Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 21

"శ్రీహర్ష!"
"ముందిది చెప్పండి. మీరు లావణ్యనా, కుటుంబరావుగారా?"
"లావణ్య  లోపలికెళ్ళి పోయింది. మొగాళ్ళం మనిద్దరం నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. ఇంక పాయింటు కోద్దాం. ఒక్క విషయం సూటిగా చెప్పేయ్. లావణ్యని పెళ్ళి చేసుకోవడం నీ కిష్టమేనా?"
మౌనంగా కూర్చున్నాడు శ్రీహర్ష.
"ఏమిటి ఆలోచన?{" అంది లావణ్య అసహనంగా.
"అబ్బే! ఏం లేదు. లావణ్యకి తగిన వాణ్ణినేనా అని అనుమానం."
"లావణ్యకి నచ్చావు."
"ఎందుకు నచ్చాను?"
"చెప్పలేం . లావణ్య నిన్ను చూడగానే నీలాంటి భర్త వస్తే ఎంత బావుండు అనుకుంది."అ  ప్రయత్నంగా లావణ్య తలదించుకుంది.
"అంటే, యూ మీన్ లవ్ అట్ ఫస్ట్ సైట్ - ప్రధమ వీక్షణంలోనే ప్రేమాంకురం అన్నమాట. అవునా?"
"అవును."
"దాన్నే తొందరపడి నిర్ణయం తీసుకోవడం అని కూడా అంటారు."
"లావణ్య ఏప్[ఎపుడూ తక్షణం నిర్ణయాలు చేస్తుంది శ్రీహర్షా! తను తొందరాపాటు మనిషే గానీ తన అంచనాలు , నిర్ణయాలు ఎప్పుడూ తప్పుకావు. నాకా నమ్మకం ఉంది."
"ఇంకో విషయం. నేను లావణ్యకి నచ్చానన్నారు. మనిషి ఆకారం నచ్చడం ఒకటే ముఖ్యం కాదు. లావణ్య పెరిగిన అంతస్థు వేరు, నేను పెరిగిన అంతస్థు వేరు. నేను తనని సుఖ పెట్టగలనా? తను  నాతో సుఖపడగలదా? నాకు డబ్బు సంపాదించాలనే తహతహ ఎక్కువ. సంపాదించి తిరతాను. అప్పటిదాకా తను సరిపెట్టుకోగలదా? నాకు తల్లి, చెల్లెలూ ఉన్నారు. వాళ్ళతో కలిసి పోగలుగుతుందా? చెప్పాండి, ఇవన్ని లావణ్యకు లేని పోనీ ఇబ్బందులు."
"అహహ" అని గంభీరంగా నవ్వింది లావణ్య. "మై డియర్ యంగ్ చాప్ నువ్వూ నీ కుటుంబం హాయిగా ఇక్కడే ఉండిపోండి. నాకున్నది మన మందరం తింటూ సరదాగా గడిపేద్దాం. నేనెవరి కోసం సంపాదించాను? నువ్వింకా ఎవరికోసం సంపాదించాలి? కాదంటావా మిస్టర్ శ్రీహర్ష?"
నవ్వాడు శ్రీహర్ష.
ఇల్లరికం అనే మాటని చాలా తిప్పి చెప్పరు మీరు. క్షమించండి , అది నాకు నచ్చదు."
"ఇల్లరికం అంటే అదేదో పాపమైనట్లు మాట్లాడుతున్నావ్."
"నాకు నచ్చదు " అన్నాడు శ్రీహర్ష.
"లావణ్యను పెళ్ళి చేసుకోవడం నా కిష్టమే. అయితే తను నాతో సర్దుకు పోగలదా అని మీరు కొద్దిగా ఆలోచించుకోవాలి."
చటుక్కున మళ్ళీ లావణ్య లా గొంతు మార్చి "సర్దుకు పోవాల్సింది నేనొక్కదాన్నేనా? మీరు కూడా సర్దుకుపోయే ప్రయత్నం చెయ్యకుడదా?" అంది చురచుర చూస్తూ.
"సర్దుకు పోవడమే కాదు మిస్ లావణ్యా! ఇంకా మీకోసం చాలా చాలా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాను." అన్నాడు శ్రీహర్ష.
"వెరి గుడ్!" అంది లావణ్య రావు గారి గొంతుతో. అతను ఒక్క మెట్టు దిగుతాడు. నువ్వొక్క మెట్టు దిగు. ఇద్దరూ పెళ్ళాడేసి హాయిగా కాలం గడిపెయ్యండి."
"లావణ్యా! ఇంతకీ మీ నాన్నగారికి నిజంగా ఇష్టమేనా?"
"రేపు అయన వచ్చిన తర్వాత తెలుస్తుందిగా."
"నా అదృష్టాన్ని నేను నమ్మలేక పోతున్నాను."
"అలా అనుకుంటే ఎలా? నాకంటే అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో వుంటుందేమిటి? ప్రతి విషయంలో నేను అదృష్టవంతురాలినే"
కబుర్లలో గంటలు గడిచిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు , ఆకలి కరకర వేస్తుండగా బీట్ రూట్ కూరా, కాబెజ్ కూరా, సేమ్యా పాయసం బ్రెడ్ తో చేసిన హల్వా , అయిస్ క్రీం తో భోజనం చేశారు.
అది పెద్ద డైనింగ్ హాలు. తెల్లటి డెకోలామ్ డైనింగ్ టేబుల్. చుట్టుతా అరడజను కుర్చీలు, ఖరీదైన పింగాణి పాత్రల్లో వంటకాలు, నూనే నెయ్యి, డాగులు పడకుండా గిన్నెల కింద రబ్బరు మాట్సు, క్లిన్ గా హాయిగా ఉంది డైనింగ్ రూం.
భోజనం చేసిన తర్వాత టేపు రికార్డర్ తెచ్చింది లావణ్య. "అబ్బా' లో పాటలు పెట్టుకు విన్నారు.
"మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు లేదా?"
"ఉహు!" అన్నాడు శ్రీహర్ష.
"నా కలవాటు ఉంది"
"పడుకోండి"
"ఇక్కడే ఒక అరగంట సేపు పడుకుంటాను. మీరేం అనుకోరు కదా. మేగజైన్సు ఏమన్నా చదువుకుంటూ ఉండండి" అంటూ సోఫాలో ఒక దిండు వేసుకుని, చెయ్యి మడిచి తలకింద పెట్టుకుని , పాదాలు చీరెలోకి లాక్కుని ముడుచుకుని పడుకుంది.
శ్రీహర్ష పుస్తకంలో చేతిలో పట్టుకున్నాడు కాని దృష్టి దాని మీద నిలవటం లేదు.
తదేకంగా లావణ్యని చూడసాగాడు.
లావణ్య కళ్ళు మూసుకుని ఉంది.

 Previous Page Next Page