Home » Vasundhara » Vasundhara Kadhalu - 15

 

    ఉలిక్కిపడ్డాను "ఎమిటన్నావ్?"
    "పద - మిగతా విశేషాలు దార్లో చెబుతాను."
    ఇద్దరం నర్సింగ్ హోమ్ కు బయలుదేరాము.
    "దొరికారా?' అంది శ్రీమతి వసంత. మమ్మల్ని చూడగానే.
    "ఎలాగో దొరకపుచ్చుకుని లాక్కొచ్చాను"అన్నాడు శర్మ.
    "ఏమండీ -- ఏం జరిగింది ?' అనడిగాను ఆతృతగా.
    "మధ్యాహ్నం మేము షాపింగ్ కు వెళ్ళాము. అనుకున్న ధరకు చీర బేరం చేయగలిగామన్న ఉత్సాహంతో -- షాపు లోంచి రోడ్డు మీదకు వచ్చాం. ఒకే ఒక్క నిముషం తర్వాత మహాలక్ష్మీ నన్ను పక్కగా తోసేసినట్లయింది. కాసేపటి తర్వాత తెలిసింది. ఆమె కారు కింద పడింది. నేను పక్కన పడ్డానని -- వెంటనే దగ్గర్లో ఉన్న మంచి నర్సింగ్ హోమ్ కు చేరాం. నావి చిన్న చిన్న గాయాలే కానీ మీ ఆవిడ బాగా గాయపడ్డారు."
    ఉలిక్కిపడ్డాను. "యాక్సిడెంట్ ఎప్పుడయింది?" అన్నాను అనుమానంగా.
    "మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు...."అన్నాడు శర్మ నన్ను పరీక్షగా చూస్తూ.
    "ఇంపాజిబుల్  "అన్నాను గట్టిగా.
    "బీ క్విట్  సరైన టైము కావాలంటే పోలీసులు రిజిస్టర్ చేసుకున్న ప్రకారం రెండు గంటల యాభై యారు నిముషాలు" అన్నాడు శర్మ.
    "నీకు తెలియదు శర్మ -- ఇందులో ఏదో మోసముంది--"అన్నాను.
    "ఏమిటా మోసం?"
    ఎలా చెప్పేది ? ఆ సమయంలో నీ భార్య నాతొ మేనక హోటల్లో అండర్ గ్రౌండ్ రూములో ఉన్నదనీ శర్మకు నేనెలా చెప్పేది?
    నేను మాట్లాడక పోవడం చూసి "ఎక్కువగా అలోచించి మనసు పాడు చేసుకోకు. మీ ఆవిడ కిప్పుడు కులాసాగా ఉంది. ప్రాణ గండం  గడిచింది. వచ్చి చూస్తావా?" అనడిగాడు.

                                     12
    "ప్రస్తుతానికి ఆమె చేత మరీ ఎక్కువ మాట్లాడించకండి -- " అని వెళ్ళిపోయింది నర్స్.
    శర్మ , శ్రీమతి వసంత ఇంటికి వెళ్ళిపోయారు. భోజనం చేసి వచ్చి సిమాకు తోడుగా పడుకుంటానని చెప్పింది శ్రీమతి వసంత.
    తల నిండా కట్లతో ఉన్న సీమను చూస్తుంటే నా గుండె చేరువై పోయింది.
    "సీమా!" అన్నాను.
    "మీకోసం బ్రతికానండీ -- " అంది సీమ నీరసంగా.
    నేనామె వైపే చూస్తుండి పోయాను.
    అమె మళ్ళీ అంది. "ఈలోకంలోనేకాదు. ఆ లోకంలో కూడా నాకెవ్వరూ లేరండి.ఎక్కడైనా మీరొక్కరే . మీ కోసం ఏమైనా చేయాలనీ, ఏమైనా అయిపోవాలని, ఏ పరిస్థితుల్లో నైనా మీతోటే ఉండాలని బ్రతికానండీ--"
    "ఎక్కువ మాట్లాడ వద్దు సీమా -- మన కింకా ముందు ముందు బోలెడు సమయముంది--"
    'ఉండొచ్చు. కానీ మీతో గడిపే ప్రతి క్షణమూ అపూర్వమైనదే నాకు--"
    సీమ కళ్ళలో మెరుపు కనిపిస్తోంది. ఆమె ముఖంలో ఉత్సాహం కనిపిస్తోంది. ఆమెను చూస్తూ ఆలోచిస్తున్నాను. నేను -- ఈమెను నేను హత్య చేయాలను కున్నాను. విధి కారణంగా ప్రమాదానికే లోనైంది.
    'అసలేం జరిగిందో చెప్పు సీమా!"
    "మీకు గుర్తుందో లేదో కానీ -- రేపు మన పెళ్ళి రోజు. అందు గురించి కొత్త బట్టలు కొందామని బయల్దేరాను. చీరాల ఎన్నికలో నాకు వసంతగారు చాలా పర్యాయాలు సహాయం చేశారు. అందుకని వాళ్ళింటికి వెళ్ళాను. ఇద్దరం కలిసి బయల్దేరి ...." ఇక్కడ సీమ ఒక్క క్షణం ఆగింది.
    "ఊ  బయల్దేరి ----" అన్నాను కుతూహలంగా.
    "బయల్దేరి మార్కెట్ కు వచ్చాం -- " అంది సీమ.
    "తిన్నగా మార్కెట్ కే వచ్చారా -- లేక మరెక్కడి కైనా వెళ్లారా?"
    సీమ తటపటాయించింది.
    "భర్త దగ్గర రహస్యం దాచకూడదు. చెప్పకపోతే నేను చచ్చినంతోట్టు" అన్నాను.
    ఈ ఇరవయ్యో శతాబ్దం లో కూడా ఓట్లు ఆడవాళ్ళ మీద అద్భుతంగా పని చేస్తాయని నాకు తెలుసు.
    భారంగా నిట్టూర్చి సీమ చెప్పసాగింది.
    "నేను వసంత గారింటికి వెళ్ళేసరికి -- ఆమె కాస్త హడావుడిగా కన్పించింది. చాలా నీటుగా ముస్తాభవుతోంది. అడిగేసరికి చెప్పిందామె. తను మేనక హోటల్లో , లేడీస్ క్లబ్ మీటింగు కి వెళ్ళవలసి ఉన్నదని. నేను వచ్చిన పని -- "ఫరవాలేదు, ఆ హోటల్లో పావుగంట కంటే పని ఉండదు -- కలిసి వెళ్ళి కలిసి వచ్చేద్దాం -- ఎటొచ్చి ఈ సంగతి చాలా రాహస్యంగా ఉంచాలన్నదావిడ" అని చెప్పింది.
    సరిగ్గా ఒంటిగంటపావుకి కారు వచ్చింది. పది నిముషాల్లో హోటలు కు వెళ్లాం. ఇదివరలో నాకు ఫోటోలు తీసిందన్నానే -- ఆవిడే అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. సుమారు పదిహేను నిముషాల సేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. ఆవిడ వసంత గారికో చిన్న కవరిచ్చింది. అందులో నూట పదహారు రూపాయలున్నాయి. ఆ క్లబ్ వారు అప్పుడప్పుడు తమ సభ్యుల్ని సన్మానిస్తూ ఉంటారట. మళ్ళీ కారులో మమ్మల్ని మార్కెట్లో వదిలేశారు.
    రెండు గంటల కల్లా మార్కెట్లో ఉన్నాం మేము. ఆ తర్వాత షాపులో దూరం. ఒక చీర నాకు చాలా బాగా నచ్చింది. బేరం చేసి తీసుకున్నాను. నెక్ట్స్ రోడ్డు మీదకు వచ్చాం -- అంతే!"
    సీమ ఇప్పుడబద్దం చెబుతోందనుకోడానికి అవకాశం లేదు. చాలా రుజువులూ సాక్ష్యాలూ ఉన్నాయి. అన్నింటినీ మించిన యాక్సిడెంటే ఉంది?
    అయితే ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల నించి నాలుగు గంటల వరకూ వసంత పెరుతో నాతో గడిపిన స్త్రీ ఎవరు? ఆమె నిశ్చయంగా వసంతేనని నేను భావించాను. కానీ నిశ్చయంగా వసంత కాదని ఇప్పుడు రుజువయింది.
    సీమను వదిలి గది బయటకు వచ్చాను. మనసులో ఎన్నో రకాల ఆలోచనలు -- ఒక్కటీ తెగడం లేదు.
    ఈ మేనక హోటల్ వ్యవహారమేమిటి ? ఎలా నిర్వహిస్తూన్నారు. వీళ్ళీ కార్యక్రమం?
    స్పెషల్ రూములో వాళ్ళు చూపించే యంత్రం సేరి స్కోప్ ప్రిన్సిపుల్ ఆధారంగా చేసుకుని తయారైనది. అందువల్ల అందులో చూపించడం కోసం వసంత ను ఏదో వంకతో హోటలు కు పిలిపించారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత ఆమెను బయటకు పంపేశారు. మరి నా గదిలోకి వచ్చినామే కూడా వసంత లాగానే ఉంది.
    అదీకాక ఇటువంటి మోసాలు కొనసాగిస్తున్నారా అనుకుందామన్నా సీమ విషయంలో ఇంకో రకంగా జరిగింది. నా గదిలోకి వచ్చిన అమ్మాయి సీమ తప్ప మరెవ్వరూ కాదు. ఆ విషయం నేను గదిలోనే రుజువు చేసుకున్నాను. అయితే శాంతి వసంతలను గదిలో పరీక్షించే అవకాశం నాకు లేకపోయింది.
    అప్పుడే మరో చిన్న అనుమానం నాలో కలిగింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పటిష్టమైన పధకాలతో ఈ హోటల్ నడపబడుతుంది. అటువంటప్పుడు సీమతో నేను గడపదానికీ వెడుతున్నప్పుడు నన్ను సరిగ్గా ఎందుకు చెక్ చేయలేదు?
    తమ నిజాయితీని నిరూపించుకునేందుకు ఒక అవకాశం మిస్తారా -- ఈ హోటల్ వాళ్ళు, ఆటువంటప్పుడు శాంతి వద్ద నాకా అవకాశాన్నేందు కివ్వలేదు?
    బాగా ఆలోచించగా ఒక్కటని పించింది. ఇంతవరకూ వాళ్ళు నాకు గదిలో మనిషిని చూసే అవకాశం ఒకేఒక పర్యాయ మిచ్చారు. ఆ మనిషి నా భార్య.
    సీమా వంక సూటిగా చూశాను.
    "ఒక పర్యాయం నువ్వు మేనక హోటల్లో వ్యభిచారం చేశావు. దానికి సంబంధించిన వివరాలు చెప్పాలి" అన్నాను సూటిగా.
    సీమ కాస్త తీవ్రంగా "వ్యభిచారం చేయాలని విపరీతంగా మనసున్న మీ బోటి వారు -- దాన్ని వ్యభిచారమని పిలవ్వచ్చు. కానీ ఎక్కడ కలుసుకున్నా -- నా భర్తతో అనుభవాన్ని వ్యభిచారంగా అంగీకరించలేను" అన్నది సీమ.
    "వ్వాట్-- " ఉలిక్కిపడ్డాను. "అక్కడ కలుసుకున్నది నన్నేనని తెలుసా నీకు?"
    'అన్నీ తెలుసు నాకు. ఆ లేడీస్ క్లబ్ ఆమె చెప్పింది. మీరు వ్యభిచరించ లేక, ఆ కోరికను చంపుకోలేక, నానా అవస్థ పడుతున్నారట. ఆ కోర్కె మీలో బలంగా పాతుకు పోవడం వల్ల - త్వరలో మీకు పిచ్చి పట్టే అవకాశం కూడా ఉన్నదని అందావిడ. తమది చాలా గౌరవనీయమైన సంస్థ అనీ -- ఏ మోసమూ ఉండదని నచ్చ జెప్పింది. సగం నమ్మాను. తర్వాత మీ ప్రవర్తనలో నాకు చాలా రుజువులు కనపడ్డాయి. నా నమ్మకం దృడ మైంది.
    హోటల్ కు వచ్చాను. గదిలో మిమ్మల్ని కళ్ళారా చూస్తె కానీ వెళ్ళనని చెప్పాను. అప్పుడు మీకు స్పృహ పోగొట్టి , గదిలో మంచం మీద పడుకోబెట్టారు. మిమ్మల్ని చూస్తె నవ్వొచ్చింది. అంతా రూడి చేసుకున్నాక -- మీకా వ్యభిచారపుటనుభూతు లివ్వడం కోసం -- కాస్త శృతి కూడా మించాను -- " ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు. మీకోసం ఏమైనా చేస్తాను. చేయగలను. అందుకే ఆరోజలా ప్రవర్తించాను. హోటల్ వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఈ ప్రసక్తి మళ్ళీ ఎన్నడూ మీవద్ద తీసుకురాలేదు. నేను వ్యభిచారించానన్న అనుభూతి ని పొందుతున్నట్లు మీరు భావించాలట.   ఏమిటో ఈ విచిత్ర మనస్తత్వం నా కర్ధం కాదు -- కానీ మీ క్షేమం కోరి అలాగే చేశాను --" ఆ తర్వాత కొద్దిగా వెక్కిళ్ళు వచ్చాయి శ్రీమతికి.
    "నన్ను మన్నించు సీమా!" అన్నాను. నా కళ్ళ ముందు కప్పుకున్న మంచు తెరలు తొలగిపోయాయి. జరిగిందేమిటో తెలియవచ్చింది.
    "ఈ ఊళ్ళో హోటల్ మేనక ఉన్నసంగతి తెలుసా? దాన్ని గురించి శర్మ నాకొక రహస్యం చెప్పాడు -- " అంటూ ఆ వివరాలన్నీ ఇచ్చి --
    "ఆవేశంలో నేను శాంతి అనే అమ్మాయిని కోరాను. పొందగలిగాను . ఆ క్షణం నించీ నాకు బెంగ పట్టుకుంది. ఎవరైనా నా కోరితే -- అందజేయగల సమర్ధత హోటల్ వాళ్ళ కుందా? వాళ్ళను పరీక్షిద్దామని నేను ప్రయత్నిస్తే నా వేలితో నా కన్నె పొడిచారు వాళ్ళు! అసలు వాళ్లాడే నాటక మేమిటంటే-- కోరుకున్న అమ్మాయిని హోటల్ కు పిలిపించి, ఓ గంటసేపు కబుర్లు చెప్పి పంపించేస్తారు. ఆ పావుగంటా ఆమె హోటల్లో ఉన్నట్లు మా బోంట్ల కు తెలుస్తుంది.
    తర్వాత ఎత్తులోనూ, రూపం లోనూ యువతికి దగ్గిరలో ఉన్న అమ్మాయిని అలాగే మేకప్ చేసి వుంచి గదికి పంపిస్తారు. మగవాడప్పుడుండె మానసిక స్థితిలో ఆ మాత్రపు తేడాను గుర్తించడం కష్టం. అందులోనూ గదిలోకి వెళ్ళే అమ్మాయిని మసక చీకట్లో ఒక అద్దాల గదిలోంచి చూస్తాం. బాగా పరిచయమున్న మనిషిని కూడా ఆ మాత్రపు దూరం నుంచి తేడాలతో గుర్తించడం కష్టం. తర్వాత అంతా కటిక చీకటి వ్యవహారం --"
    యాక్సిడెంటయ్యే వరకూ కూడా నా అనుభవాల నన్నీంటినీ పూస గుచ్చినట్లు శ్రీమతికి చెప్పాను.
    అన్నీ విని ఆమె నెమ్మదిగా ఇలా అంది. "ఒక తప్పు చేసి నేను తప్పు చేస్తానేమో భయపడి అసహ్యించుకోవడం ప్రారంభించారు. కానీ మీరు తప్పు చేశానని ఎన్నడూ గుర్తించినట్లు కనపడదు" అంది.
    నేను సిగ్గుతో తల వాల్చాను.

                                                    *    *    *    *

    అంతా విని, శర్మ ముఖంలో రంగులు మారాయి. "ఏమిటి నువ్వు చెప్పేది? మేనక హోటల్ వాళ్ళు ఇంత మోసం చేస్తున్నారా?" అన్నాడు ఆశ్చర్యంగా.
    "ఈ పవిత్ర భారతదేశంలోని ప్రతి ఆడదీ శీలవతి అని రుజువు చేయలేను. కానీ కాదని రుజువు చేద్దామనుకున్న నువ్వు ఫేయిలయ్యావని చెప్పడానికి విచారిస్తున్నాను --" శర్మ మౌనంగా ఉన్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. అతనికి బుర్రలో మార్పు ప్రారంభమై ఉండాలని నా అనుమానం. అతనికి కనువిప్పు కలిగిందని నా అనుమానం.
    "ఆ అమ్మాయి బాగుంది కదూ!" అన్నాను దూరంగా కూర్చుని వున్న ఓ అమ్మాయిని చూపించి.
    "పెళ్లైన వాళ్ళం-- మనకు అమ్మాయిల జోలి ఎందుకు లెద్దూ!" అన్నాడు శర్మ.
    'అందాన్ని అనుభవించాలనుకోవటం తప్పవుతుందే,మోకానీ, పెళ్లైనంత మాత్రాన అందాన్ని చూసి ఆనందించడంలో తప్పేముంది?" అన్నాను.
    "తప్పు లేదు. కానీ అది తప్పుకు మొదలు. ఆ అమ్మాయెం ఖర్మ. అడుగో --నించుని ఆ అమ్మాయి కేసి చూస్తున్న ఆ అబ్బాయీ బాగున్నాడు. వాణ్ణి మెచ్చుకోవెం ?" అనడిగాడు శర్మ.
    "ఈ మనస్తత్వం మనిద్దరిలో కలకాలం నిల్చుగాక!" అన్నాను. దేవుడు తధాస్తు అన్నాడో, లేదో తెలియదు .

                                      ***

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra