Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 23


    పన్నెండు

 

    "సరిగ పన్నెండు. క్షణం అటూ యిటూ కాకుండా

 

    "ఇంకా పదినిమిషాల టయిమువుంది." ఆ గదిలో చీకట్లో నుంచున్న ధైర్య తన చేతికున్న రేడియం డైల్ బుల్లి వాచిలో టయిము చూస్తూ అనుకుంది.

 

    "ఉక్కపోస్తున్నది ఫ్యాన్ వేసుకుంటే బాగుంటుంది" అనుకున్న ఆమె తనకొచ్చిన తెలివి తక్కువ ఆలోచనకి నవ్వుకుంది. "కరెంటులేదు. ఫ్యాన్ ఎలా తిరుగుతుంది?" అనుకుంది.

 

    మొండి చెయ్యిట. మొండిచెయ్యి అది గాలిలో తేలుతూ వచ్చిందట. దానికేదో ప్రాణంవున్నట్లు! అభుతకల్పనని కూడా అద్భుతంగా రాయడంలో రైటర్ భయంకరమూర్తి చాలా గొప్పవాడు....

 

    ఆమె అలా ఆలోచిస్తుండగానే టైము పూర్తి అయింది.

 

    ఆమె నుంచున్న చోటునుంచి కదిలి వెళ్ళి కుర్చీలో కూర్చుంది కొవ్వొత్తి వెలిగించింది. పుస్తకం చేతిలో తీసుకుంది.

 

    ఇప్పుడు ఆమె పుస్తకం చదవడానికి ఎనిమిది నిముషాలు ఆగింది. చేసేపని కరేక్ట్ట్ గా వుండాలికదా! పరిశోధన మాస పత్రికలో భయంకరమూర్తి రాసినా "ఆ చీకటి రాత్రి కధలోని అభయలాగా వుంది ఆమె. చీకటి రాత్రి సమయం అర్ధరాత్రి. ఇంటిలో వంటరిగా అభయ. (ఇక్కడే ధైర్య చదువుకుంటుండగా కరెంటుపోయింది. అలా వాస్తవానికి అనుకున్న టైముకి కరెంటుపోదు, కాబట్టి మెయిన్ అపుజేయటం జరిగింది. ఆమె కధలో రాసినట్లు అచ్చం అలా అన్ని సృష్టించింది.

 

    పన్నెండు పది

 

    ఆమె టయిము చూసుకుని పుస్తకం తెరిచింది.

 

    డేంజెర్ స్కేలిటన్ అంగ్లనవల. చదువుతుంది భయంతో వాళ్ళు జలదరిస్తుందని ఫ్రెండ్ చెప్పటంవల్ల ఆ పుస్తకాల షాపు నుంచి కావాలని ఏరికోరి అదే నవల తెచ్చుకుంది ఆమె. ఇప్పుడు అదే చదువుతున్నది.


    రాత్రి పన్నెండు పన్నెండు నిముషాలు.

 

    ఎటు చూసినా గాడాంధకారం.

 

    ఆ ఇంటిలో కరెంటుపోయింది. (మెయిన్ అపుకారణాన)

 

    ఇంటి మొత్తంమీద ధైర్య అనే ఆడపిల్ల ఒక్కతే వుంది. వీపుని కిటికీ వేపుపెట్టి కుర్చీలో కుర్చుని బల్లమీద వున్న కొవ్వొత్తి వెలుగులో ఓ భయంకరమైన స్టొరీ


నవలని చదువుతూ కూర్చుంది. కొద్దిగాతప్ప పెద్దగా గాలి లేదు. గాలి వీచినప్పుడు మాత్రం చెట్ల తలలు కదులుతున్నాయి. ఉండి ఉండి కీచురాళ్ళ రోద. అది లేనప్పుడు భయంకర నిశ్శబ్దం.

 

    కధలోని "ఆ చికటిరాత్రి" ఏమోగాని "ఈ చీకటిరాత్రి కూడా భయం భయంగానే వుంది.

 

    పావుగంట గడిచిపోయింది.

 

    ఆమె పరిసరాలు మరిచిపోయి పుస్తక పఠనంలో పడింది.

 

    డేంజెర్ స్కేలిటన్ లాంటి అద్భుత భయానక నవల చదువుతుంటే ఎవరు కూడా మధ్యలో లేవలేరు. రైటర్ నే ఆఫ్ రైటింగ్ యొక్క గొప్పాతనమే గాక సస్పెన్స్ కూడా బ్రహ్మాండం బద్దలయేలావుంది. చదివేవాళ్ళు పరిసరాలు మరిచిపోవటంలో ఆశ్చర్యంలేదు.

 

    ధైర్యకి ఫ్యాన్ అలవాటు బాగావుంది. ఇప్పుడు అవసరానికి ఫ్యాన్ వేసుకుందామన్నా కుదరదు. గాలి బాగా లేకపోవటంవల్ల చేమతపడుతున్నది. నవల చదవటంలో లీనమైన ఆమె అసంకల్పిత ప్రతీకార చర్యలా మధ్యలో తనకి తెలియకుండానే ఓ చేతితో చెమటని తుడుచుకుంటున్నది. నవల పదిపేజీలు చదివేలోపల తను ఇంటిలో వంటరిగా వున్నానన్న సంగతి. పరిశోధన చేస్తున్నానన్న విషయం గుర్తుంది. తర్వాతనే నవలచదవటంలో పూర్తిగా మునిగిపోయింది.

 

    పన్నెండున్నర దాటింది.    

 Previous Page Next Page