Home » Vasundhara » సుహాసిని


    "వెంకట్రత్నం గారు నిజమే చెప్పారు" అనుకుందామె తనలో. అతడి వ్యవహారమేమిటో చూద్దామని తనూ అతడి వంకే చూడసాగింది.

    అయినా అతడిలో మార్పు లేదు. ఆమెకే అతడివంక అంతసేపు చూడ్డానికి మొహమాటంగా వుంది. ముఖం పక్కకు తిప్పుకున్నా అందులో రంగులు మారుతున్నాయి. శరీరం ఇబ్బందిగా ఫీలవుతోంది. ఒక వ్యక్తి అదేపనిగా తమవేపు చూస్తున్నాడన్న భావం....ఎందుకో చాలా మందిని ఇబ్బందికి గురిచేస్తుంది. ఇలాంటిది వందమంది మధ్య ఏ బస్సులోనో, ట్రయిన్ లోనో జరిగినా చిత్రంగానూ, ఇబ్బందిగానూ వుంటుంది. అలాంటిదిప్పుడు ఆఫీసులో ఆ గదిలో ఇద్దరంటే ఇద్దరే వున్నప్పుడు అతడు ఆమెనలా చూస్తూంటే ఆ యిబ్బంది ఇంకో రకం.

    "తనలాగే అతడెందుకిబ్బంది పడడు?" అన్న పట్టుదలతో ఆమె అతడినే చూస్తోంది."

    అలా ఎంతోసేపు జరుగలేదు.

    ఉన్నట్లుండి అతడెవరితోనో మాట్లాడుతున్నట్లు, "ఊఁ" అన్నాడు. తననేమో అనుకుని, "ఊఁ" అంది చరిత ప్రశ్నార్ధకంగా.

    అతడామె ప్రశ్నను పట్టించుకోలేదు.

    "వూఁ సరే సరిగ్గా అరగంట...." అంటూ తన సీట్లోంచి లేచి నిలబడ్డాడు.

    "సర్! పిలిచారా?" అంది చరిత.

    "వూఁ" అని అప్పుడే ఆమెను గుర్తించినట్లు ఆమె వంక చూసి, "చిన్న మాటర్, జ్ఞాపకశక్తి పనిచేయడం లేదని అనుమానంగా వుంది. టైపు చేస్తావా?" అన్నాడు.

    "షూర్" అందామె.

    అతడు తన మనసులోని మాటను సరిగ్గా చెప్పలేక టైపింగ్ మ్యాటర్ కింద చెప్పి తన ముఖంలో భావాలు వెతుకుతాడని ఆమె అనుకుంది. అతడేం చెబుతాడోనని ఆమెకు సిగ్గు, మొహమాటం, కుతూహలం వగైరా కలుగుతున్నాయి.

    "రెడీయా?" అన్నాడతను.

    "వూఁ...."

    "పకోడీ, మిరపకాయ బజ్జీ, మిఠాయి కొమ్ములు, బందరు లడ్డు, పెసర పుణుకులు, కారబ్బూంది...."

    ఆ మాటర్ ఎలా టైపు చేయాలో తెలియక చక చకా నోట్ బుక్ లో కాగితం మీద వ్రాసింది చరిత.

    "టైపు చేశావా?" అన్నాడు గౌతమ్.

    ఆమె అతడికి కాగితం అందించి, "ఏమిటిసార్! ఇవి?" అంది.

    "తీపి, కారం కలగలుపు" అన్నాడతడు.

    అతడి మాటల్లో లోతైన భావముందేమోనని ఆమె ఆలోచిస్తూంటే అతడక్కడ్నించి వెళ్ళిపోతున్నాడు.

    "సర్...." అందామె.

    "ఏం, నీక్కూడా ఏకారప్పూసో కావాలంటే చెప్పు. అరగంటలో వస్తాను....తీసుకుని" అన్నాడు గౌతమ్.

    అతడు అరగంటలో వస్తానన్నమాటే ఎంతో సంతోషం కలిగించిందామెకి.

    "నాకేమీ వద్దు సార్! మీ గురించి ఎదురుచూస్తూంటాను...." అందామె.


                     *    *    *    *


    ఆరుగురమ్మాయిలు తెల్లబోతే ఏడో అమ్మాయి హాసకు థ్రిల్లింగ్ గా వుంది.

    వాళ్ళ ముందో పదహారేళ్ళ కుర్రాడు చేతిలో ఆరు పొట్లాలతో నిలబడి వున్నాడు.

    "ఎవరుపంపారు నిన్ను?" అంది హాస.

    "రామ్ లాల్ మిఠాయి దుకాణం నుంచి వస్తున్నానండి" అన్నాడా కుర్రాడు వినయంగా.

    అందరూ పొట్లాలందుకున్నారు. పకోడీలు, మిరపకాయ బజ్జీలు, మిఠాయి కొమ్ములు, బందరు లడ్లు, పెసర పుణుకులు, కారబ్బూంది....

    "ఎవరు చెప్పారివిక్కడికి పంపమని?"

    "ఎవరో ఆర్డరిచ్చి అడ్రసు చెప్పారుట మేడమ్__"

    అతడి నుంచి అంతకుమించి సమాచారం రాదని అర్ధమై హాస అతడ్ని పంపేసింది.

    ఏడుగురమ్మాయిలూ విందులా ఎంజాయ్ చేశారు.

    "హాసా! ఈ మ్యాజిక్కెలా చేశావే?" అంది సుగుణ.

    "చెప్పానుగా, అశరీరవాణితో మాట్లాడేనని" అంది హాస.

    "కానీ, అదెలా సాధ్యం?" అంది సుగుణ.

    "ఇందులో ఏదో ట్రిక్కుంది" అంది కోమలి.

    "అదేమిటో చెబితే నేను కూడా తెలుసుకుంటాను. చాలా రోజుల్నించి ఆ ట్రిక్కేమిటో తెలియక కుతూహలంతో చచ్చిపోతున్నాను...." అంది హాస.

    "గొప్ప చేయకు. నీ ట్రిక్కేమిటో నీకు తెలియకుండా ఎలా ఉంటుంది?" అంది మాలతి.

    "మన శరీరమే మనకు తెలియని వింతలెన్నో చేస్తూంటుంది. ఉదాహరణకు నువ్వు గోళ్ళు కట్ చేసుకుంటే అవి మళ్ళి ఎదుగుతాయి. అదెలా జరుగుతుందీ నీకు తెలుసా? తెలియకపోయినా అలా జరగడం ఆపగలమా?" అది హాస.

    "హాస ఈ ట్రిక్కెలా చేసిందో నాకు తెలుసు" అంది ప్రతిభ.

    హాసతో సహా అంతా ఆమె వంక కుతూహలంగా చూశారు.

    "మనం చెప్పిన అయిటమ్సన్నీ రామ్ లాల్ దుకాణంలో ముందుగా ఆర్డరిచ్చింది. ఈ టైముకి అందేలా ఏర్పాటు చేసింది."

    "కానీ మనమే మడుగుతామో హాసకు ముందేలా తెలుసు?"

    "అదే హిప్నాటిక్ ఫవర్. తనేం ఆర్డరిచ్చిందో అవే మనం చెప్పేలా చేసింది హాస."

    "నా కంత హిప్నాటిక్ ఫవర్. తనేం ఆర్డరిచ్చిందో అవే మనం చెప్పేలా చేసింది హాస."

    "నాకంత హిప్నాటిక్ ఫవరుందా?" ఆశ్చర్యంగా అంది హాస.

    "నీ అందం మగాళ్ళకే కాదు, ఆడాళ్ళక్కూడా వశీకరణ శక్తి!" అని నవ్వింది ప్రతిభ. 

    "అయితే ఇంత జరిగినా మీరెవరూ అశరీరవాణిని నమ్మరన్నమాట...." అంది హాస అసంతృప్తిగా.

    "దానికింకో చిన్న పరీక్ష...." అంది ప్రతిభ.

    "ఏమిటది?"

    "రైల్వేస్టేషన్ కి ఫోన్ చేసి సూపర్ ఎక్స్ ప్రెస్ ఎంతలేటో కనుక్కోవాలి" అంది ప్రతిభ.

    "సరే" అంది హాస.


                      *    *    *    *


    "ఇవేమిటి?" అంది చరిత.

    గౌతమ్ ఆమెకు పొట్లం అందించి, "జిలేబీ! ఒకసారి ఏదో పార్టీలో నీకు జిలేబీ ఇష్టమని అన్నట్టు గుర్తుంది. అందరికీ అన్నీ కొన్నాక నీకూ ఏమైనా కొనాలనిపించింది" అన్నాడు.

    తన యిష్టాన్నంతలా గుర్తుంచుకుని అతడు తనకోసం తెచ్చిన ఆ పొట్లం ప్రేమ పొట్లంలాగా, అందులోని జిలేబీ ప్రేమ జిలేబీలాగా అనిపించిందామెకు.

    ఆ అనురాగం ఆమె కనులలో నీరు చిందేలా చేసింది.

    గౌతమ్ అది గమనించి, "జిలేబీ కారంగా ఉందా?" అన్నాడు.

    "తీపి కారాన్ని మించి కన్నీళ్ళు సృష్టించగలదు. అయితే ఆ అనుభూతి కూడా తీపిగా ఉంటుంది." అంటూ ఆమె జిలేబీని నోట్లో ఉంచుకుంది.

    గౌతమ్ కామె మాటలు అర్ధంకాలేదు. అర్ధం చేసుకుంటానిక్కూడా అతడు ప్రయత్నించలేదు.

    "మీరూ తింటారా?" అందామె.

    ఎందుకో అతడు ఉలిక్కిపడి, "నీతో ఓ మాట చెప్పాలి." అన్నాడు.

    "చెప్పండి" అందామె ఆతృతగా.

    "నీకు రైల్వే ఎంక్వయిరీస్ నెంబరు తెలుసు కదూ...." అన్నాడతడు.

                                                 **    **    **    **


    సరిగ్గా ముప్పై అయిదు నిముషాలు లేటు....నీ అశరీరవాణి మాటలు చిత్రంగా టాలీ అయ్యాయి. అద్భుతంగా వుంది...." అంది ప్రతిభ.

    మిగతా ఆడపిల్లలు అబ్బురంగా తన వంక చూస్తూంటే హాస అదోలా ముఖం పెట్టి, "నన్ను చూస్తే నాకే భయంగా వుందిప్పుడు" అంది.

    "భయమెందుకు? నీలో అద్భుత శక్తులున్నాయి. నువ్వు మానవకన్యవు కావు...." అంది ప్రతిభ.

    "అమ్మా! ఇంకెక్కడికైనా ఫోన్ చేస్తావా?" అన్నాడు హోటల్ యజమాని.

    "ఫోన్ కి చార్జి ఎంత?" అంది ప్రతిభ.

    "ఆడపిల్లల దగ్గర నేను డబ్బుతీసుకోనమ్మా" అన్నాడు హోటల్ యజమాని వినయంగా.

    "ఎందుకని?" అంది హాస.

    "వాళ్ళు అవసరానికి తప్ప ఫోన్ చేయరు. అవసరానికి ఫోన్ చేసే వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకోను" అన్నాడతను.

    కోమలి చుట్టూ చూసింది.

    హోటల్ చాలా రద్దీగా వుంది. అందులో సగానికి పైగా యువకులున్నారు. వాళ్ళలో మూడొంతులు తమనే చూస్తున్నారు.

    ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏడుగురు అందమైన కాలేజీ పిల్లలు కౌంటర్ దగ్గర నిలబడి ఉంటే ఆ హోటల్లో తేనెపట్టు, వాళ్ళు రాణి ఈగలు, మిగతావాళ్ళు తేనెటీగలు....

    హోటల్లోకి ఇంకా ఆగకుండా యువత ప్రవాహం వస్తూనే ఉంది.

    "పదండి పోదాం!" అంది కోమలి.


                     **    **    **    **


    దిగులుగా అదోలా కూర్చున్నాడు గౌతమ్.

    చరిత అతడినే చూస్తోంది. ఎంతసేపు చూసినా అతడిలో మార్పు రాక. చివరకు తనే ధైర్యంచేసి, "చాలా రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. మిమ్మల్నో విషయం అడగొచ్చా?" అంది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra