Home » Dr muktevi bharathi » Malli Vachhina Vasantham

  

  'ఏమో ఏమి శారదో. పదిరోజులనాడు వెళ్ళింది నాలుగు రోజులుండి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఊరెళ్ళింది. వారం రోజులవరకు రానని చెప్పింది. నాకాఅమ్మాయి విషయం అర్ధంకావటంలేదమ్మా - సుబ్బలక్ష్మిగారు బియ్యం ఏరుకుంటోంది.
   
    'ఒక్కర్తే వెళ్ళిందా - లలిత కిందకూచుని బియ్యం ఏరటం మొదలుపెట్టింది.
   
    సుబ్బలక్ష్మి నవ్వింది. "ఒక్కర్తే ఎందుకెడుతుందీ. వాడు లేడు
   
    'ఎవడూ'
   
    'వాడే ఆ ఎత్తుగా లావుగా వుంటాడు - దుబ్బ మీసాలు వాడూనూ - ఆ, ఉండు, వడి పేరు దినేష్ - దినేషట"సుబ్బలక్ష్మి బియ్యం ఏరుతూ రెండుగింజలు నోట్లోవేసుకుంది.
   
    'శారద బంధువా పిన్నిగారూ'
   
    "బంధువా బండలా - స్నేహితుడనిచెప్తుంది - ఆ పిల్లచేత ఇల్లు ఖాళీ చేయించాలనుకుంటున్నా.
   
    'ఎందుకూ'
   
    'ఎందుకేమిటీ - చెప్పుకుంటే సిగ్గు చేటు - రాత్రి పదకొండు దాటినా కొంపకిపోడు - విక వికలు పక పకలు -మధ్యలో అదెవర్తో అదీ వస్తుంటుంది - స్నేహితురాలేమో ఏమైనా ఆ పద్దతి నచ్చటంలేదు - ఊరినించి రాగానే చెప్తా ఇల్లు ఖాళీ చేయమని"
   
    సుబ్బలక్ష్మిగారి ప్రతిమాటా శ్రద్దగా వింటోంది లలిత. ఏమీ మాట్లాడకుండా బియ్యంలో రాళ్ళుఏరే ప్రయత్నంలో వుంది.
   
    "ఏమే లలితా - ఒక్కమాట చెప్పు - ఇది మొగుడికి విడాకులిస్తోందిట - కోర్టులో కేసు నడుస్తోందిటగా నిజమేనా'
   
    'ఆ- అంతవరకు నిజమే - కానీ - శారద చాలా అమాయకురాలు పైకి వేషాలే కానీ ధైర్యం లేదు.
   
    "మనకెందుకూ - దానిష్టం అది - మనక్కావలసింది మనయిల్లూ దీర్ఘం తీసింది సుబ్బలక్ష్మి - పదినిముషాలు కూచుని వచ్చేసిందిక ఇంటికి లలిత.
   
                                   *    *    *
   
                                         9

   
    కారువేగంగా పరుగుతీస్తోంది. శారద మనసు అంతకు వందరెట్లు వేగం తోపరిగెడుతోంది. నాన్న తనని ఎందుకు రెండు రోజులాగమన్నాడో, అన్నయ్య వదిన పిల్లల్ని పంపి తనెందుకుండి పోయాడో ఊహకందటం లేదు. కానీ రాజమ్మ పిన్ని నాన్న మనసులో విష బీజం నాటిందని మాత్రం ఖచ్చితంగా అర్ధమవుతోంది. దినేష్ కు తనకు ఏవేవో సంబంధాలు కల్పించి వుంటుంది. ఇంకా, ఉద్యోగం మాన్పించి తనను ఆ ఊళ్ళోవుండే ఏర్పాటు చేయమని చెప్పివుంటుందీ - ఏదీ ఏమైనా తనేం చేయాలీ - ఉద్యోగమునూ వదులుకోదు, దినేష్ స్నేహమూ వదులుకోదు - ఇందులో మరో అభిప్రాయం లేదు.
   
    'కేసు ఎప్పటికి వాయిదా పడింది' - శారద సడెన్ గా అనే సరికి డ్రైవ్ చేస్తున్న దినేష్ ఉలిక్కిపడ్డాడు.
   
    'ఏ కేసు' విసుగ్గా అన్నాడు.
   
    'అదే - ఇంకే కేసూ - నా విడాకులు' నవ్వింది శారద.
   
    'నిజంగా నీకు విడాకులు తీసుకోవాలని వుందా చెప్పు'   
   
    'అంటే'
   
    'అదే - ఖచ్చితంగా ఆమాట మీదనువ్వు నిలబడితే, తొందరగా వదిలించేసుకోవచ్చు. కారు రోడ్డు పక్కన ఆపాడు దినేష్.....శారద మూడంతా పాడయిపోయింది. కారు దిగకుండా కారులోనే కూచుంది.

    'శారద ఒక్కమాట చెప్పు - తరువాత ఏం చేస్తావ్'
   
    'దేని తర్వాత' -
   
    'విడాకులు తీసుకున్న తర్వాత'
   
    'దినేష్ - నా మనసులో మాట చెప్పేయనా అంది శారద. "ఈ ఊరువదిలి చాలా దూరంగా వెళ్ళిపోవాలని ఎవరికీ కనిపించకుండా అప్పుడు కానీ శాంతి లేదు" - అంది చిరాగ్గా.
   
    "ఎందుకూ"
   
    'నాకెందుకో భయంగా వుంది. మానాన్న, అన్నయ్య వచ్చి నాచేత ఉద్యోగం మాన్పించవచ్చు - విడాకులవగానే, పెళ్ళి ప్రయత్నం చేయచ్చు. ఏదైనా కావచ్చు - అంతే కాహ్డు, ఇంటావిడ, అదే సుబ్బలక్ష్మి గారు కూడా మనని కనిపెడుతోందనిపిస్తోంది - ఏమో! - శారద ఎటోచూస్తోంది.
   
    నిజానికి ఇది దినేష్ కి పెద్ద సమస్య.....బొంబాయి శారదతో వెళ్ళి ఒక వారం రోజులుండి రాగలడు.....కానీ, అక్కడే వుండి పోవటం సాధ్యం కాదు. పైగా తనూ నీరజ వేసుకున్న పథకం విజయవంతం కావాలికదా - ఇలా ఒక అమ్మాయి మాటలకి మనసు కరిగిపోతే ఎలా - తన లాంటి వాడు ఇలాంటి వాటికి లొంగకూడదు - వీటన్నిటికీ అతీతుడైతేనే తను అనుకున్న ప్రకారం కోట్ల, కోట్ల, కోట్ల, కోట్ల శత సహస్రకోట్లకు అధికారి అవుతాడు - అప్పుడు ఇలాంటి శారదలు, రమలు శ్రీదేవులు, కల్యాణులు - అబ్బో, బోల్డు మండి తన చుట్టూ - నిదానం ప్రధానం - దినేష్ కి వెంటనే నీరజ గుర్తొచ్చింది - ఎంతమంది చేత షేర్స్ కొనిపించిందో - టైము ఊరికే అయిపోతుంది -పనులు త్వరగా కావటం లేదు -
   
    'ఏమిటి ఆలోచిస్తున్నావు - బొంబాయి వెళదామని నువ్వే ఇంతకుముందు అన్నావుగా - శారద రెట్టించి అడిగింది.
   
    'నిజమే - ఇప్పుడూ అంటున్నావు....కానీ నీరజ విషయం తెలిసాక
   
    "విషయం తెలియడమా - అంటే'
   
    'అదీ - వస్తానంటుందో రానంటుందో అయినా అన్ని నిర్ణయాలు ఈకార్లో ఇప్పటికిప్పుడు ఎలా తీసుకోగలను - ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తా - దినేష్ మనసులో ఒక బెంగ బయలుదేరింది. నిజంగా ఈ శారద తనతో వచ్చేస్తుందా.
   
    దినేష్ మెదడు రకరకాల ఆలోచనలలో పద్మవ్యూహంలా వుంది శారదని ఎలా వదిలించుకోటం - వదిలించుకోవాలా వద్దా - ఇంకా నరసాపురంలో తన పనులు పూర్తికాలేదు. ఈ మాటు శారదతో సంబంధం లేకుండా తనే వెడతాడు - వీలయితే నీరజతో కలసి వెళ్ళాలి"-
   
    చాలా హుషారుగా కారు డ్రైవ్ చేశాడు.
   
    సుబ్బలక్ష్మి ఇంటి నుంచి వచ్చిన లలితకి ఉన్నట్టుండి శారదపై అసహ్యం, కోపం కలిగాయి. శారదని రక్షించాలని తను ఎందుకు ప్రయత్నం చేయటం - జీవితంలో ఎందరో తటస్థపడతారు. అందరూ స్నేహితులు కాలేరు - అంతే, ఇవాల్టి నుండి శారద గురించికాని, దినేష్ గురించికానీ తను ఆలోచించడం మానేయాలని దృఢంగా అనుకుంది లలిత - తన జీవితం గురించి ఆలోచించలేనితను శారద జీవితం గురించి ఆలోచిస్తుందేమిటీ - లలితకి తనపైన తనకే కోపం వచ్చింది. ఒకవారం రోజులు మధనపడిన తర్వాత లలిత సమస్యకి సమాధానం దొరికింది -

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra