Home » Kommanapalli ganapathi rao » అసావేరి

    కరిగిన వెలుతురులో కరగని క్షీరవాహిని నిన్న మొన్నటి శిలాక్షి రాలు సృష్టించిన గ్రీష్మతాపం.
   
    అలా ఎంతసేపు గడిచిందో ఆమెకే గుర్తులేదు.
   
    చిన్న చప్పుడు.....
   
    కళ్ళు తెరిచింది.
   
    ఎదురుగా నిలబడి వున్నాడు వీర్రాజు ఆమె తండ్రి.
   
    అరవబోయింది కానీ అప్పటికే ఆలస్యమయినట్టు ఓ కట్టె శంకూ తలని తాకింది.
   
    "డాడీ...."
   
    ఉలిక్కిపడి నిద్ర లేచింది సావేరి.
   
    చుట్టూ చీకటి....ఆ చీకటిలో చిరుకాంతినందిస్తున్న బెడ్ లైటు.
   
    గొంతు తడారిపోతుంటే టీపాయ్ పై గ్లాసందుకుని గటగటా నీళ్ళు తాగింది. టైమెంతయ్యిందో తెలీదు.
   
    భయంగా, బడలికగా బెడ్ పై నుంచి లేచింది.
   
    సగం స్వప్నం, సగం లాలిత్యంతో రూపుదిద్దుకున్న ముగ్ధలా నడుచుకుంటూ వెళ్ళి రిస్ట్ వాచ్ నందుకుంది. తెల్లవారుజాము మూడున్నర కావస్తూంది.
   
    క్వార్ట్ జ్ వాచ్ వేపు చూస్తుంటే ముందు అన్నయ్య రవి గుర్తు కొచ్చాడు. మొన్న పుట్టినరోజుకి ప్రేమతో అన్నయ్య యిచ్చిన కానుకది. అది ప్రమాదకరమయిన టైంని సూచిస్తుందో లేక మారుతున్న టైంని స్పష్టం చేస్తూందో ఆలోచించగల అవగాహన లేదు.
   
    ఆమె గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తుంటే కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది.
   
    బయట నిశ్శబ్దంలో అనంతందాకా విస్తరించిన చీకటి.
   
    ఎక్కడో కాదు చాలా దగ్గరలో ఆ చీకటిలోనే నిద్రపోతుంటాడు శంకూ. తన గురించి ఇలాగే ఆలోచిస్తుంటాడా. కనీసం కలలో అయినా....
   
    ఆగిపోయే ప్రాణంకన్నా ఆగని కాలం గొప్పదయితే కాలగర్భంలో కలిసినా కలకాలం నిలిచేది కాలాన్ని సైతం పిలిచి శాసించేది ప్రేమనే రెండు అక్షరాల పదమే అన్న జ్ఞానం లేని వయసామెది.
   
    సృష్టిలోనూ, ప్రేమలోనూ వున్నవి రెండక్షరాలే   
    కాబట్టే రెండూ శక్తివంతమయినవేమో.
   
    అనాలోచితంగా వెనక్కి తిరిగిన సావేరి వార్డ్ రోబ్ వేపు చూసింది అక్కడ ఆమె రేపు కట్టుకోబోయే నీలం వోణీ ఫేనుగాలికి నెమ్మదిగా కదులుతూంది.
   
                                            *    *    *    *    *
   
    కాలేజీ ఆవరణ విద్యార్దులతో సందడిగా వుంది.
   
    ఇంకా క్లాసులు మొదలు కాకపోవడంతో రవి గ్రూపుకి చెందిన విద్యార్ధి బృందం రావిచెట్టు నీడన నిలబడి అలవాటుగా అమ్మాయిల్ని ఏడిపించే కార్యక్రమంలో నిమగ్నమయిపోయారు.
   
    రవి ధ్యాస అక్కడ లేదు. శంకూ కోసం నిరీక్షిస్తున్నాడు. నలుగురి మధ్య ఓడిన తను నలుగురిలోనూ శంకూని అల్లరి చేస్తే తప్ప మనసు శాంతించేట్టు లేదు.
   
    ఆ బృందంలోనే నిలబడ్డ వెంకట్ గొంతు కవితలు కక్కలేనట్టు మూగబోయి వుంది.
   
    కాలేజీలో జరిగే అల్లర్లు తాత్కాలికమే అని తెలుసు. కానీ తన మూలంగా జరిగిన పొరపాటు ఏమిటో రవికి చెప్పాలని వున్నా ఎందుకో ధైర్యం చాలలేదు.
   
    "ర్రేయ్ వెంకట్...." గావుకేక పెట్టాడు గుంపులోని సుధాకర్ చప్పుదవళ్ళమూలంగా ఒక్క అమ్మాయీ తనను పట్టించుకోనందుకు శాడిస్ట్ గా మారిపోయిన శాల్తీ అతడు ముందు సన్నగా, రివటలా వున్న అమ్మాయి వస్తుంటే అన్నాడు "నిమ్మాంజీ....అంగుళాంజీ...."
   
    వెంకట్ ఉలిక్కిపడ్డాడు ఆ అమ్మాయిలాగే.
   
    వెంటనే కాస్త బొద్దుగా వున్న అమ్మాయి నడుచుకుంటూ రావడం కనిపించింది.
   
    "నారింజ....కళేకంజీ" మరో అస్త్రాన్ని సంధించాడు.
   
    ఈ భాషేమిటో గుంపులో ఎవరికీ అర్ధం కాలేదు.
   
    నిశ్చేష్టతనుంచి యింకా తేరుకోకముందే లావుపాటి 'లావణ్య' రొప్పుతూ నడుచుకు వస్తూ వారి దృష్టిలో పడింది.
   
    "అబ్బో.... నారికేళం.... గుంజి.... గుంజి....."
   
    టక్కున ఆగిందామె. అర్ధం కాకపోయినా అది సరిగ్గా తనని ఉద్దేశించి అన్నదే అని బోధపడటంతో "మళ్ళీ అను" అంది రోషంగా.
   
    "మొత్తమా నీకొక్కదానికే సంబంధించిన విశేషణమా?"
   
    లావణ్యకు ఏడుపొచ్చేట్టుంది. "మొత్తం చెప్పు"
   
    సుధాకర్ చురుగ్గా ముందుకొచ్చాడు.
   
    "నిమ్మాంజి అంగుళాంజి
   
    నారింజ కళేకంజి   
    నారికేళం గుంజి గుంజి"
   
    ఘొల్లుమన్నారు గుంపంతా.
   
    ఎలాగూ అడిగాను కాబట్టి అర్ధం తెలుసుకున్నాక ఆనక తేలిగ్గా ఏడవొచ్చనుకుందేమో. "అదేం భాష" అంది ఎగశోష వస్తున్నట్టుగా.
   
    "అమర ప్రేమికుడైన షాజ్ హాన్ అమ్మాయిల్ని చూసినపుడు అశువుగా చెప్పే పార్శీభాష ఇది. ఈ మధ్యకాలంలో ఎవరూ వాడకపోయే సరికి నేను మళ్ళీ మొదలుపెట్టాను."
   
    "అసలు అర్ధం కావడంలేదే" అప్పటికే రెండు నీటిబొట్లు ఆమె కళ్ళల్లో ఉబికాయి.
   
    "అడిగావు కాబట్టి అర్జెంటుగా చెప్పేస్తాను. షాజహాన్ చక్రవర్తి మహలావు శృంగారపురుషుడు. పురవీధుల్లో నడిచేటప్పుడు లేత రెమ్మలాంటి అమ్మాయి కనపడిందంటే నిమ్మాంజి అంగుళాంజి అని కాస్త నుడురుగా వున్న ఆడది ఎదురైతే నారింజకళేకంజి అని నీలాగ బొండంలా వున్న ఆడది కనిపిస్తే నారికేళం గుంజి గుంజి అంటూ మాంచి ఎమోషనల్ గా ఎడ్రస్ చేసేవాడట...."
   
    బావురుమంది. "అంటే నేను కొబ్బరిబొండంలా వున్నానా?"
   
    "లేదని నేను పాపం మూటగట్టుకోలేను" టక్కున అన్నాడు సుధాకర్. లావణ్య పరుగులాంటి నడకతో వెళుతుంటే ఫకాలున నవ్వుతూ హఠాత్తుగా బిగుసుకుపోయాడు. కాలేజీ మెయిన్ గేట్ కేసి చూస్తూ "రవీ.....వాడొస్తున్నాడు."
   
    అంతా చూశారటు శంకూ నడుచుకొస్తున్నాడు.
   
    "ఓ ఆట ఆడిద్దామా?" సుధాకర్ రెచ్చగొట్టాడు. వెంకట్ వారించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే సుధాకర్ మాటలు తలకెక్కిన రవి నెమ్మదిగా ముందుకు నడిచాడు.
   
    క్షణాల్లో సిగరెట్లు వెలిగించుకున్నారు రవి, సుధాకర్ తో పాటు మరో అయిదుగురు సీనియర్ విద్యార్ధులు.
   
    కనీసం శంకూని సపోర్టు చేసే జూనియర్ కాలేజీ విద్యార్ధులు సమయానికి అక్కడ వుంటే ఏమయ్యేదో....
   
    నడుస్తున్న శంకూ ఆగిపోయాడు. సుధాకర్ అడ్డం పడటంతో గట్టిగా దమ్ములాగిన సుధాకర్ పొగని గుప్ మని శంకూ మొహంపై వదిలాడు. ఊపిరందనట్టు దగ్గుతుంటే మరో స్టూడెంట్ చొక్కాకాలర్ లాగి కాలుతున్న సిగరెట్ షర్టులో పడేశాడు.
   
    లోపల చురుక్కుమందేమో కంగారుగా షర్టు దులుపుకున్నాడు.
   
    "హీరో ననుకుంటున్నావ్ బే" ఈసారి సుధాకర్ కాలుతున్న సిగరెట్ ని శంకూ మెడకంటించాడు.
   
    చేయని తప్పుకు శంకూ మరోసారి బలైపోతున్నాడు.
   
    అతడి నిస్సహాయత మరింత ఆనందమనిపిస్తుంటే సుధాకర్ మరింత పేట్రేగి సిగరెట్ శంకూ చొక్కాజేబులో వేశాడు.
   
    అప్పుడు చూశారు ఇంటర్ విద్యార్ధులు. క్షణాల్లో ఆ వార్త జూనియర్ కాలేజీ స్టూడెంట్సుదాకా ప్రాకింది.
   
    గుంపుగా పరుగెత్తుకొచ్చారు శంకూని రక్షించుకోవాలని.
   
    అదే సమయానికి కాలేజీ ప్రిన్సిపాల్ కాలేజీలో అడుగుపెట్టారు. యాదృచ్చికంగా.
   
    అంతే... చేతులు కలవాల్సిన రెండు గ్రూపులు చెల్లాచెదురై పోయాయి.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra