ముకుందం అప్పుడప్పుడూ వచ్చివెడుతున్నాడు తప్ప పరమహంసజాడ లేదు....తను రహస్యంగా కూర్చునే అంతా నడిపిస్తాననడం గుర్తున్నా అసలు రాజారాంతో చేతులు కలిపేతననిలా ఇరకాటంలో పెట్టాడా అన్నా అనుమానం యీ మధ్య చాలా ఎక్కువగా బాధిస్తుంది. ఉద్యమం ఏస్థాయికి చేరింది తెలీడం లేదు.....ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది బోధపడలేదు.
    
    కనీసం నిమ్మరసం ఇచ్చి నిరాహారదీక్ష విరమింపచేయాలని ఏనాయకుడూ ప్రయత్నించడంలేదు.
    
    ఇకతన వల్ల కాదు.
    
    తనను అంతం చేయడమేపరమహంస రాజారాంల పథకం అయితే అర్జెంటుగా తనకు తానుగా నిమ్మరసంకలుపుకునితాగాలి....స్వయంగా సీతారామరాజు కలలోకొచ్చి తన ముందు ప్రాధేయపడి విరమింపచేసాడని ప్రెస్ స్టేట్ మెంటివ్వాలి.
    
    ఇలా అనుకుంటున్న సమయంలో ముకుందం వచ్చాడు.
    
    రాగానే అమాంతం అతడ్నిచుట్టేసి ప్రజలకి వినబడేట్టు 'వందేమాతరం' అన్నాడు.
    
    ముకుందం ఒడిలో తల పెట్టుకుని వెక్కిపడిపోతూ "నాసంగతేమిటి....నన్నేం చెయ్యాలని ఇలా ఇరికించారం"టూ రహస్యంగా కుమిలిపోయాడు.
        
    "నువ్వే ఇలా అనుకుంటే ఏభైలక్షలదాకా ఖర్చుచేసిన నా మాటేమిటి" ఓదార్చాడు ముకుందం....."నువ్వు అసాధారణమైన కీర్తిని సంపాదించుకుంటున్న క్షణాలివి......"
    
    "కాని నేను కీర్తిశేషుడ్నయ్యేట్టున్నాను......"
    
    "అలాఅయితే నీ విగ్రహావిష్కరణకి పది లక్షలు ఖర్చు.
    
    చేస్తాను"
    
    "నీబొంద" ఉక్రోషంలో ఏకవచనానికి దిగిపోయాడు బ్రహ్మాజీ."నేను పోయాక నా విగ్రహమెవడిక్కావాలి"
    
    ఇక్కడజరుగుతున్న చర్చేమిటో తెలీని ప్రజకళ్ళొత్తుకుంటుండగా.
    
    హఠాత్తుగా అక్కడికి దూసుకొచ్చారు పదిమంది ప్రతిపక్షాలకి చెందిన ఎమ్మెల్యేలు. వస్తూనే శవంలా పడివున్న బ్రహ్మాజీని చుట్టుముట్టి వివిధ భంగిమల్లో కొన్ని ఫోటోలు తీసుకున్నారు. పత్రికలకు అందించే ఉద్దేశంతో.
    
    "మహాజనులారా" పాతిక సంవత్సరాలుగా ప్రతిపక్షానికే పరిమితమైపోయిన పుల్లారావు ఆవేశంగా మాటాడ్డం ప్రారంభించాడు "ఇదిసుదినం. మహానుభావుడు సీతారామరాజు సంస్మరణం. ప్రతీ వ్యక్తి బ్రతకాల్సినమంచిదినం. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కాని ఓ లక్ష్యం కోసం ఆత్మత్యాగానికి సిద్దపడే వాళ్ళు.
    
    అతిస్వల్పం.....ఇంత కాలందేశంలో గాంధీ నెహ్రూనేను మాత్రమే త్యాగనిరతి గలవాళ్ళము అనుకుంటే ఇదిగో ఇప్పుడూ మా అడుగు జాడల్లో నడవడానికి శ్రీబ్రహ్మాజీ కూడా సిద్దపడ్డారు. అయితే నేను కాని, గాంధీ కాని నెహ్రూకాని కోరింది ఒక్కటే.....స్వేచ్చ.....అవును.....అందరూ స్వేచ్చగా బ్రతకాలని మేం అనుకున్నాం.....ఆ విషయం ఆ విషయం బర్మతి ఆస్రమంలో నేనూ, గాంధీ గట్టిగా చర్చించాం కూడా......అయితే మహాజనులారా......ఇప్పుడేం సాదించాం అది చాలా గుడ్డి ప్రశ్న మీరంతా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న కూడా"
    
    ఇప్పుడు ప్రసక్తి ఎటు మళ్ళించాలో పుల్లారావుకీ పాలుపోలేదు. అనే ఆలోచనతో కించిత్తు ఆందోళన చెందాడు కూడా....." ఇక్కడ మనం ఆలోచించాల్సింది మరోటుంది. మహాజనులారా ఏ పార్టీలు గాని, ఏ నాయకులుగాని ఆలోచించాల్సింది ప్రజల శ్రేయస్సు. కాబట్టి మేం ఏ పార్టీకి చెందిన వాళ్ళమైనా బ్రహ్మాజీని సపోర్టు చేస్తున్నాం. అతడు పోవడమే తప్పనిసరైతే రాష్ట్రంలో రక్తపాఠం తప్పదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతకుమించి బ్రిటిష్ వారిని వెంటనే ఆంధ్రాకి రప్పించి ప్రజలముందు క్షమార్పణ చెప్పించాలని కేంద్రాన్ని కోరుకుంటూ సరిగ్గా సమన్వయ సంఘం తరఫున పిలుపునిస్తున్నాం"
    
    వందేమాతరం.......చప్పట్లు......కేకలు......ఫోటోలు
    
    దుర్గంధభూయిష్టమైన అవకాశవాదం రెచ్చిపోతుంటే తనను అడ్డం పెట్టుకుని అంతా ఎదిగిపోతున్నారనుకున్న బ్రహ్మాజీ మళ్ళీ స్పృహతప్పిపోయాడు.
    
                                                                * * *
    
    "ప్రభుత్వాధి నేతల్లారా......స్వార్ధపూరిత శక్తుల ప్రేరణలో రూపుదిద్దుకుంటున్న ఈ ఉద్యమాన్ని ఆపండి. ముడుచుక్కూచున్న మేధావుల్లారా......ప్రగతికి సంకెళ్ళు వేస్తున్న రాజకీయవాదుల అసలు రంగుని ప్రజలకి తెలియచెప్పిసంఘ విద్రోహ శక్తుల్ని తరిమికొట్టే శతఘ్నులుగా మారండి. ఓ యూనివర్సిటీ విధ్యార్ధిని ప్రతిస్పందన అబ్జర్వర్ తొలి పేజీలో ఓ ఇంటర్వ్యూలో ప్రచురించబడింది.
    
    విధ్యార్ధిని పేరు ప్రచురించలేదు త్యాగి...... కాని నిన్న తను నిర్వహించిన ఇంటర్వ్యూ తొలిభాగంలా పబ్లిష్ చేశాడు.
    
    అమరవీరుడైన సీతారామరాజు కోసం నిర్వహించబడుతున్న ఈ ఉద్యమం గురించి మీరెలా స్పందిస్తున్నారు.
    
    ఇది ఓ రాజకీయ ఎత్తుగడ. సింహాసనం కోసం అంగలార్చుకుపోతున్న ఓ నాయకుడు సంధించిన అస్త్రమిది. అంటే బ్రహ్మాజీ అని మీ అభిప్రాయమా.
    
    అది అందరికి తెలిసిన విషయమేగా.....తనీనాడు రాష్ట్రంలో మరెన్నో సమస్యలుండగా సుమారు డెబ్బై ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనగురించి ఇప్పుడెందుకు గుండెలు బాదుకుంటున్నట్టు.
    
    నిజంగా ఇది అమరవీరుడు విప్లవయోధుడైన సీతారామరాజుపై మమకారమే అయితే అతడి సిద్దాంతాల స్ఫూర్తిని ప్రజలకి తెలియచెప్పాలిగని బ్రిటిష్ వారిని ఇక్కడకు వచ్చి క్షమాపణలు చెప్పమనడం జరగదని దాన్ని జరపాలని ప్రయత్నించి ఈ ప్రభుత్వం ఇలా విఫలమైందని ప్రజలకి తెలియచెప్పడమేగా."
    
    కాని చాలా మంది ప్రజలు మా ఉద్యమంలోపాలు పంచుకుంటున్నారుగా" వాళ్ళ ఉద్యమ లక్ష్యం తెలీని అమాయకులైన కొందరైతేఇలాంటి అవసరాలకు డబ్బుతో కొనబడుతున్న సంఘవిద్రోహశక్తులు మరికొందరు"
    
    అంటే ప్రస్తుత ప్రభుత్వం సమర్ధవంతమైనదని మీరు నమ్ముతున్నారా నేను ప్రభుత్వం అయితే ప్రజలు పోరాడాల్సింది ప్రస్తుతం పీడిస్తున్న సమస్యలగురించి తప్ప ఎప్పుడోరాలిపోయిన అమరయోధుడి గురించి కాదు. అటు బ్రహ్మాజీ రోజు రోజుకి శుష్కించిపోతున్నాడు. అది దేశానికి పెద్ద నష్టమని నేననుకోను.
    
    ఇలాంటి కుహ నా రాజకీయనాయకుడు రాలిపోయినా చింతించాల్సినపని లేదు..... అయినా అలాంటిస్థితే వస్తే ఏదోకారణం వెదుక్కుని ఆయననిరాహారదీక్షను ఉపసంహరించుకుంటాడు"
    
    ఎలాఊహించగలుగుతున్నారు"బ్రహ్మాజీగత చరిత్ర కార్మికనాయకుడిగా చాలా సమ్మెలు ప్రారంభించి అమాయకులైనా కార్మికుల డిమాండ్స్ సాధించకముందే యాజమాన్యం దగ్గర డబ్బు తీసుకుని సమ్మెల్ని మద్యలో ఆపించిన వంచకుడతను. ఒక యూనివర్సిటీ విద్యార్దిని అయ్యుండి అతడిగురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు.
    
    ఈ దేశంలో దేశపు ప్రగతిలోనేనూ ఓ భాగస్వామిని కాబట్టి రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోయినా సైతం అలాంటి అవగాహన అవసరమని నమ్ముతాను.
    
    "వెల్.... రేపు జరగబోయే బంద్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మామూలే.....రాజకీయ నాయకులు విసిరిసిన డబ్బు సంచుల్ని తీసుకుని కొందరు ఉద్యమకారులు జనజీవనాన్ని స్తంభింపచేస్తారు. ఆర్టీసి బస్సులు తగలబడతాయి. అంటే మళ్ళీ అది ప్రభుత్వం పై భారమవుతుంది. కొత్త బస్సుల్ని కొనడానికి డబ్బు అవసరమవుతుంది. ఆ ఋణ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయాణీకులు టిక్కెట్టు రేట్లని పెంచుతారు. ఈ అరాచకాలకు పరిశ్రమల్లో పనులు ఆగిపోతాయి. అంటే ఉత్పత్తి తగ్గుతుంది. తగ్గిన ఉత్పాదకశక్తి ధరలు పెరగడానికి కారణమవుతుంది. ఇదో సర్కిల్....ఇందులో నలిగేది ప్రజలు......ప్రభుత్వాలు కావు....రాజకీయ నాయకుల మధ్యసాగే ఈ చదరంగపు టెత్తులో చివరికి బలయ్యేది సామాన్య ప్రజానీకం. మరి ఇలాంటి ఉద్యమాలు కొనసాగకూడదంటే ప్రజలేం చేయాలి. ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోవాలి".    
    
    "ఏం చేస్తున్నాం ఎవరికీనష్టం కలుగుతూంది అన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటిఉద్యమాన్ని ఖండిస్తూప్రతిఘటించాలి......ఇలాంటివికొనసాగకుండా కీలకమైన సంఘశక్తుల్ని ప్రభుత్వం వెంటనే నిర్బంధించాలి."
    
    "వివరంగా చెప్పండి. ఇలాంటిఉద్యమాలు ప్రారంభించబడుతున్నది కొన్ని స్వార్ధపూరిత శక్తులమూలంగా కాబట్టి ప్రభుత్వం ఆ శక్తుల్ని ముందు లీడ్ చేస్తున్నవాళ్ళని కటకటాలవెనక్కి నెట్టాలి. అది చాలు బంద్ లు, హర్తాళ్ళు నివారించడానికి......."
    
    "ఇందుకు పత్రికల బాధ్యతేమిటి"
    
    "పరిపాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ లేనప్పుడు రాజ్యాంగవ్యవస్థ కూడా కుంటుపడుతుంది. ఈ మూడు ఎస్టేట్స్ విఫలమై జనజీవనం ఇబ్బందిలో కూరుకుపోతున్న సమయాన నాలుగో ఎస్టేట్ పత్రికా వ్యవస్థ నిజాయితీగా వ్యవహరించి అన్ని వ్యవస్థల్ని ఎడ్యుకేట్ చేయాలి......అంటే మీలాంటి పత్రికావిలేఖర్లు అమ్ముడుపోకుండా న్యాయబద్దంగా నడవాలి"
    
    పకడ్బందీగా రాయబడిన ఈ ఇంటర్వ్యూ ఎంతటి సంచలణానికి కారణమైందీ అంటే మేధావులే కాదు విధ్యార్దులూ పాజిటివ్ గారియాక్ట్ కావడానికి కారణమైతే ప్రభుత్వాధినేతలు బలంగా స్పందించారు. ముఖ్యమంత్రి రాజారాంకి ప్రత్యర్ధివర్గాన్ని సైతం నిరసించిన త్యాగిపై అభిమానం పెరగడం కన్నా ఏం చేయాలి అన్నది స్పష్టంగా బోధపడిపోవడంతో అర్జెంటుగా సెక్రటరీలతోనూపోలీసు అధికారులతోనూచర్చలు జరిపారు. జిల్లాలవారీగా ఉద్యమంలో యస్పీలందరికీ ఆదేశాలు అందించబడ్డాయి.
    
    అయితే....ఆ ఇంటర్వ్యూకి అతిగా స్పందించిన ఒకే ఒక వ్యక్తి సౌందర్య. డబ్బు తీసుకుని వెళ్ళిన త్యాగి చాలా తెలివిని ప్రదర్శించేశాడు. ఇది రాసింది డబ్బుతీసుకున్నందుకేనా.....
    
    కరప్టెడ్ బాస్టర్డ్.......ఆమె ఆలోచనలమధ్య కూరుకుని వుండగానే నౌకరు వచ్చి అప్పుడే వచ్చిన ఓ కవరుని అందించాడు.
    
    యథాలాపంగా తెరచిన సౌందర్య ఆ ఉత్తరాన్ని రాసిందెవరో గుర్తించగానే కంగారుపడిపోయింది.
    
                                                                 * * *
    
    సాయంకాలందాకా ఆ ఉత్తరాన్ని ఎన్నిసార్లు చదివిందో ఆమెకు గుర్తులేదు. కాని అవమానభారంతో మనసు మండిపోతూంది. ఎంత పొగరీ వ్యక్తికి...... "సౌందర్యా......

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra