Home » D kameshwari » Aruna

    ఎంత ఓర్పు వహించాలన్నా ఒక్కోసారి వాళ్ళ నసుగుడు ఆ సిగ్గు ఆ చాదస్తం మాటలు...... అన్నీ చూస్తుంటేచిరాకు, కోపం వచ్చినా, తనో డాక్టరు అన్న సంగతి గుర్తుంచుకుని కోపం దిగమింగేది. ఇదే గవర్నమెంటు హాస్పిటల్స్ లో అయితే ఏనర్సో, ఏ ఆయానో ఓ గదమాయింపు గదుముతారు. "ఏయ్ ఏమిటి మాట్లాడవు? అడుగుతూంటే వినపడదా? మందుకావాలా? అక్కరలేదా? చెపితే చిన్నగా చెప్పు లేకపోతే వెళ్ళు నీ వెనకాల ఇంకా ఉన్నారు మనుష్యులు" అంటూ కేకలు పెడతారు.    
    అసలు డాక్టరు పరీక్షచేయడానికి వచ్చేసరికి డాక్టరు ప్రశ్నించకుండానే పరీక్షచేయబోయేరోగి రోగ లక్షణాలు బాధలువగైరాలన్నీ సూక్ష్మంగా కాగితంమీద ఏ అసిస్టెంట్లో హౌస్ సర్జన్లో వ్రాసి రెడీగా పెట్టుతారు అక్కడ అయినట్టు సిస్టమేటిక్ గా తనలాంటి ప్రైవేటు ప్రాక్టీసు పెట్టిన డాక్టర్లకి ఎలా కుదురుతుంది? అదేగా బావగారు చెప్పింది ప్రైవేటు డాక్టరుగా తనబాధ్యత విధులు గుర్తుతెచ్చుకుంటూ వాళ్ళతో శాంతంగా మాట్లాడడం, ఓర్పుగా వాళ్ళు చెప్పింది వినడం..... అన్నీ అట్టేప్రయత్నం లేకుండానే అలవాటు చేసుకుంది అరుణ. డాక్టరు దగ్గరికి జబ్బుచేసిన వెంటనే రావడంరోగ లక్షణాలు సరిగా చెప్పడం, చెప్పిన మందులు సరిగా తీసుకోవడం వగైరాలు ఆ ఊరి వాళ్ళకి అలవాటు చేసేసరికి చాలా నెలలుపట్టింది అరుణకి.    
    డబ్బు విషయంలోనూ అంతే సుబ్బారావు ధర్మమా అని డాక్టరుగారి ఫీజింత' అని అడిగిన వారికి అడగనివారికి చెప్పే అరుణకికాస్త భారం తగ్గించాడు, కాస్తో కూస్తో చదువు సంధ్య ఉన్నవారు, పట్నవాసంలో ఉండొచ్చినవారు వగైరాలు తన ఫీజు గురించి తెలుసుకుని చూడడానికి రాగానే వెళ్ళబోయేముందు మర్యాదగా ఎంతివ్వాలని అడిగేవారు మరికొందరు అడగకుండానే విజిటింగ్ ఫీజు టేబిల్ మీద పెట్టేసేవారు. ఎటొచ్చీఏమీ లేనివారు ఈయనలేనివారు......డబ్బిచ్చేవారికంటే వీరి సంఖ్యే ఎక్కువగా ఉండేది అయినా, రచ్చించాలి బీదోళ్ళం" అంటూ అరుణ డబ్బుఅడగకపోయినా కొంతమందికాళ్ళు పట్టుకునేవారు. "ఫరవాలేదులే లే" అనేది అరుణనవ్వుతూ.    
    మరికొందరు ఓ అరవీశె వంకాయలో, ఓ గుమ్మడి కాయో, పనసపండో, అరటిగెలో...... ఇలా వాళ్ళ తోటల్లో పొలాలలో కాసేవి అరుణవద్దంటున్నా తీసుకొచ్చేవారు వైద్యం చేయించుకున్నాక మొదట్లో పోనీలే అని ఊరుకున్నా డబ్బిచ్చేవాళ్ళ కంటే ఇలాకూరలు పళ్ళు పప్పుదినుసులు ఫీజు క్రింద ఇచ్చేపేషెంట్లే ఎక్కువయ్యారు అరుణకి. అవన్నీ ఏం చేసుకోవడమనేది పెద్ద ప్రాబ్లమ్ అయ్యేది అరుణకి. ఏ వస్తువూ కొనుక్కో నక్కరలేకపోవడం బాగానే ఉంది కానీ, అన్నీతను ఒక్కర్తీ ఏం చేసుకుంటుంది? ఎంత చెప్పినా వాళ్ళు ఈయడం మానేవారుకాదు సుబ్బారావుతో మొరపెట్టుకుంది ఓరోజు అరుణ.    
    "ప్రోబ్లమే ఏం చేస్తాం? వాళ్ళ దగ్గిర డబ్బు రూపంలో ఉండని మాట నిజమే అందుకే వాళ్ళ దగ్గిర ఉండే వస్తువులు ఫీజు క్రింద ఏదో రూపంలో ముట్ట చెప్పేస్తున్నారు. ఏం చేద్దాం? ఆలోచిస్తూ ఆనాడు సుబ్బారావు." అదే నేనూ అడుగుతున్నాను. మా ఇంట్లో తినేవాళ్ళు ఓ పదిమంది ఉంటేనిక్షేపంలా, సంతోషంగా ఉంచుకునేదాన్ని, కాని ఒక్కర్తిని ఇవన్నీ ఏంచేసుకోను?"    
    "గట్టిగా వద్దని చెప్పకపోయారా?"    
    "చెప్పాను, వాళ్ళు వింటేగదా తెచ్చిపడేసి వెళ్ళిపోతున్నారు నేనంతకంటే గట్టిగా చెప్పలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్ధంకావడం లేదు." నిస్సహాయంగా చూస్తూ అంది అరుణ.

    "ఓపనిచేద్దాం మీకు కావలసినవి పప్పులు వగైరాలు ఉంచిమిగతావి వారానికి ఓ సారి సంతకి పంపేద్దాం. మా బండి కూరలతో వాటితో వెడుతుంటుంది అక్కరలేనివి ఇచ్చేస్తే అమ్మించేస్తాను.    
    "ఛాఅదేమిటి అమ్ముకోవడం ఏమిటి?" అంది అరుణ.   
    "మరేమి చేస్తారు వాళ్ళు డబ్బీయలేదుమీకివి ఖర్చవవు, ఉట్టివేపారేస్తే ఏం వస్తుంది? అయినా మనకి ఎక్కువ ఉన్నవి అమ్మడంలో తప్పేంలేదు. మేం ధాన్యంపప్పులు, కూరలు అవి ఎక్కువ అయినవి అమ్ముకోవడంలేదూ?" అంటూ అరుణకి నచ్చచెప్పి బోధించాడు సగం అయిష్టంతోనే, గత్యంతరం లేక ఒప్పుకుంది అరుణ ఆ సూచనకి.  
    ప్రాక్టీసు పెట్టాక ఆ రెండు నెలలలో వచ్చిన డబ్బు లెక్క చూసుకుంటే అయిదువందలు మాత్రం లెక్క తేలింది. నెలకు రెండు మూడువందలంటేచాల తక్కువ మొత్తమే: "ఇంకా ఆరంభం కొన్నాళ్ళవరకు డబ్బు ఎంత వస్తూంది చూసుకోవడం ముఖ్యంకాదు మీ పేరు నలుగిరి నోటనలగాలి. మీ పేరు చెప్పగానే మంచి డాక్టరు అన్నభావం చటుక్కున అందరికి కలగాలి. ఓ రోగం వస్తే మీరు ఉన్నారన్న నిబ్బరం అందరికి కలగాలి.    
    ఇదంతా జరగాలంటే మీరుకనీసం ఓ ఆరు నెలలయిన ఓపిగ్గా నిస్పృహ చెందకుండా ఆ రోజుకోసం ఎదురు చూడాలి" అంటూ సుబ్బారావు తనమనసులో మాటచెప్పగానే అరుణకి ధైర్యం ఉత్సాహం వచ్చాయి. అవును ప్రాక్టీసు పెట్టిన మర్నాటినించి వేలు ఆర్జించాలంటే ఎలా కుదురుతుంది పట్టణాలలో అయినా పెట్టిన మర్నాటి నించి ప్రాక్టీసు ఎక్కడుంటుంది? ఓడాక్టరు ప్రాక్టీసు పెట్టాడంటే ఆ పేరు నలుగురికి తెలియడానికి నలుగురికీ అరుణ డాక్టరు మీద నమ్మకం కుదరడానికి చాలా రోజులేపడుతుంది.  
    ప్రాక్టీసు పెట్టిన కొత్తలో అలాంటివాటన్నింటికి తట్టుకుని నిలబడవలసి ఉంటుంది. ఓ ఏడాది వరకు ప్రాక్టీసు లేకపోయినా నిరాశ, నిస్పృహ పడితే లాభం లేదు ఎలాంటి డాక్టరయినా ఈ స్థితి నుంచి దాటాలి ఓసారి పేరంటూ వస్తే ఇంక పర్వాలేదు. నలుగురికి తనమీద నమ్మకం కుదిరితేచాలు, ఇంకా నిలబడ్డట్టే అరుణ తనకి తానుధైర్యం చెప్పుకుంది.
    పేషంట్లు వస్తున్నా రోగాలకి మందులిచ్చినయం చేస్తున్నా అరుణ మీద అరుణ ఊరి ప్రజలకి మంచి నమ్మకంకలగడానికి మూడు నెలలుపట్టింది. కరణంగారి అబ్బాయిని అపెండిసైటిస్ ఆపరేషన్ చేసిన దగ్గిరనించి అరుణ పేరు ఒక్కసారిగా వెలిగింది. ఆ ఊరేకాక చుట్టు పక్కల మూడు నాలుగు గ్రామాలదాకా అరుణ పేరు మ్రోగింది.  
    ఆరోజు ఉదయమే కరణంగారి ఇంట్లోంచి ఓ మనిషివచ్చాడు. వాళ్ళ పదిహేనేళ్ళ అబ్బాయికి ఏదో జబ్బు చేసిందని, వెంటనేరమ్మని కబురు పెట్టుకువచ్చాడు. అరుణ వెళ్ళేసరికి ఆ అబ్బాయి పరిస్థితి చాలాతీవ్రంగా ఉంది. విపరీతమైన జ్వరం. ఒంటిమీద తెలివిలేనిస్థితిలో పడి ఉన్నాడు. అరుణని చూడగానే కరణంగారు ఆదుర్దాగా అంతా చెప్పుకొచ్చారు. "ఈ మధ్య చాలాసార్లు కడుపు నొప్పి అంటూ బాధపడేవాడు. మేమేదో మామూలు కడుపునొప్పి అనుకున్నాం.    
    విరోచనాలకి దానికి మందిచ్చి చూశాం. అయినా తగ్గలేదు. పదిరోజులనించి కుడివైపు మరి నొప్పితో బాధపడేవాడు, రెండు రోజులనించి నొప్పి తీవ్రంగా అయినడవలేకపోయాడు. లేవలేకపోయాడు. కుడివైపు ముట్టుకుంటే గిలగిల లాడేవాడు. వాళ్ళమ్మ నిన్న ఆముదం పెట్టి కడుపుకాచేసరికి గిలగిలలాడిపోయి ముట్టుకోనిచ్చేవాడుకాదు. నిన్న రాత్రినించి ఒకటే జ్వరం మూలుగుతూ ఒంటిమీద స్పృహలేనట్టుపడి ఉన్నాడు. ఉదయంలేవగానే పిలిస్తే ఒంటిమీద తెలివిలేదు. గాబరాపడి పిలిచాం."   
    "ఇంతవరకు ఎందుకు పిలవలేదు నన్ను? ఊళ్ళో డాక్టరు ఉండి కూడా ఇంత అశ్రద్ద చేస్తే ఎలా?" అరుణకి ఆ అబ్బాయిని పరీక్ష చేయకుండానే సగం కేసు అర్ధమయింది. పరీక్ష చేశాక పిల్లాడి స్థితి ప్రమాదకరంగా ఉందని తేల్చుకోవడానికి అట్టేటైముపట్టలేదు. ఆ క్షణంలో ఎన్నడూ రానంతకోపం వచ్చింది అరుణకి. ఏం మనుషులు.    
    "ఇప్పటికయినా పిలిచారు లేకపోతేచేతులారా చంపేసి ఉండేవారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఇంతకొంపమునిగే వరకు ఊరుకున్నారు. ఇప్పుడేం చేస్తారు?" డాక్టరయినా అరుణకే గాభరాపట్టింది.    
    ఆపరేషన్ అనగానే అప్పటికిగాని ఆ ఇంట్లోవాళ్ళకి పరిస్థితి అర్ధంకాలేదు. భయంభయంగా చూసుకున్నారు. "ఏమిటయింది డాక్టరుగారూ? ఆపరేషన్ ఎందుకు? ఏదో మామూలుకడుపునొప్పి కాబోలు అనుకున్నాము. అజీర్తిచేసిందనుకున్నాం" కరణంగారు చేతులునలుపుకుంటూ సంజాయిషీ ఈయడం ఆరంభించారు.    
    అరుణకి ఆ సంజాయిషీలు చూస్తే ఒళ్ళు మండింది" కడుపు నొప్పి అనుకున్నారా? పిల్లాడు అంతలాబాధపడుతుంటే డాక్టరు ఊళ్ళో ఉంటేకూడా తీసుకురావాలని తెలియలేదా? ఇంకా కొన్ని గంటలు అలాగే ఊరుకుంటే మీ అబ్బాయి మరిమీకు దక్కేవాడుకాదు. వెంటనే అపెండిసైటీస్ ఆపరేషన్ చేయాలి."    
    కరణంగారి భార్య కాబోలు ఏడుపు ఆరంభించింది "అయ్యో అయ్యో నా బాబో ఏమిటయిందిరా నాయనా ఇంతలో ఇంతముంచుకొస్తుందనుకోలేదురా" కరణంగారు వెలవెలబోతున్న ముఖంతో చూశారు.    
    "వెంటనేపట్నం ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. ఓ రెండు గంటల్లో ఆపరేషన్ జరగకపోతే పిల్లాడేమవుతాడో? ఇక్కడ ఎవరికైనా కారుందా?" గబగబా అడిగింది అరుణ.

    "కారెవరికీ లేదండీ పట్నంతీసుకెళ్ళాలా? ఎలాతీసుకెళ్ళడం?" గుటకలు మింగాడు కరణం.    
    "ప్రొద్దుటిబస్సుకూడా వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ రెండు గంటలకి గానీరాదే?"    
    "మరేమీచేద్దామంటారు? ఆపరేషన్ వెంటనే చెయ్యకపోతే ఏమవుతుందో చెప్పలేను." అరుణకి ఏం చెయ్యడానికి చెప్పడానికి పాలుపోవడంలేదు. బస్సు మధ్యాహ్నం వరకు రాదు. కార్లు లేవు, బండిమీద అంత దూరంప్రయాణం కాదు. మరిఎలా? కొన్ని గంటల్లో ఆపరేషన్ జరిగి తీరాలి లేకపోతే భగవంతుడిమీద భారం వేసి వదిలివేయవలసిందేనా? ఏం చెయ్యడం? "డాక్టరుగారూ:" ఆదుర్దాగా పిలిచాడు కరణం. "నా పిల్లాడిని రక్షించండి మీరే ఏదో మార్గం చూడండి ఇవి చేతులు కావు. కాళ్ళనుకోండి వెంటనేఏదో చేయండి నాపిల్లాడిని బ్రతికించండి" కరణం ఏడుపు గొంతుతో చేతులు జోడించాడు. పిల్లాడి తల్లిఅయితే పెద్దగా శోకాలు పెట్టింది. "డాక్టరమ్మగారూ, నా పిల్లాడిని బ్రతికించండమ్మా"అయ్యో దేముడోనేనేం చేస్తానో" అంటూ అరుణకి నమస్కారాలు పెట్టేసింది.    
    ఒక్కక్షణం అరుణకి ఏం చెయ్యాలో పాలు పోలేదు. పట్నంతీసుకెళ్ళే వీలులేదు. సమయం లేదు. ఆపరేషన్ వెంటనేచెయ్యాలి. "ఆలోచించకండి అమ్మగారూ మీరే ఆ ఆపరేషన్ ఏదో చేసెయ్యండి."కరణంగారు చాలా సులువుగా చెప్పేశారు. అరుణకి అంతకంటే మరో మార్గంతోచలేదు కానీ ఆపరేషన్ తను ఒక్కర్తీ ఎలా చేయగలదు? కనీసం ఇంకో డాక్టరు లేకపోయినా ఏ నర్సులాంటి వాళ్ళసహాయమన్నా లేకుండా తన ఒక్కరివల్ల అవుతుందా? ఆపరేషన్ ఎలా చెయ్యాలో తనకి తెలుసు స్టూడెంట్ గా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయడం రెండుసార్లు చూసింది. హౌస్ సర్జన్ గా ఒకసారి స్వయంగా చేసింది. అసిస్టెంట్ ఉండగా ప్రొసీజర్ అంతా బాగాతెలుసు కావాల్సిన పరికరాలు ఉన్నాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra