Home » Dr c. ananda ramam » Aparajitha


    ఆ మాటల్లో ఎంతైనా సత్యముంది. ఇదివరకు తన్నొక దేవదాసులా ఊహించుకుని, మాధవి తప్ప మరో అంశ మేదీ తన వూహల పరిధిలోకి రాకుండా చేసుకుని కుమిలి పోతున్న తను, ఇప్పుడు రాధను గురించే ఆలోచిస్తున్నాడు. మనస్సులో ఏనాటికీ చెరిగిపోదనుకున్న మాధవి బొమ్మ మసక మసకగా గతం యొక్క చివరి పొరల్లోకి జారి పోతోంది. అనుకోని యీ పరిణామానికి తట్టుకోలేక, తన కోసం అంత త్యాగం చేసిన రాధను వదిలేసి, పిరికిపందలా పారిపోయి వచ్చేస్తున్నాడు తను. తాను చేస్తున్న పని ఎంతవరకూ సమంజసమో తెలియడం లేదు.'
    రైలు స్టేషన్ సమీపిస్తోంది. ఎర్ర బట్టల కూలీల హడావుడీ, టీ కాఫీలు అమ్మే వాళ్ళగోలా, ఇవన్నీ కలిసి భారత దేశంలో ఏ స్టేషయినా ఒకలాగే ఉంటుందన్న అభిప్రాయాన్ని బలపరిస్తున్నాయ్. మధు తల కిటికీలోంచి బయటికి దూర్చి ప్లాట్ ఫారం ఆ చివరనుంచి యీ చివరకు కళ్ళతో వెతకసాగాడు. అల్లంత దూరాన్నుంచి చేతులూపుకుంటూ పరిగెత్తుకు వస్తున్నాడు నరహరి. చాలా రోజుల తర్వాత, ఒకనాటి ప్రాణమిత్రుణ్ణి చూడగానే మధు హృదయం ఆర్ద్రమై, ఇతరమైన చింతల నన్నిటినీ విస్మరించి, ఆనందంతో నిండిపోయింది. తానూ చెయ్యి వూపి, పెట్టి పట్టుకుని దిగిపోయాడు మధు.

                                *    *    *

    అక్కయ్యా!
    నిన్ను మాధవీ అని పిలవడమే కదా నా అలవాటు! కాని ఈ క్షణాన నిన్నిట్లాగే గౌరవమో, కృతజ్ఞతో, ఖచ్చితంగా చెప్పలేనుకాని, ఈ క్షణాన అటువంటి భావాలన్నిటిమించి, అంతులేని జాలి నీపట్ల నా హృదయమంతా నిండి ఉంది. ఈమాట చదువుతూ నువ్వు అభిమానపడతావని తెలుసు. మెరుపులా నేనంటే ఒక చీదరింపు కూడా నీ మనో గగనాన మెరిసిమాయమవుతుందని కూడా నేను ఊహించగలను. నన్ను క్షమించుమాధవీ! జరిగినదాని కంతటికీ ఒక విధంగా నేనూ బాధ్యురాలనై నీ జీవితంలో అశాంతి రేకెత్తించాను. నన్ను మనస్పూర్తిగా క్షమించు. నీవు జీవితంలో వోడిపోయావు. అలా నీకు నీ జీవితం ఆనందధామం కాకుండా పోవడానికి నేను నిర్వహించిన పాత్రకూడా కొద్దిగా లేదనను. కొంత నిన్ను సరిగా అర్ధం చేసుకోని అజ్ఞానంవల్లా కొంత స్వార్ధం వల్లా అలా జరిగింది. కొంత చేజేతులా నువ్వే చేసుకున్నావు మాధవీ!
    నీవు తనదానిని కావాలన్న ఏకైక లక్ష్యంతో మధు ఎంతగా శ్రమించిందీ నాకు తెలుసు. శ్యామలక్కయ్య పెళ్ళికోసం డబ్బు అతడు సర్దడంలో నీపట్ల అతనికున్న మమతను అర్ధం చేసుకున్నాను. నీవు ఆ సంసారం నుండి విడివడి వచ్చేస్తావనీ తన చేయి పట్టుకుని సుఖమయ ప్రపంచంలోకి నిరాఘాటడగా నడిపించుకు తీసుకుపోతావనీ చాలా వోపిగ్గా ఆశను చింపుకోకుండా ఎదురు తెన్నులు చూచాడు మధు. నీవంటే అతని కుండే మమత, నీ అడుగుల చప్పుడు వినిపించినా చాలు ఉత్సాహంతో పురివిప్పి ఆడే నెమలిలాంటి అతడి మనస్సు నేను గ్రహించకపోలేదు.
    ఒకవిధంగా నువ్వంటే అంతులేని జలసీ పెంచుకోడానికీ నువ్వేది చెప్పినా వినకుండా కాట్ల కుక్కలా ఎదురుతిరిగి నోరు చేసుకోడానికీ నాకు కనిపించిన కారణం అదొక్కటే మాధవీ. నీ మధుమీద నాకు మొదటి నుండీ మమత ఉందని చెప్తే నీవు ఆశ్చర్యపోకూడదు. నీవు అతని గది వూడ్చి, సామాను సర్ది, పత్యాలు వండీ, చేసిన సేవ వెనక ఏ ఆరాధనాభావం ఉందో, అతని గదిలోగంటల తరబడి కూర్చుని వూకదంపు ఉపన్యాసాలు వినిపించిన నా వోపిక వెనకా అదే ఆరాధన ఉండేది. కాని మధు నన్నెప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే భాధ్య తెరగని పడుచుపిల్లలా చూచాడేతప్ప, నా గుండెల్లో మండే మంటను గ్రహించలేకపోయాడు. నువ్వూ అంతే మాధవీ. నాలో తిరుగుబాటుతత్త్వాన్ని పెంచి పోషించడానికి ఒకవిధంగా మీరిద్దరూ కారకులయ్యారు. అమ్మకూ, నాన్నకూ తమ బిడ్డల సంగతి ఏనాడు పట్టింది గనక? నిర్లిప్తురాలైన అమ్మా, బాధ్యతా రహితంగా బ్రతికే నాన్నా నా జీవితంమీద ఎటువంటి ముద్రా వేయలేకపోయారు. మధుకూ నీకూ మధ్య దాగుడు మూతలాటగా సాగిన మీ ప్రేమకధే లేకపోతే నా జీవితమూ సామాన్య మయిన అందరు కన్నెపడుచుల జీవితాలకు మల్లే సాగిపోయేదనుకుంటాను. నా మనస్సులో కసిని, నాకు దొరకని అవకాశాన్ని రక రకాలుగా ఊహించి, నా చుట్టూ వున్న స్త్రీ జాతి మొత్తం నాలాగే అన్యాయాలకులోనవుతున్నట్లుగా బాధ పడేదాన్ని, నా రచనలు అంత ఘాటుగా ఉండడానికి అదే కారణం. ఆ ఘాటుదనమే నన్ను పాఠకలోకం దృష్టిలో విశిష్టంగా నిలబెట్టింది కూడానూ. ఏది ఎలా ఉన్నా, నా దృష్టిలో వివాహ బంధానికంటే ప్రాముఖ్యం ప్రేమకే. నలుగురూ ఆమోదించి అక్షింతలు వేస్తేనే అది వివాహమై, ఎవరికీ తెలియకపోయినందువల్ల అది కాకుండా పోలేదు. నా నడవడికలో ముందంజనూ నా దృక్పథంలో కొత్తదనాన్నీ నీవు గ్రహించాలనే ఇంతగా వ్రాస్తున్నాను.
    అక్కా! మధుకు కేవలం ఉద్రేకంవల్ల నా శరీరాన్ని అర్పించలేదు. అంత నిగ్రహమూ స్థిరత్వమూ లేని మనిషినికాను నేను. అతని పట్ల నా హృదయమంతా నిండి వెలిగే ప్రేమ ముందు మరే విషయమైనా అల్పంగానే కనిపించింది నాకు. అతనికి నన్ను నేను అర్పించుకోడానికీ అతనిలో ఒదిగి కరిగిపోడానికీ సంఘమూ, సంప్రదాయమూ విధించిన వివాహాన్ని అడ్డంకిగా తలచడం తుచ్చంగా కనిపించింది నాకు. ఈ వివాహ బంధంవల్ల ఒక మనిషిని కట్టి పడేసుకోవచ్చును గాని, సుముఖంగా లేని మనస్సును సొంతం చేసుకో డానికి వీలులేదు కదా! నా మనస్సు ఎప్పుడో మధుకు అంకితం అయిపోయింది. ఏ అపూర్వ క్షణాన అతని భావగాఢత నా చుట్టూ కాంతి చక్రంలా సుళ్ళు తిరిగిందో, ఆ క్షణాన్నే శరీరమూ, మనస్సు అనే తర్క వితర్కాలకు లోను కాకుండా నన్ను నేను అర్పించుకున్నాను. సంఘం దృష్టిలో అతి విలువైన వివాహబంధం ఆ క్షణాన నాకు కలిగించని నమ్ముతున్నాను. దీనికి బహుశా ఎవరూ సాక్షులు లేకపోవచ్చు. ఏకైక సాక్షిగా వ్యవహరించే నా అంతరంగస్పూర్తిని ఎవరూ గుర్తించకపోవడం అటుంచి మీదు మిక్కిలి నిరూపించవచ్చు, మధు కూడా ఆ క్షణానికంత ప్రాముఖ్యాన్నిచ్చి నన్నే తన జీవిత సహచారిణిగా గ్రహించకపోవచ్చు, నేను దేన్నయితే అద్భుతమైన వరంగా స్వీకరించి తన జీవితంతో నా జీవితాన్ని ముడి వేసుకుని ఆనందిస్తున్నానో దాన్నే అతడు కేవలం ఉద్రేక మైన అవితర్కిత చేష్టగా భావించి నిరసించవచ్చు. అయినా నాకు కలిగే నష్టం ఏమిటి మాధవీ! మధు ఎవరికో స్వంతం అయిపోతాడనీ, నన్ను ఆదరిస్తాడో లేదో అనీ వాపోవడం నా లక్షణం కాదు. నాలో సుదర్శనాయుధంలా, మధుమీది ప్రేమ గిరగిరా తిరుగుతూ అంచులు తొక్కుతున్నంతసేపూ నా జీవితానికి ఎటువంటి లోటూ ఉన్నదనుకోను అతను చెంత లేనిదే, అతను నన్ను అనుగ్రహించందే, అతని చేయూత లేందే నేను నాశనమైపోతాననీ, నా భవిష్యత్తు మంట కలుస్తుందనీ నేను భావించడంలేదు అతను చెంత లేకపోతే మనస్సు శూన్యమవుతుందేమోకాని లౌకికమైన నా జీవనవ్యాసంగానికీ, నేను మనిషినై పుట్టినందుకు విధిగా నిర్వహించవలసిన నా బాధ్యతలకూ ఎటువంటి లోపమూ రాదు. అతను నా హృదయానికీ రాజు. నా మానసిక జగత్తుకు సార్వభౌముడు. కాని లౌకికప్రపంచంలో నేను నిర్వహించవలసిన బాధ్యతలను అతని నెత్తి మీదికి నెట్టేసి నిరామయంగా నేను ఉండలేను. ఎవరి బాధ్యతలు వారివి. నా గర్భ కుహరంలో పెరిగే అతనిమూర్తి యొక్క ప్రతిరూపానికి అంతులేని ఆప్యాయ తతో ప్రాణం పోస్తున్నాను. దాన్ని అన్ని విధాలా నిష్కలుష మూర్తిగా తీర్చిదిద్దుతాను. నా అకలుష ప్రేమ ఫల మిదీ అని లోకానికి సగర్వంగా చూపించి మురిసిపోయే క్షణాలు వస్తాయని తరగని ఆశతో ఎదురు చూస్తాను. ఇంత బరువైన బాధ్యతను ఎవరిమీదా నెట్టను మాధవీ! నా జీవిత మంతా ఈ ఆదర్శాన్ని సఫలం చెయ్యడానికే మీదుకట్టుకుంటున్నాను.
    ఏదో ఆవేశంలో చాలా వ్రాస్తున్నాను. నీ మనస్సుకు దీనివల్ల ఎంత గాయం కలుగుతుందో నే నూహించగలను. అయినా నీ తత్త్వం నాకు తెలుసు మాధవీ! ఎక్కడి కక్కడకు పరిస్థితులతో రాజీపడుతూ నిర్లిప్తంగా బ్రతకగలిగే శక్తిగలదానివి. అందువల్లనే జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులూ నిన్ను కదిలించలేవు. ఆ విషయంలో నీవు అపరాజితవు మాధవీ!
    ఇక ప్రస్తుతానికి వస్తే, మీ కస్తూరి అక్కగారు నన్ను చాలా ఆప్యాయంగా చూచుకుంటున్నారు. ఒక చిన్న యిల్లు కుదుర్చుకోవాలనుకుంటున్నాను. నేను చదివిన బి.యే డిగ్రీ లెక్కలు, నా కింత కూడు పెట్టే సూచనలే కనిపిస్తున్నాయ్. రెస్క్యూ హోమ్ లోనే టీచరు ఉద్యోగం దొరకవచ్చు. పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చాక మళ్ళీ వ్రాస్తాను అప్పుడు జీవిత ప్రవాహానికి ఎదురీతలు కొడ్తూ అలసిపోతున్న నీ చెల్లెల్ని చూడడానికి వద్దువు గాని ఉంటాను నీ ప్రియమైన రాధ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra