Home » Saradha ashok vardhan » Manasu Porallo

 

    "తినకపోతే ఏం చేస్తారెంటి?"
    "ఏం చేస్తానా?....."
    "ఆ.....అబ్బా! వోదలండి.......మీరూ మరీనూ.....వోదలండి! .ప్లీజ్....తినిపిస్తాగా!"
    రెండు నిమిషాలు సైలెన్స్.....
    మరి వినలేకపోయింది కౌసల్య.
    ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. వాళ్ళ మాటలు వింటూ వుంటే ఏదో అనందం, తన్మయత్వం ఆమెను ఆవరించాయి. తను కన్న కలలని వారిలో నిజంగా చూస్తున్నట్టు ఫీలయింది. మనసు ఊహల్లో తేలిపోయింది.
    వంట ఇంట్లోకి పిల్లి దూరి గిన్నెలు చప్పుడు కావడంతో , ఊహల్లోంచి వాస్తవానికి కొచ్చి, గబగబా వంట ఇంటివైపు పరిగెత్తింది కౌసల్య. ఖాళీ ఇడ్లి గిన్నె, ఖాళీ పచ్చడి గిన్నె ఆమెను ఎగతాళి చేసినట్టు దొర్లిపోతున్నాయి. తలకిందులైన కౌసల్య ఊహల్లాగే! తన భర్తా, అతను ఇద్దరూ మనసులో మెదిలారు. ఎంతో లాలనగా 'నువ్వు తింటే గానీ నేనూ తినను' అంటూ ఫలహరాన్నీ , జీవితాన్ని చేరి సమానంగా పంచుకునే అతనూ, నోరు మెదపకుండా మృగంలా లటుక్కులటుక్కుమని మింగేసి, వెనుక ఆమె కోసం కాస్తంత ఉంచాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గిన్నెలు ఖాళీ చేసేసి బకాసురిడిలా తెన్చుకుంటూ వెళ్ళిన భర్తా! తన బతుకు మీద తనకే ఎంతో అసహ్యం వేసింది. "దేవుడా! నాకెందు కిలాంటి శిక్ష వేశావు?" అనుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చుంది. కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది. తినకూడదనిపించినా ఆకలి దహించుకొచ్చింది. కడుపులో బిడ్డ కాళ్ళతో తంతున్నాడేమో అబ్బా! అనుకుంటూ లేచి వంటింట్లోకి కెళ్ళింది. క్రితం రోజు తెచ్చిన బ్రెడ్ ముక్కలు కనిపించాయి. బద్దకంగా లేచి తీసుకుని దానిమీదే వదిన ఇచ్చిన సీసాలోని ఆవకాయ తీసుకుని వాటికి రాసి , అవే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించి తినేసింది. ఆకలి అటువంటిదేమో, అదే అమృతంలా అనిపించింది!
    ఎంత ఒద్దనుకున్న పక్క వాటాలోని ఆ జంట గుర్తుకొస్తూనే వుంది ఆరోజంతా! తను కన్నా కలలకి ప్రతిరూపంలా కనిపించారు వాళ్ళు. తన ఆశలన్నీ నిప్పుల మీద నీళ్ళు జల్లినట్లుగా చల్లారిపోయాయి. జీవచ్చవంలా పడుండడం తప్ప ఏం చెయ్యగలదు తను? అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయింది కౌసల్య. టైము పదకొండు దాటిందనీ తెలుసుకుని గబగబా వంట ప్రయత్నంలో మునిగిపోయింది.
    గడియారం రెండు గంటలు కొట్టినా , పానకాలు భోజనానికి రాలేదు. కౌసల్యకి ఆకలితో మూర్చోచ్చినంత పనౌతోంది. ఇట్లాగే ఒకసారి అతను భోజనానికి రావడం ఆలస్యమైతే చూసి చూసి తను భోంచేసినందుకు ఎన్ని తిట్లు తిట్టి, ఎన్ని దెబ్బలు కొట్టాడో! అది తలుచుకుంటే ఇప్పటికీ ఆకలి చచ్చిపోతుంది ఆమెకి.
    రాత్రి పదిగంటల దాకా ఇంటికి రానేలేదు పానకాలు. కౌసల్యకి ఆ రోజంతా పాస్టే అవడం వల్ల యమ నీరసంగా ఉంది. గబగబా వంటింట్లోకి కెళ్ళి పదార్ధాలన్నీ వేడి చెయ్యడం మొదలెట్టింది "బ్రావ్" మని త్రేన్చుకుంటూ వచ్చి, "నేను భోజనం చెయ్యను. జగన్నాధరావు గారింట్లో వాళ్ళ మనమరాలి పుట్టింరోజు ఇవాళ. బ్రహ్మాండమైన డిన్నరైంది. ఫస్టుగా భోం చేశాను" అన్నాడు పానకాలు.
    "డిన్నరుందని మీకు ముందు తెలియదా?" అడిగింది కౌసల్య.
    "తెలుసు. ఆ ఏర్పాట్లన్నీ నేనేగా చేసింది. నేనంటే ఆ ఇంట్లో అందరికీ అంత ముఖ్యం. నేను లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు వాళ్ళకి! నిన్నూ తీసుకు రమ్మన్నారు దిన్నరుకి. నేనే నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు అన్నం తిన్నావా? ఆ....తినే వుంటావులే! ఇంట్లో కూర్చుని తినకేం చేస్తావ్?" అన్నాడు.
    నిజంగా తను వడ్డించుకు తినాలనే అనుకుంది కౌసల్య. కానీ అతనలా మాట్లాడుతూ వుంటే తినబుద్ది కాక అన్నీ మూతలు పెట్టేసి గ్లాసు నీళ్ళు తాగొచ్చి పడుకుంది.
    "ఇరవై నాలుగు గంటలూ అలా పడుకోకపొతే , ఈ మొగుడు వెధవతో సరదాగా మాట్లాడదామని అనిపించదా నీకు?" అంటూ పక్కలోకి చేరాడు పానకాలు.
    భయంతో గజగజా వణికిపోయింది కౌసల్య. అతని రాక్షస ప్రేమ కన్నా తిట్లూ ద్వేషమే నయం. కొరుకుతూ గిచ్చుతూ మృగంలా అతని సరసం. బాధతో తను గిలగిలలాడుతూ వుంటూ అతను పొందే అనందం , కౌసల్యకి వణుకు పుట్టిస్తున్నాయి. వొంటినిండా గిచ్చిన గుర్తూలూ కొరికిన గుర్తులే! తొడల మీద కొరికితే కమిలిపోయి ఇంకా నలుపు తగ్గలేదు. అందులోనూ ఉత్తమనిషి కాదేమో ఆ మోటు సరసం , బాధ అసలు భరించలేకపోతుంది. కానీ ఆ విషయం ఎవరికి చెప్పుకుంటుంది తను? చెప్పినా ఏం లాభం? అదివరకు కనీసం విడాకులిచ్చేసి ఈ గండం తప్పించుకోవోచ్చనుకుంది. పుట్టింటి వాళ్ళ సలహా అభిప్రాయాలూ తెలుసుకున్నాక ఆ ఆశ కూడా అంతరించిపోయింది. చివరికి ఆత్మహత్య చేసుకునే హక్కు  కూడా లేకుండా వొదిన గారు ఆమె చేత ప్రమాణం చేయించుకుంది. విడాకుల ఊసేత్తకుండా అన్నయ్య కట్టేశాడు. మూగగా బాధ ననుభావిస్తూ జంతువులా పడుండడం తప్ప ఏం చెయ్యగలదు? మనసును రాయి చేసుకుని శరీరాన్ని అతనికి అప్పగించింది.
    అసలే రోజంతా ఉపవాసం ! డానికి తోడు ఈ హింస! తెల్లారగానే లేవలేకపోయింది కౌసల్య.
    "లే! నేను వెళ్లిపోవాలి. టిఫిన్ చెయ్యి" అంటూ కేకలు వేశాడు పానకాలు. లేవడానికి ఎంత ప్రయత్నించినా లేవలేకపోయింది కౌసల్య. జ్వరం వచ్చినట్టుంది. కళ్ళు మండుతున్నాయి. నీరసంతో ప్రాణాలు పోతూనట్టుగా వుండి లేవలేకపోయింది.
    "దున్నపోతులా అలా పడుకోకపోతే లేవరాదూ! అయినా నువ్వెందుకు లేస్తావ్! నేను తినకుండా పొతే నీకు మహా సంతోషం. ఉండు నీ పని చెప్తానుండు. నువ్విలా లొంగవు." అంటూ గబగబా లోపలికెళ్ళి బకెట్ నీళ్ళు తీసుకుని వొచ్చి మంచం మీద పడుకున్న కౌసల్య చెయ్యి పట్టిలాగి తల మీంచి బకెట్ నీళ్ళూ కుమ్మరించేశాడు. కౌసల్య ఉక్కిరిబిక్కిరై పోయింది. చలికి కొయ్యబారిపోయింది. కోపంతో వొళ్ళు ఊగి'పోతూ వుంటే "మీకు పిచ్చేక్కలేదు కదా?" అంది.
    "నాకు పిచ్చి అంటావా? నువ్వే పిచ్చి ముండవి" అని "వేళ్ళూ తొందరగా స్నానం  చేసి టిఫిన్ చేసి నా మొహాన తగలేట్టు" అంటూ చెయ్యి పట్టుకుని స్నానాల గదివైపు తోశాడు. తల తిరిగిపోతుంది కౌసల్యకి, కడుపులో నొప్పిగా అనిపించింది. మెల్లగా ఎడం చేత్తో గోడ పట్టుకుని, కుడి చేత్తో పొట్ట మీద అరచేత్తో రాసుకుంది. నొప్పి కాస్త తగ్గి ఉపశమనం కలిగింది. మెల్లగా వొచ్చి బట్టలు తీసుకుని బాత్ రూంలో పెట్టుకుని స్నానం చేసోచ్చింది. వంట ఇంట్లో కెళ్ళి గోధుమ రవ్వ తీసుకుని ఉప్మా చేసింది. గబగబా వొచ్చి అప్పటికే ఆలస్యమై పోయిందని ఇష్టం వొచ్చినట్టు తిట్టుకుంటూ, కాఫీ అక్కడ తాగుతాలే, నీ కాఫీ ఏడిసినట్టుంటుంది అంటూ వెళ్ళిపోయాడు పానకాలు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra