Home » Yerramsetti sai » To hell with love


    లతలు దట్టంగా అల్లుకుపోయిన ఆఖరి కిటికీ కొంచెంగా తెరుచుకుని ఉన్నట్లు కనిపించింది. వడివడిగా ఆ కిటికీ దగ్గరకు నడిచాడతను. కిటికీ రెక్క లోపలబోల్ట్ చేయలేదు. రెండు పక్కలూ బయటకు తీసి లోపలవున్నా కర్టెన్ పూర్తిగా పక్కకు లాగి చూశాడు.
    లోపల దృశ్యం అతడిని చకితుడినిచేసింది.
    చాలాఖరీదైన సోఫాలూ, స్ప్రింగ్ కాట్స్, కెమెరాలు అన్ని వైపులా అద్దాలూ....
    అవన్నీ కూడా ఎప్పుడో ఎక్కడో చూసినట్లు.....
    "హలో"
    ఉలిక్కిపడ్డాడతను.
    మాయనవ్వుతూ నిలబడివుంది.
    ఆ నవ్వులో కూడా కలవరపాటు.....కనబడీకనబడనట్లుగా....
    "నాకు తెలుసు మీరు పెద్ద ఎత్తున ఎక్స్ ఫ్లోర్ చేస్తూంటారని?"
    సురేష్ కర్టెన్ వదిలేసి కిటికీలు మూసేసాడు.
    "లోపల రాజ భవనం వున్నట్లుంది" ఆమె వంకే చూస్తూ అన్నాడు. వెనుక వున్న పచ్చని చెట్లముందు ఆమె రూపం వింతగా కనబడుతుంది.
    ఊహు!
    ఎంత సెక్సీగా వున్నా తులసిలా గ్లామరస్ కాదు.
    తులసికి ఓనరయినందుకు గర్వంగా వుంది.
    "ఈ సీనరీలు అన్నీ ఇంతకుముందు చూశాను. యాడ్ ఫిలిమ్ లోనేనే" అడిగాడు మాయవేపునడుస్తూ మాయకళ్ళు మరోవేపు తిరిగినాయ్.
    "ఆ......అయుండొచ్చు....."
    ఇద్దరూ నడక ప్రారంభించారు.
    "లోపలకు వెళ్ళకూడదని ఏమయినా ఆంక్షలున్నాయా?" కవ్వింపుగా అడిగాడు.
    "అదేమీలేదు కానీ....చూడవచ్చు అయినా ఏమున్నాయని? స్టూడియో.....ఓ చిన్న సెట్! అంతే?" గొంతులో యింకా అనీజినెస్ అలానే వుంది.
    సురేష్ కి అనుమానం పెరిగిపోతోంది.
    ఎందుకంత కలవరం?
    "అదే ఓసారి చూద్దామని వుంది! వెళ్దామా?"
    "ఇప్పుడా? ఊహు! తాళంచెవి లేదుకదా!"
    "అయిదునిముషాల్లో తీసుకొస్తాను! ఇంట్లో ఎక్కడ పెట్టారోచెప్పండి!" ఉత్సాహంగా అన్నాడు.
    "ఆహహ......ఇంట్లో లేదు. మహిధర్ తీసుకెళ్ళాడు. అతనిదగ్గరే వుంటుందది"
    సురేష్ అనుమానం ధృవపడింది.
    ఆమె అబద్దం చెప్తోంది. అంతే ఇంట్లో ఏదో రహస్యం వుంది.
    ఇంటికి వచ్చేశారు.
    తులసి 'టీ' తాగుతోంది గార్డెన్ లో కూర్చుని. ప్రభ పక్కనే నిలబడి కబుర్లు చెప్తోంది.
    అప్పుడే నిద్రలేచినమత్తు ఇంకా కళ్ళల్లో కనబడుతోంది. తులసీ ముందుకెళ్ళి మోకాళ్ళమీద కూర్చున్నాడు.
    "అబ్బ! ఎవరో కొత్త అమ్మాయిలాగున్నావ్! నీకిష్టమయితే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం!"
    ప్రభ కిలకిలా నవ్వింది.
    "త్వరగా రడీ ఆఫ్! సినిమా కెళదాం!" అంది తులసి.
    "వాట్! సినిమాకా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "అవును! ఎంతకాలమయింది మనం వెళ్ళి?"
    "కాపురం పెట్టకముందుకాసేపయినా సరదా తీర్చుకోటానికని సినిమాహాల్ కెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇల్లుందికదా!"
    "సురేష్!?" ప్రభ ఆసక్తిగా అతనిమాటలు వింటూండటం గమనించి మందలింపుగా అందామె.
    "ఆల్ రైట్! లోపలకు రా! ఈ అమ్మాయి వినకుండా మాట్లాడుకుందాం!"
    ప్రభమొఖం ఎర్రబడినది.
    "అయ్యబాబోయ్! నేనేం ఇంటంలేదండీ!" అంది లోపలకు వెళ్ళిపోతూ.
    మాయగడపలో నిలబడినవ్వుతోంది. నలుగురూనడిచే బయల్దేరారు సినిమాకి. పంటకాలువగట్టుమీదనుంచి కొబ్బరితోటలు, నేరేడు చెట్లమధ్య నుంచీ వెళుతోంటే ఎంతో ఉల్లాసంగా ఉంది. అరగంటలో ఊళ్ళోకొచ్చేశారు.
    రోడ్లన్నీ ఇరుకు సందుల్లా ఉన్నాయి. ఆ సందుల్లోనే కిటకిటలాడిపోతూ జనం. సైకిల్ గంటలు, రిక్షావాళ్ళకేకలు.....ఎంతో కోలాహలంగా వుంది.
    నలుగురూ జనాన్ని తప్పించుకుంటూ నడుస్తున్నారు. సినిమాహాల్ నుంచి గట్టిగా స్పీకర్ లో పాటలు వినబడుతున్నాయి గందరగోళంగా! హాలు బయటే సినిమాబోర్డులున్న ఓ రిక్షాలో నుంచి స్పీకర్ లో బిగ్గరగా అరిచేస్తున్నాడొకడు. వాడి స్పీచ్ ని మధ్యలో మధ్యలో కట్ చేస్తూ పాట వినబడుతోంది.
    "కన్యకా కావేరి ఫిలిమ్స్ వారి మహోజ్వాల సాంఘిక చిత్రం...."
    పాట....." తొలిచూపు ప్రేమే మషాలా..."
    "టాలెంట్ కింగ్ నవకాంత్, పాలిస్టర్ పార్వతీ కలసి నటించిన ప్రప్రధమ చిత్రం....."
    "అడుగడుగుకీ సస్పెన్స్.... వళ్ళు జలదరించే ఫైటింగులూ....."
    పాట....." వంగతోట వెనుకేమషాలా"
    సినిమా టికెట్లకోసం ఆడాళ్ళు జుట్టుపట్టుకుని కొట్టుకుంటున్నారు, బఠానీలవాడు విడదీయటానికి ప్రయత్నిస్తున్నాడు.
    హాల్లో పలకయ్ మంటూ విజిల్స్ వినబడుతున్నాయ్. న్యూస్ రీల్ మొదలయింది. 'స్త్రీ మేళా' గురించి చూపిస్తున్నారు.
    "ఇలాంటి స్త్రీ మేళాలంటే నాకిష్టం!" అన్నాడు సురేష్.
    "ఎందుకని?" అనుమానంగా అడిగింది మాయ.
    "బాగా ఎడ్వాన్స్ డ్ గా వుండేవాళ్ళని ఎంకరేజ్ చేయడం నా హాబీ."    
    ఓ అమ్మాయి సగం నగ్నంగా స్నానం చేస్తూ తను తోముకుంటున్న సబ్బు చూపించింది.
    "ఇదేనా కొత్త యాడ్!" గర్వంగా చెప్పింది మాయ.
    అప్పుడు వచ్చింది కెమేరా ఆమె మొఖం మీదకు. మాయనవ్వుతూ తలఊపుతూ సోప్ చూపుతోంది.
    "మీ చర్మసౌందర్యాన్ని కేవలం 'లక్స్' మాత్రమే కాపాడుతుంది."
    "ఇదే న్యాయం!" అన్నాడు సురేష్ మాయతో.
    "ఏమిటా న్యాయం?"
    "ఇంటిదగ్గర డ్రస్ మార్చుకునేటప్పుడు అనవసరంగా బయటకుగెంటారు నన్ను! ఇక్కడేమో ఇన్ని కోట్లమందికి మీ నగ్న సౌందర్యం ఫ్రీగా చూపిస్తున్నారు."
    తులసిక్కూడా నవ్వాగలేదు.
    సినిమా ప్రారంభమయింది.
    హీరో హీరోయిన్ పబ్లిక్ గార్డెన్ లో డ్రిల్ మొదలు పెట్టారు. పాట అవగానే ఆమె గర్భవతి అయింది.మామూలుగానే హీరోకి టెలిగ్రాం వచ్చింది సూట్ కేస్ తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ మరో హీరోయిన్ సిద్దంగా మెడ ముందుకి చాచి కూర్చుని వుంది. మరణశయ్యమీదున్న తల్లి కోరిక కాదన్లేక ఆమెడలో తాళి కట్టేశాడు హీరో.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra