక్కడ కాఫీ ఖరీదు అయిదు రూపాయలు.
    శకుంతల ట్రాన్స్ ఫర్ మీద ఇక్కడికి వచ్చిన సందర్భంగా అభినయ్ ఇంత పెద్ద హోటల్ లో పార్టీ అరేంజ్ చేశాడు. ఖర్చు వేయిరూపాయలకు మించుతుంది. తను ఇక్కడ కాఫి తాగలేని స్థితిలో వున్నాడు. అభినయ్ పుణ్యమా అని హోటల్ లో ప్రవేశించగలిగాడు. తన వాలకం చూసి గేట్ మాన్ అనుమానంగా చూశాడు. తన డ్రస్ అలా వుంది మరి.
    హోటల్ లో పార్టీ ఎక్కడ ఎరేంజ్ చేశారో తెలియదు. రిసెప్షనిస్టుని అడిగితే చెబుతాడని తెలిసినా అడగడానికి బిడియంగా వుంది.
    అందర్లా ఎంతో చొరవగా చొచ్చుకుపోవాలని వుంటుంది అతనికి. కానీ తన డ్రెస్ ను ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో- తక్కువగా అంచనా వేస్తారేమో- తన ఆకారాన్ని చూసి అసహ్యించుకుంటారేమో- తన పేదరికాన్ని కనిపెట్టేసి అవమానిస్తారేమో - తన మాటల్లో తప్పులు దొర్లుతాయేమోనన్న భయం- ఇవన్నీ అతన్ని వెనక్కులాగుతాయి. అందరూ తనను చూసి నవ్వుతారేమోనన్న సందేహం పీడిస్తుంది. తన వెనకాల తన గురించి చీప్ గా మాట్లాడుకుంటారేమోనన్న అనుమానం వేయితలల కొండచిలువలా చుట్టుకుంటుంది.
    రిసెప్షన్ లోకి వెళ్ళి అక్కడున్న సోఫాలో కూర్చుండి పోయాడు.
    అక్కడ కూర్చోగానే రకరకాల అనుమానాలు కలిగాయి. అక్కడినుంచి లేవమంటారేమోనని అటూ ఇటూ బెరుగ్గా చూశాడు. ఎవరూ తనను పరిశీలించడం లేదని అనిపించాక ధైర్యంగా కూర్చుందామనుకున్నాడు. కానీ అతను కూర్చున్న తీరే ఆ పరిసరాలను కొత్తవాడన్న విషయాన్ని పట్టిస్తుంది.
    రకరకాల మనుషులు వస్తూ పోతూ వున్నారు.
    తన కొలీగ్స్ ఎవరైనా కనిపిస్తారేమోనని ముఖమంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు.
    అంతలో దొరబాబుల్లాంటి ఇద్దరు పిల్లలు వచ్చారక్కడికి. అవన్నీ తమకు సుపరిచితమైనట్టు చాలా ఫ్రీగా కదులుతూ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళారు. ఇంగ్లీషులో ఏదో మాట్లాడారు. ఆ తరువాత ఇంటర్ కమ్ లో ఎవరితోనో సంభాషించారు. రిసెప్షనిస్ట్ కి థాంక్స్ చెప్పి లిఫ్ట్ దగ్గరికి నడిచారు.
    తను ఎందుకంత ఫ్రీగా వుండలేకపోతున్నాడు. ఈ వాతావరణమంతా తనకు పరాయిగా కనిపిస్తోంది. ఏమిటి భేదం తనకూ వాళ్ళకూ! ప్రపంచంతో సంబంధం లేకుండా తను ఎందుకంత దూరంగా ఫీలవుతున్నాడు?
    ఆలోచనలను తెగ్గొట్టుకుని రిసెప్షన్ వైపు నడిచాడు.
    'కెన్ ఆ హెల్ప్ యు' రిసెప్షనిస్ట్ పొలైట్ గా అడిగాడు.
    "మా ఆఫీసు పార్టీ.....ఎక్కడ.....అభినయ్...." గొణిగాడు.
    "ఓహ్ ఁ పార్టీకి వచ్చారా రూఫ్ గార్డెన్స్ లో - వెళ్ళండి."
    రూఫ్ గార్డెన్స్ కి వెళ్ళడానికి మెట్లు ఎక్కడున్నాయో అడగాలనుకున్నాడు కానీ అడగలేకపోయాడ్డు. ఏదో జంకు అతన్ని ఎప్పుడూ లాగుతుంటుంది. దాంతో ఇబ్బందులు పడుతుంటాడు.
    మెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ లిఫ్ట్ దగ్గరికి నడిచాడు.
    లిఫ్ట్ తెరుచుకుని లేదు. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు ఆంజనేయులు. ఇంతవరకూ జీవితంలో లిఫ్ట్ ఎక్కలేదు.
    లిఫ్ట్ పైన మూడు అంకె పచ్చగా వెలుగుతోంది. లిఫ్ట్ మూడో అంతస్తులో వుందని. అది కిందకు రావాలంటే పక్కన వేసున్న ఏరో మార్క్ పైనున్న బటన్ నొక్కాలనీ తెలీదు.
    మాంత్రికుడి గుహ దగ్గరకు వెళ్ళి మంత్రం మరిచిపోయిన వాడిలా బిక్కముఖంవేసి బిత్తర చూపులు చూస్తున్నాడు.
    లిఫ్ట్ లో వెళ్ళాలని మనసు పీకుతుంది. ఎవరైనా వస్తే వాళ్ళతోపాటు వెళ్ళవచ్చని అలా వుండిపోయాడు.
    కదలడం మరిచిపోయిన వాడిలా లిఫ్ట్ మూడో అంతస్తులోనే వుంది.
    కడకు మహాలింగం వచ్చినా మెట్లెక్కి పోవచ్చు. లిఫ్ట్ లో వెళ్ళడం సోమరితనానికి ఎంత చిహ్నమో, ఎంత డబ్బు కొవ్వో కసికసిగా చెబుతాడు. తాత్కాలికంగా తన చేతకానితనాన్ని మరిచిపోవచ్చు.
    ఇక లాభంలేదని మెట్లెక్కడానికి నిర్ణయించుకున్నాడు. ఒకడుగు ముందుకు వేయబోయి ఏదో శబ్దం కావడంతో ఆగిపోయాడు. లిఫ్ట్ వైపు చూశాడు పైనున్న నెంబర్లు మారుతున్నాయి.
    కిందకు దిగిన లిఫ్ట్ ఆగింది. తలుపులు తెరుచుకున్నాయి.
    అందులోకి వెళ్ళి, ఏ బటన్ నొక్కితే చివరి అంతస్తుకెళుతుందో తెలియని ఆంజనేయులు చేష్టలుడిగి చూస్తుండిపోయాడు.
    ఏమిటాలస్యం అని లిఫ్ట్ తనను ప్రశ్నించినట్టు భ్రమపడ్డాడు. తన ఆందోళనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని అటు ఇటు చూశాడు. జీన్స్ వేసుకున్న ఓ అమ్మాయి రెస్టారెంట్ లోకి వెళుతోంది. జిలేజీ గాలి వీస్తోంది. లోపల జిలేబీలు కాలుస్తున్నారేమోననుకున్నాడు ఆంజనేయులు. చక్కరపాకం గాలి పరిసరాలకు తీపిని అద్దుతోంది.
    లిఫ్ట్ తలుపులు మూసుకున్నాయి. అతని పుష్పక విమానం ఖాళీగానే పైకెగిరిపోతోంది.
    లిఫ్ట్ ను ఆగమని అరవాలనిపించింది. కానీ దానికి మనుషుల భాష తెలీదు, బటన్ల భాష తప్ప.
    అటుగా వెళుతున్న సర్వర్ ను ఆపి, మెట్లెక్కడ అని అడిగాడు. అతను చూపించాడు.
    ఉస్సూరుమంటూ మెట్లెక్కడం ప్రారంభించాడు.
    తనకు చాలా విషయాలు తెలీవు. లిఫ్ట్ ను ఎలా ఆపరేట్ చేయాలో తెలీదు. ఏసీ ఎలా వేసుకోవాలో రాదు. టీవీ ఛానల్స్ మార్చడం తెలీదు. స్కూటర్ ను నడపడం రాదు.
    తను కాలంతో పరుగెత్తలేడు. కుంటిగా నడుస్తూ గత శతాబ్దంలోనే వుండిపోయాడు.
    మెట్లు చచ్చిన పాములను పేర్చినట్టున్నాయి.
    చివరి అంతస్తుదాటి రూఫ్ గార్డెన్స్ చేరుకున్నాడు.
    ఒక్కసారిగా కొత్త వాతావరణంలోకి వచ్చినట్టయ్యింది. శకుంతల గులాబీరంగు చీరలో సాయంకాలం కాలక్షేపం కోసం దిగిన గంధర్వ కన్యలా వుంది. ప్రియంవద చుడీదార్ లో నాగరికత ఆడ వేషం వేసినట్టుంది. రాహుల్, జీవన్, అభినయ్ రంగురంగుల డ్రస్సుల్లో హుందాగా, అందంగా వున్నారు.
    ఆంజనేయులు అప్రయత్నంగా తనకేసి చూసుకున్నాడు.
    రంగు వెలసిపోయిన ఫ్యాంటు, పెద్ద కాలర్ తో షర్టు, కాళ్ళకు పాత హవాయ్ స్లిప్పర్లు.
    బెల్ బాటమ్ ఫ్యాషన్ ఎంత పాతది. ఆ మోడల్ పోయి టైట్ ఫ్యాంట్లు, బ్యాగీలు సెమీ బ్యాగీలు వచ్చాయి. షర్టు అయితే ఎప్పుడో అడవిరాముడు కాలంనాటిది. బ్యాగీ ఫ్యాంటు కుట్టించుకోవాలన్న కోరికకు ఎన్నేళ్ళు? రెండు మూడు సంవత్సరాలనుంచీ అనుకుంటూనే వున్నాడు.
    తన మీద తనకే జాలేసింది అతని మిగిలిన వాళ్ళతోపాటు పరుగెత్తడానికి తన కాళ్ళకు డబ్బు చక్రాల్లేవు. వాళ్ళంతా పావురాళ్ళు తను మాత్రం నల్లగా వున్న కాకి.
    "హలో! హలో!" ఆంజనేయులు గారూ! రండి" అభినయ్ పలకరించాడు.
    నవ్వడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు అతను.
    "నిన్న మీకు పరిచయం చేశాను. గుర్తుందా ఆంజనేయులుగారు, క్లర్క్ మన ఆఫీసులోనే" అభినయం పరిచయం చేశాడు శకుంతలకు.
    "సారీ! గుర్తులేదు." అని రెండుచేతులూ జోడించింది. ఆ మాటలకు గుండెలమీద చేతులతో కొట్టినట్టు గిలగిల్లాడిపోయాడు ఆంజనేయులు.
    నిజమే తనను ఎవరూ గుర్తుపెట్టుకోరు. తనలో ఏం ప్రత్యేకత వుందని గుర్తుపెట్టుకుంటారు.
    లిఫ్ట్ లో రాకుండా మెట్లెక్కి వచ్చినట్టున్నారే బాగా అలిసిపోయినట్టు కన్పిస్తున్నారు" రాహుల్ అడిగాడు.
    "అదీ....అదీ" నసుగుతున్నాడు అతను.
    "మెట్లెక్కి రావడం నామోషి కాదు లెండి. ఆరోగ్యానికి మంచిది కూడాను" మహాలింగం కరుకుగా జవాబు చెప్పాడు.
    అప్పుడు చూశాడు అనజనేయులు మహాలింగాన్ని. కాస్తంత మాసిపోయిన జుబ్బా, మరీ కొట్టొచ్చినట్టుకనిపించే ఎర్రటి ఫ్యాంటులో అతను దరిద్ర దేవత మెల్లకన్నులా వున్నాడు. ఆపదనుంచి రక్షించావన్నట్టు కృతజ్ఞతతో చూశాడు అతనివైపు. ఆంజనేయులు ఎందుకు మెట్లెక్కి వచ్చాడో అక్కడున్న వాళ్ళలో మహాలింగానికే తెలుసు. అతను అన్ని అవస్థలూపడి చిట్టచివరికి మెట్లెక్కి వచ్చాడు గనుక.
    "అడుగో వినయ్"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra