Home » Kommuri venugopala rao » నెత్తుటిబొట్టు

     ఆపరేషన్ జరిగి నెలరోజులయినా జానకిరామయ్యగారు కోలుకోలేదు. మంచంమీద నుంచి లేచి అటూ యిటూ తిరగడానికి కూడా ఓపిక వుండడం లేదు. సాయంత్రాలు ఎకౌంట్స్ రాయడం ఎప్పుడో మూతపడి పోయింది.

    ఒక్కొక్కరోజు గడిచిన కొద్దీ _ ఇల్లు గడవడం దుర్భరంగా తయారయింది. ఒకరోజు ఎలాగో ఓపిక చేసుకుని రిక్షాలో ఆఫీసుకెళ్ళాడు. రెండు గంటల తరువాత తండ్రి రిక్షా దిగుతూ వుండడం ప్రజ్ఞ కిటికీలోంచి చూసి బయటకు పరిగెత్తుకువచ్చింది. ఆయన రిక్షాలోంచి బయటకు దిగడానికి ఇబ్బందిపడుతూ వుండడం చూసి భుజంపట్టుకు సాయంచేసింది.

    కూతురు సాయంతో అతికష్టం మీద లోపలకు వచ్చాడు. ఒళ్ళంతా చెమటలు దిగజారుతున్నాయి. ప్రజ్ఞ ఆయన్ని మంచంమీద పడుకోబెట్టి "నాన్నా!" అని పిలిచింది గాబరాగా.

    జానకిరామయ్య కళ్ళు తెరచి చూశాడు. మంచినీళ్ళు కావాలన్నట్టు సౌంజ్ఞ చేశాడు.

    ప్రజ్ఞ లోపలికివెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు తీసుకొచ్చింది.

    "వాళ్ళు...ఉద్యోగంలోంచి తీసేశారు" అన్నాడు పది నిమిషాలు గడిచాక కొద్దిగా తేరుకుని.

    రాఘవయ్య వంటింటి గుమ్మంలో నిలబడి చూస్తోంది _ 'ఇంతకంటె ఇంకేం జరుగుతుందిలే' అన్నట్టున్నాయి ఆమె చూపులు.


            *                    *                    *


    "నేను ఉద్యోగం చేస్తాను" అంది ప్రజ్ఞ ఓ నిర్ణయానికి వచ్చినట్టు.

    "ఏం ఉద్యోగం చేస్తావు? నీ కోసం అక్కడ ఇవ్వడానికి ఎవరయినా పడిగాపులు కాస్తూ కూర్చున్నారనుకున్నావా?" అంది తల్లి.

    "నా కోసం ఉద్యోగాలు పడిగాపులు కాస్తూ వుండవని తెలుసు కాని ప్రయత్నిస్తే ఎక్కడయినా వస్తుంది" అంది ప్రజ్ఞ దృఢ సంకల్పంతో.

    అని ఊరుకోలేదు. ఆ సాయంత్రం డాక్టర్ దయాకర్ హాస్పటల్ కు వెళ్ళింది.

    డాక్టర్ దయాకర్ అప్పుడే రౌండ్స్ పూర్తిచేసుకుని ఓ.పి. చూసుకోవడానికి కన్ సల్టింగ్ రూంలోకి వస్తూ పేషెంట్ల ప్రక్కన నిలబడివున్న ప్రజ్ఞని చూశాడు.

    "ఎలా వుంది నాన్నగారికి?" అనడిగాడు.

    ప్రజ్ఞ  ధైర్యం  కూడగట్టుకుని "బాగానే వుంది...మీతో వేరే విషయం మాట్లాడాలని వచ్చాను" అంది.

    "లోపలి రండి" అని దయాకర్ కన్ సల్టింగ్  రూంలోకి వెళ్ళిపోయాడు.

    "ఏమిటి చెప్పండి" అన్నాడు ఆమె లోపలికి వచ్చాక.

    "నాకు మీ దగ్గర ఉద్యోగం చెయ్యాలని వుంది" అన్నది ప్రజ్ఞ మెల్లగా.

    దయాకర్ ప్రశ్నార్ధకంగా చూశాడు.

    అతని ఉద్దేశం అర్ధం చేసుకుని "ఇంట్లో గడవడం కష్టంగా వుంది" అంది.

    "హాస్పటల్ లో ఏం ఉద్యోగాలుంటాయి _ సిస్టర్ ఉద్యోగాలు తప్ప"

    "అదే చేస్తాను."

    అతనామె ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆమె అలా అడగడంలో ఎంత అవసరముంటో అర్ధం చేసుకున్నాడు.

    "నాకు వర్క్ రాదని సంశయిస్తున్నారు కదూ. పట్టుదలతో కృషి చేసి నేర్చుకుంటాను. మీ హాస్పిటల్ కు మంచి పేరు తీసుకువస్తాను."

    ఒక్కక్షణం నిశ్శబ్దం.

    "సరే. అలాగే రేపట్నుంచి డ్యూటీలో జాయినవ్వండి" అన్నాడు దయాకర్.


                 *                    *                     *


    గోపీకృష్ణ సందు మొదట్లో  అస్మిత కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. వ్రేళ్ళమధ్య  స్టయిల్ గా సిగరెట్  వెలుగుతోంది.

    ఇంచుమించు ఓ పావుగంట  గడిచాక  అతని నిరీక్షణ  ఫలించినట్టు మలుపు తిరుగుతూ ఓ వెలుగురేఖ తళుక్కుమని మెరిసింది.

    కాసేపట్లో అస్మిత అతనికి దగ్గరగా వచ్చింది.

    చేతిలోని సిగరెట్టు గిరాటేసి అటూ యిటూ చూసి ఆమెకు చెరువుగా వెళ్ళాడు.

    "నాలుగు రోజులబట్టి కనబడడంలేదే" అన్నాడు  ఆమెతో బాటు నడుస్తూ.

    "ఇంట్లో...వీలవడం లేదు."

    "ఏం ?"

    "అక్కయ్యకు మన విషయం బాగా తెలిసిపోయింది. బయటకు కదలనివ్వడంలేదు, ఎక్కడిక్కడ సి.ఐ.డి  లను  పెట్టింది. ఇప్పుడు కూడా మనలనెవరూ  గమనించడం లేదని నేననుకోవడం లేదు."

    "ఎందుకు మీ అక్కయ్యకంత  కోపం మనమీద ?"

    "ఏమో తెలీదు. అమ్మకి కొంతవరకు తెలిసింది. డాడీవరకు వెడితే చంపేస్తారు. రోడ్డుమీద ఎక్కువగా మాట్లాడడానికి అవకాశంలేదు. ఈ లెటర్ చదువుకో, డిటెయిల్స్  తెలుస్తాయి" అంటూ అస్మిత జాకెట్ లోంచి ఓ కాగితం తీసి అతనికందిచ్చి  కొంచెం నడకవేగం  హెచ్చింది  ముందు కెళ్ళిపోయింది.

    ఆ రాత్రి ఒంటరిగా కూర్చుని చాలా వరకు కరెక్ట్ గానే ఇంగ్లీషులో ఉత్తరం చదువుకున్నాడు.

    "డియర్ కృష్ణా !

    నీతో స్నేహం చేసినప్పటినుంచీ __ఎప్పుడూ _ కలలో, మెలకువలో కూడా నువ్వే గుర్తు వస్తూ వుంటావు. నీ రూపమే కళ్ళముందు కనిపిస్తూ వుంది.
 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra