Home » Yandamuri veerendranath » సిగ్గేస్తోంది!

       

                                

                                                    అధ్యాయం - 4
   
   
    న్యూస్ పేపర్ తోబాటే ఓ కాగితం గుచ్చబడి వాకిట్లో ఉండడం చూసింది ధరణి. కాలనీలో మీటింగ్ ఉన్నప్పుడు కాలనీ ప్రెసిడెంటు పేపర్ బాయ్ తో అలాంటి పనులు చేయిస్తూ వుండడం పరిపాటే!
   
    ధరణి స్లిప్ చూసింది. ఆదివారం సాయంత్రం ఆగస్టు పదిహేనున కాలనీలో జరగవలసిన ఉత్సవాలను గురించి చర్చించుకోవాలని కాలనీ ప్రెసిడెంట్ జాన్ అబ్రహం పంపిన వర్తమానం.
   
    ధరణి వంట ప్రయత్నం చేస్తూ 'అంతా రొటీన్ అయిపోయింది' అనుకుంది. చిన్నప్పుడు స్వాతంత్ర్యదినోత్సవం అంటే నెలముందు నుండే స్కూళ్ళల్లో హడావుడి! ఎన్నెన్ని డాన్సులూ! ఎన్నెన్ని ఆతల పోటీలూ? అవన్నీపోయి టీ వీల్లో జెండా వందనాలు చూసే రోజులొచ్చాయి. "ఆ రోజున హాలిడే! హాయిగా ఇంకొ గంట లేట్ గా లేవచ్చు! రోజంతా టి.వి చూడొచ్చు!!" ఇంతే గుర్తుంటోంది. పాపం ఏ ఛానెల్ వాళ్ళో అసలు సంగతి గుర్తు చేద్దామనుకొని స్వాతంత్ర్య సమరయోధుల గురించిన ప్రోగ్రామ్స్ చూపించినా, మనం వెంటనే ఛానెల్ మార్చేస్తాం. మంత్రదండం మన చేతుల్లో వుంటుందిగా! స్వాతంత్ర్యం ఇందుకు పనికొస్తోంది!
   
    జాన్ అబ్రహం ఒంటరిగా వుంటాడు. అతని భార్యపోయి చాలా సంవత్సరాలయింది. కొడుకులు ఉద్యోగాల వేటలో వేరే దేశాలు వలస పోయారు. ఈయన్నీ రమ్మంటారు. కానీ మాతృభూమిని వదిలి రానని ఈయన పట్టుపట్టి కూర్చున్నాడు. ఇదివరకు ఎంతో ఓపిగ్గా కాలనీ వాసులందరి ఇళ్ళకూ వచ్చి తలుపుతట్టి మరీ మీటింగ్ వివరాలు తెలిపేవాడు. కానీ ఆఫీసులకి వెళ్ళే హడావుడిలో ఉన్న దంపతులు 'ఈ ముసలాడు ప్రొద్దుటే వచ్చాడురా....ఖర్మ' అన్న ఎక్స్ ప్రెషన్ ఆయన ముఖంమీదే ఇవ్వటంతో ఇలా పేపర్ బాయ్ తో స్లిప్స్ పంపించడం మొదలుపెట్టాడు.
   
    "ధరణీ కాఫీ!" అంటూ శ్రీధర్ కేకపెట్టాడు.
   
    "ఆ.. వస్తున్నా" అంటూ ధరణి కాఫీ తీసుకుని వెళ్ళేసరికి శ్రీధర్ పేపర్ చదువుతూ కనిపించాడు.
   
    "ఆదివారం కాలనీ మీటింగట!" అంది ధరణి.
   
    "ఆ.. ఆ... చూశాను!" అన్నాడు.
   
    "అబ్రహంగారు పాపం ఒక్కడే కష్టపడుతుంటారు. అప్పుడప్పుడూ మీరూ ఈ విషయాలు పట్టించుకోవచ్చుకదా!" అంది.
   
    "నేనూ అబ్రహంగారిలా ఖాళీగా వుంటే పట్టించుకొనేవాణ్ణి!" అన్నాడు శ్రీధర్.

    "అబ్రహంగారు ఖాళీగా ఉన్నారా? ప్రొద్దుటే స్లమ్ లోకి వెళ్ళి ఆ పిల్లలకి పాఠాలూ, హైజిన్ గురించిన విషయాలూ నేర్పిస్తారు. ఆ తర్వాత అనాధశ్రమంలో పిల్లలకి పెద్ద పెద్ద హోటళ్ళనుంచి సక్రమంగా ఫుడ్ అందుతోందో లేదో చూస్తారు!"
   
    "అదేవిటీ?"
   
    "ఆ! రోజూ మిగిలిపోయిన ఫుడ్ పారెయ్యకుండా ఈ హాస్టల్స్ కి అందచేసేటట్లుగా ఆయన యాజమాన్యాన్ని ఒప్పించారు. ప్రతిరోజూ ఆ పిల్లలతో కాసేపు గడుపుతుంటారు. సాయంత్రాలు మళ్ళీ కార్మికులకి వయోజన విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీరు ఖాళీ చేసుకుని వెళ్ళినా మీతో మాట్లాడ్డానికి ఆయనకి తీరిక లేదులెండి!" అంది.
   
    "ఏ బంధాలూ లేని మనిషి అదృష్టవంతుడు!" అన్నాడు శ్రీధర్.
   
    "కరెక్టు!" వెంటనే అంగీకరించింది ధరణి.
   
    "ఔను! చందూగాడెక్కడా? రెండు రోజులుగా పత్తాలేడే?" అడిగాడు.
   
    "అమ్మా, నాన్నల మీద గాలి మళ్ళి ఊరికెళ్ళాడేమో?"
   
    "వాడలా గాలివాటంగా ఎన్నాళ్ళు తిరుగుతాడటా?"
   
    "అదే నాకూ అర్ధం కావటం లేదు. ఓసారి సీరియస్ గా క్లాస్ తీసుకోవాలి" అంది ధరణి.
   
    "ఈ రోజు సాయంత్రానికి గూటికి చేరుకుంటాడేమోలే! పిల్లలు వస్తారని తెలుసుగా" అన్నాడు.
   
    "ఔను! పిల్లలు వస్తారు. ఈ రోజు నాకు ఆలస్యం అవుతుందేమో మీరు బస్ దగ్గరికి వెళ్ళండి" అంది ధరణి.
   
    "శనివారాలు-పిల్లలు వస్తారు. త్వరగా వెళ్ళాలి- అని ఆఫీసులో చెప్పకపోయావా?" అడిగాడు.
   
    "చెప్పాను. అదే నేను చేసిన తప్పు!" అంది ఖాళీ కప్పుతో లోపలి వెళ్తూ ధరణి.
   
    శ్రీధర్ కీ విషయం అర్ధమై నిట్టూర్చాడు. ధరణి ఎప్పుడూ ఇంట్లో ఆఫీసు విషయాలు మాట్లాడదు. శ్రీధర్ కి అలవాటుంటే తనే మాన్పించింది. 'ఇల్లు అనేది నీకూ, నాకూ, పిల్లలకీ సంబంధించిన ప్రైవేట్ ఏరియా! అందులోకి ఎవరూ ప్రవేశించడానికి అనుమతి లేదు' అని కరాఖండిగా చెప్పేసింది. అందుకు శ్రీధర్ ఒప్పుకోక తప్పలేదు. కానీ ఆమె మాట ఎంత సమంజసమో అతనికి త్వరలోనే తెలిసి వచ్చింది. ఆఫీసు విషయాలు ఇంటిదాకా తెస్తే, ఆ విషయాలతో బాటే టెన్షన్స్ కూడా మోసుకొచ్చినట్లే. మిగిలిన "ఈ కొద్దిసేపునీ మనకోసం మిగుల్చుకోకుండా 'వాళ్ళు మనకి పే చెయ్యని టైంలో ఆ ఆఫీసు పనులు చేస్తూ, అవే టాపిక్స్ మాట్లాడుతూ ఉండడం కూడా ఒక వ్యసనమే! ఏదైనా చేంజ్ గా తప్పిస్తే, వ్యసనంలా మారితే ధరణి సహించదు! ధరణికి నచ్చని విషయాలు శ్రీధర్ చేస్తూనే ఉంటాడు. కానీ అవి ఆమెకు ఎందుకు నచ్చడంలేదో ఆలోచిస్తూ వాటికి కారణాలు తెలుసుకుంటాడు. ఈ తర్వాత మానేస్తాడు. ఈ రకమైన అండర్ స్టాండింగ్ దంపతుల మధ్య ఉంటే వారిది ఆదర్శదాంపత్యమనే చెప్పుకోవచ్చు! ఒకరు 'తాన' అంటే ఇంకొకరు 'తందాన' అందమే ఆదర్శదాంపత్యం కాదు.
   
    భర్త పార్టీలో డ్రింక్ చేసి వస్తే అలిగి పోట్లాడుతూ, భర్తకి కాఫీ అందిస్తూ తనకి తెలీని విషయాలను గురించి ఆశ్చర్యంగావింటూ, అడిగిన వాళ్ళకి తనకి తోచిన సలహాలిస్తూ అతి మామూలుగా జీవితం గడిపే సామాన్యమైన గృహిణి ధరణి! కానీ... దోసకాయ తరిగేముందు పాలిథిన్ పేపర్ వేసుకుని తొక్క డస్ట్ బిన్ లో పారెయ్యడంలో కూడా ఆమె శ్రద్దా, ప్రత్యేకత గమనించగలడు శ్రీధర్. ఆ దీక్షకీ, ఆలోచనా ధోరణికీ అతను ఎప్పుడూ ఓటెయ్యక తప్పడంలేదు! వాదనలతో కాకుండా చర్యలతో ఎదుటివారిని ఆకట్టుకోవడమే వ్యక్తిత్వం అయితే ధరణిది అరుదైన వ్యక్తిత్వమే! ఆమె అంచనాలు ఎప్పుడో కానీ తప్పవు!
   
    రావు విషయం అదే అయింది. రావు ఈ మధ్య ధరణితో చాలా గంభీరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎలక్ట్రిక్ షాక్ ఇప్పించిన తర్వాత ఆయనలో మార్పు వచ్చినట్లుంది అని నవ్వుకుంది.
   
    సాయంత్రం ఇది అవుతుండగా ఆ రోజు ధరణి ఇంటికి వెళ్ళే ప్రయత్నాలు ప్రారంభించింది.
   
    ఫ్యూన్ వచ్చి 'సార్ రమ్మంటున్నారు'అని చెప్పాడు. ధరణి లోపలికి వెళ్ళింది.
   
    రావు ఆమెవైపు చూసి నవ్వుతూ "కూర్చో.....నీతో మాట్లాడాలి!" అన్నాడు.
   
    ధరణి అసహనంగా వాచీ చూసుకొంది.
   
    "కూర్చో!" అన్నాడు.
   
    ధరణికి కూర్చోక తప్పలేదు.
   
    "సివిల్ ఇంజనీర్లల్లో ముగ్గుర్ని అసిస్టెంట్ సూపర్ వైజర్స్ గా ప్రమోట్ చెయ్యమని హెడ్ ఆఫీసు నుంచి లెటర్ వచ్చింది. దీక్షిత్, అప్పారావుతోబాటుగా నవ్వుకూడా ఆ లిస్ట్ లో ఉన్నావు. కానీ నీ పని సంతృప్తికరంగా ఉందన్న నా సిఫార్సు కావాలి! మరి ఏం చెయ్యమంటావూ?" నవ్వుతూనే అడిగాడు.
   
    ధరణి సీరియస్ గా చూస్తూ "పని సంతృప్తికరంగా ఉంటే అలాగే రాసివ్వండి సార్!" అంది.
   
    "ఎక్కడ సంతృప్తీ!" రావు అదోలా చూశాడు. "సంతృప్తి పరుస్తానన్న హామీ ఇస్తే నిన్ను ప్రమోషన్ కి రికమెండ్ చేస్తాను. ఏవంటావ్?" అన్నాడు.
   
    ధరణి ముఖం ఎర్రగా కందిపోయింది. ఠక్కున లేచి నిలబడింది. "మీ ఉద్దేశం ఏవిటో నాకు అర్ధమైంది. కానీ నేను ఏవిటో మీకు ఇంకా అర్ధంకానందుకు త్వరలోనే విచారించవలసి వస్తుంది!" అంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra