Home » Yandamuri veerendranath » మంచు పర్వతం

   

     జయ అన్నది. "నేను చేసినదాంట్లో నా తప్పెంతవరకు వుందో నాకే తెలియడంలేదు సునీతా! అంతా విని "ఎందుకంత ఆలోచనారహితంగా ప్రవర్తించావు? అలా చెయ్యకుండా వుంటే బాగుండేది?" అని నువ్వంటే డానికి నేను జవాబు చెప్పలేను. కాని ఒక్కమాట మాత్రం నిజం. అందులో నా బాధ్యతకంటే విశ్వం బావ బాధ్యతే ఎక్కువగా ఉంది. నేను స్త్రీని కాబట్టి తప్పంతా కేవలం నాదేనని విశాలలా నువ్వూ నన్ను నిందిస్తే నేనేం చెయ్యలేను" అంటూ మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది జయ.
   
    జయ చిన్నతనం నుంచీ విశ్వంమీద ఆశలు పెంచుకుంది. దానికి కారణం కూడా విశ్వమే. తనను పెళ్ళి చేసుకుంటానని పదేపదే రహస్యంగా చెప్పేవాడు. ఆ విషయం పెద్దవాళ్ళకు చెప్పాలనుకుంటున్న సమయంలో విశాల చేసిన గొడవ, ఆ వెంటనే పెళ్ళి నిశ్చయం అవడం జరిగింది. చిన్నతనంనుంచీ అనుకుంటున్న విషయమని పెద్దవాళ్ళు బలవంతం చేస్తున్నందుకే ఒప్పుకోవలసి వచ్చిందనీ విశ్వం కళ్ళనీళ్ళతో చెప్పినప్పుడు జయ నమ్మేసింది. ఆడది కళ్ళనీళ్ళు పెట్టుకుంటే మొగవాడు కరుగుతాడంటారు. కానీ మొగవాడు కన్నీళ్లు పెట్టుకుంటే కరగని స్త్రీ ఎవరు చరిత్రలో? అప్పటికే వాళ్ళిద్దరూ శారీరకంగా ఏకమయ్యారు. అయినా తను ప్రేమించిన విశ్వం బావని ఇరుకులో పెట్టలేక ఆమె దూరంగా తప్పుకుంది. విశాల మాత్రం ఆమె ఎప్పుడు కనిపించినా రుసరుసలాడుతూ ఏదోమాట పరోక్షంగా అంటుండేది. విశ్వాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన జయ మరి పెళ్ళిచేసుకోకుండా వుండిపోయింది.
   
    రెండేళ్ళక్రితం విశ్వం బజారులో కనిపించి కాఫీ తీసుకుందామని ఆమెను హోటలుకు తీసుకెళ్ళాడు. అక్కడే తన మనస్సు విప్పి చెప్పాడు. ఆమెమీద తన ప్రేమ చచ్చిపోలేదనీ, పెద్దలమాట నిలబెట్టడం కోసం విశాలను పెళ్ళి చేసుకున్నా, ఆమె వల్ల తనకు ఎలాంటి సుఖమూ లేదని అన్నాడు. ఆమె నమ్మేసింది. విశాల చాదస్తాలతో తన ఆదర్శాలన్నింటిని అణచివేస్తోందనీ, ఏమైనా అంటే ఇంట్లో గొడవలనీ, అందుకే సాధ్యమయినంతవరకు బయట స్నేహితులతో గడుపుతుంటాననీ చెప్పాడతను. రాను రాను జయ ఇంటికి రాకపోకలు ఎక్కువ చేశాడు. ఆమె దగ్గర కూర్చున్న కాసేపే తనకు నిజమైన మనశ్శాంతి అనేవాడు. ఆ మాటలతో అతని రాకకు అభ్యంతరం చెప్పలేకపోయిందామె. గుండె లోతుల్లో నిక్షిప్తం చేసుకున్న ఆమె ప్రేమను చిలికి చిలికి బయటకు లాగాడతను. అతడి సుఖం కోసమే ఒకప్పుడు అతడికి దూరమైంది. అతడి సుఖంకోసం తిరిగి అతడికి చేరువై పోయింది జయ....స్త్రీ!!!
   
    "విశాల కూడా నన్ను ప్రేమిస్తుంది. నిజమే! కాని నేను తన భర్తను కాబట్టి ఆమెకు నేనంటే ప్రేమ. నేను తనని పెళ్ళి చేసుకోలేనని అనుంటే మరెవరినో పెళ్ళాడి అతదినీ ఇంతగానూ ప్రేమించేది. అంటే ఆమె తన భర్త స్థానంలో వున్నా వ్యక్తిని ప్రేమించాలి అన్న నమ్మకాన్ని ప్రేమిస్తోందంతే. ఏమీకాని నా కోసం అన్నీ అర్పించుకున్న నీ ముందు ఆమె ప్రేమ ఎంతమాత్రం నిలబడలేదు, సాటిరాదు నేనే అదృష్టవంతున్ని..." ఇలాంటి డైలాగులు చాలా చెప్పేవాడు విశ్వం. ఇలాంటి థియరీలు చాలా సులభంగా తయారుచేయవచ్చు. తన ప్రేమను, త్యాగాన్ని అతడు గుర్తించినందుకు జయ పొంగిపోయింది. అతడికి సర్వం అర్పించుకుంది. ఇంట్లో తనొక్కతే ఉన్నప్పుడల్లా అతడికి ఫోన్ చేసి రప్పించుకునేది. ఆమె తల్లి ఊరెళ్ళినప్పుడు విశ్వం క్యాంపు కెళుతున్నానని ఇంట్లో అబద్దం చెప్పి వచ్చేవాడు రెండు మూడు రోజులపాటు ఆమెతో గడుపుతుండేవాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడాది గడిచిపోయింది.
   
    ఒకరోజు జయ తల్లి ఇంట్లోలేదు. ఆ రోజు విశ్వం వస్తానని చెప్పి వెళ్ళాడు. అతడు చెప్పిన సమయానికి యింట్లోనే ఎదురుచూస్తోంది జయ. తలుపు చప్పుడికి ఆత్రుతగా వెళ్ళితీసింది. ఎదురుగా విశాల నిలబడి వుంది. జయ భయపడింది. విశ్వం ఏ క్షణంలోనయినా రావచ్చు. విశాల డైరెక్టుగా విషయంలోకి వచ్చేసింది. ఉత్తరాలు చూపించి ఎందుకు వ్రాశావాని నిలదీసింది. చిన్నప్పటినుండి అతడిమీద కన్నేసి, అందకుండా పోయినందుకు కక్షగట్టి దగ్గరయ్యావంది. మగవాడి పొందుకోసం తపించిపోయి, అతడిని ఆకర్షించుకున్నావంది. ఏ మందో మాకో పెట్టుండాలి. లేకపోతే అతడలా ప్రవర్తించే మనిషి కాదంది. విశ్వంలాంటి గొప్ప మనిషిని కూడా పాడుచేసి నందుకు ఏడుతరాల వెనుకనుంచీ తిట్టింది. జయ దేనికీ సమాధానం చెప్పలేదు. అతడితో సంబంధం తెంచుకాకపోతే బంధువులందర్నీ పిలిచి జయ వ్రాసిన ఉత్తరాలు బయట పెడతానని బెదిరించింది. విశ్వం ఊర్నించి రాగానే అతడిని నిలదీసి అడుగుతానని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె అటువెళ్ళగానే విశ్వం ఇటు వచ్చాడు.
   
    "విశాల ఎందుకొచ్చింది? ఎందుకంత కోపంగా వెళుతోంది?" అడిగాడు విశ్వం. విశాల అతడిని చూడలేదని తెలిశాక జయ మనసు కుదుట పడింది. ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం వుందని ఆమెకు తెలుసు. విశ్వాన్ని గాఢంగా ప్రేమించిన జయ ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగానే వుంది. విశాల అన్న విషయాలన్నీ చెప్పింది జయ. తనకెలాగు తప్పదు కాని విశాల విశ్వాన్ని ఎంత సాధిస్తుందోనని భయపడిందామె. కాసేపయ్యాక ఇంటికెళతానని వెళ్ళిపోయాడు విశ్వం ఆ రాత్రి ఉండకుండా నిజమే మరి.. మూడ్....లేనప్పుడు ఎందుకు ఉండటం?
   
    నాలుగురోజుల వరకూ అతన్నించి ఏ సమాచారం రాలేదు. జయ దిగులు పడిపోయింది. అక్కడేం జరుగుతున్నదో తెలియక గాభరాతో ఆమెకు జ్వరంకూడా వచ్చేసింది. ఫోన్ చేస్తే విశ్వం ఆఫీసుకి రావడంలేదని తెలిసింది. వారంరోజుల తర్వాత కనుపించాడతను. విశాల తనను ఒక్కమాట కూడా అనలేదని, అసలా విషయమే ప్రస్తావించలేదని సంతోషంగా చెప్పాడు. తన భార్య జయను అన్ని మాటలన్నందుకు అతడికి బాధలేదు. తానంటే అమితమైన ప్రేమ కాబట్టి తన భార్య తనను ఏమీ అనలేకపోయిందని సంతోషిస్తున్నాడు. కృతజ్ఞతాభావంతో అతడి మనసు పొంగిపోతుంది. భార్య చూపించిన ఉదాత్తత అతడిని ఆమెవైపు బలంగా తిప్పేసింది. క్రమక్రమంగా అతడు జయను చూడడం తగ్గించేశాడు. ఏదో పిచ్చిసాకులు చెప్పటం ప్ర్రారంభించాడు.

    అంతవరకూ చెప్పి జయ చివరగా అన్నది.
   
    "బావ వచ్చి నాతో సామరస్యంగా మాట్లాడి తన ఇబ్బందులన్నీ వివరించి చెబితే నేనే సంతోషంగా అతడికి దూరమయ్యేదాన్ని, వాళ్ళిద్దరూ ఒకటయ్యి సంతోషంగానే ఉన్నారు. నన్నుమాత్రం అపరాధిలా నిలబెట్టేశారు. నన్ను పావులా వాడుకున్నారు. అది నన్ను మానసికంగా చాలా కృంగదీసింది. ఆరోగ్యం పూర్తిగా పాడయింది. కోలుకోవడానికి ఇదిగో ఇన్నాళ్ళు పట్టింది" అని పూర్తిచేసింది.
   
    "విశ్వం అన్నయ్యంటే నాకెంతో ఉన్నతమైన అభిప్రాయం ఉండేది, తానిలా మారతాడని కలలో కూడా వూహించలేకపోయాను" అంది సునీత అంతావిన్నాక.
   
    "ఆమెను తప్పుపట్టి లాభంలేదు సునీతా! మీ అన్నయ్యేం చిన్న పిల్లవాడు కాదు. అమాయకుడంతకన్నా కాదు. అతడిలో లోపం యేమిటో తెలుసా? పిరికితనం ఆ పిరికితనమనే బలహీనతలో తనను తాను చంపుకుంటున్నాడు గ్రాడ్యుయల్ గా".
   
    అతనిలోని ఆ పిరికితనాన్ని కొద్ది రోజులలోనే ప్రత్యక్షంగా చూసింది సునీత. ఒకరోజు ఆఫీసునుంచి ఇంటికి తిరిగి వస్తోందామె దారిలోనే విశ్వం, విశాలల స్కూటర్ ఆమెను దాటివెళ్ళింది. ఆమె చూస్తుండగానే పక్క సందులోంచి వచ్చిన సైకిల్ స్కూటర్ కి తలిగి దానిమీద వ్యక్తి క్రిందపడిపోయాడు. సునీత అక్కడికి చేరుకునేసరికి పెద్ద గుంపు పోగయిందక్కడ. సైకిల్ వ్యక్తి తలమీద గాయం అయి రక్తం స్రవిస్తోంది. తప్పు అతడిదే అయినా అలవాటు ప్రకారం జనం విశ్వాన్ని నిందిస్తున్నారు. విశ్వం బొమ్మలా నిలబడి చూస్తున్నాడు. అంతమంది మగవాళ్ళనీ ఎదిరించి పోట్లాడుతోంది విశాల. ఆమె లేకపోతే అందరూ కలిసి అతడిని చితకదన్ని పంపేవారు. అతడిలోని పిరికితనాన్ని అర్ధం చేసుకున్నట్లు వాళ్ళు మరింత గట్టిగా అరుస్తున్నారు. ఒకడు వచ్చి చొక్కాపట్టుకున్నాడు. అప్పటికీ విశ్వం నోట్లోంచి మాట రావడం లేదు. భయంగా తలదించుకున్నాడు. మగవాళ్ళలో పిరికితనం అసాధారణంగారాదు. కాని మరీ అంత దద్దమ్మల్లా గుడ్లు మిటకరించి చూసే మగవాడిని ఎప్పుడూ చూడలేదు సునీత. మొత్తానికి వాళ్ళతో సంధి కుదుర్చుకుని యాభై రూపాయలు అతడి చేతిలో పెట్టి గండం గట్టెక్కించింది విశాల.
   
    "అన్నయ్యా తప్పంతా ఆ సైకిలు వాడిదే. రాంగ్ సైడులో వచ్చాడు వాడు. అక్కడున్న జనమంతా చూశారది. పోలీస్ కంప్లెయింట్ యిస్తానంటే సరిపోయేది. ఎందుకలా మాటయినా అనకుండా నిలబడి పోయావ్?" ఇంటికి రాగానే నిలదీసింది సునీత. ఆమెకు వొళ్ళు మండిపోతోంది.
   
    విశ్వం ఇబ్బందిగా చూశాడు. వెంటనే సర్దుకుని "నా బదులు కూడా మీ వదినే మాట్లాడేసిందిగా. తను పక్కనంటే నేను నోరు విప్పాల్సిన అవసరం వుండదు" అంటూ తేలిగ్గా నవ్వేశాడు.
   
    "అట్లాంటి అలగా జనంతో మీ అన్నయ్యేం మాట్లాడగలరు? అసలే ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం నేనయితే యాభై రూపాయలతో సరిపుచ్చానుగాని ఆయనయితే వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి కట్టు కట్టించి, సైకిలుకూడా రిపేరు చేయించి, వందో, రెండువందలో చేతిలో పెట్టి ఏ అర్ధరాత్రికో యింటికి చేరుకునేవారు" అంది విశాల. అతడెంత చేతకానివాడో అతని ఎదురుగానే హాస్యంగా చెప్పేస్తూ.
   
    "పక్కన వదిన లేకపోతే సరిగ్గా ఆ పనే చేసేవాడివా అన్నయ్యా?" సునీత కూడా నవ్వుతూనే అడిగింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra