Home » Vasireddy seeta devi novels » చిలకలు


    "బావ ఇంకా రాలేదు."
    "వస్తాడులే. నేను కొన్ని పనులు అప్పగించాను."
    "బావ ధోరణి నాకేం నచ్చలేదు."
    "ఏ విషయంలో?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
    "అదే ఈ కేసు ఏదో తనే వేసి ప్రభుత్వం మెప్పుపొందాలని చూస్తున్నాడు."
    "మంచిదేగా? ఎంతకాలం అసిస్టెంటుగా ఉంటాడు?"
    "అది కాదు. నువ్వు హంతకుడెవరో తెలిసీ....."
    నరేంద్ర పకపకనవ్వాడు.
    "ఇకనువ్వెళ్ళి పడుకో, వస్తారులే" అన్నాడు మాటమారుస్తూ నరేంద్ర.
    సునంద వెళ్ళిపోయింది.
    సన్నగా వానజల్లు ప్రారంభం అయింది. గాలి హొరు కొంత తగ్గింది.
    నరేంద్ర లేచి కిటికీ దగ్గర కొచ్చి నిలబడ్డాడు.
    అతడి చేతిలో ఉన్న ఉత్తరం గాలికి రెపరెపలాడుతోంది.
    కిటికీ ముందు నిలబడిన నరేంద్ర గిర్రున వెనక్కు  తిరిగి  టేబుల్ దగ్గర కొచ్చాడు.
    టేబుల్ లాంప్ స్విచ్ వేసి ఆ వెలుగులో చేతిలో ఉన్న ఉత్తరం చదవసాగాడు.
    "ప్రియమైన అనసూయకు."
    ప్రాయమైన అనసూయ అనే అధికారం నాకుందో లేదో నేను చెప్పలేను. నా భార్యగా చనువు తీసుకొని నేను  ఈ జాబు రాయడం లేదు. ఇప్పుడు నువ్వు పరాయివాటి భార్యవని తెలిసే రాస్తున్నాను.
    నా స్నేహితుడి భార్యగానే నీకు నేను ఈ ఉత్తరం రాస్తున్నాను.
    జీవితంలో చేసిన ఒక చిన్న  పొరపాటు, హిమాలయమంత ఎత్తున పెరిగి నా జీవితాన్నే ధ్వంసం చేస్తుందని నేను కలలో కూడా ఉహించలేకపోయాను.
    ఆ రాత్రి అదే నా స్నేహితుడ్ని తీసుకోచ్చో నీకు పరిచయం చేసిన రాత్రి, నా జీవితానికి కళరాత్రిగా మారుతుందని ఉహించలేదు. సూర్యం, నా ప్రాణం స్నేహితుడిగా భావించిన సూర్యం నా జీవితాన్నే తారుమారు చేస్తాడనుకోలేదు.
    రైలు ప్రమాదం జరిగిన క్షణం నుంచే నువ్వు నాకు దూరం అయిపోయావు. కనీసం నేను బ్రతికి ఉన్నానో లేదో కూడా తెలుసు కోవడానికి మీరెవరూ ప్రయత్నించలేదు. నా రక్తం పంచుకొని పుట్టిన మా అక్క కూడా నా గుంరిచి పట్టించుకోలేదు.
    నాకు ప్రియమైన వాళ్లందరూ నన్ను మోసం చేశారు. డగా చేశారు. గతాన్నంతా త్రవ్వి నిన్ను బాధపెట్టను. అయినా నా మనసు  లోని బాధను చెప్పకుండా ఉండలేను. నీ సానుభూతికోసం నేను చెప్పడం లేదు. నువ్వేం చేశావో ఒక్కసారి గుర్తు చేసుకోమంటున్నాను.
    అంతేకాదు. నాస్మృతులు నిన్ను జీవితాంతం, మృగాన్ని తరిమే వేటగాడిలా తరుముతూనే ఉంటాయి. ఉండాలి. అదే నాకోరిక. ఆ కోరికే నన్ను ఈపని చెయ్యడానికి ప్రేరేపించింది. నేను చేసిన పని నీకు ఉత్తరంలో చెప్పను నువ్వు త్వరలోనే తెలుసుకుంతావు క్షణం క్షణం మానసికంగా కుంగిపోతావ్.
    భయపడకు. నిన్ను నేను చంపను. లేక మీ ఇద్దర్నీ జైలుకు కూడా పంపించను. అయినా ప్రతీకారం తీర్చుకుంటాను.
    ఈ ప్రేమలూ, అనుభంధాలూ, అన్నీబూటకం అని నావాళ్ళంతా నిరూపించారు.
    నాకు ప్రియమైన వాళ్లంతా ప్రేమించింది నన్నుకాదనీ, నాడబ్బుననీ తెలుసుకొని కుంగిపోయాను.
    నేను ఆత్మీయులనుకొన్న బంధువులందరూ, నేను చనిపోయానన్న మరుక్షణం నుంచి నా ఆస్తిమీద రాబందుల్లా వాలి పొడుచుకొని తినసాగారు. 
    రామచిలుకల్లా కూలికారు.
    నాకు ఈ మనుషుల మీద, ప్రపంచం మీద విరక్తి పుట్టింది. మానవత్వం మీద నమ్మకం పోయింది. మనుషులు ప్రేమించేది మనుష్యుల్ని కాదనీ,డబ్బుననీ అర్థం చేసుకొన్నాను.
    అందుకే మూడేళ్ళు అజ్ఞాతవాసం గడిపాను. ముఖ్యంగా ఆడాళ్లంటే అసహ్యం  పుట్టింది. నేను చచ్చిపోయానని తెలిసిన మూడు నెలలు పూర్తి కాకుండానే నా స్నేహితుడ్నే పెళ్ళి చేసుకోన్నావు.
    "కాని....ఆడవాళ్ళందరూ ఒక్కలాగే ఉండరని ఒక అమృత మూర్తి ద్వారా తెలుసుకొన్నాను స్త్రీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకొన్నాను. మళ్ళీ జీవితం మీద నాకు ఆశలు చిగురించాయి. ఆమే దేవత. నా ఆరాధ్య దేవత.
    నా అనే  వాళ్ళందరిచేతా మోసగించబడి, మానసికంగా కుంగి పోయిన నన్ను మళ్ళీ మనిషిని చేసింది. ఆమే నిర్మలమైన మనసుతో నన్ను ఆదరించింది. ఆమే ఆదరణలో అలసిపోయిన నా మనసు తీర్చుకుంది.
    ఆమె నిండుహృదయంతో నను ప్రేమించింది ఆమె ప్రేమించింది ఆమె ప్రేమించింది నా డబ్బును కాదు. నన్ను నన్నుగా ప్రేమించింది. నా డబ్బు కాదు. నన్నునన్నుగా ప్రేమించింది. ఆమెకు నేను డబ్బు గలవాడినని తెలియదు. నన్ను నన్నుగా ప్రేమించింది. ఆమెకు నేను డబ్బు గలవాడినని తెలియదు. తాడూ బొంగరం లేక ఆశ్రమంలో చేరానని మాత్రమే ఆమె భావించింది.
    అయినా ఆమె నన్ను ప్రేమించింది. తుది శ్వాసవరకూ ప్రేమిస్తూనే ఉంది.
    ఆమె కోసమే ఏనాడో చనిపోయినా నేను బ్రతికి మళ్లీ రామకృష్ణగా బ్రతికివచ్చాను.
    కాని విధి నన్ను వెక్కిరించింది. జీవితం ఎగతాళిగా నవ్వింది.
    "నా అదృష్టం నన్ను చిన్న చూపు చూసింది.
    నా ఆరాధ్యదేవత నేను ఈ ఊరు  చేరుకునేసరికే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయింది.
    ఆమె క్రూరంగా హత్య చెయ్యబడింది.
    ఆ విషయం నాకు కొన్నిగంటల క్రితమే ఆ వార్త తెలిసింది. నేను నిలబడి భూమి నన్ను దగా చేసింది.
    ఆమెతోపాటే ఆ హంతకుడు నన్నూ హత్యచేశాడు.
    ఆమె లేని ఈలోకం నాకు అక్కర్లేదు. అందుకే మళ్ళీ అజ్ఞాత వాసంలోకి వెళ్ళిపోతున్నాను.
    రేపు ఉదయమే, నా అనే వాళ్ళకంటపడకుండానే వెళ్ళిపోతున్నాను.
    ఇక నాకు ఆస్తిపాస్తులతో అవసరం లేడు. సర్వం వదులుకొని శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఏపరిస్థితిలోనూ తిరిగిరాను.
    ఇంతకుముందే నమ్మకస్తుడైన ఒక లాయరుచేత వీలునామ రాయించాను.
    ఆ వీలునామా నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
    అపారమైన దుఃఖాన్ని గలిగిస్తుంది. నీ మనసు నాకు తెలుసు కనుక ఇంత ఖచ్చితంగారాస్తున్నాను. ఆ వీలునామా నిన్ను జీవితాంతం చిత్రహింసకు గురిచేస్తుంది.
    నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం చేశాను.
    నువ్వు కీవితాంతం, ప్రతిక్షణం, నన్ను గుర్తుచేసుకుంటూ కుమిలిపోయేలా చేశాను.
    ఆ సంతృప్తి నాకు చాలు. నేను వెళ్ళిపోతున్నాను.
                                                                                                                                  ఇట్లు
                                                                                                                            నీ రామకృష్ణ
    నరేంద్ర ఉత్తరం చదివి, టేబుల్ మీదున్న కవర్లో పెట్టాడు. కవరు డ్రాయిర్ సొరుగులో పెట్టాడు.
    నర్రేంద్ర సిగరెట్ వెలిగించాడు.
    ఆలోచనలతో అతడి బుర్ర చెదలపుట్టలా ఉంది.
    ఈ ఉత్తరం రామకృష్ణ చనిపోయే ముందు రాశాడు తెల్లవారూ వెళ్తూ వెళుతూ పోస్టు చెయ్యాలనుకొని ఉంటాడు.
    వీలునామతో ప్రతీకారం తీర్చుకోవడం అంటే? ఆ ఆస్తి ఎవరికీ రాసి ఉంటాడు?
    ప్రభావాలు తనకు రాసినట్టు వీలునామా చూపించింది.
    అనసూయకు డబ్బు ఆశలేదని అతడికి తెలుసు.
    తన ఆస్తిని మరెవరికో రాస్తే ఆమె జీవితాంతం బాధపడుతూ కూర్చోదని కూడా అతడికి తెలుసు.
    మరి తన ఆస్తిని ఎవరి పేర రాసి ఉంటాడు.
    నరేంద్ర బుర్రలో మెరుపులా ఓ ఆలోచన తలుక్కుమన్నది.
    నరేంద్ర చివ్వున లేచాడు.
    ఫోన్ డయల్ చేశాడు.
    "హల్లో" ఓ స్త్రీ కంఠం మృదువుగా పలికింది. కాని ఆ కంఠం సన్నగా ఒణుకు ధ్వనించింది.
    "డిటెక్టివ్ నరేంద్రను మాట్లాడు తున్నాను అనసూయగారేనా మాట్లాడుతున్నాది?"
    "అవును!" ఆ కంఠంలో ఏదో భయం.
    "సూర్యనారాయణగారు లేదా?"
    "ఎందుకూ మీ డబ్బు కోసమేనా?"
    "అవును. వెంటనే తీసుకొని సూర్యనారాయణగారిని రమ్మనండి."
    "ఏం ఎగరేస్తామని భయంగా ఉందా?"
    "ఆ భయం లేదులే."
    "అసలు ఆయన్ను రమ్మంటుంది ఎందుకో నాకు తెలుసు."
    "ఎందుకు?"
    "అక్కడ ఇన్ స్పెక్టర్ ఉన్నాడు గదూ?"
    "లేదు. ఏం అక్కడకు వచ్చాడా?"
    "అవును, అతనూ, మీ అసిస్టెంటూ వచ్చారు."
    "వచ్చి?"
    "ఓకే సిగరెట్ కేసు తీసుకొచ్చి ఇది ఎవరిది అని అడిగారు. అది మావారిదేనని చెప్పాను అమాయకంగా."
    "అంటే అది మీ వారిది కాదా?"
    "మా వారిదే. కాని ఇన్ స్పెక్టర్  ప్రవర్తన బాగా లేదు. ఆ సిగరెట్ కేసును అడ్డు పెట్టుకొని ఏ హత్యానేరమో ఆయన మీద వేసేలా ఉన్నాడు" దాదాపు  ఏడుస్తూనీ అన్నది అనసూయ.
    "అందుకే త్వరగా నా డబ్బు తెచ్చి ఇవ్వమని చెప్పండి. ఈ లోపల జైల్లో పడితే నాకు డాబు వసూలు చేసుకోవడం కష్టం అవుతుంది" అన్నాడు నరేంద్ర నవ్వుతూ.
    "జైలా? మీరూ మావారు హత్య చేశారని నమ్ముతున్నారా?
    "నమ్మడం నమ్మకపోవడం అనేది ఇప్పుడె  చెప్పలేను. మీ వారిని వెంటనే ఇక్కడకు రమ్మనండి. ఇన్ స్పెక్టర్ ఏ నిముషంలోనైనా మీ వారిని అరెస్టు చెయ్యొచ్చు."
    "మీరే మమ్మల్ని ఈ ఊబిలోంచి లాగాలి."
    "ముందు మీ వారిని మాట్లాడమని చెప్పండి."
    "ఆయన  ఇంకా ఇంటికి రాలేదు."
    "రాగానే నేను  రామ్మన్నానని చెప్పండి. అ డబ్బు తిసుకురావడం మర్చిపోవద్దని చెప్పండ. నాకు డబ్బు చాలా అవసరంగా కావాలి" అనేసి రిసీవర్ పెట్టేశాడు నరేంద్ర.
    లైట్ ఆర్పేసి మంచంమీద నడుం వాల్చాడు.
    ఆ ఉత్తరంలోని చివరి వాక్యాలు మననం చేసుకోసాగాడు.
    "ఆ వీలునామా నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది."
    "నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం చేశాను."
    "నువ్వు జీవితాంతం నన్ను తల్చుకుంటూ కుమిలిపోయేలా చేశాను."
    గదిలో పాతకాలపు గడియారం 11గంటలు కొట్టింది. నరేంద్ర పదేపదే గడియారం కేసి  చూస్తున్నాడు. 11-15అయింది.
    బయట కాలింగ్ బెల్ మోగింది.
    నరేంద్ర దానికోసమే ఎదురుచుస్తున్నవాడిలా రిలాక్స్ అయ్యాడు లేచి వెళ్ళి తలుపు తెరిచాడు.
    రొప్పుకుంటూ సూర్యనారాయణ లోపలకువచ్చాడు దాదాపు నరేంద్రను తోసుకుంటూవచ్చి సోఫాలో కూలబడ్డాడు.
    నరేంద్ర తలుపు మూసి వచ్చి సూర్యనారాయణకు ఎదురుగా కూర్చుని సిగరెట్ వెలిగించాడు.
    సూర్యనారాయణ ఇంకా రొప్పుతూనే ఉన్నాడు.
    "ఏమిటలా రొప్పుతున్నారు? పోలీసులు వెంటపడ్డారా?" నరేంద్ర నవ్వుతూ అడిగాడు.
    "ఇంటికి రాగానే మీరు ఫోన్ చేసినట్టుగా అనసూయ చెప్పింది" కొంచెం ఆగాడు.
    "ఊ" నరేంద్ర సిగరెట్ పొగ విలాసంగా ఊదుతూ అతడి ముఖంలోకి చూశాడు.
    "ఉన్నపాటున ఇంట్లోనుంచి బయటపడ్డాను. వెంట్రుకవాసిలో తప్పిపోయింది."
    "ప్రమాదమా?"
    "అవును. ప్రమాదమే. నేను వీధి మలుపు తిరుగుతున్నానో లేదో పోలీస్ జీప్ వెళ్ళి మా వాకిలి ముందు ఆగింది."
    అరిచేతులకు పట్టిన చమట్లు కర్చీపుతో తుడుచుకున్నాడు. జేబులో చెయ్యి పెట్టి వందరూపాయల కట్టలు  బయటికి తీశాడు.
    "క్షమించాలి. ఆలస్యం అయింది." అంటూ నోట్లకట్టలు నరేంద్రకు చేయ్యిచాపి అందించబోయాడు.
    నరేంద్ర అతడి చేతిని వెనక్కు నెట్టి పకపక నవ్వాడు. సూర్యనారాయణ అతడి ముఖంలోకి అయోమయంగా చూశాడు.
    "ఈ డబ్బు ఇచ్చినంత మాత్రాన నీ మీదనుంచి హత్యానేరం తప్పిపోతుందనుకొంటున్నావా?"
    "అది కాదు. ఆ రోజు నేను మీకుఇస్తానన్న డబ్బు ఇస్తున్నాను" బిక్కమొహం వేసి అన్నాడు సూర్యం.
    "నేను నిన్ను రమ్మనది డబ్బుకోసం కాదు. నిన్ను ఇక్కడకు వెంటనేరప్పించడానికే అలా మీ భార్యకు చెప్పాను."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra