దైవ ప్రార్థన
ఏడు కొండలవాడా గోవిందా
బస్సు ప్రమాదం
ఆరు కొండలవాడా గోవిందా
నూనె లడ్డుండలు
ఐదు కొండలవాడా గోవిందా
హుండీలో నల్లడబ్బు
నాలుగు కొండలవాడా గోవిందా
నా పెళ్ళాం నాతో లేచిపోయింది
మూడు కొండలవాడా గోవిందా
ముఖ్యమంత్రి మూర్ఛపోయాడు
రెండు కొండలవాడా గోవిందా
చాలు నీ అవతారం చాలించు
ఒంటి కొండవాడా గోవిందా
తిరుమల తిరుపతిని మిగిలించు
ఏడో కొండ మీద
ఎర్ర జెండా ఎగిరించు
రచన : 9-11-1977
ముద్రణ: మరో ప్రస్థానం విరసం ప్రచురణ -మే, 1980


