Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 20

   
    "వర్షం వచ్చేటట్టుంది వెంకటాచలం. త్వరగా పోనీ" అంది ఆమె ఆందోళనతో.

    "ఫరవాలేదులే వదినా, బియ్యం తడిసిపోకుండా మన దగ్గర టార్బాల్ పట్ట వుందిలే" అని అతనన్నాడు.

    బండి స్పీడందుకుంది. సగం దూరం వచ్చారో లేదో వర్షం మొదలైంది.

    అతను ఎద్దులను మరింతగా అదిలించాడు.

    మేఘాలు లోకంమీద తమ కసినంతా వెలిబుచ్చుతున్నట్లు వర్షం ఈడ్చికొడుతోంది. గాలి కూడా వర్షంతో కలిసి కుట్రపన్నినట్లు వేగంగా వీస్తోంది.

    ఇద్దరూ బాగా తడిసిపోయారు.

    ఆ తేమకి పైట పూర్తిగా ఒంటికి అతుక్కుపోయి ఆమె ఎద మరింత బలంగా, స్పష్టంగా కనిపిస్తోంది.

    అతను ఎక్కడ చూసి ఆవేశానికి గురవుతాడోనని ఆమె పైటను నిండుగా కప్పుకుంది.

    "లాభంలేదు వదినా -ఆగాల్సిందే" అని అతను రో్డ్డుకు ఓ పక్కగా బండిని ఆపాడు.

    ఇద్దరూ కిందకి దిగారు.

    "ఇక్కడవుంటే తడిసి ముద్దయిపోతాం. ఆ బ్రిడ్జి క్రింద తల దాచుకుంటాం పద" అని అతను ముందుకి కదిలాడు.
 
    ఆమె అతన్ని అనుసరించింది.

    వాళ్ళిద్దరూ బ్రిడ్జికింద చివరగానున్న తూము కిందకి చేరారు పైన వాహనాలు పోతున్న శబ్దం విన్పిస్తోంది.

    అతను ఆమె పక్కగా కూర్చుని ఏవేవో మాట్లాడుతున్నాడు. ఆమెకి మాత్రం ఏమీ విన్పించడం లేదు.

    అంత చలిలోనూ అతనినుంచి వీస్తున్న గాలి ఆమె ఒంటికి వెచ్చగా తగుల్తోంది.

    అతని కండలు తనను నొక్కేస్తున్నట్లు అనిపిస్తోంది. బలిష్టమైన అతని చేతుల్లో తన నడుం చిక్కుకుపోయి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై పోతూ అలా నిలిచిపోయినట్టు ఫీలవుతోంది. అనాలోచితంగానే ఆమె మరింత పక్కకి జరిగింది.

    ఇప్పుడు అతని భుజం ఆమె  భుజానికి తగులుతోంది.

    తన చెల్లెలి భర్త అయిన మరిదితో అలా కూర్చున్నానన్న విషయం. ఆ క్షణంలో గుర్తుకురాలేదు ఊర్మిళకు. తను ఓ స్త్రీ అతను ఓ మగాడు. అంతేతప్ప మరో విషయం తలకెక్కే స్థాయిలో లేదామె.

    అతను వర్షం గురించి,ఆ వర్షంవల్ల పొలంలోని చీడ ఎలా వదిలిపోతుందో చెబుతున్నాడు ఆమెను మరో ఉద్దేశ్యంలో చూడాలన్న స్పృహ అతనికి లేదు. ఆ విషయం తెలుస్తూనే వుంది ఆమెకి. అందుకే తన మనసంతా అతనికి విప్పిచెప్పాలి. కానీ గొంతు పెగలడం లేదు.

    ఇక లాభంలేదు. మాటల్లో వీలుకానిది చేతల్లోనే చెప్పాలి.

    ఎలా ?  ఆమె మరింత జరిగి ఓ మూలకు తిరిగింది.

    ఇప్పుడు ఆమె గుండెలు వెంకటాచలానికి సుతారంగా రాసుకుంటున్నాయి. ముప్పైఏళ్ళు వచ్చినా కూడా ఎలాంటి వత్తిడికి గురికాని ఆమె ఎద వజ్రంలోని కాఠిన్యాన్ని, పూలల్లోని సౌకుమార్యాన్ని రంగరించి చేసినట్టు అతనికి తగులుతోంది.

    అప్పటికి ఆమె ఏ అవస్థలో వుందో అతనికి తెలిసింది. ఆశ్చర్యంతో ఆమెవైపు చూశాడు. కళ్ళనిండా అలుముకున్న కోరిక ఎర్రజీరలై తేలుతోంది.

    అతను చేయి వేయలేదు. లోపలున్న వేడికి ఎదపొంగ, పైనున్న జాకెట్టు హుక్ తెగింది.

    అతని కళ్ళు అక్కడ నిలిచాయి.

    ఆమె మరింతగా అతనివైపుకి తిరిగింది.

    ఇప్పుడు అతని చాతీ ఆమె ఎదకి తగులుతోంది.

    అతని వేళ్ళు ఆమె నడుముని పట్టుకున్నాయి.

    ఆమె తుపాను తాకిడికి పూలమొక్క కదిలినట్లు కదిలి, తిరిగి సర్దుకుంది.

    వర్షపు నీటి బరువుకి కాబోలు పైట స్థానభ్రంశంచెంది ఒడిలో పడింది. ఇక ఆగడం తనవల్ల కాదని జాకెట్టు హెచ్చరిస్తున్నట్లు రెండో హుక్ తెగింది.

    అతని కనుగుడ్లు ఆ అందాల్ని తాగుతున్నాయి.

    అతని చేతులు లోనెక్ జాకెట్టులోకి దిగబడిపోతున్నాయి. అతని పాదాలు ఆమె చీర కుచ్చిళ్ళను లెక్కబెడుతున్నట్లు పైకి తోస్తున్నాయి.

    లోపలున్న వేడి అంతా ఫోర్స్ గా పైకెగుస్తున్నట్టు ఆమె ముందు భాగం కాలిపోతోంది.

 Previous Page Next Page