Home » Yerramsetti sai » 69 Sardhar Patel Road

 

    "అవునోయ్ నటరాజ్! నువ్వు వారపత్రికలు ఎక్కువ చదువుతుంటావ్ కదా! ఇదేమయినా చెప్పగాలవేమో చూడు.
    ఈ రోజుల్లో రచయిత అవాలంటే ఇది అర్హత - కాకా- బాకా ఏది కరెక్ట్!"
    "బాకా కరేక్టండి!"
    "ఎందుకని?"
    కాకా అందరు పడతారండి ఎడిటర్ని. కానీ ఎడిటర్ లేని గొప్పతనం గురించి బాకా కొట్టినోడికే రచయిత ఛాన్స్ దొరుకుతుంది."
    "నిజమేనంటావ్?"
    "కావాలంటే ఓ రచయితను తీసుకొస్తాను మీరే చూడండి మన సర్దార్ పటేల్ రోడ్ లో ఆరుగురు రచయితలు, నలుగురు రచయిత్రులు వున్నారు."
    "వద్దులే! నీ మాట మీద నాకు నాకు నమ్మకముంది. ఇంకో పధం కూడా చెప్పగాలవేమో చూడు. కొందమంది నటీనటులకిది ఎప్పుడూ ఉండాల్సిందే సిగ్గు- పెగ్గు ఇందులో ఏది కరెక్ట్?"
    నటరాజ్ ఏదో చెప్పబోయాడు గానీ బయట గడపలో నుంచి "పెగ్గు" అన్న సమాధానం వినిపించి ముగ్గురూ గడప వైపు చూశారు.
    "గిరజాల జుట్టూ , కొంచెం మాసిన లాల్చీ , పైజామాలో ఓ వ్యక్తీ లోపలికొచ్చాడు.
    అతనిని చూస్తూనే గుర్తుపట్టాడు నటరాజ్.
    "అయన సినిమా యాక్టర్ శ్రీనాద్గారండీ!" అన్నాడు ఆశ్చర్యంతో.
    "అవును! ఆయనే" అంది సీత కూడా.
    రామచంద్రమూర్తి కూర్చున్న వాడల్లా విస్మయంతో లేచి నుంచున్నాడు.
    "మీరనుకుంటోంది నిజమే! నేను శ్రీనాద్ నే! ఈ కుర్చీలో కూర్చోవచ్చా! ఆఫ్ కోర్స్! వద్దని మీరెలా అంటారు కానీ" అంటూ కుర్చీలో కూర్చుని ఇల్లంతా కలియజూశాడోసారి.
    "గుడ్! ఇల్లు బావుంది. చాలా పీస్ ఫుల్ గా వుంది. ఇలాంటి ఇంటి కోసమే మూడు నెలల నుంచి తిరుగుతున్నాను."
    సీత ఎగ్జయిట్ మెంట్ తో చూస్తోందతని వైపు.
    "అదే! ఫేయింగ్ గెస్ట్ కావాలని పేపరులో వేశారు కదా! ఆ విషయం మాట్లాడానికే వచ్చాను. అందరికి మతిపోయినట్లయింది.    
    "పేయింగ్ గెస్ట్ గా మీరుంటారా?"
    "ఉండకేం చేస్తాను మనకీ ఇల్లు నచ్చినప్పుడు మీరు ఆ ఇంటి ఓనర్ గారనుకుంటాను" రామచంద్రమూర్తి వంక చూస్తూ అన్నాడతను.
    'అవునండీ! నా పేరు రామచంద్రమూర్తి! ఈమె నా మిసెస్  సీత."
    "నమస్తే!" అన్నాడు అతను.
    "నమస్తే! నిజం చెప్పాలంటే........"
    "నిజమే చెప్పండి! మొదట్లోనే అబద్దాలతో మాట్లాడుకోవటం బావుండదు" నవ్వుతూ అన్నాడు.
    సీత సిగ్గుపడింది.
    "మీ ఫాన్ ని నేను. మీ సినిమాలన్నీ చూశాను. మా ఇంటి దేవత సినిమా అయితే ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు."
    "థాంక్యు !థాంక్యు......." అంటూ నటరాజ్ వేపు చూశాడు.
    "నా పేరు నటరాజ్ అంటారండి!"
    "ఎవరంటారు?"
    "అందరూనండి!"
    "నేననను! ఎందుకంటావా? నిన్ను చూస్తే మా సినిమా ఫీల్డులో డాన్స్ మాస్టర్ లా వున్నావు . అందుకని డాన్స్ మాస్టర్ అనే పిలుస్తాను."
    "మీరెలా పిలిచినా ఒకే సార్! నిజంగా కూడా నేను డాన్సర్ నే! కదండీ! రాజేశ్వరి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో మెయిన్ డాన్సర్ ని నేనేనండి! మీ సినిమా "పెద్దింటొల్ల పిల్ల" లో మీరు హిట్ సాంగ్ వుంది చూడండి , "ప్రేమనుకుంటే పెళ్ళయిందీ , పెళ్ళనుకుంటే ఇల్లయింది" ఆ పాటకు మూడొందల నలభై సార్లు రికార్డ్ డాన్స్ చేశానండీ. చేసిన ప్రతి సారీ ఆడియన్స్ 'రిపీట్' లు, వన్స్ మోర్ లు కొట్టే వాళ్ళండీ!"
    "అయితే నేను మా ఫీల్డుకి మరీ దూరమవలేదన్నమాట! ఇక్కడ వున్నా ఆ వాసనలు వుంటాయి. ఇంతకూ నేనిక్కడ పేయింగ్ గేస్ట్ గా ఉంటే, అంటే నేనిక్కడ పేయింగ్ గెస్ట్ గా మీరుంచుకోవడానికి వప్పుకుంటే ఉంచుకోవటం' అనేది సరయిన పదం కాదనుకుంటాను. సినిమావాళ్ళం కదా! కొంచెం డబల్ మీనింగ్ పదాలు ఎక్కువగానే పడుతుంటాయి. అలవాటు వాళ్ళ, అదే.......నేనిక్కడే సేటిలయితే మీకు ఎంత డబ్బు కట్టాలో చెప్పండి" అడిగాడతను.
    రామచంద్రమూర్తి సీత వంక చూశాడు
    ఆమె "మీరే మాట్లాడండి" అన్నట్లు చూసింది.
    "ఎంతో కొంతలెండి! మేమూ పేయింగ్ గెస్ట్ ని పెట్టుకుందామని మొన్ననే డిసైడ్ చేసుకున్నాం. నిన్న నటరాజ్ పేపర్ కివ్వటం , ఇవాళ మీరు రావటం జరిగిపోయింది. అంచేత మేము ఇంత అనిగానీ, ఇంత కాదు అంత అని గానీ ఏమి అనుకోలేదు."
    "అనుకోకపోతే ఏమయ్యింది?" ఇప్పుడనుకుండాం."
    "మీరు ఎంతనుకుంటే అంతేనండీ! మీరు మా ఇంటిలో వుండటం మాకు అనందం" అంది సీత.
    "ఈ అనందం అనేది ఉంది చూశారు! మొదటి రెండు రోజులండి! తర్వాత చిరాకు మొదలవుతుంది. అంచేత అది శాశ్వతంగా ఉండాలంటే 'ఇంత' అని అనేసుకుంటే గొడవ వదిలిపోతుంది."
    "అయినా మీరు సరదాకి మాట్లాడుతున్నారా.......? లేక నిజంగా పేయింగ్ గెస్ట్ గా వుండడానికొచ్చారా అని నాకు అనుమానంగా వుంది. మీలాంటి గొప్ప స్టార్స్ పెద్ద భావనల్లో, ఫైవ్ స్టార్ హోటల్స్ లోనో వుంటారు......"
    రామచంద్రమూర్తి మాటకు అతను నవ్వాడు.
    "మనకిప్పుడు డిమాండ్ లేదుగా ఫీల్డులో. అంతా కొత్తోళ్ళు వచ్చేశారు. ప్రతి స్టార్ కి ఒక టైం వుంటుంది. అంతే.........ఆ తరువాత ఫెయిల్ క్వాలిటీ అయిపోతాడు. అదీగాక నేను సంపాదించిందేమీ నిలబెట్టుకోలేదు. ఆ సినిమా ఫీల్డ్ ప్రసాదించిన అలవాట్లకే ఖర్చు చేసేశాను. మద్రాస్ లో ఫుడ్ కి కూడా కష్టమైన పరిస్థికి వచ్చింది. ఏం చేయటమా అని ఆలోచిస్తుంటే, అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చిత్రపరిశ్రమని హైదరాబాద్ కి తరలిరావాలన్న పిలుపు వినిపించింది. ఆ వంకతో మద్రాస్ వదిలి వచ్చేశాను. ఇక్కడేదో పెద్ద మాకు ఫుడ్ దొరుకుతుందని కాదు ఎవరయినా ఎందుకు సినిమాల్లో వేయతంలేదని అడిగితే , మన ప్రభుత్వం పిలిచిందనీ, తెలుగువాళ్ళ మీద అభిమానంతో వచ్చేసాం. ఇక్కడికి రావటం వల్ల ఎన్నో సినిమాల్లో నటించే అవకాశాలు పోయాయి. అయినా గానీ తెలుగు ఫిలిం ఫీల్డు హైదరాబాద్ కి రావడానికి మేము త్యాగం చేస్తున్నాము అని చెప్పవచ్చు ఏమంటారు?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra