Home » Chandu harshavardhan » నల్లతంబి

ఇప్పుడు పరిసరాలనే కాదు. తనను తానే మరచిపోయే స్థితిలో వున్నాడతను.
ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యమైపోయిందా బీచ్. కానీ, ఎవరో అతని ప్రక్కనేవచ్చి నిలుచున్నారు.
ఎంత ప్రయత్నించినా మూసుకుపోతున్న కనురేప్పలతో ఆ ముఖాన్ని గుర్తించలేకపోయాడు.
అలాంటి ఆవకాశం కోసమే చాలా సేపటినుంది ఎదురు చూస్తున్న ఆ సుందరి అతని దగ్గరకు వచ్చింది. అతను తనను పలకరించే స్థితిని ఎప్పుడో దాటిపోయాడని గ్రహించిందామె. ఎవరో స్త్రీ తన సమీపంలో వుందని మాత్రం అర్ధమైందతనికి.
ఆమె....కిలకిలారావాలు చేస్తూ ఎదురైన కాల్ గరల్స్ లో ఒక యువతి.
అది తన భ్రమ కాదుకదా అన్నట్టు అనుమానంగా కన్నుల్ని నులుముకుని మరీ చూశాడు. అవును....ఆ వయ్యారి కాల్ గరల్ అనడంలో ఎలాంటి సందేహం లేనట్టే!
ఇప్పుడతని మనసుతోపాటు శరీరం కూడా అదుపు తప్పింది. మొద్దుబారిన అతని మెదడును కామం అనే పిశాచగణం తొలుస్తోంది.
అంత సన్నిహితంగా వచ్చిన ఆ సుందరిని దూరంగా వెళ్ళి పొమ్మనడానికి కూడా సక్తి లేకపోయిందతనిలో. మత్తులో మునిగి వున్న అతనికి ఆమె మెత్తని స్పర్శ వెచ్చగా తాకి గమ్మత్తుగా ఆ మత్తు విడిపోయిందతనిలో.
ఇప్పుడు మరో మట్టుకు బానిసైపోయాడు. ఆమె యవ్వనం అతని నరాలను మీటి వదిలింది.
తడబడుతున్న చేతులతో ఆమెను గుండెకు హత్తుకున్నాడు. అతని మత్తు కన్నులకు సౌందర్యాధి దేవత వీనస్ లా వుందామె.
కోరివచ్చిన మగువను కాదనలేని బలహీనత. మత్తును మించి శరీరాన్ని కాల్చేస్తున్న కోరిక. ఎదురుగా విందు భోజనంలా అందాల భరణి.
ఆ సుందరి కూడా ఏదో పెన్నిధి లభించినట్టు ఆ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేనట్టు బలంగా అతన్ని కౌగలించుకుంది.
పండు వెన్నెలలో, మెత్తని ఇసుక పాన్పుపై ఆ ఇరువురూ ఏక మవ్వడం, సృష్టిలోని మదిరిమను ఆస్వాదించడం చూసి సిగ్గుతో మబ్బు చాటుకు తప్పుకున్నాడు చంద్రుడు.
లేలేత సూర్యకిరణాలు ముఖంమీద పడుతుండగా ముందుగా ఆమె మేల్కొంది. ఖంగారుగా తన పయ్యెదను సరిచేసుకుని అతనివైపు క్షణం చూసి ఆ ప్రాంతం నుంచి తప్పుకుంది.
ఆమె సంజీవి. తాను అనుకున్నది సాధించింది.
అధికారి మాత్రం ఇంకా అంతులేని మత్తులోనే వున్నాడు.

                                               *    *    *
ఆకాశాన తూర్పుదిక్కు ఎర్రబారుతోంది.
కంటెదురుగా కనిపిస్తున్న కాల్ గరల్ వంక అధికారి ఒక క్షణం విభ్రమంగా చూశాడు.
ఎదురుగా ఉన్నామేను, తను ఆడబోతున్న నాటకంలో తన వంతు పాత్రను నిర్వహించడానికి, సంజీవి ఆమెకు గతరాత్రే పుష్కలంగా డబ్బిచ్చింది.
రాత్రి జరిగిన దృశ్యాలన్నీ ఒకటొకటిగా గుర్తొచ్చి అతని మనసంతా కలగాపులగమై పోయింది.
రాత్రంతా తనకు స్వర్గ సౌఖ్యాలందించిన సుందరి ఇప్పుడు తన కెదురుగా వున్నామేనన్న భ్రమలో వున్నాడు అధికారి.
వెంటనే మరొక అనుమానం.
అతని ఆలోచనను గ్రహించినట్టుగా....అంతవరకు అమాయకంగా కనిపిస్తున్న ఆమె ముఖంలో సీరియస్ చోటు చేసుకుంది.
"నా డబ్బు నాకు పారేస్తే నా దారిన నేను పోతాను" వ్యాపార సరళిలో అందామె.
అధికారి అయోమయంగా చూశాడు.
"రాత్రి ఏం మాట్టాడావో గుర్తులేదా?"
తల అడ్డంగా వూపాడు అధికారి.
"అవునులే, అవసరం తీరిపోయింది__ ఏం గుర్తుంటుంది! ఆ మైకం, ఆ వలపు, ఆ వేడి అప్పటితో సారి " కటువుగా వున్నాయి ఆమె మాటలు.
"అబ్బబ్బే...అదేమీ లేదు. నేను నేను..." అధికారికి ఆపై మాట్టాడడానికి గొంతు పెగలలేదు. మాటలను వెదుక్కుంటున్నాడతడు.
రాత్రి తనేం మాట్టాడివుంటానోనని గుర్తు చేసుకోవడానికి మరోసారి ప్రయత్నించాడు. "ప్చ్" తానసలు మాట్లాడినట్టే గుర్తు లేదు!
"ఒళ్ళు మరిచేట్టు తాగి, డబ్బుకోసం ఒళ్ళు అమ్ముకునే వాళ్ళతో గడపడం కన్నా.....సంప్రదాయబద్దంగా నీకు తగిన ఆమెను పెళ్ళి చేసుకుంటే మంచిది" ఓ ఉచిత సలహా పడేసిందామె.
"షటప్, నా విషయాలు నీ కనవసరం. ఇదిగో....నీకెంత కావాలో అంత తీసుకునిపో....పర్సు ఆమె ముఖాన విసిరికొట్టాడు. స్థాణువులా నిలిచి పోయిందామె.
ఆమెను పట్టించుకోకుండా లేచి విసురుగా బీచ్ లో నుంచి రోడ్డు ఎక్కాడు అధికారి.
సంజీవి అతనికోసమే ఎదురు చూస్తున్నట్టు ఎదురు వెళ్ళింది.
ఆమెను పలకరించకుండానే లోనికి వెళ్ళాడు అధికారి.
అతని అంతరంగంలో చెలరేగి వున్న అలజడి ఎలాంటిదో ఆమెకు తెలుసు కాబట్టి కావాలనే ఆమెకూడా మౌనం వహించింది.
సూట్ కేసులో బట్టలను సర్దుకుని ఎక్కడికో వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతున్న అతన్ని గమనించాక, తమాయించుకోలేక తనే పలకరించింది. "మళ్ళీ ఏదయినా టూర్ ప్రోగ్రామ్ వుందా?" అతను పెదవి విప్పలేదు.
"నిన్నే అడిగేది....రాత్రి ఇంటికి రాకుండా ఎక్కడా వున్నావు.....నీకోసం రాత్రంతా మెలుకువతోనే వున్నాను తెలుసా?"
సంజీవి వైపు చురుగ్గా చూశాడు అధికారి.
ఏ భాగాన్ని చదివాడో, ఏ వూహల్ని గుర్తించాడో కానీ విసుక్కోకుండా మౌనం వహించాడు.
"నీకోసం ఎదురు చూసేదాన్ని నేనొకదాన్ని వున్నాననే విషయమే మరచిపోయావు.
ఇంతవరకెప్పుడూ నువ్వు ఇలా చేయలేదు. నీలో ఏదో మార్పు వచ్చినట్టుంది. అదీ ఈ ఒక్క రాత్రిలోనే వచ్చింది. అదేమిటో నేను తెలుసుకోవచ్చా?"
గతుక్కుమన్నాడతను. మహావిరాగిలా ఆమెను తృణీకరించైనా తాను ఓ వేశ్య....కులట...కాల్ గరల్ తో రాత్రంతా గడిపానని తెలిస్తే తాను చులకనై పోతాడు. ఆమె గెలుస్తుంది. తాను ఓడిపోతాడు.
తనలో తాను నవ్వుకున్నాడు. మేకపోతు గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంటూ, "పిచ్చి వూహలేమీ పెట్టుకోవద్దు సంజీవి! నేనొక పనిమీద వెళుతున్నాను. మూడు నాలుగు రోజులవరకు రాను. నా కోసం ఎదురు చూడవద్దు" అన్నాడు అధికారి.
"మళ్ళీ ఏదయినా ఎడ్వంచర్ చేస్తున్నావా?"
"అదేమీ కాదు..."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra