Home » Yandamuri veerendranath » లేడీస్ హాస్టల్

   

    "అది వేరు, ఇది వేరు. వీడు అమాయకురాలయిన అమ్మాయిని రేప్ చేసి మరీ హత్యచేశాడు. హైదరాబాద్ లో పరిస్థితి మీకు తెలియదు. కాలేజీ స్టూడెంట్సంతా గొడవ చేస్తున్నారు. అతడికి బెయిల్ ఇవ్వడానికి కూడా వీల్లేదని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయబోతున్నారు. కాద్మతే మరింత గొడవయిపోతుంది" రాఘవరెడ్డి ఆవేశంగా అన్నాడు. బాంబే చేరగానే విజయకుమార్ నించి అతను ఫోన్ అందుకున్నాడు. అందుకే ధీమాగా అనేశాడు. అంతవరకూ కేసులో లేని 'రేప్'కి పునాది అక్కడే పడింది.
   
    "అలా అయితే సమస్యేలేదు. బెయిల్ దొరక్కుండా అతడిక్కడకు రాలేదు. ఆడలేడు. అప్పుడిక మనమీద మాటకూడా రాదు" అన్నాడు చౌదరి. రాఘవరెడ్డి ఖంగుతిన్నాడు. విషయం ఇలా మలుపు తిరుగుతుందనుకోలేదు.
   
    "రాయన్న రేప్ చేసి, హత్యచేయడం చూసిన ప్రత్యక్షసాక్షులున్నారా?" అడిగాడు చందూబోర్డే.
   
    "లేరుకాని బలమైన సాక్ష్యాలున్నాయట" రెడ్డి నీరసించిపోయాడు.
   
    "కేవలం అలాంటి సాక్ష్యాలతో నేరాలు రుజువయిపోతే మనకిన్ని కోర్టులు అక్కరలేదు. కోర్టుల్లో కేసులు సంవత్సరాల తరబడి సాగిపోవు. తీర్పు ఇచ్చే జడ్జి అన్ని సాక్ష్యాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. మనం ఆ జడ్జికంటే గొప్పవాళ్ళం కాదు. అయన తీర్పుకే మనం కట్టుబడి వుందాం. అందులో రాయన్న ఆడబోయేది టెస్ట్ మ్యాచ్ కాదు. ఈ ఆటలో అతడు తన నైపుణ్యం ప్రదర్శించకపోతే ఎలాగూ చాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని ప్రశ్నించేవాళ్ళూ వుండరు" అన్నాడు మీటింగ్ ముగిసిందన్నట్టుగా లేచి నిలబడుతూ రాఘవరెడ్డికి మరి మాట్లాడేందుకు అవకాశం దొరకలేదు.
   
                                     *    *    *
   
    కిరణ్మయి రెండు గంటలనుంచి ఆ చెట్టుకిందే నిలబడి వుంది. కోర్టులోపలేం జరుగుతుందో తెలియటం లేదు. ఆమెతో ఎక్కువగా మాట్లాడకపోయినా ఆమె బాధలో పాలుపంచుకుంటున్నట్లు రాయన్న స్నేహితుడు దగ్గిరలోనే నిలబడి వున్నాడు.
   
    కిరణ్మయిని చూస్తుంటే అతడికి బాధగా వుంది. ఉదయంనించి ఆమె ఏమీ తినలేదు. అసలు కూర్చోలేదుకూడా.
   
    "ఎంతసేపలా నిలబడతారు? అలా ఆ చెట్టుకిందే కూర్చోండి పోనీ" అన్నాడు మెల్లిగా.
   
    "ఫర్వాలేదు లెండి. ఇంకా ఎంతసేపవుతుందంటారు?" అడిగింది కిరణ్మయి.
   
    "అయిపోవచ్చిందట. బయట కోర్టు జవాను చెప్పాడు."
   
    "బెయిల్ యివ్వడానికి నిరాకరిస్తే మనం ఏమీ చెయ్యలేం గదూ?"
   
    "అవును. ఏమీ చెయ్యలేం" ఒప్పుకున్నాడతడు.
   
    "అది ఆయనమీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కదా! అసలే ఈ పరిస్థితికి మానసికంగా క్రుంగిపోయి వుంటారు. ఇక ఎప్పటికీ క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోవచ్చు కూడా. కోర్టు విధించే శిక్షకంటే ఆ శిక్ష మరింత భయంకరమైనది కదూ?"
   
    అతను ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు. తనకు తెలిసినంతవరకూ ఈమెకు రాయన్నతో పెద్ద పరిచయంగాని, రాయన్నకు క్రికెట్ పట్లవున్న అభిమానం గురించి గానీ పూర్తిగా తెలియవు. అసలు క్రికెట్టు అంటే ఏమిటో పూర్తిగా తెలియని అమ్మాయిని రాయన్న వివాహం చేసుకోవడమే స్నేహితులందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కాని ఈ అమ్మాయిలో తను వూహించలేనంత గొప్ప అండర్ స్టాండింగ్, ఉన్నతమైన వ్యక్తిత్వం, తెలివి తేటలు వున్నాయి 'రాయనన చాలా అదృష్టవంతుడు' అనుకున్నాడు.
   
    "మీరనుకున్నది నిజమే. రాయన్న చాలా సెన్సిటివ్. కాని మీలాటి వ్యక్తి సాహచర్యంలో అతడు తప్పక మామూలు మనిషవుతాడు. ఆ నమ్మకం నాకుంది. అంతేకాదు మంచి ప్లేయర్ అవుతాడుకూడా" నమ్మకంగా అన్నాడు.
   
    కిరణ్మయి అతడి మాటలు విన్నట్లే లేదు. "అన్నట్లు రాయన్న రేపు ఢిల్లీ వెళ్ళాలంటే టిక్కెట్ క్రికెట్ బోర్డు వాళ్ళు అరేంజి చేస్తారా లేక మనమే కొనుక్కోవాలా?" అడిగింది.
   
    "ఏమో సరిగ్గా తెలియదు. మనం కొనుక్కుని వెళితే తర్వాత వాళ్ళు డబ్బు తిరిగి యిస్తారనుకుంటాను. ఏం?"
   
    "అదే, మనమే టిక్కెట్ కొనుక్కోవాలంటే ఒక్క రోజులో రిజర్వేషన్ దొరుకుతుందా? అంతదూరం రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయడం కష్టంకదూ? రాత్రంతా నిద్రలేకుండా వెళ్ళి ప్రాక్టీస్ లో ఏం పాల్గొనగలడు?"
   
    "నిజమే. కాని రాయన్న బయటకు రానివ్వండి. నేను వెళ్ళి టిక్కెట్ సంగతి చూస్తాను. ఆ విషయంలో మీరేమీ దిగులు పెట్టుకోకండి. నేను అరేంజ్ చెయ్యగలను."
   
    "థాంక్స్" కిరణ్మయి కృతజ్ఞతగా చూసిందతడివైపు. "నా ఆలోచనలు మీకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయనుకుంటాను. చిన్నప్పటినుంచి మా ఇంట్లో చాల విషయాలు చూస్తూ వచ్చానండీ. ఇంటినిండా జనం వుంటారు. కాని ఏదీ ముందుగా ప్లాన్ వేసుకుని అమల్లో పెట్టరు. అనవసర విషయాలకు ప్రాధాన్యతనిస్తూ, అవసరం అయినవాటిని మర్చిపోతారు. చిన్న దుర్ఘటన జరిగితే విచారిస్తూ కూర్చోవడం తప్ప తర్వాత కార్యక్రమం గురించి ఆలోచించకపోవడం మనలో పెద్ద అవలక్షణం."
   
    ఆమె మాటల్లో సత్యం అతడికి బోధపడింది. ఇప్పటివరకూ అతడు రాయననలోని క్రీడాకారుడికి ఫాన్. కని ఒక్కరోజులో అంచెలంచెలుగా బహిర్గతమవుతున్న కిరణ్మయి వ్యక్తిత్వానికి అతడు అభిమానయిపోయాడు.
   
    "నేనున్నానుగా. ఈ విషయాలన్నీ నాకు వదిలెయ్యండి. అదుగో లాయర్ గారు వస్తున్నారు" ఆతృతగా నడిచాడటువైపు.
   
    ఆత్మీయత, అభిమానం, అనుబంధం ఏర్పడడానికి ఏళ్ళ తరబడి పరిచయం అవసరం లేదు. కల్లాకపటంలేని ఆ కాస్త సంభాషణ చాలు. కిరణ్మయి చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకునే ప్రయత్నం కూడా చెయ్యకుండా వాళ్ళవైపు నడిచింది.
   
                                 *    *    *
   
    విజయకుమార్ చాల ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు తమ క్లబ్ తరపున సికింద్రాబాద్ లెవన్ జట్టుతో ఒన్ డే మ్యాచ్ ఆడి వచ్చాడతడు. అవతల టీమ్ లో నేషనల్ ప్లేయర్సయిన శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ వున్నారు. తమ టీమ్ గెలిచే ఆశ వదులుకున్న సమయంలో అతడు విజ్రుంభించి ఆడాడు. అవుట్ అవకుండా తొంభయి రెండు పరుగులు చేశాడు. చిత్తుగా ఓడిపోతుందనుకున్న టీమ్ గెలవడంతో అందరూ అతన్ని చుట్టుముట్టేసి అభినందనల వర్షం కురిపించారు.

    "మంచి ఫార్మ్ లో వున్నావోయ్. మన జట్టులో నీ ఎంపిక ఖాయం" అన్నాడు యాదవ్.
   
    ఆడుతున్నప్పటికంటే ఇప్పుడు వీళ్ళ ప్రోత్సాహం అతడి కెక్కువ ఉత్సాహాన్నిచ్చింది. ఉదయం నించీ అన్నీ శుభవార్తలే. లేవగానే పేపర్లో రాయన్న అరెస్టు వార్త. రాఘవరెడ్డిని వెంటనే బొంబాయి పంపగలగడం, రాజారావు సహకారం, ఇప్పుడీ విజయోత్సాహం..... అన్నీ అనుకున్నట్లుగా జరిగిపోయాయి.
   
    "నాకేమయినా ఫోన్ కాల్స్ వచ్చాయా?" ఇంటికి రాగానే అడిగాడు. బాంబేనించి రాఘవరెడ్డి, ఊళ్ళోనించి రాజారావు చేశారని చెప్పాడు నౌఖరు.
   
    విజయకుమార్ ఉత్సాహంగా బాంబే డయిల్ చేశాడు.
   
    "ఏమయింది, రాయన్నకు బెయిల్ దొరక్కుండా చేశావా?" అడిగాడు రెడ్డి ఆతృతగా అట్నుంచి.
   
    "ఏమో ఇంకా తెలియదు, అక్కడేమయింది?" అన్నాడు కుమార్.
   
    "సారీ, పని జరగలేదు. బోర్డులోవాళ్ళు వప్పుకోలేదు" అన్నాడు రెడ్డి నిస్పృహగా.
   
    "అంటే, నీ వల్ల కాలేదన్నమాట" విసురుగా ఫోన్ పెట్టేశాడు. అతడి ఉత్సాహం అంతా చచ్చిపోయింది. ఇంత ఖర్చుపెట్టినా ఫలితం దక్కలేదు. ఇక ఒకటే ఆశ మిగిలింది. రాజారావుకి ఫోన్ చేసి, బెయిల్ విషయం అడిగాడు.
   
    "రాయన్నకి బెయిల్ దొరికిందట" అన్నాడు రాజారావు. కుమార్ మొహంమీద ఒక్కసారిగా కడివెడు చన్నీళ్ళు కొట్టినట్టయింది. "అలాగా, పోనీలే" అన్నాడు పైకి ఏమీ పట్టనట్లుగా లోలోపల ఆవేశాన్ని అణుచుకుంటూ ...."ఆ హాస్టల్ అమ్మాయిల గొడవ ఏమైంది" అని అడిగాడు.
   
    "ఈ అమ్మాయి లింత స్టుపిడ్స్, ఫూల్స్ అనుకోలేదు. రమణి కష్టపడి అందర్నీ కూడగట్టుకుందట. తీరా బయలుదేరబోయేసరికి అపురూపలక్ష్మి అమ్మా నాన్నా, కుటుంబం అంతా వచ్చారట. వాళ్ళు హాల్లో ఏడుస్తూ కూర్చుంటే ఈ అమ్మాయిలంతా దిష్టిబొమ్మల్లా మళ్ళీ అలాంటి అవకాశం దొరకదేమోనన్నట్లు చూస్తూ ఆనందించినట్టున్నారు. ఈ లోపులో పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. వీళ్ళు వెళ్ళేసరికి రాయన్నకు బెయిల్ దొరకడం, వాదు ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయాయి" అన్నాడు రాజారావు. ప్రస్తుతం సమాజంలో స్ట్రయిక్ చేయటానికి ఎంత సిల్లీ కారణం, చాలో, అది మానెయ్యటానికి ఎంత ఛండాలమైన రీజన్ సరిపోతుందో చెప్పటానికి ఈ ఉదాహరణ చాలు.



                                  --* * * *--

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra