Home » D kameshwari » Kottha Malupu

    "ప్రతివాది సురేష్ కి మీకు బందుత్వం ఉందా?" ఆ ప్రశ్నకి రామనాధం ఏమిటి వెర్రివెధవ ప్రశ్న అన్నట్టు హేళనగా "వుంది!" అన్నాడు గడుసుగా అన్సర్ టు ది పాయింట్ అన్నది అక్షరాల అమలుపరుస్తూ.
    "ఆ బంధుత్వం ఎలాంటిది?"
    "ప్రతివాదికి తండ్రిని నేను"
    "సురేష్ కి ముందు ఇంకా ఎవరన్నా పిల్లలున్నారా మీకు?"
    "మరొక కొడుకున్నాడు" జవాబిస్తున్న సుమతి ఈ ప్రశ్నడగడంతో అంతరార్ధం ఏమిటా అని అయన లాయరు బుర్ర చురుకుగా ఆలోచిస్తుంది.
    "మీకు వివాహం అయి ఎన్ని సంవత్సరాలైంది.?"
    "ఇరవై ఏడు సంవత్సరాలు"
    "వివాహానికి పూర్వం మీరే స్రీనన్నా ప్రేమించారా?"
    "అబ్జక్షన్ యువర్ అనర్. నా క్లయింట్ కేసుకి నా ప్రేమకి ఏం సంబంధం లేదు.
    ఐ అబ్జక్ట్ యువర్ అనర్.......
    రామనాధంగారు మొహం ఎర్రబడగా అన్నారు. జడ్జిగారు సుమతి వంక చూశారు.
    "సంబంధం వుంది. ఆ సంగతి తరువాత నిరుపిస్తాను." అంది. జడ్జిగారు ఒక్కక్షణం ఆలోచించి "అబ్జక్షన్ ఓవర్ రూల్డ్" అన్నారు.
    "చెప్పండి వివాహానికి పూర్వం మిరెవరినన్నా ప్రేమించారా?" సూటిగా అడిగింది.
    "లేదు" మొహం గంటు పెట్టుకుని అన్నారాయన.
    "పోనీ వివాహానికి తరువాత ఏ స్రీ తోనన్నా సంబంధం పెట్టుకున్నారా?"
    "ఈసారి రామనాధంగారి మొహం మరింత ఎర్రబడింది.
    "అది నా పర్సనల్ మాటర్. కేసుతో సంబంధం లేదు."
    "అన్సర్ టు ది పాయింటు" సుమతి గంభీరంగా అంది.
    "లేదు" తిరస్కారంగా సుమతి వంక చూస్తూ అన్నాడు.
    "నిజం చెపుతానని ప్రమాణం చేశానని మరిచిపోయారా? పాతికేళ్ళ క్రితం వివాహం అయి ఇద్దరు బిడ్డలు కలిగాక కూడా ఒక స్రీని ప్రేమించినట్టు నమ్మించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించి, తీరా ఆమె గర్భవతి అయ్యాక ఆమె పెళ్ళాడమని కోరగానే మీరు వివాహితులని చెప్పి తప్పుకుని ఆమె ఖర్మానికి ఆమెని వదిలి మీరు మోసం చెయ్యలేదు. ఇది నిజమా అబద్దమా?" తీవ్రంగా అడిగింది.
    రామనాధంగారు ఎర్రబడ్డ మొహం దించుకున్నారు.
    "అన్సర్ టు ది పాయింటు మిస్టర్ రామనాధం" జడ్జి హెచ్చరించారు.
    "నిజమే" గొంతు పెగుల్చుకుని ఎలాగో అన్నారు.
    యువర్ అనర్! ఈనాడు ముద్దాయి సురేష్ చేసిన నేరమే ఇరవై ఏళ్ళ క్రితం తండ్రి చేసి శిక్షింపబడకుండా తప్పించుకోగల్గారు. ఆనాటి ఆ స్రీకి ఈనాటి నా క్లయింటుకి వున్న ధైర్యసాహసాలు లేకపోబట్టి చేసిన తప్పు బయటికి రాకుండా సమాజంలో పెద్దమనిషిగా చలామణి అయ్యారు ఇన్నేళ్ళు. ఆనాడు తండ్రి , ఈనాడు కొడుకు.....ఇలా స్రీల జీవితాలతో ఆటలాడుకోవడం ఈ వంశంలో వారికీ అలవాటని, తను చేసిన తప్పే కొడుకు చేస్తే కనీసం గతం గుర్తు తెచ్చుకుని తను వివాహితులు కనక ఆనాటి స్రీకి న్యాయం చేకూర్చలేకపోయినా ఈనాడు కొడుకు చేసిన తప్పుని సరిదిద్ది ఆమెని వివాహం ఆడమని పెద్దమనిషిగా సలహా ఇచ్చి హృదయ వైశాల్యం చాటుకోవాల్సింది పోయి కొడుకు తరపున వకాల్తా తీసుకుని కొడుకు చేసిన నేరం కప్పిపుచ్చాలని చూడడం క్షమార్హం కాదని తెలియపరచడానికి ఆ ప్రశ్న అడిగాను.
    "యువర్ అనర్! నా క్లయింట్ రూప, ముద్దాయి సురేష్ కల్సి తిరిగినట్లు హోటల్లో ఈ సాక్ష్యాల వల్ల ఋజువు చెయ్యడానికి ప్రయత్నించాను. నా క్లయింట్ "తెలివితక్కువతనంవల్ల పెళ్ళి చేసుకోవాలన్నా షరతు పెట్టలేదు. అతని ప్రేమ నిజమని, ఆ ప్రేమ పెళ్లిదాకా వెడుతుందని నమ్మింది. పెళ్ళికిముందు సెక్స్ సంబంధం పెట్టుకోడం నా క్లయింట్ పొరపాటే- ఆ విషయంలో అమెది తొందరపాటే.
    "యువర్ అనర్ యుగయుగాలుగా పురుషుని తీపి మాటలు నమ్మి స్రీ మోసపోతూనే వుంది. వయసుకి సహజమైన, పకృతి సిద్దమైన ఆకర్షణలకి, వ్యామోహానికి లొంగిపోయే బలహీనత వుంటుంది. కాని మన సమాజం పురుషుని బలహినతని క్షమిస్తుంది. అది నేరంగా పరిగణించదు. పురుషుడు ఏం  చేసినా అది ప్రకృతి సిద్దంగా, సహజంగా భావించి పట్టించుకోదు. అదే బలహినతలకి స్రీ లోనయితే ఆ స్రీ మీద చెడిపోయిన ముద్ర వేస్తుంది సమాజం. ఆ స్రీకి మరి సంఘంలో భవిష్యత్తు వుండదు. పవిత్రత శీలం అన్నీ స్రీలకే పరిమితి చేసి స్రీని అణగదొక్కుతూనె వుంది. ఈనాటికి సమాజం. "పురుషుడు వివాహానికి పూర్వం ఎన్ని ప్రేమకలాపాలు జరిపినా తప్పులేదు.
    ప్రేమించానని కల్లబొల్లి కబుర్లు చెప్పి, స్రీని విలాసవస్తువుగా అనుభవించి, అవసరం తీరాక వదిలి తను మహారాజులా పెళ్ళి చేసుకొంటాడు. ప్రేమించడానికి, అనుభవించడానికి ఏ అభ్యంతరాలు ఏ పెద్దలు, ఏ వంశగౌరవాలు, కులాలు, మతాలు ఏం అడ్డురావు. పెళ్ళివేళకి వచ్చేసరికి బాధ్యతలు, పెద్దల అంక్షలు , వంశ ప్రతిష్టలు అడ్డు వస్తాయి.
    "ఒకసారి ప్రేమకలాపాలు జరిపిన స్రీని వివాహం ఆడదానికి ఏ పురుషుడు ముందుకు రాడు. ఖర్మంకాలి ఆ స్రీ సంతానవతి అయితే ఆమె భవిష్యత్తుకి పూర్తిగా దారి ముసుకుపోతుంది. ఆ సంతానం అక్రమసంతానంగా పరిగణించబడి సమాజంలో స్థానం కోల్పోతుంది. మంచిదే! వివాహానికి పూర్వం సంతానం పొందే అర్హత లేదని మన సమాజం నిర్ణయించడం మంచిదే! అక్రమంగా సంతానం పొందడం తప్పని నిర్ణయించి అలాంటి స్రీని శిక్షించినపుడు ఆ సంతానం పొందడానికి కారణమైన పురుషుడు ఎందుకు శిక్షార్హుడు కాడు!?
    దొంగతనం, నేరం, హత్య శిక్షార్హం, ఫోర్జరీ నేరం, వ్యభిచారం నేరం, మరొకరి భార్యతో పొందునేరం.......ఇవన్నీ నేరాలయి శిక్షార్హ మైనపుడు, ఒక స్రీని వివాహం ఆడకుండా సంతానవతిని చెయాడము నేరమని అలాంటి అక్రమ సంతానాన్ని కలిగించిన పురుషుని ఎందుకు శిక్షించదు మన సమాజం?"
    ""వెల్ సేడ్" కోర్టులో చప్పట్లు మారుమోగాయి అందరూ ఆమె వాదనని ప్రశంసించారు.
    "ఆర్డర్...ఆర్డర్...." జడ్జిగారు అన్నారు. సుమతి ఆ ప్రోత్సాహంతో మరింత ఆవేశం పుంజుకుంది.
    "యువర్ అనర్ ! ఇద్దరు కలిసి చేసిన నేరంలో స్రీ ఒకతే శిక్షింపబడడం అనాదిగా వస్తున్నా ఆచారం. ఈ ఆచారం ఈ నవీనయుగంలో , ఈ అణుయుగంలో కూడా ఇంకా అమలు పరచడం ప్రగతి శీలతకి చిహ్నమా? మన సమాజంలో వస్తున్న మార్పులు, మనం సాధించిన అభ్యుదయం అంతా వేష భాషలకే పరిమితమా? యుగాలనాటి ఈ దందనైతిక, నీతి ప్రమాణాలు సవరించాల్సిన బాధ్యత మన చట్టాలకి లేదా?
    యువర్ అనర్! ఏ స్రీకి అయినా అక్రమంగా కన్నా, సక్రమంగా కన్నా బిడ్డమీద తల్లికి ఎప్పుడు ప్రేమ వుంటుంది. మాతృత్వంలోని మహిమ అదే! సంఘానికి భయపడి ఎంతమంది తల్లులు భ్రుణహత్యలు చేయలేదు! తమ బిడ్డలని చెత్తకుండిలు, శరణాలయాలపాలు చెయ్యలేదు. నిర్దాణగా బిడ్డని దూరం చేసుకున్న ఆ తల్లి మనస్థాపం ఎవరైనా గుర్తించి జాలిపడతారా? ఏ స్రీ ఎలాకన్నా బిడ్డకి దూరమై అనుభవించే రంపపుకోతకి గురిచేయ్యడం సభ్య ప్రపంచం చెయ్యాల్సిన పనికాదు. తల్లితండ్రులు చేసిన తప్పుకి ఆ బిడ్డని అనాధగా చేసి శిక్షించడం అన్యాయం, అక్రమం. ఏ నేరానికి ఆ బిడ్డ అనాధగా నరకం అనుభవించాలి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra