Home » Dr muktevi bharathi » Malli Vachhina Vasantham

   

     పెళ్ళి ప్రస్తుత సమస్య - ఇంతవరకు ఎందుకు చేసుకోలేదో కానీ, ఇప్పుడు మాత్రం చేసుకుని తీరాలి - ఒంటరిగా జీవించటం చాలా కష్టం - అయినా ఎందుకు జీవించాలి అలాగా - ఆనాడు లీలకొడుకుని ఎత్తుకున్నపుడు కలిగిన గొప్ప ఆనందం లలితకి గుర్తొచ్చింది - తనుపెళ్ళి చేసుకోవాలి - తల్లి కావాలి - ఇది ఎంత తొందరగా జరిగితే అంత మేలు అన్నే నిర్ణయానికొచ్చిన లలిత, తండ్రి గదిలోకి అడుగుపెట్టింది.
   
    వేంకట్రావు ఉత్తరం చదువుతున్నాడు. చాలా ఆనందంగా వున్నాడు. ఆ ఉత్తరం ఆయన్ని అంత ఆనంద పరుస్తోందంటే అది ఖచ్చితంగా చిన్నబ్బాయి దగ్గర నుంచి వచ్చిందే.
   
    'అమ్మా ఇలారా' చూడు అన్నయ్య ఏం రాసాడో ఉత్తరం అందించాడు తండ్రి.
   
    ఉత్తరం మడచి ముసిముసిగా నవ్వుకుంది లలిత. తన మనసులో భావం ఇక్కడ ఉత్తరరూపంలో ప్రత్యక్షమయింది - చెల్లాయికి పెళ్ళి చాలా ఆలస్యం చేసాం. ఇంకా ఆలస్యం చేయటానికి వీల్లేదు - నా స్నేహితుడున్నాడు - ఈమధ్యనే అతని భార్యమరణించింది ఇద్దరు పిల్లలు - అయితేనేం అతను వయసులో చిన్నవాడు మనిషి మంచివాడు. మన లలిత విషయం మాట్లాడాను. ఎల్లుండి మేమిద్దరం కలసి వస్తున్నాం - అదీ ఉత్తరం లలిత ముఖం వెల తెల పోయింది. ఇదా నాన్నగారి ఇంటిని ఆనందపరుస్తున్న విషయం - భార్యపోయి, ఇద్దరు పిల్లలున్న వాణ్ణి నేనెందుకు చేసుకుంటానూ - లలిత చేతిలో ఉత్తరం కదులుతోంది.
   
    'అన్నయ్య ఎల్లుండి వస్తాడట - చదివావుగా'.
   
    'అన్నయ్యని రావద్దని రాయండి' - లలిత కోపంగా అంది.
   
    'అంటే - ఈ సంబంధం చేసుకోవా భార్య పోయినవాడు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదా. లక్షణమైన సంబంధం. అయినా మనం ఎక్కడ వెతికి నీకు సంబంధాలు కుదురుస్తాం - వయసు పెరిగాక సంబంధం కుదరటం కష్టం. ముసలాయన ఏదో అంటూనే వున్నాడు. లలిత గదిలో లేదని తెలియక.
   
    వీధి గేటుతీసుకుని లోపలకొచ్చిన రామం ముసలాయన కేకలువిని గదిలోకొచ్చాడు" మామయ్యగారూ - ఇక్కడ ఎవరూ లేరు - ఎవరిమీద అరుస్తున్నారు" మీరు చెప్పే మాటలు నాకు చెప్పండి" కొండంత బలాన్నిచ్చా ముసలాయనకి.
   
    'ఇదిగో ఇది చదువు -ఇందులో తప్పేమయినా వుందా' - రామం ఆ ఉత్తరం చదివాడు. తప్పు ఇదో చిత్రమైనమాట. ఏది తప్పు, ఏది ఒప్పు - ఎప్పుడు తప్పు, ఎప్పుడు ఒప్పు - చాలా కష్టం తేల్చడం -
   
    'ఏమంటుంది' -
   
    'ఏమంటుంది - చేసుకోదుట' -
   
    'పెళ్ళి చేసుకోదా - ఈ సంబంధం' - రామం అంటుండగానే రివ్వున లోపలకొచ్చింది లలిత.
   
    'పెళ్ళి చేసుకుంటాను - ఈ సంబంధం చేసుకోను'
   
    రామం ఇక ఆ విషయం మాట్లాడలేదు. పెళ్ళి చేసుకుంటారట కదా - ఇది కాకపోతే మరొకటి -మీరెందుకు గోల చేస్తారూ' ఉత్తరం బల్ల మీద పెట్టి తన గదిలోకెళ్ళిపోయాడు రామం.
   
                                    *    *    *
   
                                          10
   

    రామం తల్లి ఊళ్ళో వ్యవసాయం చేయించుకుంటూ, భర్త వదిలి వెళ్ళిన ఆ ఆరెకరాల పొలం జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఊళ్ళో రామానికి ఇల్లు వుంది. ఆ ఇంట్లో తల్లికి తోడుగా స్కూల్లో పనిచేసే కృష్ణ మూర్తిగారి కుటుంబాన్ని అద్దెకి పెట్టాడు రామం నలుగురాడ పిల్లల తండ్రి కృష్ణమూర్తి ఐతే ఈ మధ్యే పెద్ద కూతురు అల్లుడు ఇల్లుకట్టుకున్నారని, కృష్ణమూర్తిగారు ఆ ఇంట్లోనే ఒక భాగంలో వుంటున్నారని తల్లి చెప్పింది రామానికి.       
   
    రామానికి బాగా పరిచయం గాయత్రితో గాయత్రి నల్లగా వుండేది. పెద్దజడ. పెద్ద కళ్ళు. ఎప్పుడూ నవ్వుతోవుండే ముఖము గాయత్రిది. అంటే చాలా యిష్టం వుండేది రామానికి. గాయత్రితో రామం చింత గింజలాట ఆడేవాడు. గాయత్రి గోరింటాకు పెట్టుకుని, రామాన్ని కూడా పెట్టుకోమంటే, ఒకసారి చేతి నిండా గోరింటాకు పెట్టించుకున్నాడు. ఆరోజు తల్లిచేత ఎన్నితిట్లు తిన్నాడో - ఆడపిల్లలా గోరింతాకు చేతులకా అని చాలా కోపగించింది తల్లి. తల్లికి కృష్ణమూర్తిగారి పిల్లలతో కొడుకు చనువుగా వుండటమే ఇష్టముండేది కాదు. ఆడపిల్లల్లో ఒక పిల్లని రామానికి చేసుకోమని కృష్ణమూర్తిగారు అడుగుతాడనే భయం మనసులో ఎప్పుడూ వుండేది తల్లికి.
   
    ఒకసారి గాయత్రి పెద్ద పూలజడ వేసుకుంది. రామం చాలా ఆశ్చర్యంగా చూసాడు. ఇంత పెద్ద జాడా అన్నాడు జడ పట్టు కులాగుతూ అంతే, జడకి పెట్టుకున్న సవరం కదిలింది. పూలు జలజలా రాలిపోయాయి. పూలజడకి దారం వేసి గట్టిగానే కుట్టారు. సవరం కదలకుండానే అల్లారు రామం పట్టిలాగగానే అక్కడికి తెగి, వేసిన దారాలు కొన్ని ఊడిపోయాయి. గాయత్రి గొల్లున ఏడ్చింది. రామాన్ని గట్టిగా గిచ్చింది. రామానికి ఏం చేయాలో తోచలేదు - తనకేం తెలుసు ఈ గొడవంతా - పొడుగ్గా వుండే జానకి జడ ఒక్కసారిగా మరీ ఇంత పొడుగైపోయిందని ఆశ్చర్యపోయాడంతే - గట్టిగా లాగే సరికి జరిగిందిది.
   
    - రామానికి తెలుసు ఈ విషయంతల్లికి తెలుస్తుందని, తన వీపు విరిగేట్లుగా కొడుతుందని - వెంటనే రామం పుస్తకాలు తీసుకుని స్నేహితుని యింటికి వెళ్ళిపోయాడు - రాత్రి అయే వరకు ఇంటికి రాలేదు. ఆ తర్వాత పరిక్షల సందడి - సెలవులు - సెలవులకి రామం రాజమండ్రిలో మామయ్య గారింటికికెళ్ళటం - ఇలా ఇలా రోజులు గడచిపోయాయి రామం కాలేజీలో చేరాడు, హైదరాబాదులో లలిత ఇంట్లో అద్దెకి దిగాడు. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు చూసాడంతె గాయత్రిని. ఒకసారి సెలవులకి ఊరెళ్ళినపుడు గాయత్రి పరికిణి ఓణీ వేసుకుని బొద్దుగా ముద్దుగా ముద్దబంతిలా కనిపించింది.....తనని కళ్ళతోనే పల్కరించి లోపలకెళ్ళిపోయింది.
   
    "ఇవాళ గాయత్రికి పెళ్ళిచూపులు" అంది తల్లి.
   
    నిర్ఘాంతపోయాడు రామం. అప్పుడే పెళ్ళేమిటి. దానికెన్నేళ్ళు అన్నాడు.
   
    "ఎన్నేళ్ళయితేనేమిటి - ఆడపిల్ల పెళ్ళి బాధ్యత వదిలించుకుంటే కృష్ణమూర్తిగారు కాస్త తెరిపిన పడతాడు. పైగా ఇంకో పిల్లలేదూ" - దీర్ఘం తీసింది తల్లి.
   
    రామానికి మనసు సమాధానపడటం లేదు. ఆడపిల్ల, కనీసం డిగ్రీ వరకన్నా చదువుకోకుండా, ఇరవై ఏళ్ళయినా దాటకుండా పెళ్ళి చేయటం పెద్దనేరం అని మనస్ఫూర్తిగా భావించే వాళ్ళలో రామం ఒకడు.
   
    గాయత్రి పెళ్ళిచేసుకుని, అత్తవారింటికెళ్ళిపోతుందా. ఇక పిల్లల్ని కనిపెంచి అమ్మగా స్థిరపడిపోతుందా పాపం పసిపిల్ల జానకి - రామానికి కృష్ణమూర్తిమేష్టారు మీద చాలా కోపం వచ్చింది.
   
    'నేను మీష్టారితో మాట్లాడుతాను. అప్పుడే గాయత్రికి పెళ్ళిచేసి ఆలోచన పెట్టుకోవద్దని - అప్పుడే పెళ్ళిచూపులేమిటి నాన్సెన్స్" -
   
    - రామానికి టిఫిన్ తిన బుద్ది వేయలేదు.
   
    'నీకెందుకురా అనవసరమైన విషయాలు - ఆడపిల్ల పెళ్ళి ఇవాళ కాకపోతే రేపయినా చేయాలిగా అయినా వాళ్ళయిష్టం - తల్లి మందలించింది. రామం కృష్ణమూర్తిగారింట్లోకెళ్ళాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra