Home » M d sowjanya » Soujanya Saahithi

           

                                       మొదటిసారి

                                                                 ---హితశ్రీ


    గార్డు విజిల్ వేసి పచ్చజండా ఊపాడు. రైలుపెట్టె తలుపువారగా నిలబడి పదేపదే ఏమేమో చెబుతోంది. శ్రీధర్ పరధ్యానంగా ఊ కొడుతున్నాడు. రైలు కదలబోతూంది. పరీక్షకి వెడుతూ  విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా ఆమె ఏవేవో  సంగతులన్నీ గుర్తుచేసుకొని చెబుతుంటే  అతనికినవ్వొచ్చింది. ఆమె ఏవో సంగతులన్నీ గుర్తుచేసుకొని చెబుతుంటే అతనికినవ్వొచ్చింది. ఆమె ఏవో సలహాలిస్తోంది. అంటే శాసనాలన్నమాటే. అది శ్రీధర్ కి పూర్తిగా తెలుసు. శాసించ బడటం అతనికి కొత్తకాదు. ఒకవిధంగా మొదటినుంచీ తన జీవితాన్ని ఎవరో శాసిస్తూనే వున్నారు. ఎదురుతిరగాలని అతని కెప్పుడూ తోచలేదు. ఆ అవసరమూ కనిపించలేదు. ఏ విషయం గురించీ అంతగా ఆలోచించటం అతని కలవాటు కూడాలేదు.
     రైలు భారంగా కదిలింది.
     'జాగ్రత్త, తలుపువేసుకో' అన్నాడు శ్రీధర్. ఆమె తలతిప్పింది కాని అలాగే నిలబడ్డది. రైలు దూరమయాక అతను కాళ్లీడ్చుకుంటూ స్టేషన్ బయటికివచ్చాడు. రిక్షాలో కూర్చొని సరాసరి ఇంటికి వచ్చాడు. ఆమె నిర్ణయించిన కార్యక్రమం గుర్తు తెచ్చుకొని ఫ్లాస్కులో కాఫీ కప్పులో పోసుకొని తాగాడు. పడకకుర్చీలో పడుకొని, స్టేషన్లో కొని తెచ్చిన పత్రికలు తిరగవేశాడు. ఏదీచదవబుద్ది  పుట్టలేదు. ఇల్లంతా కలయచూశాడు. దూలాలు లెక్కపెట్టాడు. కాలం గటవటం లేదు. ఎప్పుడు గడియారం వైపు చూసినా ముళ్లు జబ్బుచేసి కదలలేక పోతున్నట్లుగా కనిపించసాగాయి. చీకటి పడటానికి చాలా వ్యవధి వుంది. ఏడుగంటలైతే శారద కార్యక్రమం ప్రకారం తను హోటల్ కి వెళ్ళి భోజనం చెయ్యాలి. ఆ థరువాత ఏదో కాసేపు చదివి హాయిగా నిద్రపోవాలి.


    భోజనం, చదువు, నిద్ర, ఆఫీసుపని. ఇదీ తన జీవిత  చక్రం నడక. గాడి తప్పని గతి.  అకస్మాత్తుగా శ్రీధర్ కి ముందెన్నడూ కలగనంత విసుగు కలిగింది. తీవ్రమైన అసంతృప్తి కలిగింది. ఆఫీసులో చేసినపనే మళ్లీ చెయ్యాలి. కొత్తదనం ఏమీ లేదు. భోజనం, చదువు, నిద్రలలో ఏదీ మామూలుకి భిన్నమైనా శారద ఊరుకోదు. యక్ష ప్రశ్నలతో వేధిస్తుంది. ఒక్కొక్కప్పుడు తనకిమహా చిరాకువేస్తుంది.
     శారద జ్ఞప్తికి రాగానే, ఆమె మామూలుగా తన కెదురుగా కూర్చునే కుర్చీవైపు చూశాడు శ్రీధర్. ఆమె అక్కడ లేకపోవటం ఏదో కొరతగావుంది. హృదయం గతుక్కుమంది. కానీ పదిరోజులు గిర్రున తిరగగానే ఆమె వస్తుంది కదా అని సరిపెట్టుకొన్నాడు. వివాహమైన తరువాత అదే మొదటిసారి ఆమె పుట్టింటికి వెళ్లటం. ఇల్లంతా ఏదో కొత్తగా కనిపించిందతనికి. ఏదో కావలసీ అక్కరలేని సెలవు రోజు వచ్చినట్లనిపించింది. తనేం చేసినా ఎవరూఏమీ అడగటానికి అవకాశంలేని లోకంలోకి తను హఠాత్తుగా ప్రవేశించినట్టుగా అనుభూతి  పొందాడు. ఇష్టంవచ్చినట్లు తిరిగి ఇష్టం వచ్చినపుడు ఇంటికి  రావాలనే  వింత కోర్కె కలిగిందతనికి. ఆలస్యంగా ఇంటికి రావద్దని శారద ఎప్పుడూ అతనిని శాసించ లేదు. కాని అతని కాళ్లే ఇంటికి వేళకి చేర్చేవి అప్రయత్నంగా. శారద చూపుల్తోనే శాసిస్తుందనే అనుభూతి అతనికి చాలాసార్లు కలిగింది. అలాఎందు కనుకోవలసి వచ్చిందంటే మాత్రం అతనేం చెప్పలేడు.
    సాయంత్రం ఆరుంబావయింది. శ్రీధరే లేచి గదికి తాళంవేసి బయటికొచ్చాడు. హోటలుకివెళ్ళి టిఫిన్ తీసుకొని కాఫీతాగాడు. హోటలు బయటికి రాగానే కిళ్లీవేసుకోవాలనిపించింది. కిల్లీ ఒకటి కొన్నాడు. అకస్మాత్తుగా అతనికి సిగరెట్ తాగితే బాగుండుననే ఊహ కలిగింది. వెంటనే సిగరెట్ పెట్టె ఒకటి కొని సిగరెట్ వెలిగించాడు. మొట్టమొదటిసారి దొంగతనంగా చిన్నప్పుడు సిగరెట్ కాల్చిన దృశ్యం అతనిమనసులో మెదిలింది. పొగ చిత్రంగా వొదుల్తూ ఆనందిస్తుంటే చెంప ఛెళ్ళుమంది.  ఉలిక్కిపడి సిగరెట్ దూరంగాపారేశాడు. దొడ్లో చాటుగా తను చేసినపని  ఎలా చూశాడో అన్నయ్య. "వెధవా, ఏంపని" ఈసారి ఇలాంటిపని చేస్తే ఇంట్లోంచి తరిమేస్తాను అన్నాడు. తను భయంతో వొణికిపోయాడు. అన్నయ్య మంచివాడు. నాన్నతో ఆ విషయం చెప్పివుంటే ఏం జరిగేదో ఊహించుకుని తను నిలువునా కంపించాడు. కాని అలా జరగలేదు. ఆ రోజునించీ సిగరెట్ పేరు చెబితేనే తనకేదో భయంకలిగేది. నాటికి నేటికి మళ్లీ తను సిగరెట్ వెలిగించాడు. ఇప్పుడే భయమూ లేదు. ఏదో తనకి దూరదూరంగా వుంటూ వచ్చిన స్వేచ్చ తటాలున అందినట్టయింది. దేనికైనా ధైర్యం చెయ్యాలి.
     ధైర్యం! తనకి ధైర్యం వుందా? లేదనటానికి అతని మనసొప్పలేదు. తను ధైర్యవంతుడు కాకపోతే క్లాస్ మేట్ శ్యామకి ప్రేమలేఖ ఎలారాయగలిగేవాడు. ఈ విషయం జ్ఞప్తికి రాగానే అతనిముఖం చిన్నబోయింది. తనేదో ఘనకార్యం చేశానని అనుకున్నాడు. లైబ్రరీలో ఒంటరిగా వున్నప్పుడు ఆమె కనిపించి పెద్దవాళ్లతో  మాట్లాడమని రహస్యంగా అంటే ఉప్పొంగిపోయాడు. కానీ తీరా ఇంటికి వెడితే తల వాచేట్టు చివాట్లు పెట్టింది. అవమానంతో ముఖందించుకుని  క్షమాపణ చెప్పుకున్నాడు. ఆమె తలచుకుంటే కాలేజీనుంచి సస్పెండు అయేవాడు. బ్రతుకు అల్లరిపాలయేది. ఆక్షణంలో ఆమెమీద తనకి ఎంతో కృతజ్ఞతా భావం ఏర్పడ్డది. అయితే ఆమె శారద స్నేహితురాలని ఒకరోజున తటాలున వెల్లడయే సరికి తనకి ఇంట్లోంచి పారిపోవాలనిపించింది. కాని శారద ఆ విషయం తనదగ్గిర ఎత్తలేదు. శ్యామ చెప్పకుండా ఉండదు. శారద తనని సంజాయిషీ ఎందుకడగలేదో తనకి ఆశ్చర్యం గానే వుంది. నిజానికి తన తొందరపాటుకి ప్రాయశ్చిత్తం జరిగి నప్పటినుంచీ తను బుద్దితెచ్చుకొనిజాగ్రత్తగానే మసలుకుంటున్నాడు. కన్నెత్తి పరాయిపిల్లవైపు చూడటానికి సాహసించడు. ఎవరో ఏదో ఆంక్షపెట్టినట్టుగా ప్రవర్తించసాగాడు. తన రహస్యం గుప్పెట్లో పెట్టుకుని శారద తన ప్రవర్తనని శాసిస్తోందా? ఈ ఊహ రాగానే అతని మనసు తిరగబడ్డది. ఎప్పుడో ఏదో పొరపాటుచేస్తే దానిఫలితం జీవితాంతం అనుభవించేలా ఆ రహస్యాయుధాన్ని ఇతరులు తనమీద ప్రయోగించటం అన్యాయం అనిపించింది.
      శ్రీధర్ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఎందరో ఎన్నో తప్పులు చేస్తూనే వుంటారు. తప్పించుకుని తిరుగుతూనే వుంటారు తన ప్రారబ్దం ఏమిటో, చెయ్యక చెయ్యక ఏదో పొరపాటు చేస్తే మొదటిసారే బెడిసికొడుతుంది. పరీక్షల విషయంలో అలాగే అయింది. తను శ్రద్దగా చదువుకునేవాడు. స్కూల్ ఫైనల్ లో సహవాస దోషంవల్ల ఒకపొరపాటు చేశాడు. పుస్తకాల పురుగులా ఊరికే సంవత్సరం మొదటినుంచీ కష్టపడి చదవాల్సిన అవసరంలేదనీ ముఖ్యమైనవి ఊహించి పరీక్షలముందు కాస్త కష్టపడి చదివితే చాలనీ తన స్నేహితులు  నూరిపోశారు. వాళ్లు అలా చదివి ప్రతిక్లాసూ ప్యాసవుతుండటం తను కళ్లారా చూశాడు. సెలెక్షన్ పరీక్షలముందు తను ఆపద్దతి ప్రకారమే చదివాడుకాని ప్రశ్న పత్రం చూసేసరికి ముచ్చెమటలు పోసాయి. గత్యంతరం లేక పక్కన వున్న విద్యార్ది పేపర్లోచూసి కాపీచేయటం ప్రారంభించాడు. జీవితంలో మొదటిసారిగా ఆపని చెయ్యటం ప్రారంభించగానే భయంతో గాభరాగా  మాటిమాటికీ టీచర్ వైపు చూడసాగాడు. ఆయన విషయం కనిపెట్టి చూడనట్టే నటించి తన దొంగతనాన్ని  పట్టుకున్నాడు. మంచివాడు కావటంవల్ల పేపరులాక్కుని వదిలివేశాడు. ఆ సంవత్సరం స్కూల్ ఫైనల్ పరీక్షకి వెళ్ళలేదు.  ఎందరో తనకళ్లముందే కాపీచేసి ప్యాసవుతూనే వున్నారు. కాని ఆ విషయం తలుచుకుంటేనే తనకిగుండె గతుక్కుమంటుంది.
    శ్రీధర్  రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. తనలాగా ఎదురుదెబ్బలు తిన్నవాళ్లు అరుదేమో. తను దురదృష్టవంతుడు. చేతిలో డబ్బులేక అవస్థపడే రోజుల్లో మనసొప్పక  పోయినా కంట్రాక్టరు దగ్గర్నించి మొట్టమొదటి సారిగావందరూపాయలు వాపసు ఇప్పించిగాని ఊరుకోలేదు. మరొక సారి అలాంటిపని చేస్తే రిపోర్టు చేస్తానన్నాడు. ఇంకానయం.  ఆ పనేచేసివుంటే తను ఉద్యోగంకాస్తా వూడేది.  ఆరోజునించీ లంచంసంగతి దేవుడెరుగు. కంట్రాక్టర్ని  చూస్తేనే, అతనితో మాట్లాడాలంటేనే  భయంవేస్తుంది తనకి.
     శ్రీధర్ కి ఒకవిషయం ఆశ్చర్యంగా వుంది .దేశంలో ఎంతో అవినీతి వుంది. ఎన్నో కూడనిపనులు జరుగుతున్నాయి. తను ఎంత చిన్నతప్పు చేసినా వెంటనే దండన జరుగుతోంది. బహుశా తను ఏ చెడ్డపనీ మనస్పూర్తిగా చెయ్యకపోవటమే అందుకు కారణమేమో!ఈ ఊహ రాగానే అతనికి నవ్వు వచ్చింది. ఈసారి తను తప్పుదారి తొక్కాలిసిన అవసరం ఏర్పడితే నిస్సంకోచంగా ఆపనిచెయ్యాలి. నిస్సంకోచంగా! ఇదేమిటి తనిలా ఎందుకు ఆలోచిస్తున్నాడు. చప్పున ఆలోచించటం మానేశాడు శ్రీధర్. రోడ్డుకి రెండువైపులా వున్న ఇళ్లనీ, దుకాణాలనీ చూస్తూ నడవసాగాడు. ధియేటర్ దగ్గర హడావిడిగా వుంది. ఏదో కొత్తచిత్రం విడుదలైంది.  సినిమాకి వెళ్లాలనిపించింది శ్రీధర్ కి. భోజనం చెయ్యలేదు. ఆటవిడిచి పెట్టింతరువాత హోటల్లో భోజనం దొరకదేమో. అయినా ఒకపూట  భోజనంకోసం  తను ఎందుకు అంతగా ఆలోచించాలి శారద జ్ఞప్తికి వచ్చింది. అయినా అతను లక్ష్యపెట్టలేదు. టికెట్టుకొనుక్కుని లోపలికి వెళ్లాడు సీటులోకూర్చొని .యధాలాపంగా పక్కకి తిరిగిచూసే సరికి శ్యామ కనిపించింది. ఆమె  కూడా అతనివైపు చూసింది. ఆమె భావగర్బితంగా నవ్వుకునట్లు శ్రీధర్ అనుమానించాడు. అతనికి కోపం వచ్చింది. తీరని అసహనం కలిగింది. ఆనాటి ఉదంతం తర్వాత వాళ్లిద్దరూ ఎప్పుడూ ముఖాముఖి  మాట్లాడుకోలేదు. ఏదోమాట  అని ఆమె హృదయాన్ని గాయపరచాలనే ప్రబలవాంఛ కలిగిందతనికి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra